శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మా ! శాంతించు తల్లీ ! మేం నీ బిడ్డలం కాదా ?కాపాడు జననీ!

>> Friday, June 21, 2013

తల్లీ ! జగన్మాతా ! తెలిసి తెలియని తనం,అజ్ఞానం మా ఆభరణంగా పెరిగాం . సకలం సమకూర్చిన నీ దయను దుర్వినియోగం చేసుకున్నాం . ఇలా  నీకోపానికి గురవుతున్నాం.  నీ కన్న్నులలో చిరుకోపానికే తల్లడిల్లిపోతున్నాము. మా సోదరులు,బంధువర్గం వేలసంఖ్యలో నీ భీభ్త్సరూపాన్ని చూసి తల్లడిల్లి హిమాలయాలలో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటించి .ఆదుకోమని ఆర్తనాదాలు చేస్తున్నారు. తల్లీ ! నువ్వు కోపగిస్తే ఇక మిగిలేదేముంది ?  శాంతించు తల్లీ ! శాంతించి నీసహజ సిద్దమైన దయామృతదృష్టితో కరుణించి ఈ విపత్తునుంచి అందరినీ కాపాడు జననీ.

[  మితృలందరికీ వినతిః హిమాలయ భూములలో చిక్కుకుని  ఆపదలో ఉన్న వారందరికీ క్షేమం కలగాలని .వారందరినీ కాపాడమని  ,మీ పూజలోను ,అనుష్టానములలో ప్రార్ధించవలసినదిగా మనవి. శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో రేపటినుండి వీరందరి కాపాడమంటూ ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఆదివారం  లోకమాత ను శాంతదృష్టులతో కరుణించమని కోరుతూ గాయత్రీ హోమం జరపనున్నాము . మీమీ అనుష్టానాలను ఈసంకల్పానికి అనుసంధానించమనవి  మా విన్నపము]

8 వ్యాఖ్యలు:

Anonymous June 22, 2013 at 1:03 AM  

బాగుంది!

నది పొర్లడం భౌతికమైన విషయం. దానికి కావాలసింది భౌతిక సహయం. అది చేయకుండా ఇలా ప్రార్ధనలు చేయడంవల్ల ఏంజరుగుతుంది? మేమూ ఏదో చేశామన్న pseudo satisfaction తప్ప? నిజంగా మీకంతా బాధగా ఉంటే అక్కడకు వెళ్ళి సహాయం చెయ్యండి (నేను వెళ్ళాను) అంతేగానీ ఇలా సొల్లుపనులవల్ల ఏదో అవుతుందనుకుంటే అది కేవలం మీనమ్మకం మాత్రమే

durgeswara June 22, 2013 at 9:21 AM  

స్లేడ్ గారూ
మీ అహంకారపూరిత సూచనలకు సమాధానం చెప్పే సమయం ఇదికాదు.
నేను అక్కడకు వెళ్ళివచ్చినవాడిని . అక్కడ పరిస్థితులు తెలిసినవాడిని. మీరు వెల్లివచ్హాను అంటేనే అర్ధమవుతుంది మీరేమి చేసి వచ్చి ఉంటారో. అక్కడ భుతిక సహాయం అందించటం కోసం ఇప్పుడు జనాన్ని అంగీకరించలేరు. వెల్లేవాల్లు అదనపు బరువవుతారు. కొద్దిగా రహదారులు తెరుకుంటే తప్ప వేరుమార్గం లేదు . తమకు ఏదో ఒకటి గొప్పగాచెప్పుకోవాలనే తపనతప్ప నిజమైన సానుభూతి సహాయం చేయగలిగే స్థితి లేదనేది స్పష్టమవుతుంది. ఎవరి ప్రయత్నాలు వారు చెస్తారు ఆపదసమయంలో . భౌతికంగా సహాయమందించేందుకు వందలాది స్వయం సేవకులు సరంజామాతో సిధ్ధమయి ఉన్నారు. అహంకారులకు ఇవి అర్ధం కాదు. కాస్త ఈసమయంలో మన ప్రేలాపనలు కట్టి పెడదాం. ఎవరికి చేతైన మార్గంలో వారు సహాయంఅందించేందుకు సిద్దమవుదాం
సద్భుధ్ధిని ప్రసాదించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాం

chandra vykanti June 22, 2013 at 12:39 PM  

అయ్యా స్లెడ్ గారు

మీ కామెంట్స్ ఇదివరకు కూడా చదివాను. మీకు ఎంత అహంకారం అండి. దైవ ప్రార్ధన దైవ సహాయము లేకపోతే ఊపేరే పీల్చ లేమే మరి మన మెంత వాళ్ళము చెప్పండీ .
దుర్గేస్వరరావు గారూ మీరు మీ యాత్ర గురించి వ్రాసిన వివరాలు చదివాను. నేను మీతో పూర్తిగా ఎకీభావిస్తున్నానండి మరియు మీ ఆలోచనాశక్తిని అభినందిస్తూ మీరు ఇంకా అమ్మ దయవల్ల ఇంకా సమాజములో వున్న లోపాలను సాధ్యమైతే ముందుగా గుర్తించి తగిన విధముగా సలహా కాని, హెచ్చరిక ఇస్తే కొంతమంది వినకుండా వున్దరు. నేను అమ్మ గంగాదేవి విషయము ఒక్కదాని గురించే రాయడము లెదన్ది. మీ వెబ్ సైట్ ను, మీ కామెంట్స్ ఎపుడు చదువుతూ వుంటాను సార్.
నేను కెనడాలో నివసిస్తున్నను. నేను మీరు వివరించిన ఇక్కడ కట్టు, బొట్టు చూస్తె చాలా ఆశ్చర్యకరముగా ఉంటుంది . ఇండియా నుండి వచ్చిన వారు కూడా ఇక్కడ వారిని అనుకరించ టములోముందు వుంటున్నారు అట్లా అని సనాథనధర్మము అనుకరించే వారూ లేకపోలేదు చెప్పోచే దేమిటంటే ఎవరైతే దేవుడిని నమ్మరో అక్కడ మీరు వివరించిన కష్టాలు రావడము చుసాను.

Unknown June 23, 2013 at 1:16 AM  

ఎవరి అమ్మానాన్నలు వారివారి బిడ్డలు అంతేగాని నదిని తల్లి అని కొండని తండ్రి అని పిల్లకలువాలని పిల్లలని చెట్లను చెల్లి అని మామయ్య అత్తగారు అని రాళ్ళు రాప్పలకు పేరులు పెట్టటం మంచిదికాదు,దేశానికి ప్రమాదం ప్రజలు ప్రకృతిని అర్ధం చేసుకోలేరు,తర్కించలేరు,మన మతం చెప్పేది బజన చేయమనికాదు.అన్వేషణ తర్కం చేయమని.భజన పూజా ఇవన్ని పురాతన కాలం లో పూజారులు ఉదారపోశానార్ధం సృష్టించుకొన్న ట్రిక్కులు,వీటిని కందిచాకపోతే ప్రమాదం నదిని అమ్మా అని తాతా అని అడుక్కొని అందరిని దేబిరించందని ప్రోత్సహిస్తూ దరిద్రపు బతుకు బత్కకుడదని నా అభిప్రాయం,మన హిందూ మతాని బ్రస్తు పట్టించిన సావుస్క్రుతిని ప్రొత్స హించోడ్డు అని నా మనవి

మనోహర్ చెనికల June 23, 2013 at 2:37 AM  

మేము చెయ్యగలిగినది మేము చేస్తున్నాము. ఎవరికి వారు ఉన్న ప్రాంతం నుండి, వారికి పంపగల సహాయం, ధనరూపేణా గానీ,వస్తురూపేణా గానీ చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగతంగా కానీ, సమిష్టిగా కానీ పంపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము.

"లోకాస్సమస్తాస్సుఖినోభవంతు" అని మేము ప్రతిరోజూ చెప్పే మాట మాకు తెలిపిన మరోమార్గం వారికోసం భగవంతుడిని ప్రార్ధించడం. ఆ దారి కూడా వదలకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సాటిమనిషి బాగుండాలని, ఆపద నుండి బయటపడాలని కోరుకోవడం తప్పెలా అవుతుందో మీరే చెప్పాలి. అందరూ అక్కడకి వెళ్ళే సహాయం చెయ్యాలంటే కుదురుతుందా, సహాయం చెయ్యగల ప్రతీ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. అంతే తప్ప ఏదో pseudo satisfaction కోసం చెయ్యడంలేదు

durgeswara June 23, 2013 at 9:26 AM  

అయ్యా
విన్ ని గారు
ప్రకృతితో ఆత్మీయ అనుబంధం మా సంస్కృతి . ఆసంస్కృతిని మరచి ప్రకృతిని భౌతికదృష్టితో చూసే మీ దౌర్భాగ్యపు సంస్కృతి ఈదేశానికి అంటుకుని ..ఇదో ఇలాంటి ప్రమాదాలు దాపురిస్తున్నాయి. ముందు మీరు కాస్త మీ అహంకారపు పొరలను తొలగిమ్చుకుని చూడండి

anrd June 24, 2013 at 3:27 AM  

అవునండి, దైవ ప్రార్ధనల వల్ల ఎంతో శక్తి వస్తుంది.
పూర్వం ఎందరో మహర్షులు తపస్సులు చేసి తమ తపశ్శక్తి ద్వారా లోకానికి పాసిటివ్ శక్తిని అందిస్తుండేవారని ( లోకానికి ఉపకారం ) పెద్దలు తెలియజేశారు.
భౌతికశక్తి గురించి ఆధునికులకు తెలుసు. తపశ్శక్తి గురించి తెలుసుకునే స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.


naidusree June 24, 2013 at 8:31 AM  

ఆపదలోగల సహోదరమానవులకు ఎవరికీ తోచిన రీతిలోవారు ప్రత్యక్ష,పరొక్ష కార్యక్రమాలద్వారా సహాయపడుట ద్వారా మనకుగల మానవ ధర్మాన్ని నెరవేర్చుకోవడం,మనకు ఆత్మత్రుప్తిని,ఆపదలో గలవారికి ఆత్మస్తైర్యమును 'ఉడతాభక్తి'సహాయము కాగలదు. -శ్రీహరి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP