గణపతిం భజే...
>> Saturday, March 5, 2011
- సామవేదం షణ్ముఖశర్మ
'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
విఘ్ననాశనమే ఆరంభం. అందుకే ఈయనను విఘ్నసంహారకునిగా ఆరాధిస్తున్నాం. యోగశాస్త్రంలో మూలాధారాధిపతి సర్వయోగసిద్ధులకీ మూలం. వేదాలలో బృహస్పతిగా, బ్రహ్మణస్పతిగా ఈతనినే అభివర్ణించారు. ఈయన కృపవల్లనే 'బృహస్పతి' పేరుతో దేవాచార్యుడు వెలుగొందాడు. బృహతీ అనగా వాక్కులు, జ్ఞానశక్తులు. వాటికి ప్రభువు బృహస్పతి. వేదవిజ్ఞానాలు, కర్మలే బ్రహ్మణాలు. వాటికి శాసకుడు బ్రహ్మణస్పతి. ఏడుకోట్ల మంత్రరాశికి మూలమైనవాడు- అని గణపతి సహస్ర నామాలలోని మాట. ఆ మంత్రరాశియే స్వామివారి లంబోదరం. వేదమంత్ర స్వరూపుడు కనుక ఈతడు బుద్ధిశక్తికి అధిష్ఠానదేవత కూడా. స్వామినామాలే అతని తత్వాన్ని పట్టి చూపుతాయి.
1. వక్రతుండ: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.
బ్రహ్మవిష్ణురుద్రాది దేవతలు సైతం తమతమ విశ్వనిర్వహణ కార్యాలకు ఆరంభంగా ఈతనిని కొలుచుకుంటారని పురాణ ప్రతీతి.
గణపతి పూజ సులభం, ఫలం అధికం. యోగ, మంత్ర, వేదశాస్త్రాలలో ఎన్నో తత్వాలను గర్భీకరించుకుని గణపతి వైభవం విస్తరించింది. భిన్నగతులతో మసలే గణాలను (సమూహాలను) సమన్వయపరచే ఏకసూత్ర స్వరూపుడైన మహాగణపతి కృపవలన, మనదేశం సామరస్య ప్రగతిని సాధించుగాక!
2 వ్యాఖ్యలు:
అక్షరాలసలు కనబడనంత చిన్నగా ఉన్నాయండి
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.

Post a Comment