గట్టిగా గాలివీస్తే ఎగిరి పోయేట్లుండే ఈ మనిషికి ఇంత శక్తి ఎలావచ్చిందబ్బా !??
>> Saturday, January 29, 2011
గాంధీ
ఈపేరు వినగానే పసివాని బోసినవ్వు చూసిన ఆనందం
కానీ చిన్న అనుమానం నన్ను వదలటం లేదు.
ఈయన చేసిన పోరాటం లో నాకు కొన్ని అనుమానాలు తీరటం లేదు.
ఈయన రూపం ,అలంకరణ చూస్తే ఏమాత్రం ఆకర్షణ కనిపించదు.
ఇక గొప్ప గొప్ప పోరాట యోధులకుండే శారీరిక దారుఢ్యం తోపోలిస్తే గాలివీస్తే ఎగిరిపోయేలాఉండే శరీరం .కొల్లాయిగుడ్డ.
ఇక ఆయన ప్రసంగాలు వింటే నాటి గొప్పగొప్ప వక్తల దరిదాపుల్లో కూడా నిలబెట్టలేం .
మరి ...ఇలాంటి మనిషి నాయకత్వంలో కోట్లాదిమంది జనులు ఏకమై తెల్లవాల్లతూటాలకు గుండెలను ఎదురొడ్డి ప్రాణాలు తృణప్రాయంగా వదలటానికి సిద్దపడ్డారే !!! ఎలా జరిగిందబ్బా !
ఏమిటీ మనిషిలోని ప్రత్యేకత . ఎక్కడిదీ శక్తి ఆమనీషికి .
ఎందుకంటే .......
ఏది ఆలోచిస్తాడో.అదిమాత్రమే పలికి ,ఏది పలికారో దానినే ఆచరించిన మనిషి ఆయన .
నిరంతర రామనామజపతత్పరుడాయన
ఒక సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఎన్ని అవరోధాలెదురైనా సిధ్ధాంతాలను మార్చుకోని నాయకుడాయన
అహింసా సిద్ధాంతం తో ప్రారంభమైన ఉద్యంలో చౌరీచౌరా సంఘటన తో కలతచెంది నాయకులు ప్రజలంతా ఉద్యమాన్ని ఆపవద్దని కోరినా ,హింస జరిగినందున ఇది సిధ్దాంతానికి వ్యతిరేకమని ఉద్యమాన్ని నిలిపివేసిన మహామనిషి ...కాదుకాదు మహాత్ముడాయన . అని పెద్దలు చెప్పిన మాట నిజం . నిజం . అందుకేనేమో ఈదేశం .ప్రపంచమంతా ఆయనమాటలలోశక్తితో ప్రభావితమవుతున్నది.
నమస్సులు తాతా . మళ్ళీమళ్ళీ నీ పదములకు .నువ్వుచూపిన పథమునకు .
4 వ్యాఖ్యలు:
గట్టిగా గాలివీస్తే ఎగిరి పోయేట్లుండే ఈ మనిషికి ఇంత శక్తి ఎలావచ్చిందబ్బా !??
>>>>
టైటిల్ చూసి కే సి ఆర్ అనుకుని వచ్చాను.
సీజన్ ఎఫెక్ట్.
మన్నించాలి.
>>>>>గట్టిగా గాలివీస్తే ఎగిరి పోయేట్లుండే ఈ మనిషికి ఇంత శక్తి ఎలావచ్చిందబ్బా !??
>>>>
టైటిల్ చూసి కే సి ఆర్ అనుకుని వచ్చాను.
సీజన్ ఎఫెక్ట్.
మన్నించాలి.
nenu kudaa...
నేను కూడా KCR అనే అనుకున్నాను. పోనీలెండి - ఇంకా గాంధీను గుర్తుంచుకుంటున్నారు జనాలు. అదో సంతోషం.
http://24gantalu.blogspot.com/2011/01/blog-post_31.html
Post a Comment