కురిచేడు కోటలో ఆంజనేయుని అభిషేకమహోత్సవాలు
>> Tuesday, November 22, 2011
ం
కురిచేడు ప్రకాశం జిల్లాలో ఉన్న ఓవ్యాపారకేంద్రం . కార్తీకబహుళద్వాదశి మంగళవారం అగు ఈరోజు భక్తుల అభిషేకములతో స్వామి పులకించిపోయాడు . అసలే పొగిడితే పెరిగిపోయేస్వామాయె వేలాదిమంది భక్తులు పరవశించి చాలీసాగానం చేస్తూ ప్రయాగనుంచి తెచ్చిన గంగాజలం తో కలసిన కలశజలాల తో నిలువెల్లా అభిషేకిస్తుండగా ఇక ఆయన అనుగ్రహాన్ని వర్ణించతరమా ? పసిపిల్లలనుండి పండు వృధ్ధులవరకు తరలివచ్చి కురిచేడు కోట పైన వున్న స్వామికి అభిషేకములు జరిపారు. హనుమత్ శక్తిజాగరణ పూజలో భాగంగా శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం జరుపుతున్న ఈ సామూహిక హనుమదభిషేకములు ఈరోజు కురిచేడులో నిర్వహించబడింది . కులమతప్రమేయంలేకుండా తరలివచ్చిన భక్తులు స్వయంగా తనివితీరా స్వామిని అర్చించుకుని ఆనందడోలికల్లో తేలియాడారు.
అయితే ఈమహత్తరయాగం నిర్వహించటానికి మాత్రం ఎన్ని ఆటంకాలని? ఎన్ని అడ్డంకులొస్తాయని? కానీ ఆయనపై సంపూర్ణవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తే చాలు ప్రభంజనానికి చెదిరిపోయిన మేఘలలా అన్నీ తూలిపోతాయి.అందుకే స్వామి అండ ఉంటే అన్నింటా జయమే నని మహాత్ములు చెప్పినది.
జైశ్రీరాం" అనే నినాదాలుచేస్తూ పాఠశాలలనుండి వచ్చిన విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగానిలచారు.
1 వ్యాఖ్యలు:
శ్రీ రామ దూతం శిరాసా నమామి
Post a Comment