శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీవారి పట్ల అపచారం కొరివితో తలగోక్కోవటమని జగన్ కు, ఎవరూ చెప్పరా ?

>> Monday, March 3, 2014

పవిత్రస్థలాలలో  [అదిమందిరమైనా  మసీదైనా,చర్చైనా] భగవంతుని అనుగ్రహశక్తి  ఎక్కువగా ప్రసరిస్తుంది. ఇక తిరుమల లాంటి దివ్యస్థలాలు శక్తికేంద్రాలు. . అక్కడ ఎలా ప్రవర్తించాలో,ఎలామసులుకోవాలో  పెద్దలు కొన్ని నియమాలుగా శాసనం  చేశారు.  వాటికి విపరీతంగాను,భగవంతుని పట్ల అపచారంతోనూ మన నడవడిక ఉంటే మనపూర్వపుణ్యరాశి కొట్టివేయబడుతుంది . అప్పటిదాకా మనం అనుభవిస్తున్న సిరిసంపదలు,వైభోగాలన్నీ పూర్వజన్మ కృతంగా ప్రాప్తించిన పుణ్యం వలనే  సంప్రాప్తమయ్యయనే విషయం మరువకూడదు. పూర్వం  మన పురాణాలలో మహాతపస్సంపన్నులైనవారుకూడా దైవాపచారానికి,భక్తులపట్ల అపచారానికి ,పవిత్రస్థలాలపట్ల అనుచితంగా ప్రవర్తించి తమపుణ్యాన్ని కోల్పోయి పతనమై ఘోర అవస్థల పాలవటం తెలుసు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా  కొందరు దివ్యస్థలాలకు  వెళ్లికూడా అక్కడ తెలిసో తెలియకో చేసిన అపచారాలవల్ల అక్కడ క్షేత్రపాలక దేవతలకోపానికి గురై కష్టాలపాలవుతూ ఉంటారు. విషయం తెలియక  అక్కడకెళ్ళాం ఇక్కడకెళ్ళాం కానీ ఏమీ శుభం జరగలేదని బాధపడుతుంటారు.

ఇక మనరాజకీయ నాయకులైతే ఆలయాలలో ఎలాప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. నిన్న జగన్ గారు  తిరుమల శ్రీవారి దర్శనానికి   వెల్లారట. మంచిదే . ఏమతానికి చెందినా  వారి మనసులో నమ్మకాలను వదులుకోవలసిన అవసరం లేదు. కానీ మనం వెళ్ళేచోట ఎలాప్రవర్తించాలో అదిగుర్తుంచుకోవాలి. ఆయన వైకుంఠంక్యూకాంప్లెక్స్ దాకా చెప్పులతో వెళ్ళటం ,ఎవరో నాయకుడు గుర్తించి వారించటం తో చెప్పులను వదలివెళ్ళాడు. సంతోషం.  ఇక ఆయన అనుచరవర్గానికి పూనకం వచ్చినట్లు అక్కడ తమ అధినేతను జైజగన్ అంటూ నినాదాలతో పూనకంతో ఊగిపోయారు. ఇక ఆయన సెక్యూరిటీ సిబ్బందివీరంగం చెప్పనలవికాదు పాదరక్షలతోటే ఆలయం ముందర హడావుడి  . ఇది తప్పు అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే భగవంతునికంటే ఇక్కడ సిబ్బందికి రాజకీయ నాయకులపట్లే గౌరవమెక్కువ.   కానీ అనుచరుల తప్పులు యజమానినే పీడిస్తాయి. అందువలన జగన్ గారు ఇప్పటికైనా పదేపదే తిరుమలలో తనవల్ల జరుగుతున్న అపచారాలపట్ల అప్రమత్తమవ్వాలి. లేకుంటే అది ఆయన కు మంచిది కాదు.

ఓవందమందిని వెంటేసుకుని   రాష్ట్రపతి భవనంలో కెళ్లి జైజగన్ అని అనిపించుకుంటే ఏమవుతుంది. అంతదాకా ఎందుకు  ఏదో ఒక నాయకుడు జగన్ ఇంట్లో కెళ్ళీ ఆయనముందు తనగూర్చి జేజేలు కొట్టించుకుంటే ఏమవుతుంది?  అతనిపట్ల అభిమానం పోయి కోపం కూడా కలగవచ్చు.   ఈచిన్న విషయం గమనిస్తే చాలు. శ్రీవారి పట్ల మనం ఎలాఉండాలో అవగతమవుతుంది.   ఇలా జెరూసలెం వెళ్ళి చేయగలరా ? మసీదులలో ఇలాప్రవర్తించగలరా?  ఇక్కడెవరూ మిమ్మల్ని ఎదిరించి అభ్యంతరపెట్టకపోవచ్చు,కానీ పైనొక లెక్కల చిట్టా అమలవుతూ ఉంటుంది. అసలు ఇలా దేవాలయాలలో నాయకులదృష్టిలో పడాలని అనుచితంగా ప్రవర్తిస్తున్నవారు నిజంగా ఆనాయకులకు మితృలుకాదు,అనుకూల శతృవులు.

ఇదేదో  నాకు  ఆయనపట్ల వ్యతిరేకభావంతో వ్రాస్తున్నాననుకోవద్దు. ధార్మికవిషయాలలో ఎలామసులుకోవాలో రాజకీయ నాయకులకు ధార్మికులైన వారి అనుచరులన్నా తెలుపుతారని ఆశిస్తూ వ్రాస్తున్నాను అంతే

జైశ్రీరాం.

2 వ్యాఖ్యలు:

Jayab March 3, 2014 at 7:54 AM  

అందరు దేవుల్లకేల్లా వేంకటేశ్వరుడు చాలా పవర్ ఫుల్ . ఇది జగన్ తెలుసుకోకపోయినా వారి అనుచరులు చెపితే బాగుణ్ణు .

Tejaswi March 3, 2014 at 9:21 PM  

పోగాలం దాపురించినవారికి ఎవరు చెప్పినా తలకెక్కదు! పైగా ఆయనగారికి చెప్పేంత ధైర్యం, సాహసం ఆ పార్టీలో ఎవరికీ లేవు...ట!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP