పెరిగినాడు చూడరో ! పెద్దవరం హనుమంతుడూ ! [స్వామి లీల ఇది]
>> Monday, November 28, 2011
లోకంలో హనుమత్ క్షేత్రాలలో కొన్ని విశేషశక్తిస్థానములుంటాయి .అ టువంటి క్షేత్రాలలో ప్రకాశం జిల్లాలో పెద్దవరం గ్రామం సమీపంలో లోని వీరాంజనేయస్వామి శక్తిక్షేత్రం ఒకటి. ఇక్కడ స్వామి చూడగనే వల్లు జలదరించే రూపంతో కనిపించటమేకాదు అక్కడ ప్రవేశించగనే మనమనస్సు లోకల్లోలాలు సమసిపోయి ్ ఆథ్యాత్మికశక్తి తరంగాలు మనలను నిలువెల్లా ముంచుతున్న భావన అనుభవంలోకొస్తుంది . ఏకాంత ప్రదేశం పక్కనే నిండుగా పారుతున్న సాగర్ కెనాల్ పచ్చని ప్రకృతి దగ్గరలో కొండపై కనిపించే నృసింహస్వామివెలసి ఉన్నకొండ, వెంటనే మనమనస్సు స్వామి పాదాలపై లగ్నమవుతుంది .అనుకోకుండానే ఏకాగ్రత లభిస్తుంది. గ్రహబాధలతో మానసిక సమస్యలతో అనారోగ్యాలతో పీడింపబడేవారికి సత్వరం విముక్తి ప్రసాదిస్తాడీయన. ఎప్పుడో పురాతనకాలంలో ఋషి ప్రతిష్టితము . ఏకాంతం లో ఎలాఉన్నాడో అలాగే ఇక్కడ జనులుకూడా ఏకొద్దిమంది మాత్రమో ఈక్షేత్రంలోని హనుమత్ శక్తినిసరిగాగ్రహించి సాధన చేస్తున్నారని నాకనిపిస్తున్నది .
సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నామనసులో ఓ సంకలపం కలిగింది. ఇక్కడ స్వామికి చుట్టుపక్క;ల గ్రామాలప్రజలందరిచేత అభిషేకం చేపించి పొగిడితే పెరిగే స్వామి ని పొగడి మేలుపొందే సులభమైన సాధనా మార్గాన్ని గుర్తుచేయాలనేది ఆసంకల్పం . కానీ ఎందుకో స్వామి ఆజ్ణ్జ రాలేదు. కాలం అలాగడచి పోయింది . స్వామి ఆజ్ఞ రాలేదుకనుక మిన్నకున్నాను.
ఈమధ్య కురిచేడులో జరిగిన కార్యక్రమానికి ఈ ఊరిలో ఉన్న హనుమద్దీక్షాధారులందరినీ పిలిచారు కానీ ఒక్కస్వామే వచ్చాడు. కార్యక్రమానంతరం అతను స్వామీ ఖర్చు ఎంతైనా నేను భరిస్తాను మాఊరిదగ్గరున్న వీరాంజనేయక్షేత్రంలో ఈ హనుమత్ శక్తి జాగరణ పూజలు జరపాలని కోరాడు. ఇది ఒక్కరితోటి ఒక్కరికోసం చేసే కార్యక్రమం కాదు .ఇది అందరికోసం అందరిచేత చేపించే పూజ .అదీగాక వ్యవసాయ పనులసీజన్ గ్రామాల్లో .ఒక్కని వల్ల కాదు వేసవికాలంలో చూద్దాములే !అని పంపివేశాను . ఆసాయంత్రం నేను కురిచేడులో పూజముగింపయ్యాక వినుకొండ వెళదామనుకుని కూడా షార్ట్ కట్ మావూరికెల్లటానికని ఇలా కాలువకట్టమీదుగా బండిని తిప్పాను . ఈక్షేత్రం దాటాక మళ్ళీ ఎందుకో అనుమానం వచ్చి స్వామికి నమస్కరించి వెళదామని గుడిదగ్గరకు వెనుక్కు వెళ్లాను. నమస్కరించుకుని బండిస్టార్ట్ చేయబోయేంతలో వెనుకవైపునుంచి ఒకవ్యక్తి పంతులూ ! అంటూ వచ్చాడు. ఏవిటబ్బా ? ఏకవచన సంబోధన అనిచూద్దునుగదా ఇంతకుముందు ఒకసారి మాట్లాడిన పెద్దవరం వ్యక్తే ఆకారంపిచ్చివానిలా ఉన్నాడు . ఏంపంతులూ ? ఇక్కడ పూజ కుదరదన్నావట ? మాట కోపంగా, హుంకారంగా ఉంది . ఇతను గతంలో నేను ఎదురుపడినప్పుడు అయ్యగారూ ! అని ఎంతో మర్యాదగా పిలిచినవాడే ఇదేమిటి ? అనుకున్నాను .వెంటనే బల్బు వెలిగింది . ఓహో! ఇది స్వామివారి నుంచి వస్తున్న గద్దింపన్నమాట అనుకుని నేను చాలవినయంగా [లేకుంటే వల్లుపగిలిపోతుంది మరి !] స్వామీ !మీఊరినుంచి ఒక్కల్లువచ్చారు ముందుకు .ఎలాసాధ్యమవుతుంది . మీఊరిలో ఉన్న దీక్షాధారులవరకైనా కలసి మాట్లాడుకుని నాదగ్గరకు రమ్మను అప్పుడు మాట్ళాడదాము అని ఒక్కముక్కలో సమాధానం చెప్పి వెల్లిపోయాను .
మరుసటిరోజు పొద్దుటే ఫోన్ చేసారు ఆవూరినుండి స్వామీ సాయంత్రం మీరు బడినుండి వచ్చేసరికి మీ పీఠానికి వస్తాము అని అన్నారు. సరే రమ్మన్నాను. అయితే వద్దు అనుకుంటే పట్టుదలగా చేయాలంటున్నారు కదా ! చూద్దాం ఇది స్వామి పై వీల్లకున్న భక్తా లేక వీల్లలో అంతర్గతంగా ఉండి నడిపిస్తున్న హనుమత్ శక్తా అన్నవిషయం అని మనసులో సంకల్పించాను. ఏం ? ఎప్పుడూ భక్తులకు స్వామే పరీక్షలు పెట్టాలా ? మనం మాత్రం ఆయనకెందుకు పరీక్ష పెట్టకూడదు అని మనసులో ఓచిన్న పట్టుదలపెరిగింది.
గురువారం ఐదుగురు దీక్షాధారులొచ్చారు . స్వామీ ! ఊరంతా చందాలు అడగటం కలపటం ఇప్పుడు సమయం చాలదు ఖర్చు మేమే భరిస్తాము ఏమేమి కావాలో చెప్పండి అనడిగారు.
కుదరదు స్వాములూ ! ఈకార్యక్రమంలో ఎవరినీ డబ్బు అడగకూడదు .కావలసిన వస్తువుల లిస్ట్ తీసుకుని ఇంటింటికీ వెళ్ళి అందులో మీరేమి తెస్తారు అని అడగాలి . ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు . బలవంతం చేయకూడదు. అలాగే నిరుపేదలైనా సరే చిన్న తమలపాకులకట్టనైనా తమవంతుగా తీసుకుని వచ్చేలా చేయాలి. ఇందులో డబ్బులిస్తాము మీరు అవసరమైనవి తెండి అని ఎవరడిగినా ఒప్పుకోరాదు .శ్రద్దాశక్తులు ఉంటే వాళ్ళే కొనుక్కుని వచ్చి గుడివద్దమనకు అందజేయాలి అన్నాను .
అలాగేచేయాలా ?సందేహం వ్యక్తంచేశారు వాళ్లు
అవునుఅలాగే చేయాలి ఖచ్చితంగా చెప్పాను.
తలకాయలూపారు
నూటఎనిమిది చాలీసా పారాయణములు జరపాలి మీకు చదువురాదుకదా ?ఇంతకుమునుపు పారాయణం చేసిన అలవాటు మీకులేదుకదా ఎలా ?సందేహం లేపాను .
దరిశినుంచి స్వాములను పిలుస్తాము అన్నారు వాల్లు
నాకర్ధమవుతుంది లోపల స్వామి ఎన్ని ఆటంకాలు కల్పించాలని చూసినా వీల్లచేత జరిపిస్తాడి కార్యక్రమాన్ని అని
మరి నూటా ఎనిమిది పొంగల్లు చేసి నివేదన జరపాలి
అలాగే చెబుతాం ఊర్లో అన్నారు వాల్లు.
వచ్చే మంగళవారం చేద్దామన్నారు వాల్లు
కుదరదు ఈ ఆదివారమే చేద్దాం అన్నానుపంచాంగం కూడా చూడకుండా మొండిగా .[ఎలాజరుపుతావోచూడాలి అని స్వామితో మనసులో పందెం వేసుకుంటూ.]
వాల్లు వివరాలన్నీ తీసుకుని వెల్లారు
కేవలం రెండున్నరరోజులలో ఇన్ని ఏర్పాట్లు ఎలాచేస్తారు ? చేయగలగాలంటే కేవలం స్వామి వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం . దుర్గమకాజ జగతకే జేతే !సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే .అన్నారు కదా సంత్ తులసీదాస్.
వెల్లి ఆరోజు సాయంత్రమే వాల్లు ప్రయత్నాలు మొదలు పెట్టటం ఒక్కవీధి తిరిగేసరికే కావలసిన వన్నీ వచ్చేసాయి . పొద్దుటనే చాలీసాలు ప్రింట్ చేపించే వ్యక్తి గుంటూరు వెళ్ళి వాటిని అచ్చేపించారు . ఇవతల గ్రామంలో ఎవరూ ఆదివారం పనులకు వెల్లరాదని మనఊరినుంచే ఇంటికొక పొంగలి వండి స్వామికి సమర్పించాలనే నిర్ణయం తీసుకున్నారు .
ఇక శనివారం పత్రికలలో వార్తచూసి ఆశ్చర్యపోయాను . ఆదివారం రోజు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇరవైవేల పెళ్లిల్లు ఉన్నాయని ,చాలా మంచి ముహూర్తమని ,సారాంశం.
చూశారా ! స్వామి సంకల్పం . నామూర్ఖత్వాన్ని ఎలా వెక్కిరిస్తుందో ?
ఇక ఆదివారం నిలువెత్తు స్వామిని భక్తులు ఆవుపాలు,నారికేళ జలం,శుద్దగంగోదకం లతో నిలువెల్లా అభిషేకిస్తూ తమ స్వంత బిడ్డకు స్నానం చేపిస్తున్నట్లు రుద్దిరుద్ధి మరీ సేవించారు ఆయనను.
మహిళలు క్షేత్రం వద్దనే పొయ్యిలు ఏర్పాటుచేసుకుని పొంగళ్ళు వండితున్న దృశ్యం చూడాలి .ఎంతశ్రద్దాభక్తులో చెప్పతరంకాదు.
ఒకవంక దరిశి నుంచి వచ్చిన దీక్షాధారులు నూటాఎనిమిది చాలీసాలపారాయణం చేస్తుండగా సంతోషంతో భజనలతో చిందులుతొక్కుతున్న దీక్షాధారులు . అనంతరం తమాలార్చనలు .చెప్పనలవికాని సంతోషం .ప్రతి ఒక్కరికీ హనుమత్ రక్షలు చాలీసా కార్డులు ప్రసాదంగా ఇవ్వబడ్డాయి.
ఇక హనుమత్ హోమానికి ఏర్పాట్లు జరిగాయి .
యజ్ఞానికి కూర్చోగనే పొద్దున్నుంచి కొద్దిగా చల్లగా ఉన్నవాతావరణం మబ్బులుకమ్మి చిరుజల్లులు చల్లబోయింది. స్వామీ !స్వామీ ! ఒక్కగంటసమయమివ్వు అని వేడుకున్నాము . యాగం మొదలవ్వగానే మబ్బులు విడిపోయాయి . ఏ ఆటంకంలేకుండా ఎంతో చక్కగా జరిపించుకున్నాడు యాగాన్ని తన అనుగ్రహం ఉంటే ఎలాఉంటుందో చూపారు.
వీటన్నింటీకంటే నాకింకో్ పెద్దభయం ఉంది . ఒకపక్క నిండుగా పారుతున్న సాగర్ కెనాల్ . ఈ తిరుణాళ్లవాతావరణంలో పిల్లలు ఎక్కడ ఈకాలువలో ఈతలకు దిగి ఏప్రమాదం తీసుకొస్తారో అని . ముందుగానే ఈజాగ్రత్తలు గ్రామస్తులకుచెప్పాను . . శనివారం రాత్రి నిదురలో కాలువలో దూకిన పిల్లవాణ్ని లోపల ఒక పెద్దచేపలవల బయటకు విసిరివేసినట్లు కలవచ్చింది. అటువంటిది నాభయం .
కానీ స్వామి దయవలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా సాగిందంటే స్వామి అనుగ్రహమేకదా మరి !
9 వ్యాఖ్యలు:
జై ఆంజనేయ
జై ఆంజనేయ
దుర్గేశ్వరరావు గారు.. చాలా మంచి కార్యక్రమం. మీరు చెప్పిందంతా వింటుంటే దైవశక్తి ఎంత బలీయమైనదో అర్థమవుతోంది. హనుమంతుడి కరుణాకటాక్షాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇటీవల యాక్సిడెంట్ అయినప్పుడు మీరు పంపిన హనుమత్ రక్ష నాకు నిరంతరం అండగా ఉంటోంది. మీరు సూచించిన ప్రకారం వీలైనప్పుడల్లా హనుమాన్ చాలీసా పారాయణం జరిపాను. "మీకు ప్రాక్చర్ అయిన ప్రదేశం చాలా కీలకమైనది. 50, 50% ఛాన్సులే ఉన్నాయి నయవడానికి" అని డాక్టర్లు చెప్పిన ఫ్రాక్చర్ దాదాపు నయమవడం చూశాక నాకు హనుమంతుడి పై మరింత నమ్మకం పెరిగింది.
వ్యక్తిగత స్వార్థాలతో మృగ్యమైపోతున్న ఆధ్యాత్మిక శక్తిని ఇలా తట్టిలేపుతున్నందుకు మీకు అందరం కృతజ్ఞులమై ఉంటాము.
ధన్యవాదాలు.
జై వీరాంజనేయా..!
sankalpa siddi jarigindi.. swaami tanaki alaa seva cheyinchukunnaaru.
అద్భుతమైన సంఘటన .ఇలాంటి విషయాలు తెలుసుకున్నందుకు మాకూ ఆనందంగా ఉందండి..
చక్కని అనుభవం . మీ భక్తికి మెచ్చి ,తన పూజలు నిర్విగ్నం గా చేయించు కున్నాడు హనుమ . దేముడున్నాడన డానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి .? మీరు ధన్యులు
మీ ద్వారా ఇలాంటి అద్భుతమైన విషయాలు
తెలుసుకుంటున్నాము. ధన్యవాదాలు.
meeru chala manchi seva chestunnaru. Jai veeranjaneyaa
Post a Comment