ఆగ్రహించి శిక్షించబూనినా అమ్మా అని వేడుకుంటే రక్షించి కాపాడే ప్రేమ అమ్మది
>> Wednesday, September 14, 2011
జగన్మాత నిగ్రహానుగ్రహాల గూర్చి మనం అనేకానేక ఉదంతాలు మనం తెలుసుకుంటుంటాము . అలాంటి ఒక ఉదాహరణ ఇది. ఈసంఘటనకు సంబంధించి మొదటిభాగం గతంలో వ్రాసి ఉన్నాను. మరలా వివరిస్తాను .
నరసరావు పేట దగ్గర పమిడిపాడు అనేగ్రామంలో కోటేశ్వరరావు అనే ఆయన ఉన్నారు. పదిమందిలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి వాల్లనాన్నగారు గ్రామానికి సర్పంచ్ గా కూడా పనిచేశారు. ఈయన ప్రముఖఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఏజంట్ గాచేరి తనచాతుర్యంతో కార్యదక్షతతో పెద్దస్తాయి కెదిగాడు . అతని సంపద దినదినాభి వృధ్ధిచెందింది . కారుదిగికాలుకిందపెట్టాల్సిన పనిలేదన్నట్లుగా సాగింది వైభోగం . సంపదరావటం వైపుచూస్తూ లక్ష్మీదేవి విలాసాలపట్ల అజాగ్రత్తవహించటం జరుగుతుంది కొందరి జీవితంలో . ఇక్కడా అదే జరిగింది. విజయవాడలో ఆకంపెనీ వాల్లు ఈయన కార్యదక్షతను గుర్తించి కనకాభిషేకానికి ఏర్పాటు చేశారు. ఆసమయంలో డబ్బుతో ఈయనకు అభిషేకించటం జరిగింది. ఈసమయంలో ఆ సంపదను కాళ్లతో తొక్కటం జరుగుతుంది .అదేజరిగింది.
ఇక్కడ శాస్త్రవచనమేమిటంటే తల్లి లక్ష్మీ దేవి మానవుడి శిరస్సుపై కెక్కితే ఇక నిలువదు. అలాగే పాదాలతో తాకితే అలిగి వెళ్ళిపోతుంది .
ఇక ఆ కార్యక్రమం తరువాత బండి రివర్స్ లోపడింది . నల్లెరుపై బండినడకలాసాగుతున్న జీవనగమనంలో గతుకులు మొదలయ్యాయి. అవి పెద్దకుదుపులుగా మారి ప్రయాణం తల్లకిందులుగా సాగింది . సంపదపోయింది. లోకసహజంగా సంపద తగ్గిన సమయంలో బంధుమితృలంతా దూరంగా జరిగారు. ఎక్కడ వేలుపెట్టినా నష్టమే .ఏమిటీ ఉపద్రవమని చింతిస్తూ అనేకమంది సిద్దాంతులను సంప్రదిస్తూ చెప్పినవిచేస్తూ యంత్రాలు తాయెత్తులు ఇలా తనప్రయత్నాలన్నీ కొనసాగించినా తల్లిజేష్టాదేవి కనపడుతున్నదే తప్ప లక్ష్మీప్రసన్నత లేదు. అయితే మానవుడు చేసిన పుణ్యకార్యక్రమములు వృధాగాపోవు . ఈ ఆపదసమయంలో వాల్ల మితృడైన ఓ వాస్తు సిద్దాంతి అతనికి ఓమంచి సలహా చేప్పాడు.నువ్వు దీనికి పరిష్కారం తెలుసుకోవాలంటే అమ్మను ఆశ్రయించాల్సినదే .ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి రవ్వవరంలో శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో అమ్మ సేవలో ఉండే మాస్టర్ గారికి చెబుతాను వెల్లు అని పంపాడు. విషయం నాకు మొత్తం చెప్పలేదుగానీ ఫోన్ లో చూచాయగా వివరించాడు . రమ్మంటారా ? అని గాడు.
అయ్యో ! ఇది అమ్మవారి పీఠం .అందరూ అమ్మబిడ్డలే .తల్లి దగ్గరకు రావటానికి ఇంకొకరి అనుమతి అవసరం లేదు రమ్మనిచెప్పాను .
గత నవరాత్రులలో మహర్ణవమి ఉత్సవంరోజున వచ్చాడు భార్యాసమేతంగా. దీనవదనంతో వేదన నిండిన హృదయంతో విషయం చెప్పాడు. మీరు జగన్మాత సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు అమ్మ రాక్షససంహారం చెసి ప్రసన్నురాలయి ఉన్నసమయం . గర్విష్ఠులను ఎలా శిక్షిస్తుందో ఆర్తులను అలానే రక్షిస్తుంది . మీరు ఇప్పటిదాకా మనుషులవద్ద వ్యక్తంచెసుకున్న,వ్యక్తం చెసుకోలేకున్న బాధనంతా అమ్మముందు విన్నవించుకోండి. కన్నీటితో అమ్మపాదాలపై వాలండి అని చెప్పాను. వారిచేత అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరిపించాను. వారు తెచ్చిన నూటాఎనిమిది రూపాయలనాణేలతో అమ్మవారిని అభిషేకించుకున్నారు . గుండేలో బాధనంతా మౌనంగా అమ్మను చూస్తూ వెల్లడించుకున్నారు. ఆరోజు ఉత్సవంలో వీళ్ళను పట్టించుకునే తీరిక ఎవరికీ లేదుకనుక వీరి పూజకు ఎటువంటి ఆటంకం లేదు. ఆతరువాత వాల్లకు ప్రతిరోజూ గోవుకు గ్రాసం తినిపించాలని ,కనకధారాస్తవంతో అమ్మను నిత్యం స్తుతించాలని నియమం చెప్పాను .
సంవత్సరం పూర్తవవస్తున్నది . ఇప్పుడు వారింట మరలా శ్రీమహాలక్ష్మీదేవి చిరునవ్వులు విరబూసున్నాయి. వాల్లిప్పుడూ పాలవ్యాపారం ప్రారంభించారట . చాలా చక్కగా జరుగుతున్నది. గతంలో పీట ముడిలాబిగుసుకున్న ఒక్కొక్కసమస్య విడిపోతున్నాయట . అమ్మదయవలన ఇప్పుడు మాదుఃఖాలు తొలగిపోయాయి . గతంలో అంతడబ్బున్నా లేని భద్రత ఆనందం మాకు లభ్యమవుతున్నది . ఎప్పుడేంకావాలో అమ్మదయవలన అవి వచ్చిఅమ్దుతున్నాయి అని ఆయన ఆనందం వ్యక్తం చెస్తున్నాడు. ఒక్కసారి మావూరు రమ్మని పిలుస్తున్నాడుగానీ
కుదరటం లేదు. అమ్మలీలకు ఓచిన్నపరికరంగా మారే అవకాశం దక్కటం నా అదృష్టం .....జై భవానీ
1 వ్యాఖ్యలు:
ఓం శ్రీమాత్రే నమః
చాలా బాగుంది మాష్టారు. ఈ మధ్యనే గురువు గారి ప్రవచనంలో ఓ మాట చెప్పారు. మనల్ని చాలా త్వరగా అనుగ్రహించే స్వరూపాలలో ముఖ్యమైనవి ఒకటి అమ్మ వారు రెండవది హనుమ.
అమ్మ అనుగ్రహం ఉంటే అలాగే ఉంటుంది. అమ్మ అమ్మే...
Post a Comment