శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నా మతిమరపుతో రానున్న ప్రమాదాన్ని తొలగించిన "మారుతి"

>> Saturday, October 27, 2012

ఒక్కోసారి మతిమరపు  తీవ్రతప్పిదాలకు కారణమవుతుంది . ముఖ్యమయిన పనులు,వేళలు మరచి అనర్ధాలపాలవుతుంటారు నాలాంటివాళ్లు . అయితే స్వామిని ఆశ్రయించి ఉంటే మాత్రం ఆప్రమాదాలనుండి తల్లివలె కాపాడుతుంటాడు స్వామి హనుమ. అటువంటి సన్నివేశం మొన్న పండుగనాడు అనుభవపూర్వకంగా తెలియవచ్చింది

హనుమత్ రక్షాయాగాన్ని విజయదశమి నాడు ప్రారంభించాలని ముందుగానే ముహూర్తం పెట్టుకున్నాము. అయితేపీఠంలో జరిగే ప్రధాన వుత్సవమే నవరాత్రి పూజలు. కనుక నేను ఈ పూజలలో  తలమునకలై ఉన్నాను. అంతకుముందు వారం రోజులు తిరుమలలో శ్రీవారి సేవ లో పాల్గొని రావటం వలనకూడా అలసినందివలనో ఏమో కొద్దిగా మరపుకూడా వస్తున్నట్లుంది.
విజయదశమి రోజు పూజలు భక్తులసందడి కోలాహలం సంకీర్తన. అన్నదానం తదితరవిషయాల తో అసలు విషయం మరచిపోయాను. సాయంత్రం మూడు గంటలనుండి బోజనానికి వెళ్ళబోవటం ఏదో ఒక అడ్డంకి. ఎవరో పిలవటం మాట్లాడటం/  ఇలా అప్పటికే నాలుగుసార్లు అన్నందగ్గరకెళ్ళబోయినా ఇంట్లోవాళ్లు ,భోజనానికి పంక్తి లో కూర్చుంటున్న బంధువులు,వచ్చిన భక్తులు  పిలుస్తున్నా వెళ్లటానికి వీలుపడలేదు . హఠాత్తుగా నాలుగు గంటలసమయంలో గుర్తొచ్చింది ,,.పారాయణం ప్రారంభించలేదు అనే విషయం.
అంతే హడావుడిగా నేను మిగతాభక్తులతో కలసి గణపతి పూజ చేసి   హనుమద్రక్షాయాగం [ఐదవ ఆవృతి] ని  ప్రారంభించాము.భక్తులతో కలసి హనుమాన చాలీసా,రామనామ జపాన్ని మొదలుపెట్టాము . అదే జరుగక భోజనానికి వెళ్లిఉంటే?!!     అతి ముఖ్యమైన ఈ కార్యము వాయిదా పడేది . స్వామి నా మతిమరపుతో సంభవించనున్న ప్రమాదాన్నుంచి ఇలా రక్షించారు .
విజయదశమి రోజున అమ్మ సన్నిధానంలో  లోక కళ్యాణకారకమగు ఈ దివ్యయాగం ప్రారంభమవుతూనే స్వామి మనవెన్నంటే ఉన్నాడనే సంకేతాన్నిచ్చింది. ఇక అంతా దిగ్విజయమే
.
అందుకే అన్నారు పెద్దలు
బుధ్ధిర్బలం యశోధైర్యం నిభయత్వమరోగతా ;
అజాఢ్యం వాకపటుత్వంచ హనుమత్స్మరణాద్భవేత్ "  అని

 జైశ్రీరాం

1 వ్యాఖ్యలు:

Annapragada Bangaru babu October 31, 2012 at 1:37 AM  

Okkokka sari. Devudu Kooda Pariksha pedutuntaru. Alage Malli gurtu chestuntadu. Adi daiva leela anukovatameee- Bangaru babu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP