.ద్వాదశసూత్రాలు [సద్గురువాణి]
>> Friday, November 19, 2010
కర్తవ్య పాలనలో ఉన్న ఆనందం మరిదేనిలోనూ ఉండదు.
మనల్ని మనం సంస్కరించుకోవటమే అన్నింటికంటే ఉత్తమమైన సేవ .
మనిషికి అసలు ఆస్తి డబ్బుకాదు - మంచి ఆలోచనలు.
పరాజయం ఎరుగని ఆయుధం ప్రేమ
ఆథ్యాత్మికతకు చిహ్నాలు ఆలోచనలో నిర్మలత,మాతలో స్పష్టత,చేతలో సహృదయత.
ప్రేమ సహకారం పొంగిపొరలేకుటుంబం ఈ భూలోకంలో స్వర్గమే .
సోమరితనం కన్నా దారుణమైన అతి సన్నిహితమైన శతృవు మరొకటిలేదు.
నీటివల్ల శరీరం సత్యం వల్లమనస్సు,జ్ఞానం వల్ల బుద్ధి ,సాధనవల్ల ఆత్మ బలం పొందుతాయి .
జీవితానికి మూలస్తంభాలు నాలుగు .సాధన,స్వాధ్యాయము,మితవ్యయము,సేవ
దీర్ఘాయుశ్షుకు రహస్యం ఒక్కటే . బాగా ఆకలి అయ్యేవరకు ఏమీ తినకుండా ఉండటం.
సంతోషంగా ఉండటానికి రెండే రెండు ఉపాయాలు -అవసరాలను తగ్గించుకోవటం ,పరిస్థితులతో సమన్వయం కుదుర్చుకోవటం .
ధర్మం మనిషిని దారి తప్పకుండా చూస్తుంది .
------------- పరమ పూజ్య పండిత శ్రీరామశర్మ ఆచార్య
0 వ్యాఖ్యలు:
Post a Comment