ఏజీవినీ మిగలనివ్వని విధ్వంసనాగరికత నిర్వహించే జీవవైవిద్య సదస్సు ఉపయోగం ఏమిటి ?
>> Wednesday, September 26, 2012
ఇది మా గురువులు వ్రాసింది. మీకు ఉత్సుకత ఉంటే చదువ గలరు.
నమస్సులు
--
రాజు
సూర్య ఆత్మా జగత స్తస్థుష శ్చ (ఋగ్వేదము)
~~జంగమ వస్తువులకు, స్థావర వస్తువులకు సూర్యుడు అంతర్యామియై ఉన్నాడు~~
సూర్యునికి, ప్రకృతికి, జీవరాశులకు గల సూక్ష్మ సంబంధాన్ని ఇంతకంటే గొప్పగా ఏ శాస్త్రవేత్తా వివరించలేడు. ఇది సత్యము. ఎందుకనగా, సూర్యుని యొక్క ఉదయకిరణముల యొక్క తేజస్సు వలననే అంధకారము తొలగి జంగమ జీవుల చలనవలనాలకు, కార్యకలాపాలకు మార్గము సుగమమౌతున్నది. సూర్యుని యొక్క రాత్రికిరణముల వల్ల చంద్రుడు ప్రకాశించి ఆ వెలుగులో నిశాచరజీవుల జీవనగమనము నిరాటంకముగా సాగుతున్నది. అంతేకాదు, సూర్యుని ఉష్ణము వల్లనే సముద్రపు నీరు మేఘములుగా మారుతున్నవి. ఈ కార్యమును ఆ సూర్యుడు ఒక యజ్ఞమువోలే చేయుచున్నాడు. దీనినే గీతాచార్యుడు "పర్జన్యాదన్న సంభవ యజ్ఞానద్భవతి పర్జన్యో" అని విస్పష్టముగా చెప్పాడు. కలియుగమున అన్నగత ప్రాణులై మనమందరమూ జీవించుచున్నాము. ఆ అన్నము కొరకు 'ఉదరంభరణం బహుకృత వేష'ధారులమై నిత్యమూ నటించుచున్నాము. అన్నము మనకు అంతర్యామి. అట్టి అన్నము సూర్యుని దయవలన లభించుచున్నది. కావున జంగమ వస్తువులకు సూర్యుడు అంతర్యామియైనాడు.
చెట్లు చేమలు మున్నగుగా గల స్థావర జీవులు (నిశ్చలమైనవి) కిరణజన్యసంయోగ క్రియ వల్ల పత్రహరితమును తయారుచేసికొని తమ తమ జీవికలకు కొనసాగించుచున్నవి. ఈ సంయోగ క్రియ సూర్యుని వెలుగు ద్వారానే జరుగుతున్నది. ఈ విషయమునే స్పష్టపరచుచున్నది ఈ ఋక్కు - "అథోహారిద్రవేషు మే హరిమాణం నిదధ్మసి" (హరిమాణమనిన పచ్చనివన్నె; హారిద్రవేషు అనిన హరిదలపు చెట్టు. ఇక్కడ హరిదలపు చెట్టునే పేర్కొన్ననూ తద్వారా సమస్త వృక్షజాతులని అర్థము చేసికొనవలెను). కావున కేవలము జంగమ జీవులకే గాక స్థావరజీవులకు సైతము సూర్యుడే అన్నదాతయై అంతర్యామియై అలరారుతున్నాడు.
సూర్యునిచే నిర్వహింపబడుతున్న సమస్త జీవాధారక క్రియలకు మూలము నారాయణుడని వేదములు కీర్తించుచున్నాయి. సూర్యుని కిరణసమూహములను 'రశ్మి' అన్న అభిదానముతో పిలుస్తారు. రశ్మి అన్న పదము రతి+శ+మాన అన్న ధాతువుల వల్ల ఏర్పడినది. రతి యనగా సంయోగమని, శం అనగా సుఖమని, మాన అనగా క్రీడ యని అర్థములు. మహావిష్ణువు యొక్క పంచరూపాలలోని నారాయణుని రూపమునకు 'రశ్మి' అన్న నామాంతరమున్నది. అందువలననే సూర్యుణ్ణి 'సూర్యనారాయణా' అని సంబోధించడమౌతున్నది. ఇట్టి 'రశ్మి'నామకుడైన నారాయణుడు సవితృమండల మధ్యవర్తియై సూర్యకిరణముల రూపములో స్వర్గ-భూలోకాలను ప్రకాశింపజేసి ఆయా లోకాల కనుగుణంగా సమస్త జీవులకూ ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు.
ఇలాగున సూర్యునిచే నడపబడుచున్న ఈ భూమి కేవలము మానవులకే గాక అనేకములైన ఇతర జీవరాశుఅకు సైతము నివాసస్థానమైవున్నదని, అన్ని జీవరాశులలోనూ ఉత్తములైన మానవులు ఇతర జీవుల గురించి క్షేమచింతనను చేయవలెనని "శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే" మొదలుగాగల వేదవాక్యములు ఉద్బోధిస్తున్నాయి. ఇతర జంతువులు, చెట్లు మొదలైన జీవరాశుల పట్ల మానవులలో ఆదరభావము, పూజ్యభావము ఏర్పరచు ఉద్దేశ్యముతోనే గంగాది నదులను, గోవు మొదలైన చతుష్పాదులను, అశ్వత్థ వృక్షమే మొదలుగా గల చెట్లను, నాగుబాము మొదలైన సరీసృపాలను పూజించు వ్యవస్థను సనాతన సంప్రదాయములో ఏర్పరచారు. అంతేగాక సాక్షాత్తు భగవంతుడే మత్య్స, కూర్మ, వరాహాది రూపాలలో అవతారములు దాల్చి మానవుల దృష్టిలో హేయములైన జీవజాలము పట్ల జాగూరూకులై ఉండమని సూచించినాడు. ఇట్టి జీవవైవిధ్యసమ్మానభూయిష్టమైన సంస్కారమును మరెక్కడనూ కానలేమని ఘంటాపథముగా చెప్పవచ్చును. "కురు భూతదయాన్నిత్యం" అన్న ఆర్షవాక్కు ఆకలిగొన్న ఇతర జీవులకు ఇంత అన్నము పెట్టమని, ఆపదలో ఉన్నవాటిల్ని ఆదుకొమ్మని మానవులను మరీమరీ హెచ్చరిస్తున్నాయి. భూతదయ అనునది మానవుని నిత్యకృత్యమని చెప్పిన సనాతన మతము ఏవిధముగా మూఢనమ్మకమైనదో అర్థము కావడంలేదు. ఆవిధమైన ఆరోపణలు చేయువారికి అర్థజ్ఞానము లోపించినదని మాత్రము చెప్పవచ్చును. వేదవాక్యములలో గల నిత్యసత్యత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని గ్రహించలేకపోవడం మనం చేసికొన్న దురదృష్టమే!
సనాతన సంప్రదాయ ప్రవర్తకులైన ప్రాచీనులు సులభోపాయముగా బోధించిన "జీవవైవిధ్య", "జీవకారుణ్య", "సహజీవన" విధానాలను తుంగలో త్రొక్కి, పాశ్చాత్యవిజ్ఞానమే నిజమైన జ్ఞానమను మూఢనమ్మకముతో ప్రకృతివనరులను, ఇతర జీవజాలములను ధ్వంసము చేస్తూనే కోట్ల రూపాయలను ఖర్చు చేసి అంతర్జాతీయ జీవవైవిధ్య మహాసభలను హైదరబాదులో వచ్చే నెల నుండి నిర్వహించబోతున్నారట! ఇంటనున్న కమ్మటి పెరుగును వదలి, పరాయి పంచన పుల్లమజ్జిగ దేబిరించడమనిన ఇదే కదా! కంటికెదురుగా ప్రవహించుచున్న మంచినీటి నదిని వదలి, కాల్వలో నీరు త్రాగుట అన్న ఇదియే కదా!
ఏనాటికి మన పాఠశాలల్లో ప్రాచీనుల అమోఘ జ్ఞాన సంపదలను అపహాస్యము చేయుట మాని, నిజాసక్తితో పాఠములుగా చెప్పెదరో ఆనాడే మన జాతి శ్రేయస్సును కాంచును. లేదన్నచో పరాయి పంచన మానసిక బానిసలై బ్రతకవలసినదే!
||లోకాః సమస్తాః సుఖినో భవంతు||
||స్వస్తి శ్రీ సమస్త సన్మంగళాని భవంతు||
నిజమే ఎవరు చెప్పారు మనకు మన అజ్ఞానంతో నదులను, కాలువలను, చెరువులను,
> నూతులను, భూగర్భ జలాలను ఆఖరికి సముద్రాన్ని కూడా కలుషితం చేయమని ?
>
>
> IVNS Raju
> నూతులను, భూగర్భ జలాలను ఆఖరికి సముద్రాన్ని కూడా కలుషితం చేయమని ?
>
>
> IVNS Raju
0 వ్యాఖ్యలు:
Post a Comment