శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సంపదఉన్నది కదాఅని ఆడంబరాలకుపోతే ఇలాంటిదోషాలొస్తాయి జాగ్రత్త

>> Wednesday, August 6, 2014

మా పిల్లవాడొకడున్నాడు.పూర్వ విద్యార్థి.  శాంతస్వభావి,కష్టజీవి. వినయం,వివేకం కలవాడు.
చిన్నతనం లోనే తండ్రి చనిపోతే ,చదువుకూడా మధ్యలో ఆపవలసి వచ్చింది . ఇక్కడికి సుదూరప్రాంతంలో పాతసామానులు కొనే వ్యాపారస్తులదగ్గర కూలీగా చేరి అంచెలంచలుగా ఎదిగి అతి తక్కువకాలంలోనే అక్కడేస్వంతవ్యాపారం పెట్టుకుని స్థిరపడ్డాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు చిన్నవయస్సులోనే .పినతండ్రిని కూడా ఆవ్యాపారంలో ఉంచి తన చెళ్లెల్లు, తమ్ముళ్లతో పాటు పినతండ్రి పిల్లల బాగోగులుకూడా చూస్తున్నాడు.
ఇంటికివచ్చినప్పుడు ఇక్కడకొచ్చి వాళ్లటీచర్ గారితో నాతో  సాధకబాధకాలు చెప్పుకుని గాని వెళ్ళడు.

వానివివాహం విషయంలో అమ్మాయినిచూడటం నుండి అన్నీ నన్ను సంప్రదించాడు .వివాహం ఇక్కడే స్వగ్రామంలో జరపాలని నిర్ణయించాము సార్ అన్నాడు. అయితే ఇప్పటికే ఆగ్రామంలో కాస్తసంపాదిస్తున్న కుర్రవాళ్ళంతా పెళ్ళిళ్లకు భారీగా ఖర్చులు పెట్టారు. ఆడంబరంగా  ఆర్థికస్థితిని ప్రదర్శించుకోవాలన్న అమాయకత్వం వాళ్లది . ఇప్పుడు వీని వంతు. ఇలా ఆడంబరాలవల్ల ఏంజరుగుతుంది ? మనం ఆకలిగొన్నవాళ్లకు పదిమందికి కడుపునింపితే పుణ్యమన్నావస్తుంది. కడుపునిండినవాడికి వందరకాల పదార్థాలు వడ్డించినా వాడు ఏదో ఒక వంకపెడతాడేగాని  నీగూర్చి మెచ్చుకోలుగా మాట్ళాడడు. అదీ ఒక్కపూటే ఆతరువాత నీగూర్చి చెప్పాల్సిన అవసరం వానికుండదు.
అదీకాక , ఇంత ఆడంబర జీవితం కూడా మంచిదికాదు. ఈర్ష్యాపూరితమైన నరదృష్టి వలన నష్టం కలుగుతుంది. కాబట్టి సాధారణంగా వివాహక్రతువును నిర్వహించుకో అని సలహా ఇచ్చాను. ఆతరువాత నేను బదరీయాత్రకు వెళ్ళాను. నిరుడు. అయితే ఇంటిలో వాళ్ళో,మితృల ప్రోద్బలమోకాని వానివివాహం మాత్రం భారీ ఖర్చుతో వాళ్లగ్రామంలో ఇప్పటివరకూ జరిగిన వివాహాలన్నింటికన్నా ఎక్కువ ఖర్చుతో జరిగింది, డబ్బులు పరచాడు ఊరిపై మీవాడు అన్నారు నేను తిరిగొచ్చినతరువాత .

సరే జాగ్రత్తగా ఉండరా అని వానికి సలహా చెబుతూనే ఉన్నాను ఫోన్ లో పలకరించినప్పుడల్లా.
ఈమధ్య ఆర్ధికంగా ఇబ్బందులు చుట్టుముట్టాయని తెలిసి ఫోన్ చేశాను. ఏం జరిగిందిరా ? అని
ఈవ్యాపారంలో నమ్మకంగా ఉన్న ఆప్రాంత మితృలకు అవసరం కోసం అప్పు ఇచ్చాడు .అదీ ఒక్కరికికాదు ముగ్గురికి, కాస్తభారీగానే. ఇప్పుడు వాళ్ళను  డబ్బడిగితే చూ ద్దాం అంటూ  దాటవేస్తున్నారట,  వారిలో ఇద్దరు  తిరిగి ఇవ్వటం అపనమ్మకమేనని తెలుస్తున్నది.  పసితనం నుండి కష్టపడిసంపాదించిన డబ్బు  .వాడివయస్సుకుమించి శ్రమించిపోగుచేసుకున్న కష్టార్జితం పోతుందంటే నాకే మనసు విలవిలలాడుతుంది. బిడ్డ  వానికెట్లున్నదో?
ఇది దోషపురితమైన నరదృష్టి  వలనసంభవించిన కష్టం. ఎంత ఉన్నా అవసరాన్ని మించి వాడకూడదు. అతి ఆడంబరాలకు పోకూడదు అని పెద్దలు చెబుతారిందుకే . ఆర్థికవిషయాలలో వైశ్యులు మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉంటారు.
మనం చేయగలిగినదేముంది. మన ప్రాప్తం.  నీప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు .ఇక స్వామిని ఆశ్రయించు. నిత్యం చాలీసా పదకొండుసార్లు పారాయణం చేస్తూ నీ సమస్యను స్వామికి విన్నవిమ్చుకొమ్మని  సూచించాను.
ఆపై స్వామి దయ.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP