శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పుత్రసంతానాన్ని ప్రసాదించిన పరమేశ్వరారాధన .

>> Thursday, July 31, 2014

పరమేశ్వరుడు బోళాశంకరుడు .భక్తజన వశంకరుడు. భక్తులఆర్తినితీర్చటంపట్ల ఆతురత కలిగియుంటారట.
అందుకే శివారాధన సకలసౌభాగ్యాలను ప్రసాదిస్తుంది శీఘ్రంగా అనిచెబుతారు పెద్దలు.అది మన నిత్యజీవితంలోనూ నిరూపణ అవుతుంది శ్రధ్ధాశక్తులుకలిగియుంటే,

నాపూర్వవిద్యార్థి లక్కిరెడ్డిఅంజిరెడ్డి   ప్రస్తుతం జెడ్పీ స్కూల్ లో మాథ్స్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వానికి ఇద్దరు కుమార్తెలు కలిగారు వెంటవెంటనే .అదీ సిజేరియన్. ఇకచాలు ఆపరేషన్ చేపిస్తాను అంటాడు. వాళ్ల తల్లిదండ్రులు మగపిల్లవాడొకడుకావాలిరా ఇంకొకసారి కి ఉంచుదాం అంటారు. వీడికి  భయం. నాతో వాళ్లటీచర్ గారితో   ఈవిషయం సంప్రదించాడు.  ఆడపిల్ల వద్దు అనుకోవటం తప్పుగాని...మగపిల్లవాడు కూడా కావాలనుకోవటం తప్పుకాదుకదా ? వంశం నిలిపే కుమారుడొకడు ఉండాలనికోరుకోవటంలో మీతల్లిదండ్రుల ఆశకు తప్పులేదు. ఇంకొకసారి చూడు.అన్నాము మేము.
ఏమో సార్! మరలా అడపిల్ల అయితే ? సందేహం వ్యక్తం చేశాడు
కానీయ్ ! ఇబ్బందేముంది. నువ్వు పోషించలేని స్థితిలో లేవుకదా! అయినా అనుమానం ఎందుకు ముందే.
ఈశ్వరారాధన చేస్తున్నాం కదా కార్తీకం మొత్తం .ఇప్పుడు జరుగుతున్న పార్థివలింగార్చన లో మనఃస్పూర్తిగా ఆయననుశరణువేడుతూ,నీకోరిక విన్నవించుకుని పాల్గొను. ఆయన కృపకు అసాధ్యం లేదు అని చెప్పాము.
గత కార్తీకంలో నిష్టగా నిత్యం పీఠంలో జరుగుతున్న సేవలలో పాల్గొన్నాడు ముందుండి. మరలాఅమ్మాయి[వానిభార్య] కు పరమేశ్వరానుగ్రహం కలిగింది.
కానీ వీనికి అబ్బాయా? అమ్మాయా! అనే అనుమానం.
శంకలేకుండా స్వామి శరణువేడు. వెంటవెంటనే సిజేరియన్ ఆపరేషన్లుకనుక అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్త. నిత్యం ఆమెరక్షణకొరకు హనుమాన్ చాలీసా పారాయణం సాగించమని చెప్పాము.
మొన్న ఫోన్ చేసి సార్ ! గురువారం డెలివరీ డేట్ ఇచ్చారు అనిచెప్పాడు.
ఎవరేంచెప్పినా ఆపకుండా చాలీసా పారాయణం మౌనంగా  చేస్తుండు అని చెప్పాను.
డెలివరీ టైమ్ లోకూడా వీడు బయటకూర్చుని పారాయణం మానసికంగా చేస్తూనే ఉన్నాడుట.
పండంటి మగబిడ్డ. తల్లీ,పిల్లవాడు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు.
వాడు ఫోన్  చేసి. సార్! ఇది కార్తీకంలో చేసిన స్వామి ఆరాధనా ఫలితమేనని ఆంనందంగా తెలిపాడు.
అందుకే పూర్వంనుండి శివారాధన సకలకామ్యాలకు సూచిస్తూఉన్నారు పెద్దలు
జైశ్రీరాం
నిరుడు కార్తీకంలో జరిగిన పార్థివ లింగార్చన

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP