అయ్యా ! అర్చకస్వాములూ సృహలో ఉండే మాట్లాడుతున్నారా ?
>> Wednesday, September 21, 2011
అయ్యా అర్చకస్వాములూ సృహలో ఉండే మాట్లాడుతున్నారా ?
చాలాఘోర విషయం . ఇప్పుడు ఆలయాలను మూసివేసి తెలంగాణాకు మద్దతు పలుకుతున్నామని చెబుతున్న అర్చకులు పూర్తి సృహలో ఉండి మాట్లాడుతున్నారా అని అనుమానం వస్తున్నది. టీవీ వాల్లతో మాట్లాడుతూ అర్చకులసమస్యలు ఆలయాలఘోరస్థితి గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణాకు అన్యాయమంటూన్నారు . అసలు మీరు చేస్తున్న పోరాటానికి చేస్తున్న నిరసనకు పొంతన ఉందా ? భగవంతునికి నివేదనలు ఆపి వేశాము ఇది మా నిరశన అనటం ఏమాత్రం సబబు ?
ఒకే ఒక్క మాట ఆలోచించండి ...ఇలా ఏ ఇతరమతాల వాల్లయినా తమ దేవతారాధనలను ప్రార్ధనలను మానుకున్నారా ? వాల్లూ తెలంగాణా లో ఉన్నారేగాని వారి మతాచారాలకు ఉద్యమానికి ఏదైనా లింకు పెట్టారా ? ఆమాత్రం ఆలోచన లేదా మీకు ?
వ్యక్తులుగా మీ ఉద్యమాలు మీరు చేయవచ్చు .కాదనం . కానీ భగవతారధన మానుకోవటం ఎంత అపచారం ? ఎంత అరిష్టం ? చివరకు రాజకీయాల్లో మీరూ కీలుబొమ్మలై పోతే పరిణామమేమిటో శాస్త్రకోవిదులైన మీవంటి పెద్దలకు తగినపనికాదు. అలోచించండి
11 వ్యాఖ్యలు:
devudata..........
hahahhahahha
ఇది వారి అఙ్ఞానానికి నిదర్శనం ..దేవుడి ధూప దీప నైవేద్యాలు ఆపేస్తారా? వినాశకాలే విపరీత బుధ్ధి..
చెప్పండి సాములూ
చెప్పండి సాములూ
పోగాలం దాపురిస్తే ఇలాగే ఉంటుంది.
బహుశా పూజలు, నైవేద్యం మానేస్తే దేవుడు భయపడి తెలంగాణా ఇస్తాడని వారి ఆలోచన అయివుండవచ్చు. దైవము అంటే వారి అవగాహాన ఏమిటో వారి మాటలే చెబుతున్నాయి.... అయ్యో...
బహుశా పూజలు, నైవేద్యం మానేస్తే దేవుడు భయపడి తెలంగాణా ఇస్తాడని వారి ఆలోచన అయివుండవచ్చు. దైవము అంటే వారి అవగాహాన ఏమిటో వారి మాటలే చెబుతున్నాయి.... అయ్యో...అజ్ఞానానికి పరాకాష్ట....
నేను నాస్తికుడినైనా మీ భాషలోనే చెపుతున్నాను, లగడపాటి & కావూరి లాంటి సమైక్యవాద హిరణ్యకశిపుల గుండెలు చీల్చడానికి తెలంగాణా పురోహితులు కూడా సింహావతారాలు ఎత్తాలి.
అయ్యా అర్చక స్వాములూ స్నానం పానం మానేసి తెలంగాణా రాలేదని నిరసన వ్యక్తం చేయండి
అర్చకులెక్కడా గుడులని తెరవమని అన లేదే?
స్వామివారికి ధూపదీప నైవేద్యాలు మినహా... అర్చనాదులూ, ఉత్సవాలు, ఆర్జిత సేవల్న్నింటీ మానేస్తున్నమని మాత్రమే తెలిపారు... వాటివల్ల వి.ఐ.పి లకే తప్ప ఎవ్వరికీ నష్టం రాదనుకుంటా!...
అయినా చెవిటివాడికి వినిపించాలంతే .. పక్క వాడికి కూదా కాస్త ఇబ్బందే... కాని తప్పదు ..
సత్య గారు, మీ సమర్థన అంతగా అతకలేదు. అంటే ఆ అర్చకులు పనిచేసే దేవాలయాల్లో VIPల రద్దీ అంతగా వుందనిపిస్తోందా? అర్చక ఆహార్యం క్రికెట్ ఆడుకునేంత తీరిక వుందంటే వాళ్ళ అర్చకులుగా వాళ్ళ అర్హత ప్రశ్నించతగ్గదిగా అనిపించడంలేదా? 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి...' అన్న పోతన వారసులా ఈ రాజకీయ పావులు?!
Post a Comment