శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎల్కేజీ పిల్లలను మీకేమి పాట వచ్చురా అనడిగితే .... కెవ్వు కేక..అన్నారు ... హతవిధీ ! ఎటువైపు తీసుకెళుతున్నాం పిల్లలను మనం.

>> Saturday, September 29, 2012

 మొన్న శుక్రవారం   రాముడుపాలెంలో  జరిగిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి వెళ్లాను.   రాజీవ్ విద్యామిషన్ వాల్లుకూడా అప్పుడప్పుడు కొన్ని మంచిపనులు చెస్తారనటానికి గుర్తుగా  సి.వి సర్వేశ్వరశర్మగారి ద్వారా లైవ్ లో ఒక క్లాస్ ఇప్పించారు  . చాలా బాగుంది వారి క్లాస్.   ఆతరువాత కరీంనగర్ నుంచి  ఒక మాస్టర్ గారు ఆన్లైన్లో " సార్ ! క్లిప్.తరువాత,క్లాప్ అంటూ వరుసగా  కార్యక్రమాలు ఇస్తూ పిల్లలమీద ప్రయోగాలు చేపిస్తున్నారే ఇది సబబా ? సరైన పద్దతేనా ? అని అడిగిన ప్రశ్నకు  . ఇది సందర్భంకాదని, దానికి సమాధానం చెప్పేవారు వేరే ఉన్నారని అక్కడి బాధ్యులు దాటవేయటం జరిగింది. ఇది  షరా మామూలే ననుకోండి.


 ఆతరువాత .నేను స్కూల్ ఆవరణలో  చెట్లక్రిందకూర్చుని అక్కడ ఆడుకుంటూన్న చిన్నపిల్లలు [ఎల్కేజీ,౧వతరగతి] వాళ్లను పిలచాను. బిలబిలమంటూ పిల్లమూక చుట్టూచేరారు.  ఒరే !  మనమిప్పుడు పాటపాడుకుందాం . ముందు మీకేం పాటొచ్చో చెప్పండి అనడిగాను. అంతే .......

"కెవ్వుకేక...... దీ... కెవ్వుకేక " . అన్చెప్పారు కోరస్ గా

 నాకైతే బుర్ర తిరిగింది . ఏం అర్ధంకాలేదు .. నాకు నేనేమడిగాను? వాల్లేమి చెప్పారు.  .. అంతచిన్నపిల్లల నోట ఈపాట !!!!!!!


 అక్కడదగ్గరలోనే ఇంకోచెట్టుక్రింద కూర్చొని ఉన్న ఆస్కూల్ హెచ్ ఎమ్ గారికి కేకవేసి    అన్నా ! నీపిల్లలు ఇలా అంటున్నారు అనిచెప్పాను. ఆయన  ఏంచేద్దాం ! నిన్నల్లా గణపతి నిమజ్జనానికి వెళుతూ మావూర్లో పాడింది ఈపాటే! , ప్రతి వాడి సెల్ఫోన్లో ఈపాటే !.అదేపట్టుకున్నారు  పిల్లలు అన్నాడు నిస్సహాయంగా .


ఒరే అటువంటి పాటలు పాడగూడదు .తప్పు. మంచిపాటలు పాడాలి. మీ టీచర్ గారు చెప్పినపాట చెప్పండమ్మా ! అని వారిచేత ఓపాట పాడించాను .దాన్ని నా సెల్ తో రికార్డ్   చేశాను.

ఇప్పుడు  గురువులుగా ఆపిల్లలకు మంచేదో .చెడేదో చెప్పగలమా? ఒకపక్క మేము రెండుముక్కలు  మంచిమాటలు  నేర్పేసరికే ! ? సమాజంలోంచి ఇంటిలోంచీ వాల్లు పది ముక్కలు అశ్లీలం అసభ్యకరమైన విషయాలు నేర్చుకుంటుంటే .   తల్లిదండ్రులు,పరిపాలకులు  ఎవరికీ చీమకుట్టినట్లు లేకుంటే,  టీచర్ కు,స్టూడెంట్ కుమధ్య అందమైన ప్రేమకథలను చూపించే కళాకారులు వాటిననుమతించే  న్యాయమూర్తులు విస్తరిస్తుంటే  ఇంకా నైతికవిలువలు ... నాబొంద.... ఏం నేర్పగలం. 

జాతి పతనావస్ఠకు చేరుకుని తగలడటానికి ఎక్కువకాలం పట్టేలాలేదు. కాకుంటే  ఇందుకు అందరిలో ఉన్నమేమూ ఒక  కర్రపుల్లవేస్తున్నామన్నదే బాధ,.








0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP