శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆంజనేయస్వామి అనుగ్రహానికి రుజువుచూపుతూ రూపుదాల్చనున్న అన్నపూర్ణ భిక్షాశాల కు ఈరోజు శంఖుస్థాపన జరిగింది.

>> Wednesday, April 9, 2014

పక్షం రోజులక్రితం  పూజ చేసుకుంటున్నప్పుడు సకలోకాల ఆకలితీర్చే తల్లిఅన్నపూర్ణమ్మ పేరున  అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణమునకు సంకల్పించాలి అని ఆశిస్తున్న భావన మనసులో తళుక్కున మెరిసింది. అదీ కూడా హనుమత్ రక్షాయాగంలోపు మొదలవ్వాలనే సంకల్పం
ఇంకెవరు మన  పెద్దాయన  ఆంజనేయస్వామి వారినుండే ఈ ఆజ్ఞ  వచ్చినదని మనసులో తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు డబ్బు ఎలా ? అందులోనూ నా కాలు పూర్తిగా  కట్టుకోలేదు ఎటు తిరగటం కూడా కుదరదు కదా? అనే సందేహం తలెత్తింది. అవన్నీ నీకెందుకు?
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద ? .........అంటూ  ఆయననే ఆశ్రయించి పనిచేయటమే కదా నీపని అని మనసు సమాధానాన్ని కూడా  ఇచ్చింది.
సరే! ఇది స్వామి ఆజ్ఞ కావచ్చు, లేక నాపైత్యం కూడా కావచ్చు కదా ? అందుకని  ఇది స్వామి ఆజ్ఞయే అనే నమ్మకం కలగటానికి ముందు చిన్న టెస్ట్ పెట్టుకుందాం అని ముందుగా ఆప్తులైన కార్యకర్తల తో ఈవిషయం ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాను
ముందుగా  గాంధీ నగర్ లో ఉన్న నాగిరెడ్డి ని పిలచి విషయం వివరించాను.
వెంటనే ఆపిల్లవాడు  , మాస్టారూ! మీరన్న భవనం నిర్మాణానికి సుమారు పది లక్షలకు పైగా అవ్వవచ్చు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు సమకూరటం సాధ్యమా?; అదీగాక ఏదో గుడీ ,గోపురం కడుతున్నామని అడగటం వేరు, ఇలా భోజనశాల కడుతున్నామంటే స్పందన అంతగా ఉండదు.
అదీ గాక మన పరిచయస్తులలో కూడా అంతగా వర్కవుట్ అవుతుందనుకోను అన్నాడు మొహమాటం లేకుండా . హరీ ! మొదటి బోణీయే  నిరుత్సాహం. తరువాత  ఒంగోలు లో ఉన్న శ్రీనివాసరెడ్డికి ఫోన్  చేశాను.  మా వంతుగా  మేము సహకరించినా బయట అవుతుందో లేదో ? అని సమాధానం రెండవసారి
అదే సమాధానం.
 ఇక నెల్లూరులో ఉన్న మాతమ్ముడికి ఫోన్  చేశాను . అబ్బో ! మరలా అప్పట్లోమందిరం కోసం  చేసినంత ఖర్చు  సందేహం.

ఇక లాభం లేదు . యుధ్ధం చేయాలంటే ఉత్సాహం ముఖ్యం. అది కలగాలంటే అపారమైన నమ్మకం కావాలి నడిపేవారిపై. ఇక్కడ నడుపుతున్నది స్వామి వారే కనుక
ఆయన అనుగ్రహం తోనే ఈ కార్యక్రమం మొదలవుతుంది అనే విషయం స్పష్టం కావాలి  కార్యకర్తలకు. మిగతావారందరితో మాట్లాడే ముందుగా ఈవిషయం తేలాలి.
స్వామికి మనసులో నమస్కరించి టంగుటూరు లో పనిచేస్తున్న  ఇంజనీర్ శ్రీనివాసరావుగారికి ఫోన్ లో విషయం చెప్పి ప్లాన్ కావాలని అడిగాను. ఒకవైపు ఎలక్షన్  డ్యూటీలో వత్తిడిలో ఉండి కూడా శ్రమతోసుకుని ప్లాన్ సిద్దంచేసిపంపారాయన.ముందుగా నాబ్లాగ్ లో విషయాన్ని వ్రాసి ప్లాన్ కూడా ఉంచాను.
ముందుగా నావంతుగా లక్షరూపాయలు సమకూర్చుకుంటాను నాజీతం నుండి మిగిల్చి అని స్వామికి చెప్పుకున్నాను. ఆతరువాత నాకాంటాక్ట్ లలో ఉన్న వారికి మెయిల్ గాపంపాను .
ఇక  ఎదురుచూస్తున్నాను స్వామి సందేశానికై [ఇక్కడ ఎదురు చూసింది ,డబ్బెవరిస్తారా అనికాదు,దానినివ్వమని స్వామి ఎవరికి ప్రేరణ కలిగించి ఆలీలను మాకు చూపిస్తాడా అని.]

రెండవనాడు  కెనడా నుండి ఫోన్ వచ్చింది .
  దుర్గేశ్వర గారూ!నాపేరు వెంకట్ రామ . నేను మీ మెయిల్ చూశాను. నాభార్యతో  ఈవిషయం చర్చించాలనుకుని .మరచాను. రాత్రి స్వామి వారు ఆవిడకు స్వప్నంలో కనపడి నా కార్యక్రమం మొదలవుతుంది, ఇందుకోసం నీవేమి సమర్పిస్తావు ? అని అడుగుతున్నారట.[ధన్యజీవి ఆతల్లి]
ఉదయాన్నే లేచి స్వామి ఇలాడుగుతున్నారేమిటండీ !స్వప్నంలో  అన్నారట. అయ్యో రాత్రి మాట్ళాడదామని మరచిపోయాను అని విషయాన్ని వివరించి  పదిహేనువేల రూపాయలు మావంతుగా ఇవ్వాలనీ అలాగే స్వామి కి మాతరపున వడమాల వేయాలనీ అందుకోసం ఖర్చును కూడా పంపుతున్నమన్నారాయన.
ఆహా ! ఎంతధన్యజీవులో వారు.
ఇంకొందరు స్వామి పరివారం మేమూ సహాయం అందిస్తామని మెయిల్ పంపారు

ఇక   శ్రీనివాస్ గారు అమెరికానుండి  ఫోన్ చేశారు రాత్రివేళ.  
దుర్గేశ్వర గారూ 
మీరు తలపెడుతున్న కార్యక్రమానికి  మావంతుగా ఒక లక్షరూపాయలు  సమర్పించాలని అనుకుంటూన్నాము  అని చెప్పారు. నాకు నోట మాట రాలేదు ముందు. ఏమిటీ స్వామి కరుణ
నేనెవరో ? నేను నిజమే చెబుతున్నానో,అబధ్ధమే చెబుతున్నానో తెలియదు. ఇక్కడకువచ్చి ఏంజరుగుతుందో ప్రత్యక్షంగా చూడలేదు. నాగూర్చి ప్రత్యక్ష పరిచయం లేదు. పోనీ మావూరిపక్కనా కాదు కొద్దిగావిచారించితెలుసుకోవటానికైనా

ముక్కూ మొహం తెలియని వాడిని నమ్మి......ఇలా సహాయం అందిస్తామని ముందుకు రావటం..... కాదు..కాదు. ఇది నన్ను నమ్మటం కాదు
స్వామిని నమ్మటం. స్వామి నామం పట్ల,ాఅయన లీలలపట్ల వారినమ్మకాన్ని పటిష్ఠపరుచుకోవటం. ఈమధ్య  ఆకాశంలో మేఘంలా స్వామి వారి రూపం గోచరించినదని ఆయన చెబుతుంటే వింటుంటేనే ఒళ్ళు గగ్గుర్పాటుకు గురవుతున్నది. అలాంటి తనభక్తులచే లీల నడుపుతున్నారాయన,

వెంటనే విషయాన్నీ  మావాళ్లకు తెలియపరచి  ఇప్పుడు మనం నమ్మవచ్చా ? ఇది స్వామి ఆజ్ఞయే నని అనడిగాను. వారంతా ఆనందంతో ,ఉత్సాహంతో సందేహం లేదు ,ఇది స్వామి ఆజ్ఞయే  కార్యక్రమంలోకి దిగాల్సిందేనని నిర్ణయించారు.

అందరినీ కూర్చోబెట్టి మాట్లాడె సమయం లేదు . కనుక  అందుబాటులో ఉన్నవారితో మొదలుపెడదాం . ఆతరువాత మిగతావారిని పిలచి ఇందులో పాల్గొమ్మని ఆహ్వానిద్దాం అని అనుకున్నాం
ఒకవైపు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి  పీఠంలో .

ముందుగా ఉన్న రేకులషెడ్ ను తొలగించాము. అందుకోసం ఐదువేలకు పైసా తగ్గమన్నారు  కూలీలు. సరే స్వామికిష్టమైన సంఖ్య అనుకుని ఇచ్చాం. ఈరోజు[చైత్ర శుధ్ధ దశమి బుధవారం] ముహూర్తం కుదిరింది . మాకార్యక్రమాలన్నింటా ముందుండే గోపాలకృష్ణమూర్తి భట్టు గారు నవరాత్రదీక్షలో గుంటూరు లో ఉన్నారు

వినుకొండ నుండి శేషు గారిని పురోహితులుగా పిలచాము. దరిశి నుండి లక్ష్మీనారాయణరెడ్డి దంపతులు, ఒంగోలు నుండి శ్రీనివాసరెడ్డి,  నరసరావుపేట ఆర్ డీ వో , శ్రీనివాస్ గారలనుతెనాలి ఆర్డివో శ్రీనివాసమూర్తి, మాతమ్ముడుశ్రీనివాస్[చిత్రంగా అన్నీ శ్రీనివాసుని నామాలే]  శంఖుస్థాపనకు యజమానులుగా నిర్ణయించాము. అయితే శ్రీనివాసరెడ్డి వాల్లు రాజంపల్లి,ముసీ నది ఒడ్డున జరుగుతున్న ఆంజనేయస్వామి తిరుణాల్లలో మజ్జిగ పంపిణీచెసే సేవాకార్యక్రమం లో పాల్గొనవలసి వచ్చింది
ఇక ఇక్కడ  జరుగుతున్న ఎన్నికలవల్ల కలెక్టర్ గారు ఆత్యవసర మీటింగ్ కు రమ్మని ఆదేశించారని,అందువలన రాలేకపోతున్నామని  ఆర్డీవో లిద్దరూ  రాలేకపోయారు. అలాగే వేరు కారణాలవల్ల మాతమ్ముడు కూడా రాలేకపోయాడు.

ఇక ఈరోజు వసంత నవరాత్రులపూజ ముగించి కలశ ఉద్వాసన చెప్పి, స్థలంలో కూర్చుని విష్ణుసహస్రనామ పారాయణం చేశాను పురోహితులవారు వచ్చారు. ఆయన స్థలంలో కొచ్చి కూర్చోబోయేసమయానికి గణానాంత్వా............అంటూ ఆయన సెల్ ఫో నుండి రింగ్ టోన్ వినిపించింది. నాకు అలవాటుగా హనుమాన్ చాలీసా  మొదలుబెట్టబోయే సమయానికి  మా మేస్త్రీ ఫోన్ నుండి    అంతా రామమయం ............... అంటూ రింగ్ టోన్ మోగింది . ఈసమయానికే శబరమల యాత్రపూర్తి చేసుకుని మా మేనత్త కూడా ఇక్కడకొచ్చినది.
లక్ష్మీనారాయణరెడ్డి దంపతులచే  చాలా చక్కగా శంఖుస్థాపన కార్యక్రమం జరిపించారు పురోహితులవారు.

ఇప్పటికే బీమనపల్లి వెంకట్  గారు   20,379 , jyitiprakaash[us]25000 ,g.lakshminaaraayana,5000  baba venkataramaraju 5000,chandrasekhar_2000,udayarani..,2000, raviprakash ch.....3000  srinivas.n....100000,venkat duvvuri 15000  డబ్బు ఈకార్యక్రమానికి చేరగా మరికొందరు తమవంతు సహాయం పంపుతామన్నారు
స్వామి లీలకు నిదర్శనంగా  రూపుదాల్చనున్న ఈ భిక్షాశాలలో అమ్మ అన్నపూర్ణమ్మ వడ్డిస్తుండగా మే ఇరవైనాలుగున జరగనున్న  హనుమత్ రక్షాయాగాని కొచ్చే  భక్తులు భోజనం చేయటం చూడాలనేది మా అందరి ఆశ. జైశ్రీరాం









0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP