శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రాద్ధకర్మలన్నీ జీవన భృతికేనా?

>> Friday, August 3, 2012


విధి వ్రాత తప్పించలేరని ఒక సూక్తి. కృషితో నాస్తి దుర్భిక్షం అని మరొక సూక్తి. ఈ కాలంలో ఏ సూక్తి ప్రకారం జరుగుతుంది? - కె.వి.ప్రసాదరావు, కందుకూరు
నదీ ప్రవాహానికి ఎదురుగా పడవను నడుపుతున్నప్పుడు ప్రవాహ వేగము, పడవ వాడి కర్రపోటూ రెండూ పనిచేసినట్లుగానే, ఏ కాలంలోనైనా రెండు సూక్తులూ సమంగానే పనిచేస్తాయి. కానీ వాటిలో ప్రబలమైనది మాత్రం కృషే. ఎందుకంటే విధి అనేది సామాన్యంగా చాలా పాతకాలపునాటి కర్మఫలం. కృషి అనేది వర్తమాన కాలపు కర్మఫలం. వీటిలో వర్తమానమే ప్రబలం.
ముందు ఆచమనం చేసి, ఆ తరువాత సంకల్పం చేసి, ఆ తరువాత అష్టోత్తరాదులు చదువుకోవటం మంచిదా, ఈ వరస మార్చాలా? - కోకా బాబూరావు, వైజాగ్
ఈ వరసే సరియైనది. దీన్ని మార్చవద్దు.
స్ర్తిలు గాయత్రీ మంత్రం చేయవచ్చునా?
- గోలకోటి రాజరాజేశ్వరి, విజయవాడ
శ్రుతి స్మృతి పురాణాల వాక్యాలను, తరతరాల సంప్రదాయాలను ప్రమాణంగా తీసుకున్నట్లైతే స్ర్తిలు ఓంకారాన్ని, స్వాహాకారాన్ని, గాయత్రీ మంత్రాన్నీ, వేదాలను ఉచ్చరించటం వారి పైతరాల సంతానానికి శ్రేయస్కరం కాదు.
ప్రాణులు ప్రతి నిత్యం చనిపోతూ ఉండటం చూస్తూ కూడా మనిషి తాను మాత్రం స్థిరంగా ఉంటాననుకోవటానికి కారణమైనా వుందా?
- సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె
దీనిపేరే మహామాయ అని సప్తశతి వంటి పురాణ గ్రంథాలు, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు, వివిధ రీతులుగా వివరిస్తున్నాయి. మానవులు చేసే ఉపాసనలన్నింటికీ ఈ మాయను దాటగలగటమే ఉత్తమ ఫలం.
మరణించిన జీవి మళ్ళీ మరొకచోట జన్మించి, మరొక శరీరాన్ని స్వీకరిస్తాడు కదా! అటువంటప్పుడు ఈ శ్రాద్ధకర్మలన్నీ ఒక వర్గంవారి జీవన భృతికేనా?
- వేంకటేశ్వరరావు, విజయనగరం
అవి ఒక వర్గంవారి జీవన భృతికోసం ఏర్పడినవైతే ఆ వర్గమువారిలో వాటి ఆచరణ వుండేది కాదు. ఇతర వర్గాల నెత్తిమీదనే దానిని వారు రుద్ది వుండేవారు. శాస్త్రాలను పరిశీలించినప్పుడు, మరికొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఇక్కడ మనకు అత్యంత ప్రియుడైన జీవుడు ఒకడు వెళ్ళిపోయాడు. వాడు మళ్ళీ మరో శరీరంతో మరోచోట జీవించబోతున్నాడని మనకు తెలుసు. అక్కడ కూడా వాడు సుఖంగా వుండాలని మనం కోరుకుంటున్నాము. దీనికేదైనా మార్గం వుందా?- ఈ ప్రశ్నను మహర్షులు తమ దివ్యదృష్టుల ద్వారాను, వేదవాక్యాల ద్వారాను పరిశీలించి, శ్రాద్ధ వ్యవస్థను నిర్మించారు.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి

3 వ్యాఖ్యలు:

Anonymous August 4, 2012 at 8:52 PM  

మనం బోధించిన శ్రాధ కర్మలను ఇతరులు ఆచరించాలంటే ముందు మనం వాటిని ఆచరించాలికదండీ. మోసం చేసే క్రమమే అదికదా. ఉదాహరనకి చిట్‌ఫండ్స్ వ్యవహారమే చూసుకోండి, ఎవరైతే మొదలుపెడతారో, వారూ, వారి బంధువులూ అందులో ముందుగా చేరుతారు. వారినిచూసాకే మిగతావారు.

ఇక్కడ గోలెంటంటే. ఆత్మని, చనిపోయినతరువాత లోకాలని, మంచిలోకాలు చేరాలంటే చెయ్యాల్సిన కర్మలనీ ఒకరే "కనుక్కున్నారు". వాళ్ళు ఈ ఆత్మలను మంచిలోకాలకు చేర్చేపనితప్ప ఇంకొక పని స్వీకరించడానికి ఏమాత్రం సిధ్ధంగా లేరు. జనాలు ఎంత పిచ్చోళ్ళంటే ఎవ్వరికీ ఇదంతా మోసమేమోకదా అని కొంచెమైనా అనుమానం రాలేదు.

durgeswara August 5, 2012 at 9:26 AM  

మీకు భారతీయ ధార్మిక విధులపై అవగాహన గాని,తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. తెలుసుకుని ఆతరువాత విమర్షించే ఓపికాలేదు . కానీ ద్వేషం మాత్రం నిండుగా ఉన్నట్లు కనపడుతున్నది . మనం చుసే కళ్లద్దాల రంగుని బట్టి లోకం అలా కనపడుతుంది .

Anonymous August 5, 2012 at 10:13 AM  

"మంచిలోకాలు చేరాలంటే చెయ్యాల్సిన కర్మలనీ ఒకరే "కనుక్కున్నారు".

"ఆత్మలను మంచిలోకాలకు చేర్చేపనితప్ప ఇంకొక పని స్వీకరించడానికి ఏమాత్రం సిధ్ధంగా లేరు"

ఇంకొక పనిని వాళ్లు ఎప్పుడో స్వీకరించారు. బి సి కాలం నాటి పుస్తకాలు చదివి పాత రోజులు ఊహించమాక. ఆపనిని వాళ్లు సాంప్రదాయంకొరకు చేశారే గాని మీలాంటి వారిచ్చే ముష్ట్టి డబ్బుల కొరకు చేయలేదు. ఇప్పుడు ఆపనిని చేసేవారి కొరకు భూతద్దం వేసుకొనివెతుక్కొవాలి. ంకొక పదేళ్లకి ఒక్కరు ఉండరు. నీ యదవ కోడి బుర్రకి తెలివి లేదు కాబట్టి ఇంకా గతం లో జీవిస్తున్నది.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP