మీయింట సంకటములు తొలగి శుభాలు ప్రవహించడానికై ఈ మాస శివరాత్రి నాడు మహాదేవుణ్ణి ఆహ్వానించండిలా .....
>> Friday, November 26, 2010
శివుడు శుభకరుడు . ఆయన ఎక్కడ ఉంటే అక్కడ దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి . ఆయన బోళాశంకరుడు. మనసారాస్మరిస్తే ఏపరీక్షలూ చెయ్యకుండానే భక్తులకు వరాలుకురిపించే స్వామి . కనుకనే "ఇంద్రుడాదిగా సకలదేవతలకును ఇష్టదైవమగు మూర్తివయా " అని భక్తులు కీర్తిస్తుంటారు . ఈకార్తీకమాసంలో శివారాధన తో భక్తులు తరిస్తుంటారు. నటరాజస్వామి ఆనందతాండవం చేసే సంధ్యావేళలో ఆయన అర్చన , అదీ జ్యోతిర్మయుడైన ఆయనను జ్యోతిర్లింగ రూపంలో అర్చించటం మహాపుణ్యప్రదం . ఏఇంట అలా స్వామిని అర్చిస్తే ఆ ఇంటిలో ,ఆయాస్థలాలో గలదోషాలు తొలగిపోయి అక్కడ నివాసం చేసే వారికి అపూర్వమైన శాంతి లభిస్తుంది . శుభాలు ప్రవాహంలా వచ్చిచేరుతాయి.
నరఘోష ,నరదృష్టి ,గ్రహబాధలు తొలగిపోతాయి .
ప్రతినెలలో బహుళ చతుర్ధశి శివరాత్రిగా వ్యవహరింపబడుతుంది . ఈకార్తీక బహుళ చతుర్ధశి డిసెంబర్ నాలుగు శనివారం వస్తున్నది. ఆరోజు తమయింటిలో గాని వ్యాపార సంస్థలోగాని , తమ కుటుంబ సభ్యులతోకలసి వీలుపడనప్పుడు స్వంతగానైనా ఈ జ్యోతిర్లింగార్చన చేసుకొనవచ్చు కొద్దిసమయము , కొద్ది ధనము,కాస్తఎక్కువశ్రధ్ధ వెచ్చించి ఈ పూజను జరుపుకోవచ్చు.
విధానము : ఈపూజను సాంయం సంధ్యాసమయం లో చేయాలి . ఆలోపులోనే పూజచేయవలసిన ప్రదేశం శుభ్రపరచుకుని శివలింగాకారం లో చాక్ పీస్ లేదా దేనితోనైనా చిత్రాన్ని చిత్రించాలి . దానిపై తమలపాకులు ఉంచి నూట ఎనిమిదిగాని చిన్న శివలింగమైతే ఏభైనాలుగు గాని శుభ్రమైన ప్రమిదలను ఉంచి నువ్వులనూనే లేదా ఆవునెయ్యి తో నింపి వత్తులను వేశి ఉంచాలి . ఆశివలింగాన్ని పూలతో అలంకరించుకోవాలి . స్నానాదులు పూర్తిచేసుకుని ఆశివలింగాకారం ముందు కూర్చుని దీపారాధన చేసి , ఆచమనం చేసి మీకు తెలిస్తే పూజావిధానంలోను తెలియకుంటే నిష్కల్మషమైన భక్తితో ఆయనను మీపూజకు రమ్మని మనసులో ప్రార్ధించండి. ముందుగా గణపతిని ధ్యానిమ్చండి. ఆతరువాత ఒక చెమ్చాలో చిన్నవత్తివెలిగించుకుని ఆవత్తి సహాయంలో శివలింగా కారంలో ఉన్న ప్రమిదలలో జ్యోతులన్నింటినీ వెలిగించండి. ఇప్పుడు ఆయన వచ్చినందుకు సంకేతంగా మీమనస్సులకు స్పష్టమైన సంకేతం అందుతుంది . మనస్సు ఆనందంతో నిండుతూ ఉంటుంది . ఆసమయంలో కరెంట్ బల్బులవంటివాటిని ఆపి ఉంచండి . ఆతరువాత వచ్చిన స్వామికి వినయంగా నమస్కరించి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి పూజచేయండి . ఇందుకోసం రకరకాల పుష్పాలను ఉపయోగించవచ్చు , మీ ఓపిక .ధూపం చూపి ఆతరువాత ఒక కొబ్బరికాయ కొట్టి ఫలాలు ఉంటే సమర్పించి హారతినివ్వండి . రెండు అక్షితలు అక్కడ పెట్టి నమస్కరించండి ఆతరువాత నిశ్శబ్దంగాగాని లేదా మంద్రస్వరంతోగాని నూట ఎనిమిది సార్లు ఓం నమ:శివాయ అనే పంచాక్షరిని జపించండి . ధ్యాన చేయదలచుకున్నవారు, ఏవైనా స్తుతులు చేయదలచుకున్నవారు మీ ఇష్టం గాచెసుకొనవచ్చును. ఆతరువాత మీకుశక్తి ఉంటే ఒక బ్రాహ్మణునకు దక్షిణ తాంబూల మివ్వండి లేకుంటే ఒఅక అయిదుగురు ముత్తయిదువులకు గాని అందుబాటులో లేకుంటే ఎవరైనా భక్తులకు మీరు పిలవకుండానే ఆసమయం లో మీ ఇంటికొచ్చిన వారెవరైనా వారికి గాని పండ్లు తాంబూలం ఇవ్వండి .
జాగ్రత్త లు : శివమాలిన్యం తొక్కరాదు . కనుక పూజ ముగిసి అన్ని జ్యోతులు కొండెక్కిన తరువాత అక్కడ పూజకుపయోగించిన పసుపుకుంకుమ పూలు లాంటివి జాగ్రత్తగా ఎత్తి ఆప్రాంతం మొత్తం నీటితో శుధ్ధిచేయండి లేకుంటే శివలింగాకార చిత్రాన్ని ఎవరయినా చూడక తొక్కుతారు. ఆపూజామాలిన్యాన్ని ఎవరూ తొక్కనిచోట పోయాలి లేదా పూలకుండీలో మట్టిలో పోసి పూడ్చవచ్చు .
ఈపూజ మీరు అయిదున్నరనుంచి ప్రారంభించాలి సంధ్యవేళలో జరగాలి . ఇలా చేసిన ఇంటనున దోషాలు తొలగి అక్కడ నెలకొన్న చికాకులు దూరమవుతాయి. బాగా ఎదుగుతున్నారు అనే నరదృష్టి నివారించబడుతుంది. బాధలలో వ్యాధిపీడలతో ఉన్నవారికి బాధలు దూరమవుతాయి . ఆపరమశివుని కరుణకలగాలేగాని మనసమస్యలు ప్రచండ వాయువుధాటికి చెదిరిన దూదిమేఘాల్లాగా చెల్లాచెదరవుతాయి ..
ఈ పూజ జరిపిన వారు వారి అనుభవాలను చెబుతున్నప్పుడు స్వామి లీలను తలచుకుని మనసు పులకించింది. మీ అమ్దరికీ సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాము.
ఈకార్యక్రమం మీరు చెస్తూ మీబంధువులకు కూడా తెలపండి . వారు జరుపుకుంటారు . మనం పొందే మేలు పదిమందికి కలగాలను కోరుకోవటం కూడా పూజయే కదా !
ఇక ఈకార్య క్రమానికి అనుసంధానం గా ఇక్కడ పీఠంలో అదేసమయం లో జరిగే మహాజ్యోతిర్లింగార్చన లో మీగోత్రనామాలతో పూజజరుగుతుంది దీనికోసం మీరు గోత్రనామాలు కుటుంబసభ్యులపేర్లు పంపితేచాలు ఇంకేమీ అక్కరలేదు . ఒక్క చిన్న సహాయం చేయండి చాలు . ఈ మాసశివరాత్రికి నూటాఎనిమిది చోట్ల ఈ జ్యోతిర్లింగార్చన జరపాలని సంకల్పం కలిగింది కావున ఎక్కువమందికి ఈపూజ జరుపుకునే విధానం తెలియజేయండి . ఆజ్యోతిర్లింగ ఫోటోలను వీలైతే నా మెయిల్ కుపంపండి . స్థలము నిర్వహించిన భక్తులపేరు చెబితే చాలు భక్తులఫోటోలు అవసరం లేదు ,కేవలం ఆజ్యోతిర్లింగమూర్తి ఫోటొ మెయిల్ ద్వారా పంపండి .అదే మాకు ప్రసాదం .
ఈ కార్యక్రమం జరిపుకోవటానికి ఏదైనా అనుమానాలుంటే నన్ను గాని లేదా హైదరాబాద్ లో ఉంటున్నా మితృలు పురోహితులు విజయశర్మగారిని గాని అడిగి నివారించుకోండి .
సూచన | _ కొన్నిచోట్ల అమాయకంగా శనగనూనెతో దీపారాధన చేస్తున్నవారు ఉన్నారని తెలుస్తున్నది. అది దరిద్రాలు తెస్తుంది ఎట్టిపరిస్థితులలో ఆనూనె పూజకు వాడవద్దు . అలాగే తవుడు నూనెలనుకూడా నువ్వులనూనె అని చెప్పి అమ్ముతున్నారు , మీరు జాగ్రత్తవహించి గట్టిగా అడిగి నువ్వుల నూనె అయితేనే ఇవ్వమనండి ఐస్తారు ఆవునెయ్యికూడా కల్తీలది వాడకండి . కొద్దిగా శ్రధ్ధ తీసుకుంటే స్వచ్చమైనవే దొరుకుతాయి .
మీకందరకూ సకలశుభాలు కలగాలని ఆపరమేశ్వరుని వేడుకుంటున్నాము
పూజ చెయదలచుకున్నవారి గోత్రనామాలు ఎప్పటికప్పుడు పంపండి [.అదేశించిన కర్తవ్యం మేము లక్ష్యం ప్రకారం చేయగలుగుతున్నామా అని సరిచూసుకునేందుకు]
నా మెయిల్ , ఫోన్
durgeswara@gmail.com 9948235641
విజయశేఖరశర్మగారి నంబర్
9000532563
2 వ్యాఖ్యలు:
ప్రయత్నిస్తాను, పైన ఆ పరమేశ్వరుడి దయ...
హర హర మహాదేవ శంభో శంకర!
శ్రీ దుర్గేశ్వర గారు,
మీరు ఇచ్చిన జ్యోతిర్లిన్గార్చన విధానం చాల బాగుంది. ఇంత మంచి విషయాలు పోస్ట్ చేస్తున్న మీకు మా హృదయ పూర్వక నమస్కారములు. మేము తప్పకుండ ఈ రాబోయే శని వారం నాడు ఈ పూజ చేసుకుంటాము. మీ బ్లాగ్ స్పాట్ లోని వేరే అంశాలు కూడా చదివాము. గాయత్రీ మాత గురించి మీరు వ్రాసిన ఆర్టికల్ చాల బాగుంది.
మీకు మరిఒక సారి ధన్యవాదములు.
మోహన్
Post a Comment