శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"రామదండు" లో చేరరమ్మని ఆహ్వానిస్తున్నాము

>> Tuesday, November 26, 2013భగవద్బంధువులందరకూ
నమస్కారములు .  శ్రీవేంకటేశ్వరజగన్మాత పీఠం కేంద్రంగా    అమ్మ అనుగ్రహం చేతను సద్గురుస్వరూపులు సర్వత్రా రక్షకులైన హనుమత్ ప్రభువుల కరుణచేత అనేక భగవత్ కైంకర్యములు, ఆథ్యాత్మిక సాధనలు,ధార్మిక ప్రచారకార్యక్రమములు సాగుతున్నవి . 
భగవంతుని పట్ల దాసభావము స్థిరపరచుకుని అన్నిసాధనామార్గములలో  భక్తి,జ్ఞానయోగ సాధనలో సాగుతున్న సోదరసోదరీమణులనందరనూ కలుపుకుని సాగాలని నిర్ణయించుకుని "రామదండు" గా కలసి  నడుస్తున్నాము.
అందులో మాతో కలసి నడచేవారందరికీ పరస్పర సమాచారం తెలుపుకొనుటకు, ధార్మిక విషయాలను చర్చించుకుని అనుమానాలు నివృత్తిచేసుకుంటూ హరిభక్తిని స్థిరపరచుకొనుటకు   అంతర్జాలంలో గూగుల్ గ్రూపును ఏర్పరచటం జరిగినది. ఈశ్వరనిపై అనురాగం తో ప్రవర్తిస్తున్న వారందరూ ఈ గ్రూపులో చేరవచ్చు.
మిమ్మల్ని గూర్చి స్వల్పంగా వివరాలు తెలియపరుస్తూ    మిమ్మల్ని రామదండు  గ్రూపులో చేర్చుకొమ్మని కోరుతో   hanumatparivar@gmail.com  కు మెయిల్ పంపవలసినదిగా కోరుతున్నాము .

1 వ్యాఖ్యలు:

voleti November 27, 2013 at 5:52 AM  

Sir,I have sent the message. Thank u.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP