శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీకిది బ్రాహ్మణులను మాత్రమే అవమానిస్తున్నట్లనిపిస్తుందా ? కాదు మనధర్మం,సంస్కృతులపై దాడి అని గుర్తించండి .

>> Saturday, October 27, 2012

మనధర్మాన్ని ,సంస్కృతీ సాంప్రదాయాలను, వాటిని విడువకుండా ఆచరిస్తూ సజీవంగా ఉంచున్నవారిని అవమానిస్తూ పుస్తకాలు వ్రాయటమ్,సినిమాలు తీయటం అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి.  ఈమధ్య వచ్చిన రెండు సినిమాలు  ' వాడెవడో ఎంగిలికుక్క తీసిన    చలం రచనల అధారమంటూ తీసిన సినిమా   ...అలాగే ఈమధ్య మంచు విష్ణు  హీరోగా తిసిన సినిమా లోనూ  బ్రాహ్మణులను కించపరుస్తూ తీశారని  గొడవ జరుగుతుంది.  అయితే ఇంత పెద్ద హైందవ సమాజంలో  కొద్ది గొంతులుమాత్రమే  ఈ దుర్మార్గంపై ఆవేదన తెలియజేశాయి. మిగతావారు యథాప్రకారం మౌనంగా ఉన్నారు. కారణమేమిటి ?
ఆ ! అదేదో  బ్రాహ్మణులను ఎగతాళి చేస్తున్నదేకదా ? మనకులంగూర్చి కాదుకదా అనే  భయంకర నిర్లిప్తత ఇందుకు కారణం.  హైందవ కుటుంబంలో భాగమైన ఓ ప్రధాన ఆచారధారపై  జరుగుతున్న ఈ సాంస్కృతిక దాడిపట్ల మనం మౌనం వహించటమంటే శరీరంలో ఏదో ఒకభాగానికి దెబ్బతగిలితే  మిగతా అవయవాలు స్పందించక పోవటం లాంటిదే ! అలాజరిగితే  అర్ధమేమిటంటే    మిగతాభాగాలకు పక్షవాతం వచ్చి స్పర్శజ్ణ్జానం కూడా కోల్పోతున్నట్లుగా భావించాలి. ఆ గాయం ప్రభావం శరీరం మొత్తానికి ప్రమాదమని గ్రహించి మిగతా అవయవాలు స్పందించాలి.
  మొదటినుంచీ నేనంటున్నట్లు ఈ దేశానికి  బలమూ,పెద్దబలహీనతా కూడా కులమే.
సామాజిక అవసరాల కోసం ఏర్పాటైన కులవ్యవస్థ  నేడు స్వీయపతనానికి కారణం కానున్నది.
అదెంత  గొప్పవ్యాధంటే  ఆయుర్వేదంలో ఉంది రాజయక్ష్మం అనేవ్యాధి పేరు దానంత !
ఇప్పుడు  అనేకానేన శక్తులప్రోద్భలంతో కులాలమధ్య చీలిక ఇతరకులాలు నాశనం కావాలనే మూర్ఖత్వం స్థాయికి ఎదిగింది. ఇక శతృవెవడూ మనపై దాడికి రావలసిన పనిలేదు. కమ్మ,కాపు ,రెడ్ది ,వెలమ అంటు బలమైన కులాలు వీటిలో ఇవి  కొట్టుకుంటూ నశిస్తాయి. ఇక ధర్మాచరణతో బ్రతుకుతున్న బ్రాహ్మణులను,ద్రవ్యసంచయనం సంపద సరఫరా శాఖలో ఉన్న వైశ్యులు    ,వాస్తవానికి ఈ ధర్మానికి ఆధారంగా నిలబడ్డఅట్టడుగు వరుసలోని కులాలన్నీ  ఆటొమేటిగ్గా తోడేళ్ల నోటికి చిక్కుతాయి. ఏతావాతా మనంతటమనమే పతనానికి  రహదారులు వేసుకుంటున్నాము .
ఇదేమి చిత్రమో !  మనవాడు  మతం మారి మనధర్మాన్నే ధ్వంసంచేయబూనుతున్నా మనకు చీమకుట్టి నట్లుండదు. మనవాడు వెధవైనా కులం పేరుచెబితే చాలు విపరీతమైన పూనకం వచ్చి వాడికోసం ప్రాణాలకుతెగిమ్చేంత పిచ్చి పట్తుకుంటున్నది.
అసలు నీకు ఈకులం అనే పదం ఎవడిచ్చాడు?  ఈధర్మం లోవాడివికనుక  నీకు ఒక బాధ్యత అప్పగించి ఓ పేరిచ్చారు  . మరి ధర్మమే  వద్దనుకున్నవానికి  కులమెందుకు ?

పైస్థాయిలో వాడు ఉదాహరణ కు మీ అభిమాన సినిమా హీరోల్లాంటివాల్లు  వేరే కులాల వారితో పెళ్లిల్లు  చెసుకుంటే రాని కోపం నీ చుట్టుపక్కల  జరిగితే అంగీకరించరా ?

మూర్ఖత్వం వదలి  ఇంత పెద్ద హైందవసమాజంలో కులప్రసక్తి లేకుండా  శక్తి సామర్ధ్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. వేదకాలంలో వలే అన్నివర్ణాలతో సంబంధబామ్ధవ్యాలను కలుపుకోవాలి. ధర్మంపైన  ,ఈ కుటుంబంలోని ఏ ఒక్కరిపైన   ఏరకమైన దాడి జరిగినా  ఎదుర్కోవాలి. మన నిరసన గళం బలంగా వినిపించాలి . ఇలా మౌనంగా ఉండటం ఆత్మహత్యా సదృశ్యమని  మిగతా అన్ని కులాలు గ్రహించాలి 

17 వ్యాఖ్యలు:

Anonymous October 27, 2012 at 8:22 PM  

ఇది వర్ణవ్యవస్థయొక్క వికృత పార్శ్వం. వృత్తి పేరుమాత్రమే అనే సన్నాయినొక్కులు మాని ఇప్పటికైనా కులాలెంత చేటైనవో తెలుసుకోవలసిన అవసరం ఉంది.

అన్నట్లు ఇంతకుముందు ఇతర కులాలపై సెటైర్లువేస్తూకూడా కొన్ని సన్నివేశాలున్నాయ్. మరి అప్పుడు మీరెందుకు నోరుమెదపలేదో తెలుసుకోవచ్చా? బ్రామ్హణులని అవమానిస్తే అది ధర్మాన్నే అవమానించినట్లాగునా? ఇతరులను అవమానిస్తే మాత్రం అది ఆయా కులాల సొంత వ్యవహారమా? మరి ఇదే ఇతర మతాలను అవమానించినప్పుడు ఏమయ్యింది? అప్పుడు మీరెవరూ ఇంత ఆవేశపడలేదే?

ఒకపని చెయ్యండి. అందరి సమస్యలనూ మీసమస్యలుగా చేసుకొని ఐక్యంగా పోరాడండి లేదా మీసమస్యను అందరి సమస్యగా చిత్రించడం మానుకోండి.

knmurthy October 27, 2012 at 10:16 PM  

bagundi guruvu gaaru

Anonymous October 27, 2012 at 10:41 PM  

బాగా చెప్పారు.

durgeswara October 28, 2012 at 12:36 AM  

అయ్యా
స్లేడ్ గారూ కులాలగూర్చి ఒకపార్శ్వం మాత్రమే మీకు విద్వేషంతో కూడిన అవగాహన ఉంది . వాటి అవసరం ఆనాడు ఉంది ఈరోజూ ఉంది . కాని మధ్యలో వచ్చిన విపరీతపోకడలతో అవి తుప్పుపట్టిన రాగిచెంబుల వలె తయారయిఉండవచ్చు . అంత మాత్రం చేత వాటి ఉపయోగం లేకపోదు.
ఇక ఇతర మతాలనుండి దాడులు విమర్శలను మౌనంగా ఎదుర్కోవటమే తప్ప విమర్శనైనా విద్వేషంగా ప్రకటించటం హిందువులకు తెలియదు . ఇక మీ ఆరోపణలకు గురయ్యే కారణాలు మాపట్ల ఎక్కడగమనిమ్చారో కాస్త తెలుపండి. ముందు మీరుకూడా ఈ గంగాప్రవాహంలో ఒకబిందువేనని గమనించండి

Anonymous October 28, 2012 at 1:09 AM  

అయ్యా దుర్గేశ్వరగారూ... నా ప్రశ్నలకు ఒక్కదానికైనా సమాధానమివ్వలేదేమండీ? నాప్రశ్నలో దేనికైనా సమాధానమ్మిస్తారని అనుకున్నాను సార్. కనీసం మీబాధం మొత్తం హిందూమతం బాధ ఎలా అవుతుందో ఐనా చెబుతారనుకున్నను సార్. ఇక ఆ ఆశలేదులెండి. ఈ వ్యాఖ్యను ప్రచురించాల్సిన అవసరంఖూడా లేదులెండి.

కులాల అవసరం ఇంకా ఉందా? బహుశా కులమే ఉపాధిమార్గమైన మీబోటివారికుందేమో! అవిలేకపోతే నిద్రపట్టని కులనాయకులకుందేమో! కళ్ళు తెరవండిసార్. చుటుప్రక్కల ప్రైవేటుస్యామ్యం రాజ్యమేలుతోంది. కొందరు సంకుచిత మనస్కుల మినహా పెద్ద పెద్ద కార్పొరేట్లు కులాలకన్నా ప్రతిభకి ప్రాధాన్యమిస్తున్నాను. హిందూమతాన్ని ఉధ్ధరిస్తామని బీరాలుపలికేమీలాంటివారే కులాలు-అవశ్యకత అంటూ లెక్చర్లు దంచితే అభాసుపాలవ్వగలరు జాగ్రత్త.

కులాలకు గుర్తింపు ఉంది నిజమే కానీ కులాన్ని కూడా జయించగల శక్తి ఈనాడు డబ్బుకుంది. ఎందుకూ కొరగానివాళ్ళుమాత్రమే ఇంకా "ఖులము ఖులము" అని పాకులాడుతున్నారు.

Anonymous October 28, 2012 at 3:20 AM  

బ్రాహ్మణద్వేషాన్ని కేవలం బ్రాహ్మణద్వేషంగా తీసుకోవడమ్ చాలా పొఱపాటూ. అది చాలా లోతైన ఐడియాలజీ. అది ప్రాథమికంగా సర్వహిందూ వ్యతిరేక ఐడియాలజీ. బ్రాహ్మణద్వేషులంతా తప్పనిసరిగా సర్వసాధారణంగా అగ్రకులాలవారందఱినీ ద్వేషించే తరహా అయ్యుంటారు. మిగతా ఆగ్రకులాల్ని తిడితే శాల్తీలు గల్లంతవుతాయి గనుక ఈ డొంకతిరుగుడు (బ్రాహ్మణుల్ని అడ్డం పెట్టుకోవడం) రూట్ లో వస్తారు.

Anonymous October 28, 2012 at 6:30 PM  

durgeswara said...
October 28, 2012 12:36 AM

కుక్క కాటుకి చెప్పుదెబ్బలా సమాధానం ఇచ్చారు. :))

durgeswara October 29, 2012 at 1:01 AM  

స్లేడ్ గారూమీరు ఆవేశం తగ్గించుకుని మనస్సులో స్థిరపరచుకున్న విద్వేషభ్వాలను పక్కకు నెట్టి మీ రంగుటద్దాలను మార్చి విషయాన్ని చూడాలి.
మనకు సహకార సంఘాలున్నాయి . ఇప్పుడంటే రాజకీయరొచ్చు కలగలసి కంపుబట్టాయి గాని వాస్తవానికి అవి నిర్మాణమైన లక్ష్యంగాని సరిగ్గా పనిచేయనిస్తే అవిసాధించే ఫలితాలుగాని మమ్చివేకదా?
వేదకాలంలో ఈ వర్ణాలన్నీ ప్రతిభ ఆధారంగా శ్రమవిభజనపై ఆధారపడి నిర్మితమయినవే . కాలానుగుణంగా మనబుధ్ధిహీనతతో అవి విక్రుతరూపాన్ని తీసుకుంటున్నాయి . వీటిని అణచివేయాలి,నాశనం చేయాలి అని కేకలెసిన వాల్లంతా ఇప్పుడు తామే కులనామాలను గర్వంగా ప్రదర్శిమ్చుకుంటున్నారు. అంటే వీటి దుష్పలితాలను బలప్రయోగంతోనో ద్వేషంతోనో నివారిమ్చటం సాధ్యంకాదు అని చరిత్రచెబుతున్న సత్యం. ఇక కులాధారంగా వంశపారంపర్యంగా వచ్చే విద్యలు వాటిలో నైపుణ్యాలు కొందరిదగ్గరైనా సమాజానికి మేలుచేసేందుకుపయోగపడతాయి కదా?
ఇక మీకొక అపోహఉంది . నేను బ్రాహ్మణున్ని కాదు.ప్రథమంగా నేను హిందువును నేను జన్మించిననది "కాపు" అనే హైందవ శాఖలో . ప్రస్తుతం నాకు ధార్మిక ఆచరణ వృత్తి కాదు అదొక జీవన విధానం. ఇక దీనిని వృత్తిగా ఆచరిస్తూ సమాజానికి మేలుచేయటానికి శ్రమించే వారిపట్ల మీకు ద్వేషమేమిటో ,బాధకలిగిస్తున్నదేమిటో అర్ధం కావటం లేదు.
ఇక మీలా మేమెప్పుడు దేన్నైనా ఉద్దరిస్తామనో >>> ఊడబొడుస్తామనో చెప్పటం లేదే ! మీరెందుకు ఆరోపణ చేస్తున్నారో మీకున్నలక్ష్యమేమిటో మాకు తెలియదు. ఇక కులాలను బట్టి ప్రాధాన్యతనివ్వాలని నేనన్నానా? పై వ్యాఖ్యలో చూడండి నేనేమని వ్రాశానో.
ముందు మనసులు కలవాలంటే ద్వేషభావం పోవాలి అది తొలగిమ్చుకుని రండి చర్చిద్దాము. ఇంట్లో ఎలుకలు పడితే ఇల్లు తగలబెట్టాలనే రకాలకు వ్యతిరేకంగా మాట్లాడతామే గాని అన్నదమ్ములతో చర్చంచటానికి ఏభేషజాలు అడ్దంరాలెదు ఇంతవరకు భగవంతుని దయవలన

జైశ్రీరాం

Anonymous October 30, 2012 at 7:22 AM  

ముందుగా మీరు నన్ను మన్నించాలిసార్. పదహారు, పదిహేడు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై, ఇవయ్యికటి. మీరు ఇరవ్వయ్యొకటో శతాబ్దంవారనుకున్నాను.

నా మొదటి ప్రశ్న ఇంకా మీదగ్గరే ఉండిపోయింది. ఇతరకులాలమీద భౌతిక దాడులు జరిగినప్పుడుకూడా మౌనం వహించే లేదా కారణాలను మరుగునపరిచే మీలాంటివారు ఒక్క బ్రాహ్మణులపై జరిగితేనే ఎందుకు ఇలా బాధపడిపోతారు? మరి అప్పుడు ఖండించాల్సిన అవసరమూ, ఆవేశమూ మీకెందుక్కానరావు? మిగతవారికేమైనా ఫర్లేదా? మీలాంటివారు అంటే దానర్ధం కులం కాదండోయ్. బ్రాహ్మణుల ప్రాపుకోసం తెగ తాపత్రయపడిపోయే మీలాంటివారు అని అర్ధం. మీపక్షపాతాన్ని వేలెత్తిచూపిస్తే మీకు నాది ద్వేషంలా అనిపిస్తుందా? అది దేనిమీద ద్వేషమో కొంచెమైనా ఆలోచించారా?

కులాలు ఇంట్లో దూరిన చిట్టెలికలుకాదుసార్ అవి దేశాన్నే మింగేయగల దయ్యాలు. మీరన్నది పాక్షికసత్యమేసార్. మనందరం కలసికట్టుగా కులాలపై పోరాడింది లేదు. ఇదిగో మీలాంటివారెప్పుడు కులాలవల్ల ఉపయోగాలు అంటూ సన్నాయినొక్కులతో అడ్డుపడుతున్నారు. ఏ కులవృత్తుల గురించిసార్ మీరు మాట్లాడుతున్నది. కులాలకతీతంగా చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇదిగో ఈ బ్రాహ్మణులతో సహా. కులాలవల్ల ప్రస్తుతానికి ఉపయోగాలకన్నా నస్టాలె ఉన్నాయి సార్. ఒక్కసారి మీ పోస్టులే చూడండిసార్. ఎన్నిపోస్టులలో మీరు వాటికి చేతులూడ్డుపెట్టి కాపాడాలనిచూశారో, ఎన్నిసార్లు వాటివల్ల జరిగిన హత్యలను ప్రక్కదోవపట్టించేప్రయత్నం చేశారో తెలుస్తుంది.

SNKR: . (అంతకన్నా నిన్నుపట్టించుకోవడం అనవసరం)

durgeswara November 1, 2012 at 9:11 AM  

మీకు ద్వేషం తప్ప మరోభావం మనసులో నిలవదని మీరచనలద్వారా చెబుతున్నప్పుడు ఇంకేమి చెప్పగలం మీకు . మీరు ఏవిధంగా ఈఉలాలు నిర్మూలిస్తారో చెప్పగలరా? కులాలను కొనసాగనివ్వమని కాదు శక్తిసామర్ద్యాలను పక్కనబెట్తమని నేనెప్పుడు చెప్పలేదు. కులాలను కూలదోయాలనే పేరుతో చేస్తున్న దేమిటి? జరుగుతున్నదేమిటి> దానివెనుక నడుపుతున్న శక్తుల లక్ష్యమేమిటి ? ఇవన్నీ లోతైన ప్రశ్నలు. కులాలను కూల్చాలని చెబుతూనే సాగుతున్న మీ ఆలోచనలేమిటి? ఇతరకులాలంటూ హైందవసమాజంలో చిచ్చుపెడుతున్న వికృత మేధావితనముల ఉత్పత్తి కేంద్రాలు చేస్తున్న ప్రయ్తనాలు ఏవిధమయిన స్థితిని కల్పిమ్చాయో సమాజంలో గమనిమ్చండి. ఇక్కడ ఎవరిప్రాపగాండాకోసమో ఎదురుచూస్తే నాకొచ్చేదేమిటి>
పోనీ లేండి అలా అనుకున్నా నేనేమీ పరాయి మతాలపంచనచేరే వంచనపనులను చేయటం లేదుకదా ?

ఇక పద్దెనిమిదో శతాబ్దంలో ఉన్నమమ్చి లక్షణాలతో బ్రతికితేచాలు ఇరవయ్యొకటోశతాబ్దం లో ఉత్పత్తిచేస్తున్నకొన్నిరకాల వికృత మేధస్సు నాకక్కరలేదు.

Anonymous November 1, 2012 at 8:45 PM  

/SNKR: . (అంతకన్నా నిన్నుపట్టించుకోవడం అనవసరం)/

నీలాంటి టపోరి లను బాగానే పట్టించుకున్నట్టు తెలుస్తూనే వుందిగా, అది చాలు. కంగ్రాట్స్ :P
'అప్పుడు చేయలేదే, ఇప్పుడు చేయలేదే' అనే ఎదవ ఏడుపులు ఎప్పుడూ వుండేవే. అన్ని చోట్ల అందరూ అన్ని కాలాల్లో వుండి, చూచి స్పందించాలని లేదు. ఇప్పటి ఆయన స్పందన మీద మీ అభిప్రాయాలు ఏడిస్తే చాలు. ఆయన తన కులం గురించి చెప్పేసరికే నీకు గాలిపోయిందని తెలుస్తూనే వుంది. ఐలయ్య తాటకిలో తన మూలాల్ని వెతుక్కుంటున్నారట వెళ్ళి చేరు, అయనతో చేయో/కాలో కలుపుకో. :D

Materialforappsc November 16, 2012 at 9:49 PM  

slade lanti vaallu chaala mandi unnaru. veeridi vikruta aanandam. intaku mundu koodaa ilaati aandolanalu jarigaayi. kaani prastutam evarinee influence cheyyaleni brahmins meeda varusagaa ituvantivi ekkuva avadam to sahanam nasinchi brahmins kooda modalupattalsi vachindi

chandra vykanti November 18, 2012 at 3:31 PM  

ఎవరండి స్లెడ్ గారు. వారి మాటలలో అవహేళన తప్ప, అర్ధము కనిపించుటలేదు. దుర్గేస్వరావు గారు బాగా సమాధానము చెప్పారు. ఇది ఒక కులము మీద దాడి కాదండి. సంఘములో ఒక వర్గము వారిని బాధించినది అని మోత్తు కొంతుంటే, ఇంతకుముందు ఇటువంటివి జరిగినవి అపుడు మీరు స్పందిచారా అని అడిగిన వారిని ఏవిధముగా అర్ధము చేసుకోవాలి. వీల్లె విభజించి పాలించు అన్న బ్రిటిష్ వారికీ వత్తాసు పలికే ప్రబుద్ధులు. వీళ్ళు భారతీయ జీవన విధానము గురించి మైకెల్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇచ్చిన ప్రసంగము వినాలి. ఇటువంటివారు కాదండి వాళ్ళు ప్రవేసపెట్టిన abcd AND SCIENCE టెక్స్ట్ బుక్స్ లో పెట్టి , మన ఆర్ష సంప్రదాయా న్ని సంపూర్ణముగా తెలగించే ప్రయత్నములో సహకరిస్తున్నది. వీళ్ళకు భారతీయ వైభవము గురించి ఏమి తెలుసండి. స్లాడే గారికి టైం వుంటే కొంతకాలము శ్రీ పరిపూర్నానంద స్వామి గారి దగ్గర వుండి భారతీయ వైభవము గురించి నేర్చుకోమని నా అబ్యర్ధన. కనిసములో కనీసము అయిన స్వామి వారి చర్చ విన్నా కొంత అవగాహనా వస్తుంది.అయ్యా స్లాడే గారు, నేను బ్రాహ్మణుని కాను. కానీ నాకు ఏ సమాజికవర్గాముపై దాడి జరిగిన భాధ వేస్తుంది. అపుడు మాట్లాడలేదని ఇపుదు తప్పించుకొనే రకము కాదు. తప్పు ఎపుడైనా తప్పే. దాన్నిని అందరు ఖండించాలి. అపుడుకాని మెరుగైన సమాజము వస్తుంది అని భావించవచ్చు. నేను ఇక్కడ బ్రాహ్మణా సపోర్ట్ గ వ్రాయడము లేదు.ఇపుడు బ్రాహ్మణులూ ఐనది రేపు వేరే సామాజక వర్గము అవుతుంది. రేపు ఇస్లాము అవ్వొచ్చు. స్లాడే గారు కొంచము భావిలో కప్పలాగా ఆలోచించకుండా పెద్ద హృదయముతో ఆలోచిచమని ప్రార్ధన.

దయయుంచి శ్రీ పరిపూర్నానంద సరస్వతీ స్వామివారి చర్చలు వినండి. వెలైతే వారితో చర్చలో పాల్గొని మీ సలహా వివరించండి.

నమస్కారము
జైశ్రీరామ్

chandra vykanti November 18, 2012 at 3:31 PM  

ఎవరండి స్లెడ్ గారు. వారి మాటలలో అవహేళన తప్ప, అర్ధము కనిపించుటలేదు. దుర్గేస్వరావు గారు బాగా సమాధానము చెప్పారు. ఇది ఒక కులము మీద దాడి కాదండి. సంఘములో ఒక వర్గము వారిని బాధించినది అని మోత్తు కొంతుంటే, ఇంతకుముందు ఇటువంటివి జరిగినవి అపుడు మీరు స్పందిచారా అని అడిగిన వారిని ఏవిధముగా అర్ధము చేసుకోవాలి. వీల్లె విభజించి పాలించు అన్న బ్రిటిష్ వారికీ వత్తాసు పలికే ప్రబుద్ధులు. వీళ్ళు భారతీయ జీవన విధానము గురించి మైకెల్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇచ్చిన ప్రసంగము వినాలి. ఇటువంటివారు కాదండి వాళ్ళు ప్రవేసపెట్టిన abcd AND SCIENCE టెక్స్ట్ బుక్స్ లో పెట్టి , మన ఆర్ష సంప్రదాయా న్ని సంపూర్ణముగా తెలగించే ప్రయత్నములో సహకరిస్తున్నది. వీళ్ళకు భారతీయ వైభవము గురించి ఏమి తెలుసండి. స్లాడే గారికి టైం వుంటే కొంతకాలము శ్రీ పరిపూర్నానంద స్వామి గారి దగ్గర వుండి భారతీయ వైభవము గురించి నేర్చుకోమని నా అబ్యర్ధన. కనిసములో కనీసము అయిన స్వామి వారి చర్చ విన్నా కొంత అవగాహనా వస్తుంది.అయ్యా స్లాడే గారు, నేను బ్రాహ్మణుని కాను. కానీ నాకు ఏ సమాజికవర్గాముపై దాడి జరిగిన భాధ వేస్తుంది. అపుడు మాట్లాడలేదని ఇపుదు తప్పించుకొనే రకము కాదు. తప్పు ఎపుడైనా తప్పే. దాన్నిని అందరు ఖండించాలి. అపుడుకాని మెరుగైన సమాజము వస్తుంది అని భావించవచ్చు. నేను ఇక్కడ బ్రాహ్మణా సపోర్ట్ గ వ్రాయడము లేదు.ఇపుడు బ్రాహ్మణులూ ఐనది రేపు వేరే సామాజక వర్గము అవుతుంది. రేపు ఇస్లాము అవ్వొచ్చు. స్లాడే గారు కొంచము భావిలో కప్పలాగా ఆలోచించకుండా పెద్ద హృదయముతో ఆలోచిచమని ప్రార్ధన.

దయయుంచి శ్రీ పరిపూర్నానంద సరస్వతీ స్వామివారి చర్చలు వినండి. వెలైతే వారితో చర్చలో పాల్గొని మీ సలహా వివరించండి.

నమస్కారము
జైశ్రీరామ్

durgeswara November 19, 2012 at 8:06 AM  

శ్రిగురుబ్యోనమః
> నమస్కారం దుర్గేశ్వర్రావుగారు
> చాల చక్కని విషయము చర్చకు మెదలుపెట్టారు.
>
> ఎవరండి స్లెడ్ గారు. వారి మాటలలో అవహేళన తప్ప, అర్ధము కనిపించుటలేదు.
> దుర్గేస్వరావు గారు బాగా సమాధానము చెప్పారు. ఇది ఒక కులము మీద దాడి కాదండి.
> సంఘములో ఒక వర్గము వారిని బాధించినది అని మోత్తు కొంతుంటే, ఇంతకుముందు
> ఇటువంటివి జరిగినవి అపుడు మీరు స్పందిచారా అని అడిగిన వారిని ఏవిధముగా అర్ధము
> చేసుకోవాలి. వీల్లె విభజించి పాలించు అన్న బ్రిటిష్ వారికీ వత్తాసు పలికే
> ప్రబుద్ధులు. వీళ్ళు భారతీయ జీవన విధానము గురించి మైకెల్ బ్రిటిష్ పార్లమెంట్లో
> ఇచ్చిన ప్రసంగము వినాలి. ఇటువంటివారు కాదండి వాళ్ళు ప్రవేసపెట్టిన abcd AND
> SCIENCE టెక్స్ట్ బుక్స్ లో పెట్టి , మన ఆర్ష సంప్రదాయా న్ని సంపూర్ణముగా
> తెలగించే ప్రయత్నములో సహకరిస్తున్నది. వీళ్ళకు భారతీయ వైభవము గురించి ఏమి
> తెలుసండి. స్లాడే గారికి టైం వుంటే కొంతకాలము శ్రీ పరిపూర్నానంద స్వామి గారి
> దగ్గర వుండి భారతీయ వైభవము గురించి నేర్చుకోమని నా అబ్యర్ధన. కనిసములో కనీసము
> అయిన స్వామి వారి చర్చ విన్నా కొంత అవగాహనా వస్తుంది.అయ్యా స్లాడే గారు, నేను
> బ్రాహ్మణుని కాను. కానీ నాకు ఏ సమాజికవర్గాముపై దాడి జరిగిన భాధ వేస్తుంది.
> అపుడు మాట్లాడలేదని ఇపుదు తప్పించుకొనే రకము కాదు. తప్పు ఎపుడైనా తప్పే.
> దాన్నిని అందరు ఖండించాలి. అపుడుకాని మెరుగైన సమాజము వస్తుంది అని భావించవచ్చు.
> నేను ఇక్కడ బ్రాహ్మణా సపోర్ట్ గ వ్రాయడము లేదు.ఇపుడు బ్రాహ్మణులూ ఐనది రేపు
> వేరే సామాజక వర్గము అవుతుంది. రేపు ఇస్లాము అవ్వొచ్చు. స్లాడే గారు కొంచము
> భావిలో కప్పలాగా ఆలోచించకుండా పెద్ద హృదయముతో ఆలోచిచమని ప్రార్ధన.
>
> దయయుంచి శ్రీ పరిపూర్నానంద సరస్వతీ స్వామివారి చర్చలు వినండి. వెలైతే వారితో
> చర్చలో పాల్గొని మీ సలహా వివరించండి.
>
>
> నమస్కారము
> జైశ్రీరామ్

durgeswara November 19, 2012 at 8:08 AM  

paivyaakhya mail dvaaraa vachchinadi

svkr November 22, 2012 at 9:20 AM  

namaskaam durgeswara rao garu,
slade gaariki manchini manchiga chebute, butuga vinipinchindi.
dharmacharan nerpinche brahmanulanu kinchaparachadaanni samardinchetluga undi.brahmana dushana entati daridramo chesinavadiki teliyadaaniki kaliyugamlo ento samayam pattadu. hindu dharmacharana paina meeku entati gowravaabhimanalunnayo mee matallo telustundi. duradrusta vasaattu aakasampaiki ummavaddante vinipinchukoni slade laanti moorkulaku kodavalekundapoindi. zilamandakunu jobilo pettukuni tirige slade laamtivarini pattinchukovaalsina paniledu. bhakti maargamlo meelanti sadacharula salahaalu samaajaniki avasaram.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP