శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధర్మం పైన అభిమానమే కాదు ధర్మనిష్ఠ ఉన్నదా మనకు?

>> Tuesday, February 15, 2011

ప్రతివ్యక్తికీ తమధర్మం పైనఎంతో కొంత అభిమానం ఉంటుంది . ఐతే అది ధర్మనిష్ఠ కాదు. ధర్మనిష్ఠ అంటే మనధర్మం మననుండివేరుగా చూదబడకూడదు. మనభావంధర్మంతో మమేకమై ఉండాలి. నీధర్మాన్ని విమర్శించినప్పుడు నీకు వేదన కలగాలి . నీధర్మాన్ని రక్షించుకోవటానికి నీవ్యక్తిత్వాన్ని రక్షించుకోవటంతో సమానంగా భావించాలి. ఉదాహరణకు మనం రోజూ వెళ్ళి పూజించేలేక నమస్కరించే దేవీదేవతలు మననుండి పరాయివారుకారు కనుక మనం మనకుటుంబసభ్యులపట్లచూపే ప్రేమాభిమానాలు ,గౌరవమర్యాదలు వారిపట్ల చూపాలి ,అదే నీధర్మం పట్లచూపాలి.అది ధర్మనిష్ట అంటే . అలాకాకుంటే అవసరార్ధ భక్తి ఆభగవంతునికి ఆమోదమవుతుందా ? ధర్మోరక్షతి రక్షితః అని పెద్దలలెందుకు అంతఖచ్చితంగా చెప్పారో మనం ఆలోచించుకోవాలి .

ఈ విషయంలో మన నిబద్దత ఎంత అనిప్రశ్నించుకోవాలి . మన ధర్మంలోని భావాలు ఉన్నతమైనవి .శాంతి ,సహనం,క్షమాగుణం మనకు తల్లిపాలతో వస్తాయి . అయితే ఇవి మనలో అన్ని విషయాలలోనూ ఒకేరకంగా ఉన్నయా ? ఆలోచిద్దాం ఓసారి.
సాధారణంగా మనం ఇతరులభావాలను ,ఇతరులధర్మాలను కించపరచం . మంచి సంస్కారమిది . ఈలక్షణాలను మనకు మన మతగ్రంథాలు ,మనపెద్దలు చిన్నతనం నుంచి నేర్పారు. కానీ మనం ఇంకాకొద్దిగా ఎక్కువనేర్చుకున్నామేమో ఇప్పుడు మనధర్మాన్ని ,మనవిశ్వాసాలను అవమానించినా పట్టించుకోని స్థితికి చేరుతున్నామేమో క్రమేపీ అని అనిపిస్తున్నది నేటి పరిస్థితులు చూస్తుంటే .
ఇది ఆచరణీయమేనా ?

ఏమిటిది ? రెచ్చగొట్టే విధంగా వ్రాస్తున్నాడు అనుకోకండి .నాప్రశ్నను పరిశీలించండి.

నీవు అమ్మా.మాతా అని పిలచిప్రార్ధించే దైవాన్ని గాని నీ కన్నతల్లిని గాని తిడితే శాంత వహిస్తున్నావంటే నీవు లోకమర్యాదలకు అతీతస్థితికిచేరిన సర్వసంగ పరిత్యాగి వయ్యుండాలి. లేదా దైవాన్ని తిట్టినప్పుడు కలగని బాధ నీ కుటుంబసభ్యులను తిట్టినప్పుడుమాత్రం కలుగుతుందంటే మాత్రం ..............ఇది శాంత గుణమేనా ? అనే అనుమానం రావాలి. పరిశీలించుకోవాలి. ధర్మం వేరు మనం వేరుకాదు, ఆధర్మం అండలేకుంటే మన జీవితం ఇంతప్రశాంతంగా సాగేది కాదు . కనుక ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనజీవితావసరం కూడా .

సరే ఇక మనం ఈరోజు చూస్తున్న విచారకరమైన స్థితి గూర్చి చూద్దాం . ఎవడైనా మనవాల్లను మనధర్మం నుంచివేరుచేయటానికి చేసేప్రచారంలో వాల్ల విశ్వాసాలగూర్చిచెప్పటం కాక .మనధర్మాన్నిగూర్చి తిట్టడమే ఎక్కువగాఉంటుంది , మైకులుపెట్టి మరీ.
ఏచెప్పులకంపెనీవాడైనా వానిచెప్పులపై మనదేవతలను ముద్రించగలడు.
ఏసినిమావాడైనా మన విశ్వాసాలను మతాచార్యులను,విశ్వసాలను హేళనగాచూపుతూ సినిమాతీయగలడు.
బుర్రలో గుజ్జులేకున్నా ,అసలు మన మతగ్రంథాలమొహం చూడనివాడుకూడా దౌర్భాగ్యకరమైన వ్యాఖ్యానాలుచేస్తూ పుస్తకాలు వ్రాయగలడు.
ఇక మనమొహంముందే మన ఆచారాలను తిట్టగలడు. శుభమా అని మనం పండుగ చేసుకుంటుంటే మనవిశ్వాసాలను దెబ్బతీసేవిధంగా టీవీల్లోచర్చావేదికలు పెట్టగలరు.
ఇదెక్కడిదాకా పోతోందంటే వాళ్లఇంట్లో కూరలో ఉప్పుతగ్గినా మనదేవతలను విమర్శిస్తారు
మాకూరగాయలవాడితో నాకు గొడవైంది కనుక సీతా..గీతా ఏమిగొప్పని బ్లాగులు వ్రాయగలరు. పాలవాడో,పాతసామానువ్యాపారో నన్ను తిట్టాడు, కనుక నేను మీదేవతలను తిడతాను అనే బుద్దిహీనవాదనలను చేయగలరు నిర్భయంగా .

ఎందుకు జరుగుతుందిలా ?

స్వేచ్చలు ,వాక్ స్వాతంత్ర్యాలు,ప్రజాస్వామ్యాలు,పైత్యానందాలు ఇతర మతాలు,ధర్మాలపట్ల ఒల్లుదగ్గరపెట్టుకుని ఉంటూ మనధర్మం మీద, మతం మీద మాత్రమే ఇంత అహంకారపూరితంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాయి ?

ఇప్పుడు నేనంటాను మనకుధర్మం పట్ల అభిమానం ఉందికాని ధర్మనిష్ఠ తక్కువ . ఇతరులకు వారి ధర్మంపై ఉన్న స్థాయిలో అభిమానం మనకు లేదు అని.దానివల్లనే మనధర్మానికి మనవిశ్వాసాలకు[అంటే స్వయంగా మనకే]ఇన్నిఅవమానాలు.

కోప్పడకండి..అలోచించి చూడండి .వాస్తవమో కాదో . వాస్తవం మాట్లాడితే మతోన్మాదం అంటారుకూడా [అదికూడా మనలని మాత్రమే అనగలరు.]

నేనొకప్పుడు ఒక పత్రికలో పనిచేసే వాడిని .ఒకరోజు అందులో జయగోపాల్ అనే వ్యాసకర్త ఒకాయన పలానామతం లో స్త్రీలకు స్వేఛ్చ తక్కువ అని వ్రాశాడు . అంతే సాయంత్రానికల్లా గుంటూరు లోను ఇంకా చాలాచోట్ల రాస్తారోకోనిరశన ప్రదర్శనలు, మరుసటిరోజు వస్తున్న ఆ పేపర్ కట్టలు తగలెట్టడం జరిగాయి . వెంటనే చాలాభ్యుదయ భావాలుగల నాటి ఆ పత్రిక సంపాదకుడు యాజమాన్యం ఆ మతానుయూయులకు క్షమాపణ చెప్పటం జరిగింది .

ఇక నేను నూజండ్లలో పనిచేసేప్పుడు ఆవూరిలో సంఘటన . ఆఊరిలో ఆంజనేయస్వామికి చెందిన ఏడెకరాలభూమిని ప్రభుత్వంవారు తీసుకుని మండలకార్యాలయాలు, మనమతంలోని బలహీనవర్గాలకు ఇళ్లకు కేటాయించగా ఇంకా ఆలయం పక్కనే మిగిలిఉన్నస్థలంలో ఒక ప్రార్ధనామందిరాన్ని[పూరిల్లు] కట్టారు. దానిలోనుంచి రోజూ మైకులో రాల్లు రప్పలూ దేవుడా >? ......తుడుచుకునే రాయి దేవుడా ? అని విమర్శిస్తున్నా పదహారు సంవత్సరాలపాటు వింటూ బాధపడురతున్నారేగాని ఎదిరించటానికి ఎవరూ పూనుకోలేదు . ఆ తరువాత నేను అక్కడకెళ్లాక స్వామి అనుగ్రహంతో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయటం చాలామంది హనుమద్దీక్షలు తీసుకోవటం ఎంతో మందికి జీవితంలో సమస్యలు తొలగి మంచిఫలితాలురావటం .అక్కడనుంచి మైకుల్లో విమర్శలు మాయంకావటం జరిగాయి. ఆతరువాత ఆమతం వాల్లు విదేశంనుంచి వచ్చే నిధులతో అక్కడ పెద్దప్రార్ధనామంధిరాన్ని నిర్మించాలని ప్రయత్నాలు మొదలెట్టగా కుర్రవాల్లు ఎదురుతిరగటం ఒక మత స్థలం ప్రక్కన మరొకదానికి అదీ ఈదేవునికి సంబంధించి స్థలంలో ఇవ్వటం కుదరదని అధికారులచే చెప్పించటం జరిగి తాత్కాలికంగా ఆగిపోయింది.[ఆకారణంగా కక్షపెట్టుకుని ఓరాత్రి పదిమంది మా అశ్రమం మీద దొంగతనానికొచ్చారు కూడా]
ఆ తరువాత వచ్చిన ఎలక్షన్ లో మాఓట్లు కావాలంటే ఆస్థలం మాప్రార్ధనామందిరానికి ఇవ్వాలని వాల్లు పెట్టిన షరత్తుకు ప్రధానపార్టీలకు చెందిన ఇరువర్గాల నాయకులు పరిగెత్తుకెళ్ళి మద్దతిచ్చి దగ్గరుండి సహకరించారు .వీళ్లలో ఓట్లు ఒక్కల్లకు మాత్రమే వేస్తారని తెలిసినాకూడా . స్వామి ద్వారామేలుపొందినవారుసైతం గ్రామరాజకీయాలు మేము ఎదిరించలేము అని మొహంచాటేశారు . కలి మాయ తండ్రీ ,అని కన్నీటితో స్వామికి క్షమాపణ చెప్పుకుని వచ్చేశాను . స్వామినుంచి మేలు పొందటానికి మాత్రమే పనికొచ్చిన భక్తివిశ్వాసాలు మనవాల్లకు స్వామి పట్ల జరుగుతున్న అపచారాన్ని నివారించటానికి కలుగలేదు .
అప్పుడు జరిగిన స్టాఫ్ మీటింగులో ఈవిషయంపైన నేనువ్రాసిన వార్తను మా స్టాఫ్ రిపోర్టర్ ప్రచురించనీయలేదు అని బ్యూరో ఇన్చార్జ్ కు ఫిర్యాదు చేశాను . దానికి మాస్టాఫర్ ఇతను చాలా తీవ్రవాదండి అని ఎగతాళిచేయగా ... బ్యూరో గారైతే మైనార్టీస్ అవర్ చిల్డ్రన్సయ్యా ఎప్పుడు తెలుసుకుంటావు ,అయినా మతాలు రెచ్చగొట్టే విధంగా వార్తలు వ్రాస్తావా అన్నాడు. సరేలెండి నేను రేపు వినుకొండలో ఆమతంవాల్లు వందఎకరాలు ఆక్రమించుకుని కట్టుకున్న పెద్దమందిరం పాఠశాల ప్రహరీ గేటుకు వెలుపల ,రోడ్డమ్మటి ఒక విగ్రహం పెట్టుకుంటాను అప్పుడు వాల్లు ఎదురు తిరిగితే మనం వార్త వ్రాస్తామా ? వ్రాయమా అని అడిగాను. అంతే ఆయన సీరియస్సయ్యాడు.
ఇంత దిక్కుమాలిన భావాలతో నేను పనిచేయలేనని చెప్పి ఆపత్రికనుంచి బయటకొచ్చాను.

ఇక నాఉద్యోగవిషయంలో సంఘటన
నాదగ్గరకొక అడ్మిషన్ వచ్చింది . అడ్మిషన్ ఫారంలో మీ మతమేదమ్మా అంటే అపిల్లవాని తల్లి ఫలానామతం అని చెప్పింది . నాపక్కనే ఉన్న మాష్టారు ,అలాచెప్పకూడదు . హిందూ..చెప్పాలి లేకపోతే రిజర్వేషన్ రాదు అని చెపుతూ నన్ను హిందూ అని వ్రాయమటాడు. అదెలాగయ్యా ఆవిడ మేము కాదు అంటుంటే ? అన్నాను
ఆయన చెప్పమన్నా సరే ఆపిల్లవాని తల్లిమాత్రం ,మేము ఫలానా మతస్తులమని అని గట్టిగాచెబుతుంది . ఇక మా మాస్టారు నానుంచి అడ్మిషన్ ఫారం లాక్కుని తాను పూర్తిచేసుకున్నాడు [ఆయనహెడ్మాస్టార్ మరి] .

మొన్న వినుకొండలో సంఘటన

ఆర్టిసీ బస్టాండదగ్గర నాచిన్నతనంలో ఒక ముసలావిడ ఎవరో చాలాకష్టపడి చిన్న శివాలయం కట్టించింది.చిన్నతనంలో మా జేజినాయన వెంట వెళ్ళినప్పుడు అయనతో పాటు నమస్కరించుకోవటం అలవాటు. ఆతరువాత ఆపక్కనే ఒక మసీదు వెలసింది, దానిపక్కనే ఉన్న జీవాలయం వాల్లు కూడా ముందుకు వచ్చి మేరీమాత విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు ప్రొక్లైనర్లతో వచ్చి దేవాలయం లేపేశారు.విగ్రహాలు పీకిపక్కన పడేశారు. ఎంతదుర్మార్గం అని అనుకున్నవాల్లేగాని ఒక్కల్లు ఎదిరించి మాట్లాడలేదట. పక్కనే ఉన్న ప్రార్ధనామందిరాలదగ్గరకెల్లేసరికి "పుచ్చలు లేసిపోతాయ్" అని హెచ్చరికలొచ్చాయి కాబోలు అధికారులు పరార్ . మీరిప్పుడొచ్చి చూడండి ..ధ్వంసమైన ఆలయం పక్కన సగర్వంగా నిలుచున్న ప్రార్ధనామందిరాలను. ఇది వాల్లధర్మ నిష్ట. ఆధర్మ నిష్ఠ కలవారు కనుకనే వారి విశ్వాసాలపై దాడి చేయటానికెవడూ సాహసించడు.

మనవాల్లు రోజూ వెళ్ళి దణ్నం పెట్టుకునే గుడిగూర్చి వివాదమేదన్నా జరుగుతుందని తెలిస్తే మనపిల్లలను అటువెళ్లవద్దని హెచ్చరిస్తాం . వాల్లవిశ్వాసాలకు ప్రతీకలైన వాటిపట్ల అవమానం జరిగితే పిల్లాదిమొదలు తమనిరసన తెలిపేందుకు సిద్దమవుతారు .న్యాయపరంగా నిజమైన విషయాలపట్లనయితే వాల్లస్పందన నాకు అభిమాన విషయం .అదీ ధర్మనిష్ఠ అంటే.
సరే మనం మనధర్మం పట్ల ఇంత నిరాశక్తత,నిస్సహాయత , చూపించటమే మనధర్మనిష్టకు ప్రతీకగా భావిద్దామా ?
ఎందుకింత నిర్లక్ష్యం ? మనకు మనధర్మాన్ని అవమానింపబడకుండా కాపాడుకునే శక్తిలేదా ? దానికోసం మనం మగొంతునుంచి ఒక్క కేకను బయటకు పంపలేమా ? మనచుట్టూతా, మనకు వీలైన చోట్ల మన నిరశన తెలుపలేమా?మరొకరు మనలను అవమానించకుండా చట్టపరిధిలో మనం మనశక్తిచూపలేమా ? అందుకోసం మనం మనజీవితాన్నుంచి ఏమీ ఇవ్వలేమా ?
మనకోర్కెలు నెరవేర్చేందుకు మాత్రమే మనకు మన దైవాలు, విశ్వాసాలు అవసరమా ? మనకు మనధర్మం పట్ల ఈమాత్రం అభిమానముంటే మన దేవీదేవతలకుఇన్ని అవమానాలు వారిపట్ల ఇన్ని అపచారాలు జరుగుతాయా ?
దీనికి మన సమాధానమేమిటి ? ఎవరి మనసుకు వాల్లం చెప్పుకుందాం ఓ పదినిమిషాలు మన అమూల్యమైన,అతి బిజీ జీవితాలనుంచి వెచ్చించి .

12 వ్యాఖ్యలు:

veera murthy (satya) February 15, 2011 at 10:40 AM  

దుర్గేశ్వర గారు , మీ పోస్ట్ లోని ప్రతీ వాక్యం తో ప్రతీపదం తో ప్రతీ అక్షరంతో నేను ఏకీభవిస్తునాను. మీ సేవ అసామాన్య మైనది. may always God be with you.

Bhardwaj Velamakanni February 15, 2011 at 12:20 PM  

These things will stop when all the Hindus say ""పుచ్చలు లేసిపోతాయ్"!

This is where, though ironic, radical views come in handy.

astrojoyd February 15, 2011 at 5:18 PM  

super post sir

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ February 15, 2011 at 8:28 PM  

సర్, మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది.

రాఘవ February 15, 2011 at 10:25 PM  

భగవంతుఁడే భగవత్సేవకై మనకు శక్తినిచ్చుగాఁక.

Rajasekharuni Vijay Sharma February 16, 2011 at 12:39 AM  

ఆ బ్లాగు లో ఎడమ చేతి పై భాగము లో "Report abuse" అని
వుంటుంది. దాని మీద క్లిక్ చేసి తరువాత పేజి లో
Report a Terms of Service Violation
select "Hate or violence" -> continue -> continue -> submit

for now we can do this. till further steps


నేను చేశానీ పని, మరి మీలో ఎందరు చేశారు. మొదటి అడుగు వేద్దాం రండి. పిచ్చి పిచ్చి టపాలు రాసేవారికి ఇదొక గుణపాఠం కావాలి.

రాజేష్ జి February 16, 2011 at 3:35 AM  

$దుర్గేశ్వర గారు

మీ విలువైన సమయాన్ని వెచ్చించి అంతే విలువైన సమాచారాన్ని అందించారు. అందులకు కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా మీ నిజజీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు. అలాంటి సంఘటనలు ఆంధ్రాలో మరీ ఎక్కువ.
ఈ టపాలో మీరు ఏ ధర్మ౦ నవ్వులపాలవుతున్నదో, మరియే మతాలూ ఈ ధర్మాన్ని అణచడానికి ఎంత గట్టిగా కృషి సలుపుతున్నవో కూడా చక్కగా వివరించారు.

నేను ఈ "ధర్మనిష్ఠ ఉన్నదా" అనేదాన్ని మరో కోణంలో, ఉపయోగపడేదే, విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నా! నాది అసందర్బపు వ్యాఖ్య అయితే తొలగించగలరు.

#"ధర్మనిష్ఠ ఉన్నదా మనకు?"

ఉందా లేదా అన్నది పెద్ద తికమక! ఈ తికమక ఏంటో ముందు విన్నవించుకుంటా!

అసలు ధర్మనిష్ఠ కార్యాచరణకు పూనుకుని యువతని కాయోముఖులను చేయవలిసింది పెద్దలు. అవును ఇవి పెద్దలు మాత్రమే(?) చెప్పాలి. మేం చదివి తెలుసుకో౦, కావాలంటే అసంగత పెసినీలు సంధిస్తాం. అంతే! నాలుగు డబ్బులోచ్చేయి ఏవైనా ఉంటే చెప్పండి, చక్కగా రెండురోజుల్లో నేర్చుకుంటాం.

మరి ఈ పెద్దలైనా సరిగ్గా పిల్లలకి చెబుతున్నారా?

సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, ఏమనుకోవద్దు? మొన్న మీరు హిందూధర్మ ద్వేషం అని చెబుతూ "..మహమ్మదులనుండి క్రీస్తుదేవులవరకు.." రాసారు. నాకు ఒక్కసారిగా చుక్కలు కనిపించి కాసేపు మతిపోయింది. అవి మతాలు, వాటికో దిశానిర్దేశకుడు. మనది ధర్మ౦, జీవన విధాన౦.
ఈ ధర్మ౦లోకి వారు ఎప్పుడు వచ్చి చేరారా అని తలబాదుకున్నా! అవును మరి నాకు తెలిసింది వేరు, ఇదేమో కొత్తగాఉండే! ఈ ధర్మంలోకి వారు రావాలి అంటే అందరు దేవుళ్ళు ఒకటే అని నమ్మాలి, ఈ మతమార్పిడులు, మతంతో మారణహోమాలు ఆపాలి. అసలు వారి మతం ప్రాచుర్యం పొందడానికి
తొలినాళ్ళనుంచి చేస్తున్నది, చూస్తున్నది అదే మారణహొమ౦. సరే ఈ మంచి, చెడ్డలు పక్కన బెట్టినా మనం కలుద్దాం అనుకున్నా కలవనిచ్చేస్థితిలో వారులేరు. మరలాంటప్పుడు ఎందుకీ జెంజాటాలు చెప్పండి? మనదేదో మనం చూసుకోవచ్చు గదా, అన్నింటినీ కలుపుకోవలిసిన అగత్యం ఏమిటి? ఇక్కడ పక్కమతాలని ద్వేశించ్మని కాదు చెప్పేది, తన్ను మాలిన ధర్మ౦, అదీ "అతి" వద్దని మాత్రమే! అదే "స్వీయ ఆచరణ-సర్వ ఆదరణ". కానీ ఈ మౌలిక సూత్రం గతి తప్పి ఇలా అయ్యింది ""స్వీయ నిరాదరణ-సర్వ ఆదరణ" అయింది. ఎవరు కారణం?

ఈ మౌలిక సూత్రం చెప్పినపుడు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. 2005 లో నిజం కాలేజ్ గ్రౌండ్లో "జై శ్రీమన్నారాయణ" యజ్ఞం జరిగింది. నేనూ వెళ్ళా. అంతా బానే ఉంది. శ్రీ త్రిందండి రామానుజ చినజీయరుస్వాములవారు ఉపన్యాసం మొదలుపెట్టారు. నిజానికి పై మౌలికసూత్రం ఆయన చెప్పిందే, కాపోతే వారి ఉపయోగ సందర్భ౦ "వేరు"లెండి. ఉపన్యాసం మద్యలో ఆయన చెప్పిన మాటలివి.

రాజేష్ జి February 16, 2011 at 3:36 AM  

"
మన ధర్మానికి కొన్ని దుష్టశక్తుల నుంచి ప్రమాదం ఉంది. మన సోదరులు అందరూ మన ధర్మాన్ని మెచ్చుకుంటున్నారు, పాటిస్తున్నారు. క్రైస్తవసోదరులు మన ధర్మాన్ని ఆదరిస్తున్నారు. అలానే ముస్లి౦ సోదరులు కూడా.
(స్వగతం: దీంతో నా బుర్ర వేడెక్కి పోయింది. మరి ఇక ఎవరినుంచి ముప్పు?).

ఆ స్వాములవారు తర్వాత ఇలా చెప్పారు. కానీ మనకు ఈ శైవుల నుంచి ముప్పుతప్పట్లెదు. వారు మన ధర్మానికి ఆటంకాలని ఏర్పరుస్తున్నారు అని.

అప్పుడు నాకర్థమయింది ఆయన ధర్మ౦ "హిందూ" ధర్మ౦ కాదని, అది వైష్ణవమని. అదండీ విషయం. ఆ యజ్ఞంలో ఏంతోమంది పండితులూ, పెద్దలూ ఉన్నారు. ఒక్కరు కూడా కిక్కురు మనలేదు. ఈముక్క విన్నతర్వాత నాకు కడుపులో దేవినట్లై బయటకు వచ్చేసా! అన్నట్లు నేను శైవున్న్ని, వైష్ణవుడ్ని కాను సగటు హిందువుని మాత్రమే!

ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఇదే స్వాములవారు "రాముడు దేవుడా, అసలున్నాడా" అన్న రచ్చ జరిగినప్పుడు "రాముడు మానవుడు మాత్రమే, ఇంకా చాలా చెత్త మాటలు.." అని చెప్పిన ఘనత కూడా ఉంది. ఇక ఆ ముక్కలని వాడుకునే పత్రికలు చక్కగా ప్రచురించాయి.

ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారని నా భావన. వారు ఈ ధర్మానికి మంచి చేసేది ఎలా ఉన్నా, తమ మాటలతో చెడు మాత్రం చేస్తారు అని నా భావన!

మరి పైన ఉదాహరించిన మాటల వల్ల చెడు ఎలా అంటారా? అక్కడికే వస్తున్నా!

ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా సమస్యనుంచి వస్తున్న ఇక్కట్లకి వ్యతిరేకంగా పోరాడ్డ౦లో యువతది అగ్రభాగం. పెద్దవారు వారికి అనుసరణీయులు. మరి అసలే చెదలు పట్టిన విద్యావ్యవస్తతో కొట్టుమిట్టాడుతున్న యువతకి/ లేదా దాని నుంచి బయటికి వచ్చిన యువతకి పై మాటలు విన్నప్పుడు ఏ విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది. మొదటగా "అన్ని మతాలూ సమానమే", రెండవది ధర్మ౦అంటే "నా దేవుడు" మాత్రమే! మొదటి అభిప్రాయం "పక్కమతాలనుంచి ఏమైనా ఇక్కట్టు వచ్చినప్పుడు అదికూడా మన మతమే కదా! పోనీలే" అన్న చేతకానితనం కలిగిస్తుంది. ఇక రెండవది, "నే పూజించే దేవుణ్ణి అన్నప్పుడు చూద్ద్దాంలే (అంటే ఆ దేవుడు హిందూ ధర్మంలో అంతర్భాగం కాదు!)" అన్న విచిత్రమైన పోకడని కలిగిస్తుది. నిజానికి యువతకి ఇదో పెద్ద తికమక! ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు శాంతి వచనాలు పలకాలో తెలీని అసమర్థత. ఇది ఎవరి తప్పు?

continued...

durgeswara February 16, 2011 at 6:36 AM  
This comment has been removed by the author.
durgeswara February 16, 2011 at 6:42 AM  

రాజేష్ గారూ !
చాలా చక్కని విశ్లేషణ. లోతైన వాదన .ఇక్కడ ఇతరులు చేరి వివాదం చేయకుండాలని మనవి.

మీరు వేసిన ప్రశ్నలో ధర్మం ఏమిటి అనడిగితే .అది సత్యం . అది మనం చెప్పినా మరోభాషలో చెప్పినా ఒక్కటే. ప్రపంచంలో వివిధప్రాంతాలలో ఆవిర్భవించిన మహనీయులంతా చెప్పినది ,ఆచరించినది సనాతనధర్మంలోని మూలాలనే . అక్కడ ఆప్రాంతంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అప్పుడు అవసరమైన విధానాన్ని అవలంబించారు ఆమహనీయులు. అయితే ఆతరువాత కాలంలో అవి రాజ్యాధికార సిద్దాంతాలుగా పరిణమించి మేము చెప్పేది తప్ప వేరేది ధర్మంకాదు అనే దౌర్జన్యకర సిధ్ధాంతాలుగా మారాయి . ఇక్కడే మన సనాతన ధర్మానికి మిగతా మార్గాలకు తేడా .
సృష్టిధర్మాన్ని ఆవగతం చేసుకుని సృష్టిసమస్తాన్ని గౌరవించగలిగేలా మనలను తీర్చిదిద్దిన మన సనాతనధర్మమే సృష్టికి మూలమని తన గొప్పతనం చాటుకుంటున్నది.
అదే మనంచెప్పినదిమాత్రమే నిజమని మిగతాది అస్త్యమని వాదిస్తే ఇది పరిపూర్నమెలా అవుతుంది . ఇప్పుడు అలాచెప్పిఉంటే మనయువత మనసుపెట్టి మన్ంమాత్రమే దేవుని తెలుసుకోగలిగి ఉంటె మనధర్మంమాత్రమే సత్యమైతే మరి ఇతర ప్రాంతాలలో ఆవిర్భవించిన మతాలు అసత్యమా? అంటే మనదేవుడికి మన భారతదేశం లో విషయాలుతప్ప మిగాతావి తెలియవా అని ఎగతాలి చెసే అవకాశం దొరికేది.
వాదనలు కాకుండా సత్యాన్ని పరిశీలిస్తే .కొద్దిగా వెనక్కువెళ్ళి చూడండి .భవిష్య పురాణంలో ...మామూదుడు అనే శివకింకరుడు భూమిపై సాగించే కార్యక్రమములు.... ఈశపుత్రనామ కుమారీ గర్భసంభవ అ..ఆని మరో మార్గప్రవక్తలగూర్చి వీల్లు పుట్తడానికి ముందే వారు చేయబోయే మహత్కార్యాలను చెప్పారు వ్యాసభగవానులు . ఆయన హిమాలయాలకు వచ్చి తపస్సుచేసిన సత్యం ఆథ్యాత్మికపరిశోధకులు వెళ్లడిస్తున్నారు.నేడు
కలి పురుషుని ప్రభావానికిలోనై మానవజాతి వినాశనానికి చేరువైనప్పుడు ఆకాశంనుండి శ్వేతాశ్వం పైన విష్ణువు కల్కిరూపము దాల్చి దుష్టసంహారానికి ఎలా పాల్గొంటారో నాడు భవిష్యపురాణం ,భాగవతాదులలో చెప్పిన విషయం తరువాత ఇఅతరమతాలలోని ద్రష్టలైన ఋషులు తమధ్యానంలో దర్శించి ఆయామతగ్రంథాలలో చేర్చారు .అవి చదివిచూడండి అర్ధమవుతాయి .
భూమిపైన ఏమూల ఏమి జరుగుతుందనే జ్ణ్ణానము కలిగిన జాతికనుకనే మహాత్ములను,మహనీయులను వారెక్కడ ఉద్భవించినా గౌరవించి పూజిస్తుంది మనజాతి.
అయితే ఆ మహాత్ముల అనంతరం అవి రాజ్యాధికారసిధ్ధాంతాలుగామారి ప్రపంచంలో కలినెదిరిమ్చగల ఈ సనాతధర్మాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నిస్తుంటే చూస్తూ కూర్చోమని కాదు . ఇంకా వివరంగా త్వరలో వివరిస్తాను

Anonymous February 16, 2011 at 7:14 AM  

ఇప్పుడు హి౦దూ దేవాలయము రోడ్డు విస్తరణ కోస౦ తొలగి౦చి నపుడు హి౦దువులు మౌనం వహి౦చారు ..అలాగే ము౦దు ము౦దు మిగతాలూ అర్ధ౦ చేసికొని , అభివృద్ధి ని మూడనమ్మకాలకి బలి చెయ్య కు౦డా ఉంటారు ...అని ఆసి౦చాలి

durgeswara February 16, 2011 at 8:02 AM  

పై వ్యాఖ్యలో రాజ్యసంక్రమణ సిధ్ధాంతంగా చదువుకోగలరు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP