స్వామి ! ఇష్టపడి మరీ చేపించిన హనుమాన్ చాలీసా పారాయణం[శనివారం]
>> Saturday, November 27, 2010
శనివారం రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిపి అన్నదానం చేపించాడు స్వామి పరమ కరుణతో . అమెరికానుంచి మా పిల్లవాడు సునీల్ ఫోన్ చేసి సార్ ! ఈకార్తీక మాసం లో ఒకరోజు అన్నదానం చేయాలనుకున్నాను అని అడిగాడు . అంతకుమునుపు చేయాలని సంకల్పం ఉన్నా , ఇంట్లో మీటీచర్ గారికి ఆరోగ్యం సరిగాలేదయ్యా ,మరొకసారి చేద్దామని చెప్పి వాయిదావేసుకున్నాము . కానీ గురువారం రోజు హనుమద్దీక్షలో ఉన్న పిల్లలు వచ్చి సార్ ! నూటఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం మేము ఎలాగూస్వాములకు అన్నదానం చేయాలనుకున్నాము వంట ఏర్పాట్లు మేము చూసుకుంటాము అని ముందుకొచ్చి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కసారి మాట అంటే చాలు మనం మరచిపోదామనుకున్నా వెంటపడి మరీ ఆపని నిర్వహించేదాకా నిదురపోనీయని మా "బాస్"హనుమంతుల వారి గురించి తెలిసినదేకనుక సరే కానీ స్వామీ అనుకుని మొదలుపెట్టాము అప్పటికప్పుడు సరుకులు తెప్పించి . శనివారం ఉదయం తెల్లవారి ఆరుగంటలకు మొదలుపెట్టిన పారాయణం సంకీర్తనా పద్దతిలో ఒంటిగంటవరకు సాగింది . చిరంజీవులు హుస్సేన్ ,శ్రీహరి రెడ్డి,అంజయ్యనాయక్ ,సాంబానాయక్ ఇంకా వాల్ల మితృలు ఒకపక్క పారాయణం చేస్తూ మరొక పక్క వంట పర్యవేక్షణ చేస్తూ ఎంతో భక్తిగా స్వామికి సేవలుచేశారు . మధ్యలో అయ్యప్పదీక్షాధారులు అందరూ వచ్చి కలసి కార్యక్రమాన్ని కన్నులపండుగగా జరిపారు . స్వామి ఆదేశముంటే మన ఇష్టా ఇష్టాలతో పనిలేదు ..ఆయనే నడుపుతాడు అని నానమ్మకం మరొకసారి అనుభపూర్వకంగా తెలిసివచ్చింది .
1 వ్యాఖ్యలు:
స్వాములూ మీ గొంతునుంచి జాలువారే శ్రీ హనుమాన్ చాలీసా చాలా ఆహ్లాదకరంగా,ఆనందకరంగా,అద్భుతంగా ఉంటుంది.నేను విన్నాను కదా! ఇక్కడ systemలో ఎమ్మెస్‍అమ్మగారి హనుమాన్ చాలీసా వింటూండగా మీ టపా చదవడం ఒక అందమైన అనుభవం.
రామ లక్ష్మణ జానకీ! జై బోలో హనుమాన్‍కీ!
Post a Comment