విగ్రహాన్ని పూజించినా భగవంతుణ్ణి పూజించినట్లే
>> Saturday, October 26, 2013
[Kb Narayana Sarma ]
--
శరీరంలో ఏ అవయవాన్ని తాకినా వ్యక్తిని తాకినట్లే. ఒక గుండు సూది మొనతో
శరీర లోని ఏ భాగాన్ని స్పృశించినా వ్యక్తి స్పందిస్తాడు. వ్యక్తి కంటికి
కనబడడు. శరీరంలో భాగమైన ఏదైనా అవయవాన్ని ముట్టుకుంటే చాలు కనబడని వ్యక్తి
స్పందిస్తాడు.
ఈ
శరీరంలో నీవుండే చోటేది? నీ ఉనికికి కేంద్రమేది? అని ప్రశ్నిస్తే .. తన
ఉనికి ఈ శరీరమంతా వ్యాపించి ఉంది అని వివరిస్తాడు. ఆరడుగుల ఎత్తు, 80
కిలోల బరువు ఉన్న దేహంలోనే వ్యక్తి అంతటా వ్యాపించి ఉన్నప్పుడు, అఖిలాండ
కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు
అయిన పరమాత్మ ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉండడంలో అతిశయోక్తి లేదు. అన్నీ
తానే అయినప్పుడు దేనిని స్పృశించినా పరమాత్ముని స్పృశించినట్లే. అన్నీ
తానే అయినప్పుడు దేనిని పూజించినా దానికి ఆయన స్పందించడంలో ఆశ్చర్యమే
లేదు. విగ్రహాన్ని పూజిస్తే పరమాత్ముణ్ణి పూజించడమే అవుతుంది.
0 వ్యాఖ్యలు:
Post a Comment