శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏ అవతారమయినా లోకరక్షణార్ధమే....

>> Tuesday, October 22, 2013

ఏలోకంలోనైనా భక్తి తత్వం విశిష్టమైనది. అది లేకుండా ఎవ్వరూ పునీతులుకారు. ఈ భక్తితత్వం అలవాటుగా వచ్చేది కూడా కాదు. పురాకృత పుణ్యవిశేషం వల్ల, మహనీయుల సందర్శనం వల్ల, సత్సాంగత్యం వల్ల భక్తి తత్వం పరిపుష్టమవుతుంది. మనోవాక్కాయ కర్మల్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే అదే సత్యమవుతుంది. ఆ సత్యస్వరూపమే భగవంతుడు. భగవంతుని దర్శించడానికి భక్తితత్వమే ప్రాతిపదిక. స్థిరమైన భక్తికున్న శక్తి భగవత్శక్తిని మించినదనడంలో అతిశయోక్తి లేదు. మోహం నశిస్తేనే గానీ, భక్తి అబ్బదు.


లోకంలో జన్మించిన మహనీయులెందరో నిశ్చల భక్తితో భగవన్నామ స్మరణయందే తమ సంపూర్ణ కాలము వెచ్చించి, మహామహితాత్ములై ప్రసిద్ధి చెందారు. అట్టివారిలో మొట్టమొదట చెప్పుకోదగినవారు, రామభక్తి సామ్రాజ్యంలో నిరంతరం శ్రీరామనామోచ్ఛారణతో ఆయన పాదాల వద్ద తన జీవిత సర్వస్వం పునీతం చేసుకున్నవాడు శ్రీఆంజనేయస్వామి వారు.
మనదేశం సదాచార సాంప్రదాయాలకు కాణాచి. కొందరి దృష్టిలో ఇవి శాస్ర్తీయమైనవి కావనీ, నిరర్ధకములైనవనే భావన ఉంది. దూరం ఆలోచింపక, వాటిలోని వాస్తవికతను తెలుసుకోలేక ఇలా నిందిస్తారేమోగానీ, వాటిలో వాస్తవికత, విజ్ఞాన విషయాలు ఎన్నో ఉన్నాయి.
పూర్వకాలం ఏమోగానీ, ప్రస్తుతకాలంలో గ్రామ, పట్టణ నగర పొలిమేరల్లో ఎతె్తైన, గంభీరమైన, ఆకర్షణీయమైన ఆంజనేయ స్వామి విగ్రహాలను నిర్మిస్తుండటం మనం గమనిస్తూనే ఉన్నాం.

ఇలా విగ్రహాలను ఊరి పొలిమేరల్లో ప్రతిష్టించడానికి ముఖ్య కారణం లేకపోలేదు. పొలిమేరల్లో స్థాపించిన ఈ విగ్ర హాల వలన ఆ ప్రాంతంలో నివశించే ప్రజలకి దీర్ఘవ్యాధులు, కలరా, మసూచి వంటి మహమ్మారి రోగాలు వ్యాపించవనే నమ్మకం ఉంది. ఈ నమ్మకానికి కారణమైన ఒక పురాణ కథని తెలుసుకుందాంశ్రీమహా విష్ణువు కూర్మావతారం ధరించి పాలసముద్రంలో మంధర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై ఎత్తిపెట్టాడు. దేవదానవులు వాసుకిని తాడుగా చేసుకుని సముద్ర మథనం చేయగా అమృతం వంటి ప్రభావవంతమైన పదార్ధాలేకా కుండా, భయంకరమైన కాలకూట విషంతో పాటు అనేక నివారణలేని రోగక్రిములు కూడా ఉత్పన్నమయ్యాయి. అంతే కాకుండా అనేక దుష్టశక్తులు కూడా ప్రబలి ప్రజల్ని బాధిం చడం మొదలయ్యింది. విషపదార్ధాల నుంచి వ్యాపించిన రోగ క్రిములు మసూచి, కలరా వంటి వ్యాధుల్ని వ్యాపింపచేయగా, ఊళ్ళకి ఊళ్ళు తుడిచిపెట్టుకుపోవడం మొదలయ్యింది.

ఈ వ్యాధుల్ని ఎంత ఘనవైద్యులు ప్రయత్నించినా దుష్టశక్తులు నశించలేదు. ఈ ఘోరమైన రోగాలు నయం కాలేదు. ఇక చేసేది లేక ప్రజారక్షణా తత్పరులైన ఋషులు బ్రహ్మవద్దకు వెళ్ళి తమ ఆర్తిని తీర్చమని ప్రార్ధించారు. బ్రహ్మదేవునికి కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకనందున అందరితో కలిసి కైలాసవాసుడైన ఆ పరమేశ్వరుని వద్దకు వచ్చాడు. ఆర్త జన రక్షకుడైన ఆ శివుడు ఈ సమస్యనించి ప్రజల్ని కాపాడటం కోసం తాను వానర రూపాన్ని ధరించి, తన అంశలోని ఏకా దశ రుద్రులకు వానర రూపాలే కల్గచేసి ఈరోగాలు వ్యాపిం చినచోటకు వెళ్ళి భయంకరమైన వికృత అరుపులతో రణగణ ధ్వనిచేసి హడలెత్తించారు. ఈవానర సమూహ ధాటికి రోగక్రి ములుగా ఉన్న దుష్టశక్తులన్నీ నిలువనీడలేకుండా పోయాయి. ఈ విధంగా సర్వజనోద్ధరణకు వానర సైన్యం భూమ్మీద అవతరించింది.

అందరూ సుఖసంతోషాలు పొందారు. ఆ సమయంలో బ్రహ్మ దేవుడు వానరరూపంలో ఉన్న శివ శక్తిని ఆరాధిస్తే సకల శుభా లూచేకూరతాయని ఆశీర్వదించాడు.
వానరులకు, నరులకు చాలా విషయాల్లో పోలికలున్నాయి కదా: కోతి నుంచే మాన వుడు ఉద్భవించాడని కూడా విజ్ఞాన శాస్తవ్రేత్తల అభిప్రాయం. కైలాసవాసుడు శివుడే శ్రీఆంజనేయస్వామిగా అవతరించాడని చెప్పుటకు గల మరో ఐతిహాస్యాన్ని తెలుసుకుందాం..
పూర్వం గార్థభనిస్వనుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివు ని గూర్చి ఘోర తపస్సుచేసి శివశక్తినే తన కవచంగా చేసుకు న్నాడు. ఇక అనేక ఘోరకృత్యాలు చేస్తూ, తపోధనుల్ని, ప్రజానీ కాన్ని అల్లకల్లోలం చేయడం ప్రారంభించాడు. ఎన్నిచేసినా శివశక్తి కవచం వల్ల ఏదీ గార్ధభనిస్వనునికి తాకేది కాదు. వీని ఆగడాలు శృతిమించిపోవడంతో అందరూ శ్రీమహావిష్ణువుని వేడుకున్నారు. అప్పుడు ఆయన శివశక్తి కవచం వల్ల ఈ విధ మైన సమస్య రావటంచేత అందర్ని వెంట నిడుకుని కైలాసా నికి వచ్చాడు.

శివునితో, పరమేశ్వరా గార్ధభనిస్వనునికి ఇచ్చిన నీ శివశక్తి కవచాన్ని ఉపసంహరించమని ప్రార్ధించాడు. అం దుకు ఆ పరమేశ్వరుడు, కేశవా! నీకు తెలియనిదేమున్నది భక్తులకిచ్చిన వరాన్ని తిరిగి తీసుకోలేను. అని సమాధానం ఇచ్చాడు. ఇక చేసేదిలేక విష్ణువు వానితో తలబడడానికి సమా యత్తమయ్యాడు. ఈ విషయంలో శివకేశవులకి వాగ్యుద్ధం జరిగింది. ఆ వాగ్యుద్ధంలో శివశక్తివల్ల శ్రీహరి ఓడిపోతే, ఆయన శివునికి దాసుడుకావాలి. అదే శ్రీహరి చేతిలో గార్ధ భనిస్వనుడు మరణిస్తే శివుడు, శ్రీహరికి దాసోహం చేసే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. దైవలీలలు చెప్పడం ఎవరికి సాధ్యం..! శివకేశవులకు బేధం లేదు కదా..! శ్రీమహావిష్ణువు తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఆ సమ యంలో గార్ధభనిస్వనుడు తన సుందర ఉద్యానవనంలో విహ రిస్తున్నాడు. శ్రీమహావిష్ణువు ఒక అందమైన స్ర్తీరూపం ధరించి తనముందు కదలాడాడు. ఆ రాక్షసాధముడు చిత్తచంచలుడై ఆ మాయారూపంలో ఉన్న శ్రీహరి వెంటపడ్డాడు. శ్రీహరి నయగారాలు నటిస్తూ, గార్ధభనిస్వనునిచేత విపరీతంగా మథు వు తాగించి, ఆ మత్తులో పడివున్న గార్ధభాసురుని తోడేలు రూపం దాల్చి ఖండఖండాలుగా చేసేసాడు. అంతటితో గార్ధభ నిస్వనుడు నిర్జీవుడైయ్యాడు. పరమేశ్వరుడు కూడా శ్రీహరి దుష్టసంహారానికి సంతోషించాడు. సర్వలోకాలకూ శాంతి కలి గింది.

చెప్పిన మాట ప్రకారం తాను శ్రీహరికి దాసుడనన్నాడు. శ్రీమహావిష్ణువు పరమేశ్వరుని వారించి చిరునవ్వుతో పరమే శ్వరా! కాలక్రమంలో త్రేతాయుగంలో రావణ సంహారానికి నేను శ్రీరాముడుగా అవతరిస్తాను. అప్పుడు నీవు ఆంజనేయు డిగా అవతరించి నీ మాట నెరవేర్చుకుందువుగాని. అని వైకుం ఠానికి తరలి వెళ్ళాడు. లోకాలన్నీ శాంతించాయి. ఋషులు, సకల రాజన్యులు ఎంతగానో సంతోషించారు. ఆనాటి మాట ప్రకారమే త్రేతాయుగంలో శివశక్తితో అంజనేయుడు అవత రించి నేటికీ శ్రీరామపద సేవా తత్పరుడిగా మనందరి చేతా పూజలందుకుంటున్నాడు.
విద్యుత్తును ఉత్పత్తి చేసే పెద్ద విద్యుత్తు కేంద్రం ఎక్కడో ఉంటుంది. అయితే అది మీకు నేరుగా విద్యుత్తును అందివ్వలేదు. సాధారణంగా చాలా మంది విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం గురించి ఏమాత్రం పట్టించుకోరు. అసలు దాని గురించే వారికి తెలిసి ఉండదు. అయితే తమ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌లోకి విద్యుత్తుతో పనిచేసే ఏదైనా ఉపకరణానికి ఉన్న ప్లగ్‌ను పెడితే ఆ పరికరం పనిచేస్తుందనే విషయం బాగా తెలుసు. అలాగే, కుండలిని, ప్లగ్‌పాయింటే కాని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కాదు. అది 3 పిన్నులది కాకుండా ఏకంగా 5 పిన్నులున్న పాయింట్ మీరు శరీరంలోని సప్తచక్రాల గురించి వినే ఉంటారు. వాటిలో ఒకటైన మూలాధార చక్కం ప్లగ్‌పాయింట్ వంటిది. అందుకే దానికి మూలాధారం అని పేరు వచ్చింది. అంటే మౌలికమైన లేదా ప్రాథమికమైనది అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాల్లో 5 చక్రాలు ప్లగ్ వంటివి. మరి ఏడో చక్రం ఏమిటంటే, అది వెలుగిచ్చే బల్బు వంటిది. దానితో మీరు అనుసంధానమయ్యారంటే మీకు చెందిన సర్వం వెలుగుతో నిండిపోతుంది. సక్రమంగా అనుసంధానం జరిగితే రోజంతా 24 గంటలూ దీపాలు వెలుగుతూ ఉంచుకోవడమనేది ఓసమస్యే కాబోదు. మీ బ్యాటరీ డౌన్ అయిపోతుందనే భయంతో మీ శక్తిని(విద్యుత్తును)కట్టేయవలసిన అవసరమే రాదు. ఎటువంటి నదురూ బెదురూ లేకుండా అసలే మాత్రం పట్టించుకోకుండా దాన్ని అలాగే నడిపించేయవచ్చు. మీరు సరాసరి ఆ శక్తి లభించే మూలవనరుతోనే అనుసంధానమై ఉన్నారు కనుక ఇది సాధ్యం.
ఇప్పుడు కూడా మీలో శక్తి ఉంది. మీరు జీవించి ఉన్నారు అంటే, జీవనశక్తులన్నీ పనిచేస్తున్నాయని అర్థం. కాకపోతే, చాలా అత్యల్పస్థాయిలో అదీ ఆ మహాశక్తిలోని అతి స్వల్ప అంశంగా మాత్రమే పనిచేస్తుంటాయి. అలాకాకుండా ఆ మొత్తం శక్తి అంతా మీకు అందుబాటులోకి వచ్చి, దానితో సవ్యంగా అనుసంధానమై ఉంటే, దానితో మీరు సాధించగలిగే వాటికి అంతే ఉండదు. మీ ఇంటిలోని ప్లగ్‌పాయింట్‌కు సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే మీరు దీపాలను వెలిగించవచ్చు. ఏసీని పనిచేయించవచ్చు. అలాగే హీటర్, టీవీ ఒక్కటేమిటి? ఏ విద్యుత్తు పరికరాన్నయినా పనిచేయించి దానివల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు కదా. అన్నిటికీ, కేవలం ఒకే ఒక్క పవర్‌పాయింట్ (విద్యుత్తును అందించే సాధనం)చాలు. ఎన్ని పనులైనా చేయడం సాధ్యపడుతుంది. కాని, మీరు మాత్రం అనుసంధానం చెంది లేరు. మీ సొంత శక్తిని సృష్టించుకోవాలని, ఉత్పత్తి చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఏకంగా రోజుకు 5సార్లు తింటున్నారు. అయినా కూడా రోజంతా నిస్సత్తువగా అలసి సొలసిపోయి ఉంటున్నారు. జీవితాన్ని సాగించడానికి పడే అష్టకష్టాలు ఇవి.
శక్తి అంటే కేవలం భౌతిక శక్తి రూపంలోనో, కార్యకలాపాల రూపంలోనే ఉండేదే కాదు. అది జీవనశక్తి, అసలు ఉనికే మహాశక్తి. ఈ అస్తిత్వానికి మూలమంతా శక్తే. అది తెలియడమంటే జీవితమూలాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండటం. శక్తి విధివిధానాలు కనుక మీరు అర్థం చేసుకోగలిగి ఉన్నట్లయితే ఈ మొత్తం సృష్టి రచనకు సంబంధించిన సర్వం మీకు బోధపడుతుంది. అంటే మీరు అనుసంధానమై ఉన్నారంటే, ఆ శక్తి ఏ విధంగా తయారవుతుందన్న విషయం తెలియకపోయినా, అసలు శక్తి అంటే ఏమిటో, అది ఏమి చేయగలదో, దాని నుంచి మీరేమి సాధించగలరో మీకు తెలుస్తుంది. తద్వారా తిరగులేని, శక్తి మూలంతో మీరు మమేకమై ఉంటారు. కుండలిని అంటే ఇదే.
మరిప్పుడు అనుసంధానం గురించి తెలుసుకుందాం. ఏదైనా విద్యుత్తు పరికరాన్ని పవర్‌పాయింట్‌తో ప్లగ్ చేయాల్సి వస్తే , మీ చేతులు వణుకుతుంటే, గోడంతా తడిమినా మీరు ప్లగ్‌పాయింట్‌తో ప్లగ్ చేయలేరు. అదే విధంగా దేహంలోని 5 పాయింట్ల ప్లగ్‌ని ప్లగ్ పాయింట్‌తో అనుసంధానం చేయడం చాలా మందికి ఎంతో కష్టసాధ్యంగా కనపడుతోంది. ఎందుకంటే, వారి దేహం, బుద్ధి, మనస్సు, ఆలోచనలు, శక్తియుక్తులు ఏవీ స్థిరంగా ఉండడం లేదు. ఈ స్థిరత్వం సాధించడం కో సమే Äెగాభ్యాసం. తద్వారా మీరు ఆ కేంద్రంతో అనుసంధానం కాగలుగుతారు. అలా అనుసంధానం చేస్తే ఇక అపరిమితమైన మహాశక్తి ఉంటుంది. ఆ మహాశక్తిని సృజించేది ఏదో, ఎక్కడుందో మీకు తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. అనుసంధానం కండి, అంతే, అంతా జరిగిపోతుంది.
ఎటువంటి ఆటంకాలు లేకుండా శక్తి ప్రవాహం నిరాటంకంగా ప్రవహించడానికి అవసరమైన సక్రమ అనుసంధానం జరగడానికి తోడ్పడేదే యోగం. ఒకసారి మీరు నిరాటంకంగా సాగే ఈ శక్తి మూలాలతో అనుసంధానం కాగలిగారంటే, జీవితం ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే మీ జీవితాన్ని సాగిస్తారు. అప్పుడిక అసలు జీవితం దేనికోసమే, దానిలక్ష్యంఏమిటో దానివైపే మీరు సహజంగా సాగిపోతారు. సాధారణంగా మిమ్మల్ని మాయలో పడేసే, మిమ్మల్ని వేధించే చిత్రవిచిత్రమైన ఆలోచనలు, కలలు, ఆశలు, కోరికలు, భావావేశాలు, భయభ్రాంతులు.. ఈ లోకంలోని భవబంధాలనేవే మీ మిమ్మల్ని కట్టిపడేయలేవు. వాటి బంధనంలో చిక్కుకోరు. సరాసరి సాగిపోగలుగుతారు. మహాశక్తి మూలంతో మీరిప్పుడు నిరంతరం అనుసంధానమై ఉన్న కారణంగా ఇది సాధ్యమవుతుంది. అదే ఈ సర్వసృష్టికి మూలాధారం.
ం సద్గురు
- See more at: http://www.andhrajyothy.com/node/11266#sthash.vwtKCH5M.dpuf

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP