శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దర్భలు అశుభ కార్యాలకే వాడతారా?

>> Monday, April 2, 2012

రి నా వయస్సు అరవై నాలుగు సంవత్సరాలు. దినఫలాలు, వారఫలాలు, సంవత్సర ఫలాలు నాకు వర్తిస్తాయా?
- ఎస్.వేంకటరమణయ్య, కంచెరపాలెం
దినఫలాదులు ప్రపంచంలో ఏ ఒక్కరికైనా ఎలా ఫలిస్తాయో, ఏ జ్యోతిష శాస్త్ర గ్రంథం ప్రకారం ఫలిస్తాయో దేవుడికే తెలియాలి. ప్రపంచంలో వాటిమీద మోజు మాత్రం దేశ దేశాల్లోనూ వ్యాపించింది. ఏ మాత్రం శాస్ర్తియ దృష్టికలవారైనా ఆ మోజుకు లొంగటం తగిన పని కాదు.
రి ‘‘రామాయణం రంకు, భారతం బొంకు’’ అనే సామెత ఎందువల్ల వచ్చింది?
- సంశయ శ్రీ, సికిందరాబాదు
గిట్టనివారు చేసే విమర్శ ప్రసంగాలకు సామెతల స్థాయిని అంటగట్టే తెలివితక్కువతనంవల్ల వచ్చింది.
రి చంద్ర గ్రహణానికి దర్బలకు సంబంధం ఏమిటి?
- కె.వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
సూర్య చంద్ర గ్రహణ సమయాలలో సూర్యకాంతిలోని కొన్ని ప్రమాదకర విష కిరణాలు భూమిమీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచీ దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో తేలింది.
అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. వారిమీద సూర్య చంద్ర గ్రహణాలలోని వ్యతిరేక కిరణాల ప్రభావం వుండటంలేదు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు. కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని మొక్కు తీర్చుకునేదాకా వచ్చింది. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
రి దర్భలు అశుభ కార్యాలకే వాడతారా?
- లక్ష్మీ అన్నపూర్ణ, చిలకలగూడా
దర్భ అనేది సామాన్య నామధేయం- దానిలో చాలా జాతులున్నాయి. వాటిలో దర్భ, కుశ, బర్హిస్సు, శరము (రెల్లు) అనేవి ముఖ్యమైనవి. వీటిలో దర్భజాతి దర్భను అపరకర్మలకు, కుశజాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, రెల్లుజాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. ఎక్కడ వాడినా దర్భజాతి గడ్డిపోచలన్నీ పవిత్రతనే సంపాదించి పెడతాయి.
రి ఉపనిషత్తు, వేదాంతము ఈ రెండు పదాల భావన ఒకటేనా?
- పెద సుబ్బారావు, కనుపూరు, నెల్లూరు జిల్లా
ఈ రెండూ తత్త్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఒక గ్రంథానికి రెండు పేర్లు మాత్రమే. వ్యాస భగవానుడు వేదశాఖల విభాగం చేసేటప్పుడు, ప్రతి శాఖ చివరలోనూ భగవత్తత్త్వాన్ని చర్చించే మంత్ర భాగాలను సమకూర్చాడు. ఈ భాగాలు పరమాత్మ తత్త్వానికి సన్నిహితంగా వున్నాయి గనుక, వాటిని ఉపనిషత్తులు అన్నారు. అవి వేద శాఖల అంతాలలో వున్నాయి గనుక, వేదాంతాలు అన్నారు- అవి రెండూ ఒకటే.
రి ముండకోపనిషత్ సారాంశం తెలుపగలరు?
- రమణయ్య కనిగిరి
ఈ చిన్న వేదికలో అంత పెద్ద విషయం చెప్పటం కష్టం. ఐనా సంగ్రహంగా చెప్పుకోవాలంటే, ఓంకార అనుసంధానం ద్వారా విశ్వతైజప్రాజ్ఞ స్థితులను దాటి పరమాత్మ స్థితిని అందుకునే ప్రక్రియలను ఉపదేశించటమే ముండకోపనిషత్తులోని ప్రత్యేకత.
రిబీబీనాంచారు అమ్మవారు కాదు కదా! మరి అమ్మవారెవరు?
- వి.రామాంజనేయులు,్ధర్మవరం
పురాణాల ప్రకారం పద్మావతీదేవియే అమ్మవారు.
రి పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రాన్ని మాత్రమే చూపిస్తారు, ఎందుకని? ఇతర పతివ్రతలు చాలామంది వున్నారు కదా!
- వి.బాలకేశవులు, గిద్దలూరు
పురాణాలలో చెప్పినవారే మాత్రము కాక, వాటిలోకి ఎక్కని పతివ్రతలు ఇంకా చాలామంది వున్నారు. మానవ జాతి మీద ప్రభావం చూపించగల అధికార పదవిని అందుకొన్న పతివ్రత మాత్రం అరుంధతీ దేవి ఒక్కతే. నక్షత్రాలలోంచి వచ్చే కాంతి ప్రసారాలు మానవ మస్తిష్కాల మీద అనేక రకాల విచిత్ర ప్రభావాలను చూపిస్తాయని మన మహర్షులు గుర్తించారు. అలాంటి నక్షత్రాలలో అరుంధతీ వశిష్ఠ నక్షత్రాలు ధర్మసమ్మతమైన సుఖ దాంపత్యానికి దోహదం చేస్తాయి. కనుక, వివాహ సమయంలో నూతన దంపతులు ఆ నక్షత్రాలను దర్శించాలని వారు శాసనం చేశారు.
రి సకల దేవతలకు మూలం పరమాత్మ ‘ఓం’కారం కదా! ఏకాత్మ భావన కొరకు అన్ని నిలయాలలో ఒకే రీతి ప్రార్థన చేయించవచ్చు కదా?
- గ్రంథి పుల్లయ్యగుప్త, నేరేడుచర్ల
మానవులందరూ ఒకే రీతి భావనలో వుంటే, మీరు చెప్పినట్లే చేయవచ్చు. అలాంటి మంచిరోజుకోసం ఎదురుచూద్దాం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP