నాకసలు దేవుడితో పనేమిటి?
>> Monday, June 9, 2014
"స్వామీజీ! మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి డబ్బు సంపాదించారు. నాకు ఇల్లు, కారు, ఇతర సదుపాయాలు అన్నీ కల్పించారు. చదువు చెప్పించారు. నేను కూడా బాగా కష్ట పడతాను. నా అవసరాలన్నీ చక్కగా తీర్చుకుంటున్నాను. నాకొకటే సందేహం.
నాకసలు దేవుడితో పనేమిటి?
మా కుటుంబం పడే శ్రమే మమ్మల్ని బతికిస్తోంది తప్ప, ఏ దేవుడూ కాదు. మేమసలు దేవుణ్ణి ఎందుకు తలవాలి?"
ఆ స్వామీజీ ఆమెని అడిగారు "మీరే కాదు తల్లీ, మీలాగే ప్రతి ఒక్కరూ ఏదోలా శ్రమపడి, వారి వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. అలాంటప్పుడు మీ దేశానికి మళ్ళీ .......... ......... అనే అద్యక్షుడు ఎందుకు?"
"అదేమిటి స్వామీ! ఎవరికి వాళ్ళు జీవితం కోసం శ్రమపడినా అందరం ఈ సమాజంలో భాగస్వాములమే కదా! కాబట్టి ఈ సమాజం ఓ పద్ధతి ప్రకారం నడవడానికి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను నడపడానికి ఓ ప్రభుత్వం, ప్రభుత్వమన్నాక దానికొక అధినేత ఉండాలి కదా" అని ఆమె ఆశ్చర్యంగా తిరిగి ప్రశ్న వేసింది.
"తల్లీ, నువ్వన్నది నిజమే. అలాగే మనమంతా ఈ సృష్టిలో భాగమే. ఇంతటి సువిశాల సృష్టి సజావుగా నడవడానికి ధర్మమే కారణం! మరి, ఈ ధర్మాన్ని నడిపించే అధినేత ఉండడా? ఆ అధినేతనే దైవంగా గ్రహించి ఆరాదిస్తున్నాం."
ఏ ఒక్కరూ సృష్టి ధర్మానికి అతీతులు కారు. కాబట్టి ధర్మాన్ని, దైవాన్ని అంగీకరించడమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తెలియజెప్పి, జీవితాన్ని సంస్కరిస్తుంది మన భారతీయత"
------[ kbn sarma gaaru ]
0 వ్యాఖ్యలు:
Post a Comment