శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

సన్న్యాసాశ్రమం అంటే ఏమిటి? సమాజానికి సన్న్యాసుల వల్ల ఎంతవరకు ఉపయోగముంటుంది?

>> Wednesday, November 13, 2013

సన్న్యాసాశ్రమం అంటే ఏమిటి? సమాజానికి సన్న్యాసుల వల్ల ఎంతవరకు ఉపయోగముంటుంది?
సమ్యక్-న్యాసః సన్న్యాసః సర్వ సంగ పరిత్యాగమే సన్యాసము.  శాస్త్రాలు బోధించిన ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య ఆశ్రమవాసులు కర్తవ్యాలతోను, గృహస్థాశ్రమం లోనివారు బాధ్యతలతోను ముడిపడి వుంటారు.  వారు తమ కర్తవ్యాలను, బాధ్యతలను విడిచిపెట్టడం ఎంత దోషమో వాటిలోనే కూరుకు పోవడం కూడా అంతే దోషమని గ్రహించాలి.  తన కర్తవ్యాలను, బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించిన వ్యక్తి వాటిని తన తరువాతి తరానికి అప్పజెప్పి మోక్షమనే పరమ పురుషార్థాన్ని పొందేందుకు ఆంతరంగికంగాను, బహిరంగంగాను సంసిద్ధుడు కావాలి.  ఈ సంసిద్ధతనే సన్యాసమని, దీనినే విద్వత్ సన్యాసము, వివిదిషా సన్యాసమని శాస్త్రాలు రెండు విధాలుగా వివరించాయి.

విద్వత్ సన్న్యాసమనగా?
వేదవేదాంత తత్వాన్ని గ్రహించిన విద్వాంసుడు ఆ తత్త్వంలో నిష్ఠ ను పొంది పరమధర్మమైన మోక్షమును పొందుటకు సమస్తాన్ని పరిత్యజించే వాడు విద్వత్ సంన్యాసి.
వివిదిషా సన్న్యాసమనగా?
వేత్తుం ఇచ్చా వివిదిషా .. అంటే శాస్త్రాల ద్వారా తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే సంకల్పంతో తనకున్న ప్రతిబంధకాలను దాటుకుంటూ శ్రవణ, మననముల కొరకై అన్నింటినీ త్యజించేవాడు వివిదిషా సంన్యాసి. ఈ విధంగా ఐహిక, ఆముష్మిక, సామాజిక, వ్యావహారిక, లౌకిక భావాల నుండి విడివడి, వాటితో లేశమాత్రపు సంబంధమైనా లేకుండా కేవలం ఆత్మస్థితి యందు రమిమ్చేవాడే సన్యాసి. వారి వల్ల సమాజానికి ఉపయోగం ఉందా, లేదా అని భావించడం మన అవివేకమే.

అన్నీ వదులుకున్న సన్న్యాసులు సమాజసేవ, ధర్మప్రచారం వంటి వ్యవహారాల్లో ఎందుకు నిమగ్నమౌతున్నారు?
సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కాషాయాంబర ధారుల్ని సన్యాసులు అనేకన్నా సాధువులు లేక మహాత్ములని పిలవడం సమంజసంగా ఉంటుంది.  పరకార్యం సాధయతీతి సాధుః అంటే ఇతరులకోసమై జీవించేవాడు సాధువని అర్థం.

ఈ భగవత్ సృష్టిలో నది, వృక్షం, సూర్యుడు మొదలగునవన్నీ ఇతరుల కోసమే జీవించే సాధు స్వరూపాలు.  అలాగే ఇతను కూడా ధర్మ ప్రచారం చేసినా, భక్తి ప్రభోధం చేసినా, మఠ మందిర వ్యవస్థలను స్థాపించినా, వైదిక ధర్మాభివృద్ధికై వేద పాఠశాలలు నిర్వహించినా అవన్నీ మానవ శ్రేయస్సుకై, లోక కళ్యాణార్థమై చేసే సేవలేనని గ్రహించాలి.  'చికీర్షుర్లోకసంగ్రహం' అని గీతావాక్యం.  వీరు లోక కళ్యాణం కొరకే వాటిని నిర్వర్తిస్తారని వాక్యార్థం.  

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP