ఇక శ్రీ రావణరాజ్యం రాబోతుంది కాచుకోండి
>> Thursday, November 17, 2011
నేను చిన్నతనంలో అంటే పదవతరగతి నుండి చూస్తున్న,విన్నదుశ్ప్రచారాలు ఏమిటంటే హిందూ మతవిజ్ఞానాన్నిపంచే వేదాలు,పురాణాలు అబధ్ధాలు.అవి అసలు జరగనేలేదు. కల్పిత గాథలు .పుక్కిట పురాణాలు అనే ప్రచారాలు.. సహజంగా మేము చిన్నతనంలో కాలేజీలలో విద్యార్థిరాజకీయాలు నడిపే గుంపులలో కలసి తెలిసీ తెలియని జ్ఞానంతో జిందాబాద్ లు కొడుతూ ఉన్న వయస్సులో విన్నవిషయాల్లో ఈసారాంశం సహజంగా అంతర్లీనంగా ప్రచారంగా ఉండేది. ఇక ఈధర్మాన్ని ధ్వంసం చేయాలని కదం తొక్కుతున్న కలిమతాల ప్రధాన ప్రచారం మనపురాణాలన్నీ అబద్దాలనే.
ఇప్పుడు ఆర్య ,అనార్య,వలస చరిత్రలన్నీ అబద్ధపు రాతలని చరిత్ర పరిశోధనలవలన తేలిపోయింది . భారతీయ జీవనధారనుండి ఈ ఇతిహాసాలను తొలగించటం సాధ్యంకాదని స్పష్టమవటంతో కొత్త వ్యూహాలు మొదలయ్యాయి . అదేమిటంటే ఎలాగూ భారతీయ ఇతిహాసాలను ధ్వసంచేయలేరు కనుక ఆ ఇతిహాసములపైన ,పురాణములపైన అపప్రచారాలు సాగించి గందరగోళము సృష్టించి భారతీయ సమాజాన్ని మరింత బలహీనపరచటం వ్యూహంలో భాగంగా ఎంచుకున్నారు. ప్రతి సమాజంలో ఉన్నవిధంగానే మానవుల అవివేకము వలన ఏర్పడ్డ సామాజిక అసమానతలను అవకాశంగా మలచుకుని ,అన్నదమ్ములను చీల్చి మతాలుమార్చి ఓటుబ్యాంకుసైన్యాలుగాతయారుచేసుకుని అప్రతిహతంగా సాగుతున్న కలిసేన తమ మేధోపుత్రులద్వారా అబద్దపు ప్రచారాలు ముమ్మరం చేసింది . కావలసినంత నిధులు అందుతున్నాయి కనుక ప్రచారాలకు ఆడు అదుపూలేదు. కలిలో అబధ్ధానికి బలమెక్కువ . అబద్దాన్నైనా పదేపదే చెబితే నిజమని భ్రమింపజేయవచ్చనే సూత్రాన్ని తయారు చేసుకుని ప్రయోగిస్తున్నారు . ఇక అంతర్గతంగా ప్రచార మాధ్యమాలలో తమ పెట్టుబడులతో వేదికలు సిద్దం చేసుకుని హైందవుల పండుగలు పబ్బాలప్పుడు చర్చలంటూ మొదలెట్టి అందులోని దుష్టపాత్రలను గొప్పగ చూపించే విధంగా ప్రచారం చేయటం జరుగుతున్నది .అందులో ఎప్పుడొ తప్ప ఎక్కువగా అనామకులైన హిందూ ప్రతినిధులను ఎన్నుకుని/లేక ఏర్పాటుచేసి రెచ్చిపోయి విమర్శలు చేస్తుంటారు. తద్వారా హిందువులలో గందరగోళం నెలకొల్పటమే ప్రధానం.
ఇక జాతీయ స్వాభిమానం కూడా లేకుండా చేయాలి.ధేశభక్తి నశింపజేయాలనేది ఈ విదేశీ గూఢచారుల వ్యూహం కనుక ఇందులో మనగౌరవ జాతీయ నాయకులపై కొత్తగా సృశ్టించిన చరిత్ర ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. వీరనారి లక్ష్మీభాయి దగ్గరనుండి మహాత్మాగాంధీ పైనకూడా గౌరవభావం తగ్గేలా కొత్త రచనలు,నాటకాలు కళారూపాలసృష్టి ప్రచారం సాగుతుంది . ఇక చిన్నినాకడుపుకు శ్రీరామరక్ష అనే ధోరణిలో బ్రతుకులీడుస్తూ తమ సంస్కృతీ సాంప్రదాయాలపై జరుగుతున్న దాడులగూర్చి సాగుతున్నదౌర్జన్యాలనుగూర్చీ పట్టించుకునే ఓపిక శక్తీ లేక సామాన్య హిందువులు దైవభక్తి,దేశభక్తి రహిత జీవచ్చవాలుగా మారబోతున్నామని గ్రహించలేని స్థితిలో జీవిస్తున్నారు. ఎదిరించగలిగిన వారిని అదుపుచేసే వ్యూహాలతో కలిసేన కదం తొక్కుతుంది.
అయితే ఇప్పుడు జరగుతున్న జరగబోతున్న వన్నింటీనీ ఐదువేలసంవత్సరాక్రితమే వ్యాసభగవానులవారు భవిష్యపురాణం ,భాగవతాదులలో చెప్పియున్నారు. ఎవరు ఎలా ధర్మాన్ని ధ్వంసం చేస్తారో ? చివరకు జరగబోయేదేమిటో కళ్లకు కట్టినట్లు వివరించారు.దీనినే వీరబ్రహ్మేంద్రుల వారు కాలజ్ఞానంలో మరింత వివరించారు. ఉద్యోగములుజూపి ఉచ్చులెన్నోవేసి మనమతానికె ఎసరు పెడతారు అని హెచ్చరించారు . దురదృష్ట వశాత్తూ భవిష్యపురాణం అసలు ప్రతి లండన్ మ్యూజియంలో ఉండగా మన విజ్ఞానం మనం తెలుసుకోవటానికి ఆధారమైన సంస్కృతం మరణశయ్యపై ఉన్నది.
ఇక పైన చూడండి రామరాజ్యం బదులు రావణ రాజ్యం, వీరనరకాశుర , సాధ్వీసూర్పణఖ లాంటి సినిమాలు
గాంధీ హింస , పిరికి నేతాజీ, పారిపోయిన అల్లూరి వంటి నికృష్ట చారిత్రక సత్యాలు సృష్టించ బడతాయి .................ప్రచారంచేయబడతాయి .
11 వ్యాఖ్యలు:
త్వరలో కంస పురాణం, హిరణ్య కశిప మహత్యం, భస్మాసురారాధన, దుర్యోధన సహస్రనామావళి, భక్త బకాసుర కథ, తాటకి చరిత్ర, పిశాచోపనిషత్ వంటి భక్తి సాహిత్యంతో పాటు భగవద్గీత అర్జునునికి బోధించింది కృష్ణుడి రూపంలో ఉన్న దళితుడు లాంటి ప్రచారాలు వస్తాయిక చూస్కోండి. మొన్న వాడెవడో రావణాసురుడి భక్తుడు టీవీలో మాట్లాడుతూ శూర్పణఖ అసలు పేరు మీనాక్షి, శూర్పణఖ అనేది ఆమె ముద్దు పేరు అని చెప్పినప్పుడు బుర్ర గిర్రున తిరిగింది. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో. ఖర్మ ఖర్మ
రావణుడు చెడ్డ పాలకుడు కాదు చెడు బుద్ది కలవాడు. నేను ఇలా అన్నాను అని మీరు తప్పుగా అనుకోకండి, హైందవ మతంలో ప్రతీదీ విసిదీకరించ బడింది.
మీరు తిట్టుకున్నా ఇది నిజం.
నేను హిందువును అని గర్విస్తున్నాను.
ఇక మీరనట్టు గాంధీ మంచి వాడయితే Round table conference లో జరిగిన సంభాషణ ఎందుకు బయట పడలేదు.
నేను చెబుతున్నది ఒకటే మన పురాణాలు మనకి నేర్పింది నీలో చిన్న లోపం ఉన్నా లేదా నువ్వు చిన్న తప్పు చేసినా అది నిన్ను దహించి వేస్తుంది, వేరే రూపంలో లేకపోతే నరక కూపంలోకి తీసుకుపోతుంది.
తప్పుకు శిక్ష తప్పదు, ఇది నాలాంటి వాడి అభిప్రాయం.
మీరు తిట్టుకున్నా మీరు వ్రాసిన దానిని నేను అంగీకరించను.
SHANKAR.S గారూ,
అవన్నీ హిందువుల పేర్లే. కొంత పరవాలేదు. కానీ ఏ మావో పట్టాభిషేకమో, మావో కల్యాణమో వస్తేనే మరీ ప్రమాదం. రావాణులని, హిరణ్యకశపులనీ హీరోలు చేసేది ఈ మావో కుళ్ళు వేరుపురుగులే. హిందువుల పురాణాల నుండి కొందరి "విలన్ హిందువులను" వేరు చేసి, హిందువులను విభజించటమే వీరి ఉపాయం; అయితే ఇలాంటి వేరుపురుగుల్ని హిందూ మహావృక్షం ఎన్నో వేల సంవత్సరాల నుండీ చూస్తూనే వున్నది. వీటి వలన హిందూ మహావృక్షానికేమీ ప్రమాదం లేదు కానీ....కొన్ని "విషపు కాయలు" కాసే అవకాశం వున్నది. ఈ విషపు కాయల వలన మిగిలిన మంచి కాయలకి కొద్ది కాలం ఇబ్బంది కలుగుతుంది అంతే. ప్రపంచంలోని అన్ని రకాల సంస్కృతుల నుండి, ఇజాల నుండీ దాడులు జరిగింది ఒక్క హిందూ మతం పైనే... కానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. డోంటువర్రీ, ఈ విషపు కాయలు మననేమీ చెయ్యలేవు.
ఫణీంద్ర గారూ,
>>రావణుడు చెడ్డ పాలకుడు కాదు చెడు బుద్ది కలవాడు>>
చెడుబుద్ధి గలవాడు చెడ్డ పాలకుడు కాకుండా ఏమౌతాడు?
చెడుబుద్ధి గలవాడు మంచి పాలకుడు ఎలా అవుతాడు?
>>మీరు తిట్టుకున్నా మీరు వ్రాసిన దానిని నేను అంగీకరించను.>>
దయచేసి కొంచెం వివరంగా తెలుపగలరా? ఇందులో మీకు అభ్యంతరకరమైన విషయాలు ఏమిటి?
ఈ మొత్తానికి కారణం ఒక్కటే. హిందూ మతానికి నాయకత్వం లేకపోవటమే. పేరుకి మఠాదిపతులు డజన్ల కొద్దీ ఉన్నారు. దేనికి వాళ్ళ మఠాలకు ఉన్న ఆస్తులు అనుభవించటానికి, వేదాంతం, మోక్షం అంటూ అంతు చిక్కకుండా ఉపన్యాసాలు దంచటానికి మాత్రమె. వీళ్ళల్లో వీళ్ళకే ఐక్యత లేదు. ఆ లోకువ చూసుకునే హిందూ మతం మీద అనేకానేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి.ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడి అటువంటి దాడులను ఎదుర్కున్నది లేదు. స్వయంగా హిందువులమని చెప్పుకుంటూనే, కుహనా మేధావులు ఎక్కడెక్కడి చెత్తా వాగే వాళ్ళు ఎక్కువయ్యారు.
అందరికీ భగత్ సింగ్ అంటే భక్తీ ప్రేమ ఉన్నాయి. కాని ఎవరికీ వాళ్లకి భగత్ సింగ్ పక్క వాళ్ళింట్లో పుట్టాలనే కోరుకుంటారు.
@ రాధాకృష్ణ
Well said.
దీనికే అంటారేమో, రావణుడి కాష్టం ఎప్పుడు కాలుతూనే ఉంటుందని. హరిసేవ గారే శ్రీ రావణుడి రాజ్యానని ఆహ్వానిస్తునారులా ఉంది ! యతో మనః తతో బుద్ధిహీ ! ఆలోచనలలో కూడా అట్లాంటి వి రానీయకండి మాష్టారు. పైన తధాస్తు దేవతలు ఉంటారంట !
ఫణీంద్రగారు
మీరు విషయంపై స్పమ్దిస్తున్నారా ?లేక ఏదోవిధంగా వాదన చేయటమే స్పందనకు గుర్తుగా భావిస్తున్నారా ?మీ ఉద్దేశ్యమే అర్ధంకావటం లేదు.
పెద్దలు శివరామప్రసాదు గారు ఆరోపణ మాత్రమేచేస్తున్నారు
అసలు కారణం ఆరోపణలతో మరుగుపడదుకదా ? మఠాధిపతులొక్కరికే బాధ్యతా > మనలాంటివాల్లం మనస్పందనలను ఏవిధంగా ప్రకటించామో చెప్పుకోగలమా ?
దీనిపై మరో పోస్ట్ వ్రాస్తాను.
ఇక జిలేబీగారూ ! మీరు బ్లాగులు మాత్రమే చూస్తున్నారా ?బయట పత్రికలు,టీవీలు చూడండి ఏమిజరుగుతుందో రావణరాజ్యం స్థాపించాలని ఎన్ని ప్రయత్నాలు సాగుతున్నాయో ?
మీరు పొగిడిన వాళ్ళు అన్నీ నిజాలు చెప్పలేదు అని నా అభిప్రాయం అంతే.
సర్వ సంగ పరిత్యాగం చేసి పీఠాధిపతులు అయ్యి, హిందూ సమాజానికి మార్గ నిర్దేశనం చెయ్యాల్సిన మన నాయకులు. కాని,వాళ్ళ వాళ్ళ ఆస్తులు గురించిన తగాదాలు, వాళ్ళల్లో వాళ్ళకి విబేధాలల్లో మునిగిపోయి, ఏదో మొక్కుబడిగా కొన్ని ఉపన్యాసాలు ఇచ్చేసి ఊరుకుంటున్నారు. హిందూ మతం మీద దాడి జరుగుతున్నప్పుడు, మనం నాయకులుగా భావించే ఈ పీఠాధిపతులు, ఆశ్రమాధీపతులు ముందుగా మాట్లాడి మనల్ని జాగృతం చెయ్యాల్సిన బాధ్యత లేదంటారా. జనం బాగా వాళ్ళంతట వాళ్ళు గొడవ చేసేసిన తరువాత, చివరికి వచ్చి ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతే అది నాయకత్వం ఎందుకు అవుతుంది. రాజకీయ నాయకులకి వీళ్ళకి తేడా ఏమిటి. కొన్నాళ్ళు జీయర్ స్వామిగారు మాట్లాడేవారు. ఆయన ప్రస్తుతం మౌనమే నా భాష అన్నట్టుగా ఉంటున్నారు కారణం తెలియదు. సరే కంచి పీఠాధిపతిని అరెస్టు చేసినపుడు, మిగిలిన పీథాధిపతులు ఎందుకు స్పంధించలేదు. జనం వీళ్ళ గురించి పోరాడలంటే, వీళ్ళు జనంలో భాగమవ్వాలి, వాళ్ళకివాళ్ళు నాయకులం అనుకోంగానే సరికాదు, జనం కూడా వాళ్ళ వంక నాయకత్వం కోసం చూసినప్పుడు దీటుగా స్పంధించి మార్గ నిర్దేశనం చెయ్యాలి. అప్పుడే ఈ పీఠాధిపతులకి గౌరవం.
ఒకాయన తెలుగువాడే కాషాయ వస్థ్రాలు ధరించి(అగ్నివేష్) ఎక్కడెక్కడి చెత్త వాగుడూ మాట్లాడుతుంటాడు. అతన్ని ముందు నీ కాషాయ వస్త్రాలు తీసి మామూలుగా ఉండి మాట్లాడు అని ఎందుకు కట్టడి చెయ్యరు.
ఇది నా భావన, ఉద్దేశ్యం. ఆరోపణ కాదు. నిజాలు చూసి తరువాత ఏర్పడిన ఉద్దేశ్యం. .
ayya, ravanasurudu chedda buddhi kalavadu matrame, chedda palakudu kadu.... yedi sakshattu hanumantula varu sundarakanda modatisaari ravanudini choosinappudu atani tejassu choosi yevidham ga anukuntadu
: "okka para stree vyamohamu kanuka leka pote yetanu nischayamuga moodu lokamulanu yelataku arhata kaliginavadu" pls refer sundarakand
vinay
Post a Comment