శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గాయత్రీ మహిమ

>> Thursday, November 18, 2010

ఏప్రకారం పుష్పముల సారం మధువో .క్షీరం లో సారం ఘృతమో అదే ప్రకారం సమస్తవేదముల సారం గాయత్రి. సిధ్ధించిన గాయత్రి కామధేనువుతో సమానం గంగ శరీరపు మురికిని నిర్మూలించినట్లే గాయత్రి అనే బ్రహ్మ గంగచే ఆత్మ పవిత్రంచేయబడుతుంది . ఎవరు గాయత్రిని వదిలి ఇతర ఉపాసనలు చేస్తారో ,వారు సిధ్ధాన్నమును వదిలి భిక్షాటనకు వెళ్ళిన మూర్ఖునితో సమానులు . కోరికలు నెరవేర్చుకొనుటకు తపో వృధ్ధికి గాయత్రి కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు


[ వేదవ్యాసమహర్షి]

గాయత్రి భక్తియొక్క స్వరూపము . ఎక్కడ గాయత్రి ఉంటుందో అక్కడ నారాయణుడు నివాసముండటం లో ఎలాంటి సందేహము లేదు. [నారద మహర్షి ]

వేదములు ,యజ్ఞం ,దానం తపం గాయత్రీ మంత్రము యొక్క ఒక్క కళకు కూడా సమము కావు .
[విశ్వామిత్ర మహర్షి]

ఏద్విజుడు ఉభయసంధ్యలలో గాయత్రి జపిస్తాడో అతడు వేదాధ్యయన ఫలం పొందుతాడు . [మనువు]

గాయత్రి తెలుసుకున్నవాడికి నిస్సందేహంగా స్వర్గం ప్రాప్తిస్తుంది [ శంఖ ఋషి]

మందమతులు ,కుమతులు,అస్థిరమతులు కూడా గాయత్రీ ప్రభావంతో ఉన్నతపదవులు పొందుతారు .తర్వాత సద్గతి పొందటం నిశ్చయం [ వశిష్ఠ మహర్షి ]


గాయత్రి ప్రతాపముచే కఠిన దోషములు ,దుర్గునములు క్షాళన చేయబడతాయి [ అత్రి మహర్షి ]

బ్రహ్మ పూర్వక గాయత్రి జపం వలన , తాజాఉసిరిపండ్లు సేవించటం వలన మనుషులు దీర్ఘజీవనులవుతారు [చరక మహర్షి ]

గాయత్రీ మంత్ర నిరంతర జపం వలన రోగులు స్వస్థతపొందుట ,ఆత్మోన్నతి పొందుటకు ఉపయోగకరం , స్థిరచిత్తముతో శాంత హృదయముతో చేసిన జపం ఆపద కాలంలో సంకటములను తొలగిస్తుంది . [ మహాత్మాగాంధి]

ఋషులు మనకిచ్చిన రత్నములలో అనుపమ రత్నం గాయత్రి . దానివల్ల బుద్ధి పవిత్రమవుతుంది [మదనమోహన్ మాలవ్యా]

భరతవర్షమును మేల్కొల్పిన మంత్రం చాలా సరళం . ఒక్కశ్వాసతో దానిని ఉచ్చరించవచ్చు . అది గాయత్రీ మంత్రము .ఈ పవిత్రమంత్రము అభ్యసించుటలో తార్కితకు,ఊహాపోహలకు ,మతబేధాలకు ఏవిధమైన అవకాశము లేదు .[రవీంద్రనాథ ఠాగూర్ ]

మనం సార్వభౌమిక గాయత్రీ ప్రార్ధన పై ఆలోచించటం వలన ఈమంత్రం ఎంతమహత్తరమైనదో తెలుస్తుంది . రాముని పొందుట సర్వోతృష్ఠమైన కార్యం .గాయత్రి ఉద్దేశ్యం కామరుచిని విడనాడి రామరుచి యందు లగ్నమగుట . ఎవరి బుధ్ధి పవిత్రమో వారే రాముని పొందగలరు .బుధ్ధి ఎంతపవిత్రంగా ఉండాలని గాయత్రి నిర్దేశిస్తుందో - అతడు రాముని కామునికంటే శ్రేష్ఠుడని గ్రహిస్తాడు ..గాయత్రి మంత్రమెలాంటిదంటే దానివలన ఆథ్యాత్మిక భౌతిక లాభాలు రెండూ ఒనగూడుతాయి [ స్వామి రామతీర్థ ]

నేను ప్రజలకు చెప్పేదేమనగా - దీర్ఘసాధనలవసరం లేదు .చిన్నదైన గాయత్రి సాధనచేసి చూడండి .గాయత్రి జపంవల్ల సిధ్ధులు చేకూరతాయి .,మంత్రం చిన్నదేకాని దీని శక్తి అమోఘం [రామకృష్ణపరమహంస ]


పరమాత్మ నుండి కోరదగినది సద్బుధ్ధియే . పరమాత్మ ఎవరియందు ప్రసన్నుడవుతాడో వానికి సద్బుధ్ధి ని ప్రసాదిస్తాడు. గాయత్రి సద్బుధ్ధి మంత్రం .అందువలన గాయత్రి మంత్రం అన్ని మంత్రములకు శిరోమణిగా పేర్కొనబడింది .

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP