పెద్దలు చెబితే వినాలి ! కదా ?
>> Friday, October 14, 2011
మనపీఠానికి ముక్కెల్లపాడు అనే గ్రామంనుంచి ఇద్దరు భక్తులు వచ్చి సేవచేసి వెళుతుంటారు. ఇద్దరూ కుర్రవాల్లే. ఏదైనా పనిభారం ఎక్కువైనప్పుడు కబురుచేస్తే చాలు వచ్చి వాలిపోతారు .
వీళ్లలో సుబ్బారావు అనే పిల్లవాడు వినుకొండలో ఓ వ్యాపారసంస్థలో పని చేస్తున్నాడు. ఇంకొకరు ఆదిశేషయ్య వ్యవసాయం ఎందుకోగాని వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉండాలి ఈసంవత్సరం అని మనసులో పదేపదే అనిపిస్తున్నది మొదటినుండి . అందుకే ఈసంవత్సరం జరిపిన హనుమత్ రక్షాయాగంలో వీళ్ళను బలవంతంగా నైనా పాల్గొనేట్లు చేశాను. వీల్లకో ఖచ్చితమైన నియమం విధించాను . మీరు ఎట్టిపరిస్థితులలోనూ హనుమాన్ చాలీసా పఠించకుండా వాహనాలెక్కవద్దు అని, స్వామి స్మరణ చేయకుండా ప్రయాణాలు వద్దు అని . మరికొన్ని సూచనలు చెప్పాను.
సరే ! ఈమధ్య ఆదిశేషయ్య ప్రయాణాలు చేయొద్దు అనేమాట పెడచెవినబెట్టి వేరే స్నేహితునితో కలసి బండిమీదవెళుతూ ప్రమాదానికి గురయ్యి కాలుభాగంలో కండచీలి పొయ్యి పెద్దప్రమాదంజరగాల్సింది స్వామి దయవలన చిన్న దెబ్బతో బయటపడ్డాడు. ఏంటిరా ?విషయం అంటే . స్నేహితుని తండ్రి మరణిస్తే పెద్దకర్మకు వెళ్ళి వస్తూ స్నేహితుని బలవంతంతో అక్కడ వండిన ఆహారపదార్ధాలను ఇంటికి తెచ్చుకోవటం జరిగిందని చెప్పాడు.మరుసటి రోజు ఇలా ప్రమాదం.
ఏమయ్యా !బుద్దుందా ? ఎవడన్నా దినంకూడు ఇంటికి తెచ్చుకుంటాడా .తలకాయలేని పనులు చేస్తావా అని కోప్పడ్డాను.
ఇక మనకుర్రవాడు సుబ్బారావున్నాడుకదా . ఇతను మొన్న బుధవారం వినుకొండలో స్నేహితులతో కలసి వెళుతూ, ప్రతిరోజూ నియమంగా చాలీసా పారాయణం చేసిన తరువాతనే ఏదైనా తినమన్నారు ప్రయాణం చేయమన్నారు మాస్టర్ గారు అని అనుకునికూడా ఆ! అయినా ఒక్కసారికేముందిలే అని పారాయణం వదలిపెట్టి ప్రయాణం చేసి వినుకొండలో యాక్సిడెంట్ అయ్యి కాలుకు పెద్ద దెబ్బతగిలింది . పాదం టూవీలర్ చక్రంలో పడటంతో వెనుక కండరం మొత్తం తెగింది. డాక్టర్లు కుట్లువేసి కట్లుకట్టారు. విషయం నాకు ఈరోజే తెలిసింది. ఇందాకే వినుకొండ వెళ్ళి మరలా కట్టుమార్పించి ,ఎక్సరేలు అవి చూసి డాక్టర్ గారితో సంప్రదించి ఆపిల్లవాడిని ఇంటికి పంపివచ్చాను . పారాయణం చేయకపోవటమేకాదు వస్తూ వస్తూ రోజూ మేము బుధవారం నివేదనలు సమర్పించే అయ్యప్ప ఆలయంలోకి వెల్లి ప్రదక్షణలు చేసి నమస్కరించుకునేవాణ్ణి ,ఆరోజు అక్కడకు కూడా వెల్లబుద్ది కాలేదండి అని చెప్పాడు కట్టుమారుస్తున్నప్పుడు బాధతో విలవిలలాడుతూ. వాని బాధచూసి నాకూ మనసు కలుక్కుమన్నది.
మనకు పెద్దలో చిన్నలో ఓమంచిమాట చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకో మీకు ప్రయాణంలో ఈజాగ్రత్తలు తీసుకోవాలని అని చెప్పాలనిపించింది చెప్పాను . ఇక్కడ అవి ఆచరించటం ముఖ్యం , నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుని అనుగ్రహం ఉండబట్టి చిన్నప్రమాదంతో బయటపడ్డావు. భగవత్ సంబంధిత మైన సేవలను ఎవరన్నా మనకు సూచించారంటే అవి భగవదానుగ్రహం వల్ల మనచెవికి చేరాయనే గుర్తుంచుకోవాలి .నిర్లక్ష్యం కూడదు కదా ! అని ఓదార్చి పంపాను . కర్మ బలీయంగా ఉన్నప్పుడు మనం భగవంత్ క్రియలను మన ఉపాసనలను పక్కనపెట్టి వెలతాము ప్రమాదములలోకి నేరుగా . చాలామంది ప్రమాదాలకు గురైనప్పుడు పరిశీలిస్తే వాల్లు ఆరోజు ఇలాంటి సత్క్రియలనుపక్కనపెట్టి ప్రయాణించి నట్లు తెలిసింది ,ఇది నాస్వానుభవంలో కూడా నిరూపితమైనది.
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష .
0 వ్యాఖ్యలు:
Post a Comment