శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

చిన్నపిల్లాడిని కారుప్రమాదం నుండి కాపాడిన శ్రీరామ నామ మహిమ

>> Friday, June 13, 2014

ఎక్కడ రామనామము స్మరింపబడుతుందో అక్కద హనుమంతులవారు రక్షకులై నిలుచుంటారన్నది సత్యం.
అందుకు ఇంకొక ప్రత్యక్ష నిదర్శనం ఇదిగో చదవండి. హనుమత్ రక్షాయాగంలో భాగంగా రామనామ లేఖన ప్రతులను అందరికీ పంచాముకదా! అలానే మా పాఠశాలలో పిల్లలకు ఇచ్చాము. పిల్లలంతా చక్కగా వ్రాస్తున్నారు భక్తిగా.

మాకు పాఠశాలలు నిన్నతెరచారు. విధులకు హాజరయ్యాను. నేనుపని చేస్తున్న తిమ్మాపురం యం.పిపి పాఠశాలలో నాలగవ తరగతి చదువుతున్న పిల్లవాడు  అమరా నవనీత్ చౌదరి  కోసం వాళ్ల అమ్మగారు స్కూల్ వద్దకొచ్చి ఇంటికి బంధువులొచ్చారు వీడ్ని చూడాలని. పంపండి సార్!  అనడిగింది. ఇప్పుడేకదమ్మా వచ్చినది బమ్ధువులు వీడ్నిచూడటానికి రావటమేమిటి ! అన్నాను  .పిల్లవానిని కారు గుద్దింది సార్!  నాబిడ్డను దేవుడు నాకుదక్కించాడు.   నాదీపం ఆరిపోయిందనుకున్నాను . అని బాధపడింది
ఏమైందమ్మా! అన్నాను.
మొన్న వినుకొండలో బంధువుల పెళ్ళికి వెళ్లాము. గంగినేని కళ్యాణమండపంలో పెళ్ళి. మధ్యాహ్నం వేళ వీడు ఇంకొకరితో కలిసి  బయటకొచ్చి రోడ్ అవతలకు వెళ్ళారు పాస్ కని [అది గుంటూర్-కర్నూల్  హైవే] . నేను వీడు బయటకెందుకెళ్ళాడా అని పిలవాటానికి వచ్చాను. మావాడు పరిగెత్తుకుంటూ రోడ్ దాటుతున్నాడు. అటువైపునుండి ఒక కారు వేగంగా వస్తున్నది నేనుఆగమనికేకలేస్తూ ఉన్నప్పటికీ వీడువేగంగా రోడ్ మధ్యకొచ్చాడు. చివరక్షణంలో డ్రైవర్ బ్రేక్లు వేసినప్పటికీ కారు ఆగలేదు వచ్చి వీడిని ఢీకొన్నది ,అంతెత్తున  ఎగిరి దూరంగా పడ్డాడు. నాకొంపాఅరిపోయింది దేవుడా ! అని నేను పెద్దగా అరుస్తూ పరిగెత్తాను ,పడ్డవాడు లేచికూర్చున్నాడు మేందగ్గరకెళ్ళేసరికి . జనమంతా పోగై గోలగోలగా ఉంటే నేను ఏడుస్తూఉన్నా వీడు మాత్రం నాకేం కాలేదమ్మా అన్నాడు.ఆస్పత్రికి తీసుకెళ్లాము .డాక్టర్ గారు ఏమీకాలేదన్నారు.   కారుగుద్ది అంత దూరం ఎగిరిపడ్డా వీనికి చిన్నదెబ్బకూడా తగలకపోవటం. ఎవరో చేతులతో ఎత్తుకుని పక్కనపనుకోబెట్టినట్లు  దెబ్బలేవీ తగలకపోవటం నిజంగా  దేవుడి చలవే నండి అని ఆవిడ కళ్లనీళ్ళుపెట్టుకున్నారు.
అవునమ్మా ! రామనామం జపించినా,లిఖించినా వానిని రక్షణబాధ్యతలను ఆంజనేయస్వామి స్వయంగా చూస్తుంటారని శాస్త్రం. వీళ్ళు ఇప్పుడు వ్రాస్తున్న శ్రీరామనామము ఇలావీడిని కాపాడినది.  అని చెప్పాను
అవునండి ! మావాడు రోజు వ్రాస్తున్నాడు. స్వామిదయ మాకు బిడ్డను దక్కించినదని ఆవిడ సంతోషపడినది
భద్రాచలంలో జరిగే కార్యక్రమానికి కూడా వచ్చి రామనామప్రతులను సమర్పించేందుకు ప్రయత్నాలుచేసుకుంటామని చెప్పినదావిడ. ఇది స్వామిదయకు మరో ప్రత్యక్షనిదర్శనం. ఆబిడ్డ జాతకంలో ఉన్న ప్రమాదాన్ని నివారించిన రామనామ మహిమ

శ్రీరామార్పణం.

1 వ్యాఖ్యలు:

Vamshi Krishna June 17, 2014 at 1:18 AM  

Rama bhaktha hanuman ki
jai
jai
jai...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP