శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విపత్తులనుండి కాపాడమని ఆదిపరాశక్తికి జరిపే ఈ అర్చనలకు మీ గోత్రనామాలు పంపండి .

>> Monday, March 14, 2011




ఈనెల 17 నుంచి 21 వరకు భూమిపైన విపత్తులు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిషవేత్తలు సూచనలు చేస్తున్నారు. మానవుని ఆధీనంలో లేని విపత్తులనుండి మాధవుని ఆశ్రయించటం ద్వారామాత్రమే తప్పుకోగలము.
ఈ ఆపదకాలంలో శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో లోకక్షేమం కోసం హరిహరసమేతంగా ఇక్కడ కొలువై ఉన్నఅమ్మకు ప్రత్యేక అర్చనలను .అభిషేకములను నిర్వహించబడుతున్నాయి . గురువారం నుండి సోమవారం వరకు పురుషసూక్త,శ్రీసూక్త,రుద్రసూక్తములతో స్మామివారలకు ,అమ్మవారికి అభిషేకములు తదనంతరం శ్రీవారికి తులసీదళార్చనలు, రామలిగేశ్వరునికి మారేడు దళములతోనూ. అర్చన . ఆతరువాత శ్రీచక్రార్చన కుంకుమ పూజలు జరుగుతున్నాయి .
ఆపైన విష్ణు ,లలితా సహస్రనామ పారాయణములు ,సాయంత్రం జ్యోతిర్లింగార్చన జరుపబడుతుంది . అలాగే 19 న చంద్రోదయ కాలంలో ప్రత్యేకం వెన్నెలలో శ్రీచక్రార్చన జరుపబడుతుంది .పరివార దేవతలకు నవగ్రహాధిపతులకు అర్చనలు జరుపబడతాయి [ముఖ్యంగా చంద్రగ్రహారాధన ] .


ఈకార్యక్రమములో భక్తులదరి తరపున నివేదనలు జరుగుతాయి కనుక మీ గోత్రనామాలు కుటుంబసభ్యులపేర్లు తెలిపినచో వారిపేరనకూడా అర్చనలు జరుపబడతాయి . ఐతే గోత్రనామాలు పంపువారు .ఈ ఐదురోజులు ,మీమీ మతానుసారం దేవతారాధన ,కనీసం ,విష్ణు లేదా లలితా సహస్రనామ పారాయణం . "ఓం నమఃశివాయ" అనే పంచాక్షరి మంత్రజపాన్ని కనీసం నూటాఎనిమిది ఆపై శక్త్యానుసారం జపించాలి .
మీగోత్రనామాలు
durgeswara@gmail.com నకు పంపగలరు .

2 వ్యాఖ్యలు:

Sesirekha Munagala March 15, 2011 at 6:34 AM  

దుర్గేశ్వర గారు

మా నామాలు నీలాద్రి రావు, శశిరేఖ, శ్రీ ఆరోబిందో, శ్రీ రామ్, గోత్రం కౌశికశ.

ప్రణామములు
శశిరేఖ.

suvarna March 15, 2011 at 7:04 AM  

Namaste Durgaji,
Mee prayatnam chaala bagundi.
memu kooda LALITA&VISHNU sahasranama parayanalu chestamu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP