డయాబెటిస్ - ఒక ప్రాణశక్తి సంక్షోభం :సద్గురు
>> Wednesday, August 28, 2013
దీర్ఘవ్యాధులేవైనా, దానికి మూలకారణం ప్రాణమయ కోశం(ప్రాణశక్తి పనిచేసే తీరు)లోనే ఉంది. మీరుంటున్న వాతావరణ పరిస్థితులు, మీరు తింటున్న ఆహారం, మీకున్న సంబంధ బాంధవ్యాలు, మీ భావావేశాలు, మీ దృక్పథం, ఆలోచనలు, ఉద్దేశాలు... ఇలా అనేక కారణాల వల్ల ప్రాణశక్తి సక్రమంగా పనిచేయదు. కొన్ని బాహ్య శక్తులు మీ అంతశ్శక్తిని కలత (సంక్షోభం) పెట్టడం వల్ల కూడా ప్రాణశక్తి సక్రమంగా పనిచేయకపోవచ్చు. ఇలా ఏదో కారణంగా మీ ప్రాణశక్తి క్షోభకు లోనవుతోంది. అదే శారీరక, మానసిక కలతగా పరిణమిస్తుంది. ఒకసారి ఈ ప్రాణశక్తి కలతకు గురైతే, భౌతిక, మానసిక శరీరాలు కూడా కలతకు లోనవుతాయి. నిజానికి అప్పుడే అది వైద్యపరమైన సమస్య అవుతుంది. అప్పటి దాకా శారీరక సమస్యగా వ్యక్తం కాకపోవడం వల్ల అది వైద్యపరమైన సమస్య కాలేదు.
దురదృష్టవశాత్త్తూ వైద్య శాస్త్రాలు వ్యాధుల్నే అర్థం చేసుకోగలవు తప్ప ఆరోగ్యపు మూలకారణాలను గుర్తించలేవు. ఈ అనారోగ్యానికి కారణం ఏమిటి, దానికి ఆధారం ఏమిటి అని అవి గుర్తించలేవు. మీరు మధుమేహ(డయాబెటిస్) వ్యాధిగ్రస్తులైతే చక్కెరతో మీకు సమస్య కాదు, మీ ప్యాంక్రియాస్(క్లోమ గ్రంథి) సరిగా పనిచేయడం లేదు, అంతే! మీ శరీరంలో చక్కెరను నియంత్రించే ప్యాంక్రియాస్ సరిగా పనిచేయడం లేదు కాబట్టి, చక్కెర తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే అల్లోపతి (ఇంగ్లీష్) వైద్యంలో ప్యాంక్రియాస్‌ను ఎలా ఉత్తేజపరచాలో వారికి తెలియదు. అందుకే వారు రోజు 'షుగర్ చెక్ చేసుకోండి. అవసరం అయితే ఇన్సులిన్ మోతాదు పెంచాలి' అంటారు. అల్లోపతి పైపై లక్షణాలనే చికిత్స చేస్తుంది. వైద్యులు మీ వ్యా«ధి లక్షణాలకే చికిత్స చేస్తారు.
బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియా వ్యాధుల వంటి వాటికి, అల్లోపతి వైద్యం ఎంతో ఉపయోగకరం, అత్యుత్తమం! కాని మనిషి తానుగా లోపల నుంచే తెచ్చుకుంటున్న రక్తపోటు, మధుమేహం, పార్శ్వనొప్పి లాంటి వాటికి అల్లోపతి వైద్యంలో ఏ విధమైన పరిష్కారమూ లేదు. ఈ ఆ«ధునిక వైద్యం వ్యాధిని సమర్థించుకు వస్తుంది. అంతేకానీ మిమ్మల్ని వ్యాధి నుంచి విముక్తి చేయదు. కేవలం వ్యాధిని నియంత్రించడానికి మాత్రమే ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎంతో ధనాన్ని, సమయాన్ని కేవలం వ్యాధి నియంత్రించడానికే ఖర్చు చేస్తున్నారు. ప్రజలు మానసిక ఒత్తిడిని, రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడంతో సరిపెట్టుకుంటున్నారు. అసలు తమ ప్రాణశక్తులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ తెలివి తక్కువతనం వచ్చింది.
యోగాలో మధుమేహ వ్యా«ధిని చాలా మౌలికమైన సంక్షోభంగా గుర్తిస్తాము. దానిని తేలికగా తీసుకోము. అసలు శరీర వ్యవస్థే దెబ్బతింటోందని, అందుకే వ్యాధి వస్తోందని గుర్తిస్తాము. మనిషి మనిషికీ అది వేరు వేరుగా ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా చికిత్స చేయవలసి వస్తుంది. ఏ వ్యాధి అయినా శరీరంలో సమతుల్యం తీసుకురావడానికి, ప్రాణ శరీరాన్ని ఉత్తేజితం చేయడానికి యోగా ప్రయత్నిస్తుంది. ప్రాణశక్తి వ్యవస్థ సమతుల్యతతోఉండి, శక్తి చలనం సరిగా ఉంటే శరీరంలోగానీ, మనుసులోగానీ వ్యాధులు ఉండే అవకాశం లేదు. డయాబెటిస్‌ను ఒక వ్యాధిగా కాక, అది శరీరంలోని ప్రాణశక్తి వ్యవస్థ దెబ్బతినడం మూలంగా వచ్చిందని గ్రహించి, దానిని సరిచేయడం వల్ల అది నయమౌతుంది. అందువల్ల మనుషులు తమ శక్తి వ్యవస్థను బాలెన్స్ చేయడానికి కొంత యోగ సాధన చేయడానికి ముందుకు వస్తే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
-సద్గురు
2 వ్యాఖ్యలు:
ఈ విషయంలో నా అభిప్రాయాన్ని నా బ్లాగులో వ్రాసాను. చదవండి ఆధ్యాత్మికవేత్తలూ - వైద్యసలహాలూ.
పెద్దలు శ్యామలీయం గారికి నమస్కారం
జగ్గీవాసుదేవ్ గారి ఉపన్యాసం ఒకటి పత్రికనుంచి నాబ్లాగ్ లో పోస్ట్ చేశాను . వినదగు నెవ్వరు చెప్పిన ... అనే సూక్తి ప్రకారం మనం చదివినవన్నింటినీ గుడ్డిగా నమ్మం . వినటంలో తప్పూ లేదు. ఇక వైద్య విధానాలపై మీ స్పందన కొద్దిగా ఆవేశంగా ఉన్నట్లనిపిస్తున్నది. వివరంగా వ్రాద్దామంటే నేను బెడ్ రెస్ట్ లో ఊండటం వలన కుదరటం లేదు. కాలుకు దెబ్బతగిలి శస్త్రచికిత్స చేశారు . కోలుకున్నాక గానీ లేక మీరు ఫోన్ లో కలిసినప్పుడు గాని మాట్ళాడతాను . ఆయన వ్రాసినవి ,మీరు వ్రాసినవి ఇంకోసారి పరిశీలనగా చూడండి జైశ్రీరాం .
Post a Comment