సాలగ్రామాలు శివశక్తులు జగన్నాథుడు కలియుగం లో పదివేలసంవత్సరాల పిదప భారత భూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు పురాణాలు శంఖాలు శ్రాధ్ధతర్పనాలు,వేదోక్త కర్మలు,దేవపూజలు దేవనామధేయాలు,గుణకీర్తనలు వేదాంగాలు,సకలశాస్త్ర్రాలుసత్యధర్మాలు,వేదాలు గ్రామదేవతలు ,వ్రతాలు తపస్సులు ఉపవాసాలు--ఇత్యాదులన్నీవారితోపాటే తరలి వెళ్ళిపోతాయి . అటుపైని భూగోళం నిండా వామాచారులు మిగులుతారు .కపటులు మిథ్యావాదులు మిగులుతారు.తులసి కలికానికైనా కనిపించదు. ఏపూజలూ ఉండవు పొట్తపూజతప్ప .అందరూ శఠులు క్రూరులూ దాంభికులూ అహంకారులూ చోరులూ హింసకులు అయిపోతారు. స్త్రీపురుషబేధం తప్ప తక్కిన వావివరుసలన్నీ నశిస్తాయి .నిర్భయంగా జరిగే వివాహాలకు ఉండవు. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చుసినా ఇంటింటా ఆడపెత్తనమే కనిపిస్తుంది .తర్జనభర్త్సనలతో భార్యలు భరతలను అదుపుచేస్తుంటారు.
ఇలాలే ఇంటికి అధిపతి . మొగుడు సేవకునికన్నా అథముడు . అత్తమామలు దాసదాసీజనం తో సమానం.ఇళ్లల్లో రక్తసంబంధాలే తప్ప విద్యాసంబమ్ధులు ఎవ్వరూ కనపడరు. విద్యాసంబంధులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితుల్లా మెలుగుతుంటారు. ఆడవాళ్ల ఆజ్ఞలేనిదే ఎవ్వరూ ఏపనీ చెయ్యలేని దుర్భలులై పోతారు.
కలియుగాన వర్ణాశ్రమ ధర్మాలన్నీ నశిస్తాయి .సంధ్యావందన యజ్ఞసూత్రాది కర్మలు కనిపిమ్చవు . చాతుర్వర్ణాలవారూ మ్లేఛ్ఛాచారులైపోతారు. మ్లేచ్చ విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్చ శాస్త్రాలే వల్లిస్తారు.ప్రజలు సత్యహీనులవుతారు. మేదినీమండలం లో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలవుతాయి తరుణులు సంతానహీనులవుతారు.గోవులు క్షీరహీనమవుతాయి వచ్చిన క్షీరం లో వెన్నవుండదు .దంపతులు ప్రీతిహీనులవుతారు . గృహస్థులు సత్యహీనులవుతారు .రాజులు ప్రతాపహీనులవుతారు ప్రజలు కరపీడితులు[పన్నులబెడద]అవుతారు .నదీనద వాపీకూపతటాకాదులు జలహీనమైపోతాయి .చతుర్వర్ణాలవారూ ధర్మహీనులు పుణ్యహీనులు అవుతారు .కోటికొక్కడైనా పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత వికృతాకారులవుతారు. అంతటా కుత్సితవార్తలే వినిపిస్తాయి .
కొన్ని నగరాలు గ్రామాలు నరశూన్యాలైపోతాయి .భయానకంగా మారిపోతాయి .కొన్నిచోట్ల ఒకకుటీరాన ఒకమనిషే మిగులుతాడు. నగరాలలో గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూదా కరపీడితులు అవుతారు. తతాక నదీ తీరాలలో మాత్రమే పంతలు పండుతాయి. ఉన్నతవంశాలవారు నీచపడతారు. అసత్యవాదులు ధూర్తులు అవుతారు .సారవంతమైనభూములు నిస్సారమై పంతలు పండవు.నీచులు ధనవంతులవుతారు . దైవభక్తులు నాస్తికులవుతారు. సాలప్రాంశులు కనిపిమ్చరు.స్త్రీపురుషులంతా వామనులు వ్యాధిపీడితులూ గానే ఉంతారు.అల్పాయుష్కులు గదా[అదొకరోగం]పీడితులవుతారు. యౌవన్నమే కనిపించదు .ఇరవిఅఏళ్లకే వృధ్ధులవుతారు. ఎనిమిదేళ్ళకే రజస్వలలై గర్భిణులవుతారు .సంవత్సరానికి ప్రసవించి పదహారేళ్లకే ముసలమ్మల్లా తయారవుతారు. బహుపుత్రవతులు అరుదు ,ఎక్కువమంది గొడ్రాళ్లుగానే మిగులుతారు. చతుర్వర్నాలవారూ నిస్సంకోచంగా కన్యావిక్రయం చేస్తారు .కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి వారందించిన సొమ్ముతో పొట్టపోసుకునే స్థితి కనిపిస్తుంది . కలియుగం లో ఇంకా దారుణమేమంటే ......శ్రీహరి నామం కూడా ఒక వ్యాపార వస్తువవుతుంది. [హరేర్నామ్నాం విక్రయణో భవిష్యంతి కలౌయుగే]
ధనవంతులు కీర్తికోసమని ప్రచారం కోసమనై దానం చేస్తారు . మరలా తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుని దాననియమాలను ఉల్లంఘిస్తారు. దేవవృత్తి,బ్రహ్మవృత్తిగురువృత్తి[కులవృత్తి] అన్ని భూములనూ ఆక్రమించుకోవడమే . స్వదత్తమా పరదత్తమా అనే విచక్షణ ఉండదు. ఆక్రమిమ్చుకోవడమె ,
అత్తగారు వదినగారు ,మరదలు ,రక్తసంబంధీకురాలు ఇలాంటి వావివరుసలు అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితో అక్రమసంబంధాలు పెచ్చురిల్లుతాయి. ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయిమ్చడం కష్టతరమవుతుంది..
నారదా ! కలియుగంలో లాక్షాలోహరసాలతోనేకాదు ఉప్పుతోకూడా వ్యాపారం చేస్తారు. విపృలు వృషవాహకులు అన్యశవదాహకులు అవుతారు. చెయ్యకూడని చోట భోజనాలు చేయటం పరస్త్రీలతో సంగమించటం వంటిదోషాలకు వెనుకాదరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతాలుండవు. సంధ్యాసౌచాలు వదిలేస్తారు.
సారాంశంగా ఒక్కమాట చెబుతాను . కలియుగం లో ఆహారనియమంగానీ విహారనియమంగానీ ఆశ్రమనియమంగానీ ఉందవు . సమస్తమూ మ్లేచ్ఛమయమయిపోతుంది .హస్తప్రమాన వృక్షాలూ అంగుష్ఠప్రమాన మానవులూ తయారవుతారు ......................................................[దేవీభాగవతం నుండి]
4 వ్యాఖ్యలు:
ఆడ వాళ్ళను అ౦త అధములుగా ఎ౦దుకు చిత్రీకరి౦చారు?
ఈ ఛాయలు కనిపించటం మొదలెట్టాయి అనిపిస్తుంది.
అజ్ఞాత గారూ పొరబడుతున్నారు
దెవీ భాగవతమ్ చదవండి అమ్దులో అథములుగా చిత్రించారీ మహోన్నతంగా చిత్రిమ్చారో తెలుస్తుంది
మానవులు తమంత తాము ఎలాదిగజారి శక్తిహీనులవబోతున్నారో కలి ప్రభావమేమిటో ఆనాడే చెప్పిన మహర్షుల హెచ్చరికలు గమనించండి కేవలం వాదనకోసమేనయితే వేరేచోట ప్రయత్నించండి
అమ్మా మందాకిని గారూ మీరన్నది నిజం మొదట్లోనే ఇలాఉంది . ఇక కలిపురుషుని విజృంభన తీవ్రమయినకొద్దీ ఎలాఉంటుందో పైనచెప్పిన స్థితిగూర్చి నమ్మవలసినదే కదా !
అజ్ఞాత గారూ పొరబడుతున్నారు
దేవీ భాగవతమ్ చదవండి అందులో స్త్రీలను అథములుగా చిత్రించారో మహోన్నతంగా చిత్రించారో అర్ధమవుతుంది
మానవులు తమంత తాము ఎలాదిగజారి శక్తిహీనులవబోతున్నారో కలి ప్రభావమేమిటో ఆనాడే చెప్పిన మహర్షుల హెచ్చరికలు గమనించండి కేవలం వాదనకోసమేనయితే వేరేచోట ప్రయత్నించండి
అమ్మా మందాకిని గారూ మీరన్నది నిజం ఇప్పుడే ఇలాఉంది . ఇక కలిపురుషుని విజృంభన తీవ్రమయినకొద్దీ ఎలాఉంటుందో పైనచెప్పిన స్థితిగూర్చి నమ్మవలసినదే కదా !
November 25, 2010 6:18 AM
Post a Comment