శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హమ్మా! సత్యజ్ఞానానంద గురూజీ !!!!!

>> Tuesday, July 29, 2014

ఈమధ్య ఓ ఆథ్యాత్మిక కార్యక్రమం ఓ క్షేత్రంలో నిర్వహించుకునే అదృష్టం కలిగింది.  ఈకార్యక్రమంలో నాకు తెలిసినవారు  నేనెవరో తెలియనివారుకూడా వచ్చారు. వీరిలో ఓ ప్రాంతంలో ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికూడా  ఆయన శిష్యగణం తో వచ్చారు. గతంలో ఓకార్యక్రమానికి కూడా వీరు వచ్చారు ఆపరిచయంతో ఇలా కార్యక్రమమండీ అని చెప్పగానే వారు మేమూ వస్తున్నామని చెప్పి మాకంటె ముందుగానే ఆక్షేత్రానికి వారి పరివారమ్తో చేరుకుని ఉన్నారు. సరే! వెళ్లగానే కార్యక్రమం మొదలైమ్ది కనుక ఆయనతో తీరికగా ముచ్చటించే సమయం లేదు. కార్యక్రమంలో పాల్గొంటున్నా గానీ ఎందుకో ఆయన తమవాళ్లను నాకుపరిచయం చేయటం గానీ, ఈకార్యక్రమం గూర్చి అందరితో చొరవగా కలవటం గానీ కనపడనట్లనిపించింది . వాల్లవాల్లందరినీ ఒకవైపు వేరుగా ఉంచుతున్నారు. అంతగానేను పట్టించుకోలేదు.
   ఈకార్యక్రమానికి వసతి,భోజనసౌకర్యాలు ఏర్పాటుచేపించాముకదా! ఆసత్రం వారు వచ్చినవారి వివరాలన్నీ కావాలని అడిగారు. మా కుర్రవాళ్లు పెన్నూ పేపరూ తీసుకుని అందరిపేర్లూ ,అడ్రెసులూ వ్రాసి పట్టుకొచ్చారు. మరి  ఇందాక నేను చెప్పినాఅయన వెంతవచ్చిన వివరాలేవి అనడిగితే ,వాళ్లవి వాళ్ళెవ్రాసి సత్రం వారికి ఇచ్చారట అన్నారు, సరే! ,మంచిదని చెప్పి నేను ఆసత్రం మేనేజర్ గారి వద్దకు వెళ్ళి వివరాలందిస్తుండగా అక్కడే వాళ్లిచ్చిన వివరాల పేపరూ ఉన్నది. దానిపై ఓ  విజిటింగ్ కార్డ్ ఉంది. దానిపై చుట్టూ కాంతివలయాలు అందులో ఈపెద్దాయన బొమ్మ,దానిక్రింద  "సత్యజ్ఞానానంద గురూజీ" అనే పేరు అట్టహాసంగా ముద్రించబడి ఉన్నాయి.
నాకేదో అనుమానం వచ్చింది.    కార్యక్రమం మధ్యలో  వాళ్లవాళ్లలో ఒక రిటైర్డ్ టీచర్ అట ఒకాయన నాదగ్గరకొచ్చారు. ఆయన మీదేవూరు,ఏం చేస్తుంటారని అడిగారు. మాస్టర్ గారూ! మీకు ఈకార్యక్రమం వివరాలు పూర్తిగా తెలియలేదా ! అనడిగాను. ఇక్కడ ఒక  కార్యక్రమం రమ్మని మాగురువుగారు చెబితే వచ్చామండి మిగతావివరాలంతగా తెలియదన్నాడాయన .
ఆయనకు  సంక్షిప్తంగా కార్యక్రమ వివరాలు చెప్పాక ఓవిషయం అడిగాను. మీగురువుగారు సన్యాసం ఎప్పుడు స్వీకరించారండీ ?అనడిగాను
లేదే   ! మాగురువుగారు సంసారంలోనే ఉన్నారు  అనిచెప్పాడాయన
 మీ గురువుగారి పేరు ఫలానా ! కదా ! మరి ఈ విజిటింగ్ కార్డులో ఉన్న పేరెవరిచ్చారు అయనకు సందేహం వ్యక్తం చేశాను,అమాయకంగా.
 ఒకరిచ్చేదేమిటి ? మాగురువుగారే పెట్టేసుకున్నారాపేరు . ఠపీమని చెప్పారాయన.
నానోరు మూతబడ్డది . మిగతాకార్యక్రమంలో బిజీ అయిపోయాము.
మేము తిరిగివచ్చాకకూడా  ఇంకొకరోజు ఆయన అక్కడేవున్నారు పరివారంతో.
మాపై అభిమానంతో ఈకార్యక్రమానికొచ్చిన మితృలు సుభాష్ గారు [వీరు ఆథ్యాత్మికరంగంలో విశేషసేవలందిస్తున్నవారు] కూడా మరుసటి రోజు సాయంత్రందాకాఆసత్రంలోనే విశ్రాంతి తీసుకుని బయలుదేరుతామని చెప్పారు.
ఇంటికొచ్చాక ఓరోజు సుభాష్ గారు ఫోన్  చేశారు.
  దుర్గేశ్వర గారూ!  కార్యక్రమానికొచ్చిన ఫలానా వ్యక్తి [సత్యజ్ఞానానంద గురూజీ] గూర్చి మీ అభిప్రాయమేమిటి? అన్నారు.
ఏమోనండి ! నాకంతగా పరిచయం లేదు. గతంలోకూడా ఇక్కడే జరిగిన ఓ కార్యక్రమంలో పరిచయం ఆదీ వారిప్రాంతంలో ఉన్న మన మితృలు కృష్ణారావుగారిద్వారా .అందువలన మిగతా వివరాలేవీ తెలియదు అన్నాను.
ఏంలేదండి! ఇతను మీవెంట కార్యక్రమాలకు తీసుకెళ్ళవలసిన వ్యక్తికాదేమో అనిపించినది. ఆయన మాటలద్వారా.మరుసటిరోజు సాయంత్రం దాకా ఉన్నాం కదా ఏదో తేడాగా అనిపించినది అన్నారాయన తో జరిగిన చర్చలు వివరిస్తూ.
 ఈయన ప్రాంతంలో మన జర్నలిస్ట్ మితృలున్నారు నేనొకసారి ఎంక్వైరీ చేస్తాను అనిచెప్పాను సుభాష్ గారికి
సత్యజ్ఞానానంద గురూజీ వారి ప్రాంతంలో  ఉన్న మన మితృణ్ని ఈవిషయం అడిగాను.
ఆయనది  మాటౌన్ కు దూరంగా ఉన్న ఓపల్లెటూరండి. ఏదో గుళ్లలో అప్పుడప్పుడు భగవద్గీత,ాఅథ్యాత్మిక ప్రవచనాలు చెపుతారు. వారి ఊర్లో చుట్టుపక్కల భజనలు సత్సంగాలు నడుపుతారని తెలుసు మీరడుగుతున్నారు కదా ఇంకొంచెం విశేషాలు తెలుసుకుంటాను అనిచెప్పారు.
తరువాత  సాయంత్రం ఫోన్ చేసి. మీ అనుమానం నిజమే.కాస్తతేడానే
ఈయన ఈయన మితృలు ఇంకొందరు స్వయం ఉపాధిపథకంగా  కాస్తతేడావ్యాపారాలుచేసి డబ్బుకూడబెట్టారు.  పెద్దముప్పు అవుతుందని తెలిసి మిగతావారు టౌన్ కుచేరగా ఈయనమాత్రం ఆథ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ కవర్  చేసుకుంటున్నారు,ఉన్న ఒక్కకొడుకుతో సరిపడదు. వాని కాపురం కూలి ఇళ్లు నరకంలానే ఉందంటారు ఆయనకు,.  మొత్తానికి మన కార్యక్రమాలకు పిలవదగ్గవాడుకాదు అని చెప్పాడు మనమితృడు.


అమ్మదుర్గమ్మకు నమస్కరించుకున్నాను .తల్లీ !  నీదయ ఇది. మాయలోపడకుండా,మాయలమారులను దరిచేరనివ్వకుండా ఇలా కాపాడుతున్నావు.చెప్పుకున్నాను. ఆశ్రయించి ఉన్నవాళ్లను జగన్మాత ఎలాకాపాడుకుంటుందో నాజీవితంలోనే నాకు నిదర్శనం చూపుతూఉంది ఎప్పటికప్పుడు.0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP