శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శమీ వృక్షం

>> Thursday, October 4, 2012



శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ సాయినాధాయనమః
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
మనం దసరా నాడు పూజించే శమీ వృక్షం యొక్క వివరం "ఆంధ్ర ప్రభ దిన పత్రికలో"
శ్రీ రామమోహన్ రావు గారు చాలా వివరం గా అందించారు.  దానిని
అంతర్జాలంనుంచి సేకరించి మీకు అందిస్తున్నాం.

శమీ వృక్షం

దేవ దానవులు పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం ఉద్భవించిన రోజు కూ డా
విజయ దశమేనని అంటారు. ఇక శమీపూజ విష యానికి వస్తే శమీ అంటే జమ్మి అని
అర్థం. దేవతలు అమృతం కోసం సముద్రం చిలికినపుడు పారి జాతం, బిల్వ, తులసి,
శమీ మొదలైన వృక్షాలు ఆవిర్భవించాయి. ఈ చెట్లన్నంటికీ కలిపి 'వన మాలి' అనే
ఓ అధిష్టాన దేవత కూడా ఉంది. ఈ దేవతకే శమీ దేవత అని పేరు. ఈ దేవతను తలచు
కుంటేనే పాపాలు పోతాయని అనాదిగా వస్తున్న విశ్వాసం.

మీ శమయతే పాపం| శమీ శత్రు వినాశనం|

అర్జునస్య ధనుర్దారీ| రామస్య ప్రియదర్శిని|

శమీ కమల పత్రాక్షి| శమీ కంటక హారిణి|

ఆరోగ్యంతు సదాలక్ష్మీ| ఆయు: ప్రాణాంతు రక్షతు|

ఆదిరాజ మహారాజ| వనరాజ వనస్పతే|

ఇష్ట దర్శన మృష్టాన్నం| కష్ట దారిద్య్ర నాశనం||

మరియు

మీ శమయతే  పాపం  - శమీ శత్రు వినాశినీ
ధారిణ్యర్జున  బాణానాం  రామస్య ప్రియవాదినీ!!
కరిష్యమాణ యాత్రాయాం  యథాకాలం సుఖంమయా
తత్ర నిర్విఘ్న కర్త్రీ  త్వం భవ శ్రీ రామ పూజితే !!

అనే శ్లోకాల్ని   పఠిస్తూ విజయదశమి రోజు శమీ పత్రాలను పెద్దవారికి ఇచ్చి
నమస్కరిస్తారు. ువయస్కులైతే ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకంటారు.

శమీ శమయతే పాపం|
అంటే పాపాలను ఉపశమింపజేసేది అని అర్ధం. అరణ్య వాసానికి వెడుతున్న
శ్రీరాముడు శమీ వృక్షచ్ఛాయలో విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే ఈ
వృక్షాన్ని ఎంతో పావ నమైనదిగా భావిస్తారు. అలాగే, శ్రీరాముడు ఇక్కడ ఉండేం
దుకు శమీ వృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని ప్రతీతి.
త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ద దశమినాడు ఆది పరాశక్తిని జమ్మి ఆకుతో పూజించి
రాముడు రావణునితో యుద్ధం చేసి విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది.
కనుకనే విజయదశమిరోజున శమీ దర్శనానికి అంత ప్రాముఖ్యత.

పాండవులు కూడా అజ్ఞాత వాసానికి వెళ్లేముందు తమ ఆయుధాలు జమ్మిచెట్టు పైనే
దాచారు. అజ్ఞాత వాసం పూర్తయిన తరువాత శమీవృక్షాన్ని పూజించి, ఆయుధాలు
తీసుకుని అర్జు నుడు ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించాడు. పాండవులు తమ
అస్త్రశస్త్రాలు శమీ వృక్షంపై పెట్టినందువల్లనే మహాభారత యుద్ధంలో
పాండవులకు విజయం కల్గిందని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం రూపంలో
ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది పాండవులు కౌరవులపై విజయం సాధించారని
పురాణాల ద్వారా విశిధమవుతుంది. విజయదశమి రోజున ఆయుధపూజ చేయడం వెనుక
పరమార్ధం ఇదే.

బంగారు పత్రాలు-స్నేహానుబంధాలు

విజయదశమి రోజు శమీ చెట్టు ఆకుల్ని ఒకరికొకరు ఇచ్చుకుని దసరా శుభాకాంక్షలు
చెప్పుకుంటారు. ఈ ఆకులను బంగారు ఆకులుగానే భావిస్తారు. దీని వెనుక ఒక
అంతరార్థం ఉంది. పూర్వకాలంలో కౌత్సుడనే ముని కుమారుడు వరతంతు అనే గురువు
దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే ఇంటికి
వెళ్లే సమయంలో గురువుగారికి గురుదక్షిణ ఇస్తానని పట్టుబడతాడు. తనకేమీ
వద్దని ఎంత చెప్పినా వినకుండా ఇస్తానని వేధించడంతో చివరకు ఆ గురువు '14
కోట్ల బంగారు నాణలు తనకు గురుదక్షిణంగా ఇవ్వ'మంటాడు. అంత డబ్బును ఎలా
సమకూర్చాలో తెలియక కౌత్సుడు, ఇక్ష్వాకు వంశస్థుడైన రఘమహారాజుని
ఆశ్రయిస్తాడు. అప్పటికే 'విశ్వజిత్తు' యాగం చేసి సమస్త ధనాన్ని దానం
చేసిన ఆ రాజు వద్ద ప్రస్తుతం ఏమీ ఉండదు. అయినా దానమడిగిన వారిని
వట్టిచేతులతో పంపించడం సూర్యవంశస్థులకు మాయని మచ్చ. కాబట్టి ఎలా గైనా
కౌత్సుని కోరిక తాను తీర్చాలి. కానీ, ఎలా? అని బాగా ఆలోచిస్తాడు రఘువు.
ఇందుకు కుబేరునిపై దండెత్తడమే సరైన పని అనుకుంటాడు. కుబేరునికీ విషయాన్ని
తెలియచేస్తాడు. రఘు మహారాజు పరాక్రమాన్ని బాగా తెలిసిన కుబేరుడు దండయాత్ర
వరకు రానీయకుండా ఆ మహారాజు రాజ్యంలోని శమీ వృక్షంపై బంగారు ముద్రల వర్షం
కురిపిస్తాడు. దాంతో జమ్మిచెట్టు ఆకులన్నీ బంగారంగా మారి పోతాయి. ఇది
చూసిన రఘువు కౌత్సుని పిలిచి ఈ బంగారం మొత్తం తీసుకువెళ్లి నీ అవసరాన్ని
తీర్చుకొమ్మని చెబుతాడు. అయితే కౌత్సుడు మాత్రం కేవలం గురువు గారు
కోరినంత విలువ గల బంగారు ఆకులను మాత్రమే తీసుకుని మిగిలినదంతా ఇక్కడే
విడిచిపెడతాడు. అలా కౌత్సుడు ఈ ఆకులను తీసుకువెళ్లిన రోజు కూడా
విజయదశమేనని అంటారు. అందుకే ఈ పర్వదినాన ఇచ్చిపుచ్చుకున్న ఆకులను
జాగ్రత్తగా దాచుకుంటే సంపదలు వృద్ధి చెందుతాయని ప్రజల ప్రగాడ విశ్వాసం.

యాగాగ్నికి సమిధ

వేదకాలం నాటి మహర్షులు శమీవృక్షం (జమ్మిచెట్టు) వేళ్లను ఒకదానికొకటి
రాపిడిచేసి అగ్ని ప్రజ్వలింప చేసేవారు.

నేటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోమాలకు ఆచార్యులు అరణి మధించి
అగ్నిని వెలిగిస్తారు. శమీ వృక్షపు వేళ్లు, ఆకుల్లో అగ్ని ఉండడమే దీనికి
కారణం. బంగారాన్ని అగ్నిశక్తిగా భావిస్తారు. అంచేత అగ్నికి నివాసమైన
జమ్మి చెట్టుని సువర్ణం కురిపించే వృక్షం అంటారు. ఆనాటినుంచి విజయదశమి
రోజున జమ్మిచెట్టుని పూజించే సంప్రదాయంఏర్పడింది.

ఘనమైన ఆయు'ర్వేదం'

శమీ చెట్టుకు ఆయుర్వేదంలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు ఆకులు,
బెరడుల కాషాయాన్ని నోటిలో పుక్కిలిస్తే నోటి దుర్వాసన, పంటినొప్పి,
చిగుళ్ల నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక ఈ కషాయాన్ని రసి
కారుతున్న కురుపులపై పోసి వాటిని శుభ్రపరిస్తే వెంటనే తగ్గిపోతాయి. జమ్మి
ఆకులను నీటిలో మరగకాచి దాన్లో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి మొటిమలపై క్రమం
తప్పకుండా అద్దితే వెంటనే చర్మం మాములు స్థితిని చేరుతుంది. శమీ పత్రంలో
60 శాతం తేమ ఉండటమే గాక ఐరన్‌, జింక్‌, మెగ్నిషీయం, వంటి ప్రశస్తమైన
తత్వాలు పుష్కలంగా ఉన్నాయి. వేళ్లు నైట్రోజన్‌ని సమీకరించి భూసారాన్ని
వృద్ధి చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఈ జమ్మిచెట్టు అందిస్తోంది గనుకనే
విజయదశమి నాడు ఈ వృక్షానికి ఇంత ప్రాధాన్యతనిచ్చారు. అందుకే మనం కూడా
శమీపూజను చేసి, పత్రాలు పంచుకుని స్నేహభావంతో మెలగి, ఆయురా రోగ్యాల్ని
పొందుదాం! ముందు తరాలకి ఈ సంస్కృతిని అందజేద్దాం! శుభం.
శ్రీ రామ శ్రీ రామ  శ్రీ రామ
సర్వే జనాః సుఖినో భవంతు
శ్రీ   సాయిపథం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP