శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"అహోబిళ" నవ నారసింహ క్షేత్ర యాత్రకు బయలుదేరుతున్న దాసబృందానికి మీగోత్రనామాలను తెలియపరచండి .

>> Friday, August 17, 2012

హనుమత్ రక్షాయాగ నిర్వహణ లో ప్రధానపాత్రవహించి న బృందం అంతా కలసి అహోబిళ యాత్రకు బయలుదేరుతున్నాము .  నవనారసింహ క్షేత్రాలైన జ్వాలా,అహోబిళ,మాలోల,క్రోధ,కారంజ,భార్గవ,యోగానంద,ఛత్రవట,పావన నారసింహ రూపాలుగా కొలువైయున్న ప్రహ్లాదవరదుని దర్శించుకుని పూజా,జపధ్యానాదులతోసాగే ఈ సాధనకు  వలసిన శక్తి సామర్ధ్యాలను ప్రసాదించాలని స్వామిని వేడుకుంటున్నాము. లక్ష్మీవల్లభుడైన స్వామి కొలువైయున్న నల్లమల కీకరారణ్యంలో తోడునీడై నిలచి దర్శనాన్ని అనుగ్రహించే స్వామిని దర్శించటానికి ఇంకెవరైనా రాదలచుకున్నవాళ్ళు మాతో చేరవచ్చు. అయితే తీవ్రశారీరక శ్రమను తట్టుకోగలగటం  ,స్వామి పదపద్మములపై అచంచలమైన విశ్వాసం అవసరము. ప్రతిక్షేత్రానా స్వామికి తులసీదళార్చన  మార్గమధ్యములో వీలైన చోట యజ్ఞము నిర్వహించుకోవాలని  ఈ దాసుల సంకల్పము . ఆపై దాసపోషకుడైన స్వామి దయ.
ఇక భగవత్ ప్రసాదాన్ని పదిమందికిపంచటమనేది మాపీఠ సాంప్రదాయము కనుక ఈ యాత్రకు మాతో రాలేకపోయినను  ఆ నారసింహక్షేత్రంలో జరిగే పూజలలో మానసికంగానైనా పాల్గొనదలచుకున్నవారు మీగోత్రనామాలను  రేపు [శనివారం] మధ్యాహ్నం లోగా తెలియపరచగలరు  . అక్కడ మీతరపునకూడా ఓ తులసీదళం స్వామి పాదపద్మములపై ఉంచబడుతుంది.సామూహిక ప్రార్ధనలో మీగోత్రనామాలు చెప్పబడతాయి .
మీరు ఇంటివద్ద విష్ణుసహస్రనామ పారాయణమో రామనామ జపమో చేసి స్వామి పాదాలపై ఒక పుష్పాన్నిసమర్పించండి .

durgeswara@gmail.com

9948235641

జైశ్రీరాం


1 వ్యాఖ్యలు:

Anonymous August 17, 2012 at 6:09 PM  

సర్వమెరిగిన సామి
నా నామగోత్రంబెరుగడా
నా గోత్ర, నామ, పుట్టు పూర్వోత్తరాలు ఆ సర్వేశ్వరుడికి ఎరుకనే. నా యీ Snkr గుర్తింపు ఒక్కటి కలుపుకోండి. :)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP