శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగ ప్రసాదములు అందనివారు దయచేసి తెలుపగలరు .

>> Sunday, June 10, 2012

హనుమత్ రక్షాయాగములో  ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొని ,పారాయణము చేసినవారు, సహాయసహకారములందించిన వారందరికి హనుమత్మ్సరణపూర్వక నమస్కృతులు . పారాయణంచేసి ప్రతులు పంపినవారందరి గోత్రనామాలతో స్వామివారికి అర్చనలు జరిగాయి.
 ఇక యాగానంతరం భక్తులందరికీ హనుమత్ రక్షలు,ప్రసాదములు పోస్టల్ కొరియర్ ద్వారా పంపాము. అయితే యాగానికి దక్షిణపపినవారందరికి మాత్రమే  పోస్ట్ చేశాము.[మా అర్ధిక పరిస్థితి మీకు ముందే విన్నవించి ఉన్నాము] . ఇక్కడ మన పోస్టల్  డిపార్టమెంట్ వారి చిత్రమేమిటోగాని సుదూరంగా ఉన్నకొందరికి అందగా దగ్గరలో ఉన్న మరికొందరికి అందలేదని తెలుస్తున్నది . అలా అందలేదన్నవారికి మరలా పంపుతున్నాము .  ఇంకా ఎవరన్నా   ప్రసాదములు అందనివారుంటే  దయచేసి మెయిల్ లేదా ఫోన్ ద్వారా  తమ అడ్రెస్ లు మరలా పంపాలని మనవి. 
ఇక యాగానంతరం పనులవత్తిడి, ఈమధ్యలో మాకు వృత్తిపరమైన శిక్షణలు ఉండటం వలనను మరలా పాఠశాలలు ప్రారంభమవుతున్నందు వలనను యాగానికి సంబంధించిన జమాఖర్చుల వివరాలను ఇక్కడ ఉమ్చలేకపోయాను. త్వరలో నే ఇక్కడ ఉంచగలను . అన్యదాభావించవద్దని మనవి . జైశ్రీ రాం 



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP