శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎంతనీచానికి దిగజారారీ మతవ్యాపారులు !!??

>> Sunday, September 11, 2011

మతం మార్చి.. అనాథలుగా విరాళాల సేకరణ
నేపాలీ చిన్నారులకు విముక్తి
కోయంబత్తూరు, న్యూస్‌టుడే: నేపాల్‌కు చెందిన చిన్నారులను తీసుకొచ్చి
అనాథలుగా చిత్రీకరించి విదేశీ విరాళాలు సేకరిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ
ఉదంతం తమిళనాట వెలుగులోకి వచ్చింది. నేపాల్‌ దేశంలో అదృశ్యమైన పలువురు
చిన్నారులు నగరంలోని మైఖేల్‌ జాబ్‌ పాఠశాల ఆవరణలోని ఆశ్రమంలో ఉన్నారని
అందిన సమాచారం మేరకు ఆ దేశ రాయబార కార్యాలయ అధికారులు గురువారం రాత్రి
కోయంబత్తూరు కలెక్టరు కరుణాకరన్‌ సాయంతో సదరు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు
నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ మొత్తం 42 మంది చిన్నారులు ఉండగా వారిలో
23 మంది నేపాలీలుగా, మిగతా వాళ్లు వివిధ రాష్ట్రాల చిన్నారులుగా
గుర్తించారు. అందరూ 14 ఏళ్ల వయస్సులోపు వారే. వాళ్లను అనాథలుగా అక్కడి
నిర్వాహకులు తెలియజేశారు. అయితే అక్కడి రిజిస్టరులోని పేర్లకు, చిన్నారుల
పేర్లకు పొంతన లేకపోవడంతో ఆ చిన్నారులను అధికారులు విముక్తులను చేసి
స్థానిక ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. వివిధ ప్రాంతాల్లోని
హిందూ మత చిన్నారులను బలవంతంగా తీసుకొచ్చి మత మార్పిడి చేస్తున్నారని,
వారి పేరిట విదేశీ విరాళాలు సేకరిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.
దీనిపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు, సంబంధిత ట్రస్టుపై తగిన చర్యలు
చేపట్టనున్నట్లు కలెక్టరు కరుణాకరన్‌ తెలిపారు. నేపాల్‌ చిన్నారులను
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ దేశానికి అప్పగించేందుకు తగిన చర్యలు
చేపట్టామని పేర్కొన్నారు.

సీబీఐ దర్యాప్తు కావాలి: హిందూ మున్నణి
నేపాలీ చిన్నారుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు అవసరమని హిందూ మున్నణి
డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన
విలేకరుల సమావేశంలో హిందూ మున్నణి కోయంబత్తూరు డివిజన్‌ కార్యదర్శి
కిషోర్‌కుమార్‌ కోరారు. మైఖేల్‌ జాబ్‌ ట్రస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని
తెలిపారు

1 వ్యాఖ్యలు:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు September 11, 2011 at 9:57 PM  

ఈ చెత్త నా_______________ ఏం చేయడానికయినా సిద్ధ పడుతారు. వీళ్ళకి తగిన శిక్ష పడ్డప్పుడే మరికొంత మంది ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి భయపడుతారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP