ఒకకేజీ బ్రతికిన కప్పలను తక్కెట్లో ఉంచి తూచవచ్చు కానీ పదిమంది హిందువులను ఒక్కటిగా కలపలేము ... మీ అభిప్రాయమేమిటి ?
>> Wednesday, November 3, 2010
ఒకమహాను భావుడు జాతి నిర్వీర్యం కావటానికి ప్రధానకారణం ఐకమత్యం లోపించటమేనని గ్రహించి హిందువులను ఒకతాటిమీదకు తేవాలని సంకల్పించారు ఒకప్పుడు . అయితే బ్రతికిన కప్పలను తక్కెట్లో ఉంచి తూయవచ్చుగానీ పదిమంది హిందువులను ఒకేభావనతో కలపటం అసాధ్యం అతని మితృలు నిరాశపరచారట . అయితే వజ్రసంకల్పం గల ఆయన ప్రయత్నం వృధాపోలేదనుకోండి .
కానీ మానసికంగా జాతి ఆస్థాయినుంచి బయటపడలేదని,బయటపడటానికి ప్రయత్నించటంకూడా లేదని నిరూపించబడుతూనే ఉంది . ఒకప్పుడు బానిసత్వం ఇప్పుడు బానిసభావజాలం మనలను అలానే అణగదొక్కుతున్నాయి . కారణమేమిటంటారు ? భావజాల వైశాల్యమా ? భావదారిద్ర్యమా ? కాక ఇంకేదన్నా కారణమా ? మీ అభిప్రాయం ఏమిటంటారు ? పనిలో పనిగా మీమనసులో ఉన్న పరిష్కారక్రియలు కూడా వెళ్లడించండి .
41 వ్యాఖ్యలు:
ఒకప్పుడు బానిసత్వం ఇప్పుడు బానిసభావజాలం మనలను అలానే అణగదొక్కుతున్నాయి. కారణమేమిటంటారు ? భావజాల వైశాల్యమా ? భావదారిద్ర్యమా ? కాక ఇంకేదన్నా కారణమా ?
Gandhiji (and others like Tilak, Bose, Bengali people, Maharastrians and Punjabis, etc) brought us together temporarily as a Nation for the first time in 1200 years. With their sacrifices, we have our Independence.
Caste, Language and Region divide our people into warring factions. In this war no one benefited. The people most benefited out this war between Castes are ఒక అరబ్ వాడు, ఒక తెల్ల వాడు, ఒక తెల్లది (ఇటలి) మాత్రమే.
మహాత్మా గాంధి సాదించిన స్వాతంత్రం తొ మనము సగౌర్వంగా తల ఎత్తుకొని జీవించవలసింది పొయి, కుల(language and regional) కుమ్ములాటలతొ ఒక ఇటలి వనిత కాళ్ళు పట్టుకొవలసి వచ్చింది. Some of the best minds (most capable people) in the country (read Congress Politicians) are prostrating in front of that women. Instead of working for the betterment of our country, culture and society they are hell bent on destroying it.
History teaches us that a కన్వర్ట్ డ్ హిందు ( మతము మారిని మరియు కమ్యునిస్ట్ అయిన) was most dangerous to our Indic traditions. It was proved time and time again.
There was no simple answer to your questions. Some possible reasons may be as follows.
1) Only rely on natural growth. No secondary growth (మత మార్పుడులు)
2) రక్షణ లేక పొవడం. Including India, our people are not feeling secure
3) No Central leadership
4) No Central Organization
5) Loss of control over revenue producing Temples
6) loss of contact with Hindu masses
7) No reformation as per changing times
8) Insular (Antipathy of) attitude of Successful Hindus
9) Support system గా వున్న Kings (Kingdoms) పొయిన తరువాత, వారి place లొ ఎవరు రాక పొవడం. Hindu politicians (all political parties) are not supportive, in fact they are against us.
10) Fail to adopt new trends in the field
11) No unified intellectual leadership
12) Net loss of numbers over time due to a) natural loss of followers due to various reasons b) ఇతర మతాలలొకి మారడం c) రాజుల (government) support లేక పొవడం d) Secularism practiced by successful Hindus (Politicians, Industrialists, Famous Hindus etc)
I will stop here for the time being. Lets continue the discussion.
నమస్కారములు
దుర్గేశ్వర్ గారు ." పదిమంది హిందువులను ఒక త్రాటిపై తేవడం అసాధ్యం అన్నారు " ఒక్క హిదువులనే ఎముంది ? అసలు ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు కలుస్తాయా ? ఇది ఈనాటి సమస్య కాదు. 600 సంవత్స రాల క్రిందటె మన వేమన గారు చెప్పారు." తివిరి ఇసుమున దైలంబు దీయ వచ్చు " " ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి " అని ఇలాంటి సూక్తులు అనుభవం మీద చెప్పినవే అంటే వందల ఎళ్ళు గా వస్తున్న వ్యవస్త అమాంతంగా ఎలా మారుతుంది చెప్పండి ? మనిషిని మనిషి ఎన్నటికీ మార్చ లేడు. ఇక దురాచార ఖండన " పొడుగు గల్గు నట్టి పులితోలు భూతియు,....కక్ష పాలలు పది లక్షలైన ....మోత చేటె గాని మోక్షంబు లేదయ ...విశ్వ దాభి రామ వినుర వేమ "! అన్నారు
అయితే బ్రతికిన కప్పలను తక్కెట్లో ఉంచి తూయవచ్చుగానీ పదిమంది హిందువులను ఒకేభావనతో కలపటం అసాధ్యం
__________________________________
Agree 100%
అమ్మా రాజేశ్వరి గారూ
మీరు చర్చను వదిలి పెట్టి దూరంగా వెళ్ళారనిపిస్తున్నది .
@ఒకమహాను భావుడు జాతి నిర్వీర్యం..
నాకు తెలిసి ముగ్గురు మహానుభావులు ప్రయత్నించారు జాతి నిర్వీర్యం కాకుండా కాపాడడానికి
1.శ్రీ ఆదిశంకరాచార్యుల గారు
2.శ్రీ వివేకానందుల వారు
3. శ్రీ గురూజీ(శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్) గారు (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) సంచాలకులు)
http://en.wikipedia.org/wiki/Madhav_Sadashiv_Golwalkar
మొదటి ఇద్దరి గురించి అందరికి తెలుసు కాబట్టి శ్రీ గురూజీ గారు ఎలా ప్రయత్నించారో చెప్తా..
శ్రీ గురూజి గారు హైందవ ధర్మం లో ఐకమత్యం లేక పోవటానికి కారణం రకరకాలుగా విభజింపబడి ఉండట౦, అందులోనూ ముఖ్యంగా కులం. ఆ కులరొచ్చుని రూపుమాపడానికి ఆయన ఆసేతుహిమాచలం - కాశ్మీరు నుంచు కన్యాకుమారి దాకా- తిరిగి పండిత పామరుల్ని ఏకతాటిపై తీసుకువచ్చి 1950 లలో హిందూ మహాసభ నిర్వహించి కంచి,శృంగేరి,కుర్తాళం .. మొదలగు పీఠాధీపతులందరి చేత ముక్తకంఠముతో " హిందువులలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేరు..అందరూ సమానులే..వేదాలలో కులప్రసక్తి లేదు" అని చెప్పించారు.
అయన ఉద్దేశ్యం ఇలా పెద్దవారు చెబితే ప్రజలలో ఉన్న అపోహాలు లేదా కులజాడ్యం పోయి అందరు కలిసి ఉంటారని. కాని అది పెద్దగా ఫలించలేదు.ఎందుకంటే నా ఉద్దేశ్యం ప్రకారం చేసే వృత్తిని బట్టి ఏర్పడిన కులాలు రాన్రాను పెత్తందారి వ్యవస్టకి ప్రాణం పోశాయి.. ఆ తర్వాత ఆ జాడ్యం ఎక్కువ అయ్యి చంపుకునే స్తితి కి వచ్చాయి కూడా..
శ్రీ గురూజి చెప్పించారు కానీ అప్పటికే ఆ జాడ్యం లో కూరుకు పోయి అందల మెక్కిన వారికి అది రుచించలేదు, ఇప్పటికి కూడా. నిజానికి నేటి కులవ్యవస్తకి హైందవ ధర్మానికి సంభందం లేదు. మనిషి తన స్వార్థం కోసం అన్నిటినీ ఎలా వాడుకుంటాడో హైందవ ధర్మాన్నీ లేదా/మతాన్ని బూచిగా చూపించి పెత్తనం సాగించాడు. అది నేటికీ సాగుతుంది ఇంకా ఎక్కువ పాళ్ళలో పలు రకాలుగా.
మీరు అన్న కప్పలకి వాటి కులమేదో తెలియదు కాబట్టి పాపం తక్కెడలో ఒద్దికగా కూర్చున్నాయి.. కాని తెలిస్తే??
పైన చెప్పిందంతా మీరు పదిమంది హిందువుల్ని ఎందుకు కలపలేము అనే దానికి ఒక ముఖ్యకారణం.. అందరికి తెలిసినది.. చెప్పా. అదీకాక మన ధర్మ౦ ఎవరో ఒకరు కూర్చుని చెబితే మొదలయినది కాదు. యుగయుగాలుగా ఏంతో మంది మహనీయులు తమ అనుభవాలని తరువాతి తరం వారికి వారసత్వముగా ఇచ్చివెళ్లారు. అందుకే ఇన్ని శాఖలు..
ఇన్ని మార్గాలు.. ముక్తిని పొందడానికి.. దీనివల్ల కూడా మనమంతా ఒక గట్టు మీదకి రాలేకపోతున్నామని నా భావన..
మీరన్న భావదారిద్ర్యము అక్షరాలా మనకు మొగలయీల నుంచే మొదలయింది.. అది ఇంకా వదల్లేదు...
ఇహ భావజాలవైశాల్య౦ - ఈ వైశాల్యం మనకి చాలా ఎక్కువే! దేశాన్ని ముక్కలు జేసి పక్క దేశాలకి పంచడానికి..
నాకు తెలిసిన మొట్టమొదటి పరిష్కారము కులజాడ్యాన్ని అంతమొందించడమే అది ఎ రూపములో ఉన్నా...
కానే అది అంత సులువా ఇప్పుడు?? పెద్దలు పూనుకొని పిల్లలికి చెప్పాలి..
చివరగా.. ఒక నిఖార్సయిన మాటా.. నేను గమనించింది.. ఒకడిలో కుల జాడ్యం లేకపోయినా అవతలి వాడి/వారి జాడ్యాన్ని చూసి వీడికి అది అంటుకుంటుంది అదేదో అ౦టువ్యాధి లాగా. అవును మరి వీడు మటుకు మంచిగా ఉంటె సరిపోద్దా? ఇంకో౦దరికి కొన్ని సుత్తులు వట్టిపోయిన మాటలు పట్టి నువ్వు ఇది..అది.. అంటు౦టే మనసు సేద కోసం ఈ జాడ్యాన్ని కొద్దిగా తీసుకొని రాసుకోక తప్పడంలేదు అప్పటికి అదేంటో తెలీకపోయినా .
ఇక్కడ మొదట వ్యాఖ్యానించిన అజ్ఞాతులెవఱో భాషని విచ్ఛేదక శక్తిగా అభివర్ణిస్తున్నారు, నిజానికి మాతృభాషలకు తగినంత గుర్తింపు లేకనే భారతీయసంస్కృతి నాశనమవుతున్నది. ఎందుకంటే సంస్కృతి అనే వంటకంలో 90 శాతం ఆక్రమించే అసలైన దినుసు భాషే. తతిమ్మా దినుసుల వాటా 10 శాతం మాత్రమే. ఒక పరాయిభాష ద్వారా దానికి సంబంధించిన పరాయిసంస్కృతి యావత్తూ దేశంలోకి దిగుమతవుతుంది. ఒక దేశభాషని బతికిస్తే ఆ దేశసంస్కృతి యావత్తూ కాపాడబడుతుంది. ఒక భాష చనిపోతే ఒక ప్రాచీన సంస్కృతి, వారసత్వం నాశనమవుతాయి. మిథ్యా జాతీయవాద హోరులో పడి కొట్టుకుపోవడం వల్ల మనకీ ఇంగితజ్ఞానం లోపించింది. మనం మతాన్నీ, జాతీయవాదాన్నీ పర్యాయపదాలుగా భావించేలా తర్ఫీదివ్వబడ్డాం. కానీ మతం వేఱు. జాతీయవాదం వేఱు. జాతి అంటే భాషే. మఱింకేమీ కాదు. ఒక జాతి ఎన్ని మతాలనైనా అవలంబించవచ్చు.
భాషలు ఇండియాలోనే ఉన్నాయా ? హిందువులకు మాత్రమే ఉన్నాయా ? ప్రపంచంలో ఇంకెక్కడా లేవా ? క్రైస్తవులకూ, మహ్మదీయులకూ వివిధభాషలు లేవా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ దాదాపుగా ఏదో ఒక భాషాపరమైన గుర్తింపుగా ఏర్పడ్డవే. మతపరంగా ఏర్పడ్డవి అఱుదు. ఇండియా విషయానికొస్తే ఈ దేశపు జాతీయవాదానికి ఏ ప్రాతిపదికా లేదు, 190 సంవత్సరాల ఉమ్మడి బ్రిటీషుపాలన తప్ప ! ఇలాంటి విచిత్రమైన దేశం ఇదొక్కటే. దీన్ని దేశం అనడం కంటే సామ్రాజ్యం అనడం ఎక్కువ సమంజసం.
మన దేశానికి గత అయిదువేలేళ్లలో జఱిగిన మంచేదైనా ఉంటే అది భాషాప్రాతిపదికన మన ప్రజలు సంఘటితులు కావడమే. ఆ పని ఇతరదేశాలలో వందలాది సంవత్సరాల క్రితమే జఱగ్గా మనకి మాత్రం గత 55 సంవత్సరాలుగా మాత్రమే జఱిగింది. అంటే ఎంత వెనకబడిపోయామో ఆలోచించండి.
నా అభిప్రాయంలో హిందువులు చరిత్రలో ఎప్పుడూ సమైక్యంగా లేరు. ఇకముందు ఉంటారో లేదో తెలియదు. ఇక్కడ మన సందిగ్ధం ఒకటే. సమైక్యంగా ఉందాం. కానీ ఏ ప్రాతిపదికన ? ప్రపంచంలో మనకు సర్వసాధారణంగా కానవచ్చే వాస్తవం ఏమంటే బహిశ్శత్రువుల్ని నిర్జించినాక తదనంతరం జఱిగేది తమలో తాము కుమ్ముకొని చావడం. హిందువులంతా ఏకమై దేశంలో హిందూరాజ్యాన్ని స్థాపిస్తే ఆ తరువాత జఱిగేది శాఖల పేరుతో గుద్దుకు చావడం. హిందువుల్లోని అంతర్గత పాతకక్షలన్నీ తమ సమాధుల్లోంచి లేచికూర్చుంటాయి.
చారిత్రాత్మకంగా హిందువులు ఎప్పుడూ ఒకటవ్వలేదు. ఇప్పుడు అవ్వడానికన్నా విడిపోవడానికే కారణాలు ఎక్కువున్నాయి. కాబట్టి అందర్నీ ఒకటిగా కలపాలనే ఆలోచనే అప్రస్తుతం. Tell me one good reason why you believe Hindus are one and why they should be one now?
రాజేష్ జి November 3, 2010 5:25 PM
hmmmm...
are you the same Rajesh_G who hang in Narada blog?! :-O
:)
హిందువు అన్న పదం అఖండ భారతంలోని అయిదారు వందల సంస్థానాల్లో జన్మించిన ప్రజల అస్తిత్వానికి గుర్తుగా ఉండిందే తప్ప మతంగా అది ఎన్నడూ గుర్తు ఎరుగదు. ఆసేతు హిమాచలం హిందుస్థానంగా ప్రసిద్ధి చెందిందే తప్ప, దీన్ని హిందూ రాజ్యంగా ఎవరూ పిలవలేదు. ఈ హిందుస్థానంలో మతం అంటే శైవం.. మతం అంటే వైష్ణవం.. మతం అంటే శాక్తేయం.. మతం అంటే సిక్కిజం.. మతం అంటే `ౌద్ధం.. మతం అంటే జైనం...ఇస్లాం,christianity ఆ తరువాత పరాయి గడ్డల మించి వలస వచ్చినవి.
వీటిలో కొన్ని ఇక్కడ సహజంగా పుట్టినవి.. మరికొన్ని బలవంతంగా ఇక్కడ చొరబడ్డవి. ఈ దేశ సంస్కతిలో అంతర్భాగంగా చేరిపోయినవి. ఇక జాతులు, ఉపజాతులు.. కులాలు, ఉప కులాల సంఖ్య చెప్పనే అక్కర్లేదు. వాటి మధ్య జీవన వైరుధ్యం , సాంస్కతిక వైరుధ్యం, సంప్రదాయ వైరుధ్యం ఎంతో ఉంది. ఒక్కో సంస్థానం ఒక్కో విధమైన జీవన శైలిని అనుసరించింది. అటు గాంధారం (ఇవాల్టి ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్) నుంచి బాలి దీవుల దాకా వందలాది సంస్థానాల్లో విభిన్నమైన నాగరికత అభివద్ధి చెందింది. అయితే, అదై్వత, విశిష్టాదై్వతాది ధర్మాలు , `ౌద్ధ, జైన ధర్మాలు ఆసేతు హిమాచలం హిందుత్వమనే జాతీయ భావనా సూత్రం ఆధారంగా విస్తరించటం వల్ల ఈ వైరుధ్యాల నడుమ ఏదో తెలియని సామరస్యం ఒక ప్రవాహశీలియై కొనసాగుతూ వచ్చింది. ప్రపంచంలో మరే దేశానికీ లేని విభిన్నమైన జాతీయత ఈ దేశానికుంది. ఒక భాష కాదు, ఒక సంస్కతి కాదు, ఒక పండుగ కాదు, ఒక మతం కాదు, ఒక వేషం కాదు.. ఇన్ని వైరుధ్యాలు ఉన్నా అన్నింటినీ కలిపే సన్నని దారం ఏదో అంతర్లీనంగా ఉన్నదని పెద్దల మాట. దానికే వారు పెట్టిన పేరు భిన్నత్వంలో ఏకత్వం. ఎవరికి వారు వారి వారి మతాభిప్రాయాలను గౌరవించుకున్నా, భారతీయ సమాజం అంతా ఒకటేనని మనం ఎప్పుడూ చెప్పుకునే మాట. ఎందుకంటే మన పూర్వీకులు అంతా ఆసేతు హిమాచలాన్ని ఒకటిగానే భావించారు. జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే అని నిత్యం దేవతార్చనల్లో వినిపించే పవిత్ర మంత్రం. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు స్వయంగా అన్న మాట. ఒక్క రామాయణమే కాదు.. భారతాది ఇతిహాసాలు. ఇతర సాహిత్యము, ఇక్కడి పర్యాటక `ేత్రాలు, ఆ`ద్యాత్మిక `ేత్రాలు, నదులు, పర్వతాలు భారత ప్రజలందరినీ ఏకం చేశాయి. రాజకీయంగా దేశంలో వందలాది రాజ్యాలు ఉండేవి.. అయినా సాంస్కతికంగా ఉన్న ఐక్యత దేశాన్ని ఏకతాటిపై ముందుకు నడిపించింది. అంతే కానీ భౌతిక ఐకమత్యం అనేది ఈ దేశంలో సాధ్యమయ్యే పని కాదు.. ఎందుకంటే ఈ పోస్టును మరోసారి పరికించండి
http://kovela.blogspot.com/2008/11/blog-post_25.html
ఈచర్చపై స్పందిస్తున్నమితృలందరికీ ధన్యవాదములు .
కొందరు మితృలు నాకు మెయిల్ ద్వారా తమ అమూల్యమయిన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు . ఈపోస్ట్ ను దాదాపు రెండువందలమందికి పైగా ఇప్పటిదాకా చూశారు . చూడని వారుసరే , తమధర్మాన్ని గూర్చి తమ అభిప్రాయం ఒకముక్కచెప్పటానికి జంకెందుకు ?. వారికి నాదొక విన్నపం . ప్రపంచంలో ఏ ధర్మాన్ననుసరించే వారిని కదిపినా వారు ఫలానా ధార్మికమార్గానికి చెందిన వారిమని,పలానా సంస్కృతికి చెందినవారిమని,బహిరంగంగా , సగర్వంగా చెప్పుకుంటారు. కానీ మనలో మాత్రమే తమ ధర్మాన్ని గూర్చి ,మాట్లాడటానికి వెనుకాముందూ చూసుకుంటుంటారు చాలామంది . జాతిని నిర్వీర్యం చేస్తున్న వైరస్ప్ .... .భయం... భయం.. భయం ... కారణం లేని భయం . ఎంతకాలం దీనిబారినపడి ఉందాం మనం ? . హిందువునని చెప్పుకోవటం .ఈ సాంస్కృతీసంపదలకు వారసులమని గర్వంగా చెప్పుకుందాం . హిందువుని అనిచెప్పుకోవటం లో సృష్టిలో ఉన్నధర్మాలన్నింటినీ,సాంప్రదాయాలన్నింటినీ గౌరవిస్తున్న గొప్ప జాతి నాది అని గుర్తించడం .అంతేగాని పరధర్మాలను అవహేళన చేసి ,సమూలంగా తుడిచపెట్టాలనుకునే రాక్షసాంశలముకాము మనం.నిర్భయంగా ,మీ అభిప్రాయాలను ఎలుగెత్తి చెప్పండి .ఇక్కడైనా మీబ్లాగులలోనైనా . కాకుంటే అది ఆలోచనారహితమైన ఆవేశంగా ఉండకూడదు . చర్చ ఇంకా ముందుకు వెళుతుంది కనుక దయచేసి ఎవరు వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడవద్దని మనవి .
ఇక కత్తి మహేష్ గారు . హిందువులు ఒకటిగా ఎందుకు కలిసుండాలి అని ప్రశ్నిస్తున్నారు .అవును నిజమే . కానీ హిందువులు ఎందుకు విడిపోవాలి ? ఎవరికోసం విడిపోవాలి ? ఎవరి వ్యుహంలో పావులమై విడిపోవాలి ? ఎవరి కుటిలనీతికి ఈ సంస్కృతీ సాంప్రదాయాలు సమూలంగా నిర్మూలించబడాలి ? ఈప్రశ్నలకు కూడా సమాధానాలు కావాలి . ఈ మేధోమథనం ద్వారా అమూల్యమైన సూచనలు రావాలి . ఈ అక్షరాలు చిన్నవే కానీ వేల మెదళ్లలో ఆలోచనలు రగిలించగల శక్తిమంతమైనవి అని నాఅభిప్రాయం . ఇక్కడ నేను వ్రాసిన దాన్నే సమర్ధించమని కోరటం లేదు . కానీ చర్చ పక్కదోవపట్టకుండా చూడమని వేడుకుంటున్నాను .
"భారతీయులంతా హిందువులే.హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు,అది జీవన విధానం" అన్నారు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్(సాక్షి 1.3.2010).
ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?
Hinduism is not a religion but a thought processes. It is not confined to a region. Anyone who agree with it can be called a hindu.
Thanks for drawing my attenction to this blog Durgeswara garu. Many thought provoking articals. I shall go throuh them leisurely.
Good job sir. Keep it up
నా అభిప్రాయం:
హిందువును నిర్వచించాల్సిన అవసరం వస్తే, వేదాలను గౌరవించేవారు హిందువులని చెప్పవచ్చు. ఈ వేదాలకు వివిధ భాష్యాలు చెప్పిన వారు తద్వారా వివిధ పద్దతుల్లో మోక్షసాధన చేసేవారు, అసలు చెయ్యని వారు వీరిలో ఉండవచ్చు. కానీ వేదాలను నిరసించేవారు హిందువులు కారు. రాజకీయ కారణాలవల్ల అఫిషియల్ గా హిందువులవుతూ వేదాలనే నమ్మని నాస్తికులు దయచేసి ఇలాంటి చర్చల్లో నయినా హిందువులమని చెప్పవద్దు. నాస్తికులుగానే మిమ్మల్నిమీరు ఒప్పుకోండి. తప్పులేదు. ఎవరి ఇష్టం వారిది. మతం వ్యక్తిగతం. మా చుట్టాల్లోనే నాస్తికులు ఉన్నారు. పుట్టుక రీత్యా ప్రభుత్వ రికార్డులలో వాళ్ళూ హిందువులు.
ఈ రిజర్వేషన్ గొడవలేని విదేశాల్లో ఏదో చర్చిలో బాప్టైజ్ కాని వాళ్ళు క్రిష్టియన్లు అని చెప్పుకోరు. రికార్డులు ఎలా ఉన్నా సరే.
రహమతుల్లా గారు చెప్పినట్లు భారతీయతకు, హిందూత్వానికి తేడాలేదంటే నేను ఒప్పుకోలేక పోతున్నా. ఆవును కొట్టి కోసి చంపటం భారతీయ చట్టాల ప్రకారం న్యాయమే, హిందూ నిభంధనల ప్రకారం కాదు. మాంసాహార భక్షణ హిందూ నిభంధనల ప్రకారం న్యాయమే జైన మతం పాటిస్తుంటే కాదు. భారతీయత అంటే నాస్తిక, భౌద్ద, జైన, హిందూ,సిక్కు, ఇస్లాం, పార్సీ, క్రైస్తవ, యూదు మతస్తులు కలిసి ఈ గడ్డమీద బతకటానికి ఏర్పరుచుకున్న నిభంధనలు.
ఇక ఒక మాటమీద, ఒక తక్కెడలో ఉండటం విషయానికి వస్తే, భావ స్వేచ్చ, సంస్కారాభిలాష లేని మూర్ఖ మతం కానందువల్ల మీకు అలా అనిపించి ఉండ వచ్చు. చక్కటి భావ స్వేచ్చ కలిగిన ప్రాన్స్ లాంటి దేశంలో క్రిష్టియన్ మతస్తులు కూడా ఇలాగే ఉంటారు. నామటుకు నాకు నా మతం యెక్క వివిధత్వమే ఇష్టం. మా అమ్మ ద్యానించిన దేవుణ్ణే, ఆ మార్గంలోనే నేను పూజించక్కర లేదు. నా మార్గం నాది, స్థాయి, విచక్షణ, స్వభావాన్ని బట్టీ నేను నిర్ణయించుకొంటాను. పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకొంటాం.
Caste, Language and Region divide our people into warring factions.
In the above line .....
The word "Language" did not refer to a particular language (e.g. Telugu, Tamil, Hindi and Marathi etc). This word used in the sense that selfish interests based on affiliation to a particular language are also playing a role in dividing Hindus.
One specific example: At the national level Hindu Politicians tend to divide on the basis of 1) party affiliations 2) State 3) Self interests 4) Language (e.g. Tamil or Marathi etc) 5) Caste/class (rich or poor or lower or upper) 6) ideology (e.g. Communist) 7) religion (some of them claim that they are Hindus, but they already sold their souls) 8) Gender
Did any body see a broad coalition of Hindu Politicians cut across Party affiliations, States, Castes, Languages ?
But there are such coalitions for minorities (how small they are) and Communists.
So what is preventing Hindu Politicians to cooperate across Party lines? In fact they hate each other.
The answer to this question is the solution for problems facing by Hindus.
Example: Take the case of Andhra Pradesh. Rosaiah (Congress), Babu (TDP), Chiranjeevi(Praja Rajyam), Chandrashekar Rao(TRS), Raghavulu(CPM), Narayana (CPI), Kishan Reddy(BJP). They all are Hindu born, but most of them may not be practicing now( at least openly). Did they ever discussed the problems facing by Hindus at State and National level. Never. Can you imagine such a broad coalition among Hindu Politicians? I think not.
See politics are politics, every one has to try to out-smart others. But don't you think that they have the responsibility for the well being of our community? These Hindu politicians replaced our traditional support system (Kings, Queens and Kingdoms).
Whose responsibility or role it is to educate these ignorant politicians to act upon to protect our community? Either they have to realize themselves or people have to teach them a lesson at the ballot box.
"చారిత్రాత్మకంగా హిందువులు ఎప్పుడూ ఒకటవ్వలేదు".
This statement by Kathi is wrong. This is the propaganda of శత్రువులు of Hindus.
Before destroying any Society/Tribe/Community మిషనరీస్ use this argument.
Please read the world history for how మిషనరీస్ destroyed Cultures/Societies in Africa, America's, and Asia in the last 600 years.
@సాగర్: హిందువులు అనే ఒక సంఘటిత కమ్యూనిటీనే లేనప్పుడు హిందూ శతృవులు అనే కాల్పనిక జట్టు ఉండే ఆస్కారమే లేదు. Please read your history properly.
మిషనరీల కుట్ర అనేది నియీ హిందుత్వభ్రమ. అంతేతప్ప మరొకటి లేదు. దాదాపు 300 సంవత్సరాల ఆంగ్లేయ పరిపాలనలో కనీసం 2% కూడా వాళ్ళు కన్వర్ట్ చెయ్యలేకపోయారు. so, much for missionary work under British. :)
"దాదాపు 300 సంవత్సరాల ఆంగ్లేయ పరిపాలనలో కనీసం 2% కూడా వాళ్ళు కన్వర్ట్ చెయ్యలేకపోయారు".
At times you speak partial truth unknowingly.
Lets analyze your statement (only your statement). I can conclude the following.
1) That shows how resilient and strong హిందు community in the face of mortal danger. The roots of హిందూస్ (Cultural, Social and Religious) go back to several Millenium. As you profess that హిందూస్ were weak they could have collapsed like other native Civilizations in America's, Africa and Asia.
Other areas of negative impact of బ్రిటిష్ rule such as a)Economic exploitation, b) loss of opportunity for advancement, c) slavery of entire Civilization, d) alienation of major segment of population (Mecauly's Children) e) destruction of indigenous production methods f) preventing advancement of society
When you get a chance read the book "The Clash of Civilizations" by Samuel P. Huntington
Before (1750) బ్రిటిష్ captured and stifled the soul of this nation, India's GDP was about 25% of the world GDP. By 1947 it was reduced to less than one percent.
Come up with specific factual points, instead of general garbage.
ముందసలు 'హిందువు' అంటే ఎవరో చెప్పండి దుర్గేస్వరగారు...నాస్తికులు, ఆస్తికులు, agnostic (తెలుగులో 'ప్రత్యక్షవాది' అంటారట) కూడా హిందువులే అని విన్నాను...ఇది చాలదా ఒక్కటిగా కలపలేకుండా ఉండటానికి. హిందుత్వం ఒక జీవన విధానమే అయితే తన(హిందుత్వం) విధానంలో ఉన్న ఎన్నో శాఖలను నమ్మే ప్రజలు ఒక్కటిగా ఉండాల్సిన అవసరమే లేదు. మీ ప్రశ్నను నేను మార్చి డుగుతున్నాను...ఇంత గొప్ప జీవన విధానంలో ఉంటుకూడా ఆ సంస్కృతి సర్వమానవ సమానవ్తాన్ని ఎందుకు ఆకళింపు/అర్ధం చేసుకోవడంలేదు? అసలు చేసుకోగలమా...?
'హిందువు' అంటే ఎవరో ఎవరైనా వివరించండి...నిజంగానే నాస్తికుడు, agnostic కూడా హిందువు కాగలడా ?
ఒక Organized Hindu community యే లేనప్పుడు వాళ్ళకి శత్రువర్గం ఉండడమేంటి ? అంటున్నారు.
ఇది స్వీయ అవగాహనా రాహిత్యం గానీ, అపమార్గదర్శనం గానీ కావచ్చు. ఒకప్పుడెప్పుడో వేలాది సంవత్సరాల క్రితం హిందువుల్లో తాము ఒక కమ్యూనిటీ అనే స్పృహ లేనిమాట నిజమే. Organize కానీమాటా నిజమే. కానీ బౌద్ధమతావిర్భవకాలం (క్రీ.పూ.2000) నుంచి "వైదికులమైన తామంతా ఒక్కటి" అనే భావం హిందువుల్లో వచ్చింది. కాదు, వచ్చేలా చేశారు బౌద్ధులు తమ మతోన్మాదం (మతాంతరీకరణల ఉన్మాదం) తో !
శంకరాచార్యులు జన్మించి బౌద్ధుల్ని వాదంలో ఎదుర్కొని నెగ్గి దేశం నలుమూలలా వైదికమతప్రచారం నిమిత్తం తన పీఠాలు స్థాపించిన తరువాత కూడా హిందూ కమ్యూనిటీని organized community కాదనే సాహసం ఎవఱు చేయగలరు ?
1330 ప్రాంతంలో ఓరుగల్లు తురుష్కుల దాడికి గుఱయ్యాక వారిని ఎదుర్కొనే నిమిత్తం విద్యారణ్యస్వాములవారు హిందూరాజ్యాన్ని స్థాపించినాక కూడా ; అదే విధంగా ఆయన అడుగుజాడల్లో నడిచిన శ్రీకృష్ణదేవరాయలు హిందూరాజ్యరమారమణుడనే బిరుదుతో దక్షిణాపథ సామ్రాజ్యాన్ని ఏలిన తరువాత కూడా హిందువులు Organized communityగా లేరనే చరిత్రవిస్మారక వాదం ఎలా చేయగలరు ?
ఉత్తరభారతదేశపు శ్రీకృష్ణదేవరాయలని చెప్పదగ్గ శివాజీ ముస్లిమ్ సైన్యాల్ని ఎదిరించి హిందూరాజ్యాన్ని స్థాపించినాక కూడా హిందువులు Organized community కాదనే నిరక్షరాస్యవాదాన్ని ఎలా తలకెత్తుకోగలరు ?
హిందువుల ఆధిపత్యాన్ని సహించబోమంటూ మహ్మదాలీ జిన్నా ముస్లిములకొక ప్రత్యేకదేశాన్ని అడిగిన నేపథ్యంలో "హిందువులనే కమ్యూనిటీయే మిథ్య" అనేవాదాన్ని ఎలా లేవనెత్తగలరు ? కమ్యూనిటీయే లేనప్పుడు మఱి అనేకశతాబ్దాలుగా ఈ దేశం ఇంటా బయటా అన్ని జాతుల పుస్తకాల్లోను హిందూస్థాన్ అనే పేరుతో ఎలా వ్యవహరించబడుతూ వస్తున్నది ? వాళ్ళంతా భ్రాంతచిత్తులూ, వీరు మాత్రం అందఱి చెవుల్లోనూ దూరెళ్ళగల మహాజ్ఞానులూనా ?
నావే మఱికొన్ని ప్రశ్నలు మిత్రులారా !
౧. ఒక కమ్యూనిటీలో ఐకమత్యం లేనంతమాత్రాన ఇహ ఆకమ్యూనిటీ అస్తిత్వంలో లేనట్లేనా ? ప్రస్తుతం మన తెలుగువారిలో ఐకమత్యం లేదు. అంటే ఇహ ఈ భూమండలం మీద తెలుగువారనే కమ్యూనిటీయే లేనట్లవుతుందా ?
౨. ఒక కమ్యూనిటీ వ్యవస్థీకృతం (organize) కానంతమాత్రాన ఇహ ఆ కమ్యూనిటీ ఉనికిలో లేనట్లేనా ? మన దేశంలో తాపీమేస్త్రీలూ, పెయింటర్లూ మొదలైన అనేకరకాల అవ్యవస్థీకృత (unorganized) వృత్తులవారున్నారు. అంటే ఇహ ఆ వృత్తులే దేశంలో లేనట్లా ?
౩. ఒక కమ్యూనిటీ వ్యవస్థీకృతం కానంతమాత్రాన ఇహ ఆ కమ్యూనిటీకి శత్రువులెవఱూ ఉండరా ? ఉదాహరణకు - యూరోపులో జిప్సీలు వ్యవస్థీకృతులు కారు. వారొక సంచారతెగ. కానీ వారంటే అక్కడ అందఱికీ ద్వేషమే, అసహ్యమే. హిట్లర్ హయాములో యూదులతో పాటు జిప్సీల్ని సైతం హతమార్చారు.
అటువంటప్పుడు మఱి లోకమంతా ఎఱిగిన హిందువులకు శత్రువులు ఉండరా ? ఏదీ, కేవలం హిందువులన్న కారణం చేత ఒక పొఱుగుదేశం నుంచి యుద్ధాల్నీ, ఒక అంతర్జాతీయ మతోన్మాద సంస్థ నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటున్న ఈ పరిస్థితిలో ? ఒక కమ్యూనిటీగా హిందువుల్ని ద్వేషించకపోతే వారు పూజించే దేవతల బొమ్మల్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా అవమానించారు అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను ? (అండర్‌వేర్‌ల మీదా, బాత్‌రూమ్ టైల్సు మీదా ఆ బొమ్మల్ని ముద్రించారు)
పైన ఒకాయన తాంబూలాలిచ్చేశాను.. తానుక్కుచావండి అన్న పద్దతి లో ఓహ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని "చారిత్రాత్మకంగా హిందువులు ఎప్పుడూ ఒకటవ్వలేదు", మేధావి గదా మరి. పాపం ఆయన నిద్రలో కూడా పలవరిస్తూ, ఉదయ౦ లేచింది మొదలు నామస్మరణ చేసే "కెలుకుడు గాంగ్" ఏ విధంగా ఒక్కటి అయ్యారు తెలీదా? ఇక ప్రాంతమా, ఒక కులమా లేక ఒక ఒకరికి ఒకరు కనీసం తెలుసా?. లేదే. మరి ఏ శక్తి నడిపించింది అటువైపు ఈయన రాసే ఛండాలపు రాతల మీద పోరాడడానికి? ఇది చాలదా మీకు ఉదాహరణ.
అసలు ఒక్కటి అవ్వాల్సిన అవసరమేమి అని అడిగారే, హవ్వ విడిపోయి బతుకుతున్నవారు ఒకటి అవుదా౦
ఇకనైనా అని అనుకుంటే సంతోషించాల్సింది పోయి ఎందుకు అని అడిగేవారికి ఆ విడిపోయి ఉండడం వల్ల ఒనగూరే లాభాలు పోతాయనా భయం?
ఏమయ్యా, మిమ్ములను ఎప్పుడో ఎవరో కులం పేరుతొ తిట్టారని(?) ఆ అవమానానికి(?) అపమానాలు, ఉపమానాలు, నిరుపమానాలు ఆపాదించి నేటికి దాని మిషతో విషం కక్కుతున్నారే? దాని వాళ్ళ ఉపయోగం ఏమైనా ఉందా, శుష్క వాదనలు తప్ప. ఆ వాదనలతో మీ మనసు ఏమైనా సేద దీరుతుందా మానసికముగా, అంతరాత్మనడిగి చెప్పండి?
అలా కాకుండా కుల జాడ్యం లేకుండా అందరు ఒకటి అవ్వి మిమ్ములని ఆరోజు తిట్టారని అనుకుంటున్న వాళ్ళు మీ దగ్గరకి వచ్చి "సోదరా, క్షమించు అలా అన్నందుకు తెలిసీ తెలియక, మనమంతా ఒకటే" అని అంటే తీవ్రవాదులని సైతం వదిలిపెట్టండి అనే తీవ్రమైన భావజాల వైశాల్యం ఉన్న మీరు క్షమించరా. అప్పడు మీ మనసు చూడండి ఎంత ప్రశాంతతో ఉంటదొ. మీకు ఇది మలక్కు గారు ఎప్పుడో చెప్పారు, కాని మీకు అది రుచించలా.. ఎందుకు జెప్పండి? నాకు తెలిసి అలా కలవడం కొన్ని మతశక్తులకి అది ఇష్టం లేదు.. మీరు ఆ బాపతులో లేరు అనుకుంటున్నాను. మీ మేధావితనాన్ని మంచికి ఉపయోగిద్దాం రండి.
@తాడేపల్లి గారు,
చాలా చక్కగా వివరించారు. అందులో అణుమాత్రమైనా అబద్దం కాని, అసంబద్దం కాని లేదు. ఇక చోమ్మూనిస్తులు రాసిందే సెరిత్ర అనుకునేవారికి "టాట్ .. ఇది తాడేపల్లి రాసిన చరిత్ర" మాకక్కర లేదు హన్న హాశ్చర్యం లేదు. మీరడిగిన ప్రశ్నలకి కలవాల్సిన అవసరమేమిటి అని అన్నవాళ్ళు చెబితే బావుంటది.
@Nrahamthulla గారు
లెస్స పలికితిరి. ఇంగ్లీషులో "religion" అనే పదానికి మతం అనే అర్థం వస్తుంది. మనం వాడే "ధర్మం" అనే పదానికి ఇంగ్లీషులు లో సరి అయిన పదం లేక పాశ్చాత్యులు హిందు ధర్మానికి religion అని వాడారు.. ఆ తర్వాత అది క్రమేపి హిందూ మతం అయి కూర్చుంది.. ఇది కూడా భావదారిద్ర్యమే..
ఇక్కడ అందరికీ తెలుసు.. hinduism is way of life, not religion. హైందవ ధర్మ౦ అనేది ఒక జీవన విధానం, ఎవరో ఒకరు కూర్చొని చెప్పిన ఆచారం కాదు.
అందువల్ల, ఇది వదిలేసి అసలు టపా ముఖ్యఉద్దేశ్యం పై చర్చించ వల్సిందని మనవి
దుర్గేశ్వర రావు గారు, ఈ టపాకి సంబందం లేని వాఖ్య రాస్తున్నాను. మనం హిందూ మతం గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు. కొంతమంది వాస్తవ విరుద్దంగా సిద్దాంతాలు,అనాలిసిస్ లు రాసి ఎదుటివారిని ఇరుకున పడేయాలను కొంటారు. వాస్తవాన్ని ఎంత తొక్కి పట్టినా అది బయటపడుతుంది కదా! బ్లాగు లోకం లో వాదించె వారికి వాస్తవాలు తెలిసిన తెలియనట్లు రాస్తూ ఉంటారు. అసలికి వీరు వెనక వేసుకో వచ్చె క్రైస్తవ మిషనరీల పరిస్థితి ఘోరం గా ఉంది. వారి మతం లో ఇప్పుడు జనాభా లేక విలవిల లాడుతూ మనదేశం లో వారిని కన్వర్ట్ చేయటం మొదలు పెట్టారు. ఎందుకంటె భవిష్యత్ లో ఒక మతం నుంచి వచ్చె సవాలును ఎదుర్కొనటానికి మనుషులు కావాలి కదా.
Please see below video
http://www.youtube.com/watch?v=6-3X5hIFXYU
భారతీయులంతా హిందువులే. ఈ వ్యవస్థలోని కుల విభజనలు పొతే ఇది ఒక గొప్ప నాగరిక దేశముగా వర్దిల్లగలదు.అసలు కులమే ఉండకూడదు.
నేతి బీర కాయలో నిజమెంతో,హిందువల్లో ఐక్యత అంతే. రాజేష్ జి చెప్పింది అక్షరాలా నిజం.రాజేశా,నీ లాంటి వ్యక్తులు నా బ్లాగులో కామెంటు పెట్టినందుకు నేను గర్విస్తున్నా. వెల్ సెడ్.
మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ పొష్ట్ మరియు కామెంట్లు . ఒకరు ఇద్దరు తప్ప, దుర్గేశ్వర్ గారు అడిగిన దానికి సమాదానము ఇవ్వలేదు. కామెంట్లల లొ ఒకానొక పదం లేక వ్యాఖ్యం ని అసందర్బంగా తీసుకొని పిడి వాదం చెచారు కొందరు.
హిందువులు ఇప్పుడు అనుసరిస్తున్న పద్దతులు లేక వున్న స్తితి సమ్మతము కాదు. చదువుకున్న మేదావులు ఎ మాత్రము సంతొషంము గా లేరు.
ఇక సలు విషయానికి వస్తే, కామెంట్లులొ వున్న కొన్ని విషాయాలు బాగానే వున్నాయి. ఉదాహరణకు.
(kind of copy/pasting from other peoples comments)
- Natural attrition is a reality. Even Abrahamic Cults #1 faces this. Some members leave the cult and some new members join. With out this phenomena Abrahamic cults cease to exist. They realize this fact. So at any cost, they harvest new souls.
So far only natural methods (positive Birth rates) contribute to real growth to Hindu population.
Since 1980's the birth rates among educated Hindus fall drastically. As more and more Hindus get education and move to middle class, this trend will continue.
So it is up to Hindus to consider the option of seeking new converts to fill the gap and send a message to those Cults.
Historically Hindus were defending .. defending ... defending. Only defending.
This approach is not the best solution to the problems facing in 21st century. The aggressor (these Cults) always poke at the open wounds. They developed best methods to unsettle Pagans/Kafirs.
The monsters of anti-Hindu Media, Pseudo-Secularism, Minority Appeasement, Communist Ideology, Vote Bank politics, Secularization of Rich/Powerful/Successful Hindus and their ignorance, Loss of Political power, weak/non-existent Intellectual Leadership, Religious conversions by Abrahamic Cults will reduce Hindus to insignificant minority in next 50 years.
#1: Only Cults seek new members aggressively. Matured Religions don't resort to such methods. The inherent contradictions in the historiography of these cults force them to remember the purported event over and over again. Usually there was no evidence to such historical event(s). So they rely on the Book. They thump the book. They say see .. see .. our book says this, so it is true.
(This narrative was taken from Rajiv Malhotra's Articles).
Matured Religions are like Rivers. River starts in high mountains, rapid falls, fast course, slow in plains, and then meander in Delta and finally meets the Sea.
Where as these Cults always fixated in aggressive conversion mode. Else they cease to exist.
Have a good Day!.
సమాజానికి పనికొచ్చె పని చెయడానికి, నలుగురు హిందువులను కూడతీయాలి అంటె ఎంత కష్టమయిన పనో చాలా మందికి తెలిసేవుంటుంది. ఒకడు పుల్ల వెస్తాడు - వాడు ఎదో డబ్బు దొబ్బ డానికే ఈ పని మొదలు పెట్టాడు అని.
ఇంకొకడు వేరే పుల్ల వెస్తాడు - ఎడిసాడు వాడు ఆ పని వాడే ఎందుకు మొదలు పెట్టాలి, నేను ఎందుకు కాకూడదు, లేకపోతే నా బందువు ఎందుకు కాకూడదు, కాకపొతే నా కులం వాడు ఎందుకు కాకూడదు.
ఆ క్రెడిట్ వాడికే ఎందుకు రావాలి?
ఒక ఉదాహరణ: మా వూళ్ళొ జీర్నావస్త లొ వున్న గుడి స్థానం లొ, కొత్త గుడి కట్టడానికి 25 సంవసరాలు పట్టింది. మాది పెద్ద వూరు. (డబ్బున్న) హిందువులు చాలా మంది వున్నారు. కాని ఎవడికి వాడికి సుతి లేదు. గమ్మత్తుగా ఎక్కువ మంది ఒక కులానికి (OC) చెందినవారే. ఇక్కడ కుల కుమ్ములాటలు లేవు.
కారణాలు: ఈగొలు, జెలసి, selfishness, దుగ్ద, low self esteem, no vision, lack of planning, no sense of community, no awareness, petty local fights, no leadership, gap between generations.
ఇక పై కారణాలకు కుల కుమ్ములాటలు కలిస్తె ఎలావుంటుందౌ ఆలొసించండి.
పైన కొంతమంది చెప్పినట్లు. ఇదే స్థితిని మనము ఒక గ్రామ పరిదిలొ, ఒక జిల్లా పరిదిలొ, ఒక రాస్ట్రం పరిదిలొ, దేశం పరిదిలొ మరియు అంతర్ జాతీయ పరిదిలొ చూడవచ్చు.
పైన ఒక హిందువు వున్నాడంటే, మిగతా హిందువులు వాడిని పడేసెదాకా నిద్రపొరు. అదే ఒక కిరస్తాని కాని, ఒక తురక కాని పరిపాలిస్తుంటే, అందరు వాని కాళ్ళు పట్టుకొని నువ్వు దేవుడివి అని కొలుస్తారు. కిరస్తాని YSR ని "దేవుడి"ని చెచారు. వాడు కిరస్తాని కాబట్టి, వాని పూర్వాశ్రమంలొ ని కులం ఇక అడ్డు రాదు, అది అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందు కంటె పూర్వాశ్రమంలొ వాని కలానికి చెందిన హిందువులు వానికి మద్దతుగా వుంటారు. వాళ్ళు తమ కులానికే చెందిన ఇతర హిందువులను డర్ట్ లా చూస్తారు, మరియు ఇతర కుల హిందువు వారికి ప్రదాన శత్రువులు. ఆ "దేవుడు" వీళ్ళను ఒట్టి వెదవలు అని ఆడిస్తుంటాడు.
ఎవరికి ఎవరికి పొతన లేదు. తెలుగు వాడు మహరాష్ట వెలితే వాడు తంతాడు. ఒక మరాటి వాడు North East States వెళితే అక్కడి వాడు తంతాడు. అందరు కలసి బయటి వాడి కాళ్ళు పట్టుకుంటారు.
పరిస్తితి ఎమి మారలా.
మరి సొల్యూషన్స్ ఎమిటి?
Ramesh గారితో ఏకీభవించక తప్పడం లేదు. నూటికి నూఱుశాతం నిజం. మా కాలనీలో కూడా మేము సాయిబాబా గుడి కట్టడం మొదలుపెట్టి ఎనిమిదేళ్ళవుతోంది. ఇంతవఱకు అది పూర్తికాలేదు. కనపడ్డ ప్రతి ధనిక హిందువు కాళ్లూ, గడ్డమూ దీనంగా పట్టుకున్నాం. అయినా మా కోరిక తీఱలేదు. ఒకాయన మూడులక్షలిస్తానని ముందుకొస్తే ఒక హిందూపూజారి (ఈయన ఒకప్పుడు వేఱేచోట సాయిబాబా గుళ్ళో పనిచేసినవాడే) ఏదో చెప్పి ఆయన్ని చెడగొట్టి ఆపించాడు. మా నిర్మాణ కమిటీ సభ్యుల్లో ఒకాయన మేము పోగుచేసిన చందాల డబ్బు భారీగా తినేసి అటుతరువాత పక్షవాతంతో శాశ్వతంగా మంచం పట్టాడు. ఈ లోపల ఆ ప్రాంతంలో మూడు చర్చిలు, ఒక మసీదు కూడా వచ్చేశాయి. తత్ఫలితంగా సాయిబాబా హారతులతో మారుమ్రోగాల్సిన మా పేట ఇప్పుడు నమాజులతోను, హల్లెలూయలతోను ప్రతిధ్వనిస్తున్నది.
మనుషుల మద్య వృత్తి పరమైన పొటి వుండడం సహజం. అది ఒక రకంగా కొతవరకు ఆరొగ్యకరం కూడా. ఎందుకంటే పొటి వుంటేనే అభివృద్ది సాద్యము అవుతుంది.
మనుషులు అందరు ఎల్లప్పుడు సొదరభావం తొ వుండాలి అని అనుకొవడం అవివెకం. That is not possible. అందరు సొదరులు, అందరు సమానులు అని డప్పాలు కొట్టుకునే తురకలలొ, కిరస్తానీలలొ, కమ్యునిష్టులలొ కూడా practical గా అది నిరూపించబడలేదు. Then forget about Caste ridden హిందువులు.
ఓక తల్లి పిల్లల లొనే అది సాద్యము కాదు. మరి అలాంటప్పుడు ఒక గ్రామము వాళ్ళు కాని, ఒక కులం వాళ్ళు కాని, కులాల మధ్య కాని, ఒక ప్రాంతము వాళ్ళు కాని, ఒక మతము వాళ్ళు కాని, ఎప్పుడు ఎల్లప్పుడు కలసి మెలసి వుండడము అనేది సాధ్యము కాదు.
కాని ...
విపత్కర పరిస్తులలొ తురకలు, కిరస్తానీలు, కమ్యునిష్టులు, విడి విడి గా, అన్ని కూటములు కలిసి కట్టుగా పనిచెస్తున్నాయి. ఆ విపత్కర పరిస్తితి పొయిన తరువాత, వాళ్ళు కొట్టుకుంటున్నారా లేక కలిసి పనిచెస్తున్నారా, ఎ degree లొ cooperate చెసుకుంటున్నారు అనేది secondary.
ఇంక మన హిందువుల విషయానికి వస్తే ...
సామాన్య పరిస్తితి లేదు, విపత్కర పరిస్తితి లేదు ... cooperation శూన్యము లేదా minimal అని చెప్పాలి.
ఇది ఎందుకు ఇలా?
ఈ ప్రష్నకు సమాదానము ఎమిటి?
(The following example was taken from previous comments of this post by others)
వుదాహరణ: ఆంధ్రాలొ ...
Babu, Chiranjeevi, Rosaiah, Chadrashekar rao, Raghvlu, Narayana and kishan Reddy. అందరు వెదవాయిలు హిందు పుట్టుక పుట్టిన వారే. కాకపొతే వివిద కులాలకు చెందిన వారు(అందరు కాదు). వాళ్ళ ideologies వేరు వేరు. వాళ్ళ రాజకేయ దాహం వేరు వేరు. ఒక్కడు అంటే ఒక్కడికి పడదు.
విడి విడి గా కాని, కలిసి కట్టుగా కాని వాళ్ళు మన హిందు community కి వీస మెత్తు ఉపకారం చెయలేదు. పైపెచ్చు తురకలకు, కిరస్తానీలకు మత పరంగా Reservations ఇస్తామని promise చెస్తున్నారు.
వారికి మన సమాజము face చెస్తున్న విపత్కర పరిస్తితులు తెలుసా? తెలిసి ఏమి చెయడం లేదా? తెలియదా? అందులొ బాబు 9 years రూల్ చెచాడు. మన community కి specific ఎమి చెచాడు?
ఇలాంటి నేతలు వున్నందుకు అది మన ఖర్మ అని సరిపెట్టుకొవాలా? లేక ?
రమేష్ గారు,
చక్కగా చెప్పారు. మీరు చెప్పినదాంట్లో..
@మనుషులు అందరు ఎల్లప్పుడు సొదరభావం తొ వుండాలి అని అనుకొవడం అవివెకం.
నాకు తెలిసి సొదరభావం ఉండాలనుకోవడం అవివేకం కాదు. మీరు అలా వుండడం కుదరదని అవివేకం అన్నారా? కానే ఒకే కట్టుపై ఉండాలనుకోవడం మాత్రం అవివేకం లేదా అత్యాశ అవుతుంద. అది నాకు తెల్సి అది ఎవరూ కోరుకోవట్లా. మీరు అన్నట్లు ఏదయినా అవాంతరం వచినప్పుడు ఒక్కటిగా ఉండాలి అని కోరుకునేది.. మీరు కాశ్మీర్-అమరనాథ్ ల్యాండ్ విషయ౦ లో జరిగిన గొడవ చూసి వుంటారు.. అప్పుడు ఏ విధముగా హిందువులు ఐక్యముగా ఉండి సాధించుకున్నారో( గుడ్డిలో మెల్ల నయం అన్న చందం అనుకోండి!) అది కావలి అనుకోవడమే.
రాజకీయనాయకులు.. అది షరా మమూలే..
వారు మారాలంటే హిందువులు ఒక్కమాట మీద ఉండాలి.. వోట్ బాంక్ సత్తా చూపించాలి.. అప్పుడు ఎవరి కోసం మారరు చెప్పండి?
రాజేష్ గారు, ఆ paragraph బావాన్ని సరిగా గ్రహించారు.
మన సమాజానికి ఒకప్పుడు (బ్రిటిషర్స్ కు ముందు, ఇంకా ముందుకు వేళితే, తురకల కన్నా ముందు) వున్న Support systems ఇప్పుడు లేవు.
ఇంతకు ముందు comment పెట్టిన వారు చెప్పినట్లు, మన సమాజాన్ని కాపాడే, రాజులు, రాజ్యాలు, జమిందారులు, శ్రీమంతులు, కళాపొషకులు ఇప్పుడు లేరు.
పైన చెప్పిన వారి స్తానములొ ఇప్పుడు వచ్చిన వారు (Politicians, Industrialists, Cinema Stars, Landed Class), కుహనా లౌకిక తంత్రము లొ బతుకుతున్నారు. ఎక్కువ మంది (అందరు కాదు) సామాన్య హిందువుల వల్ల డబ్బు, పేరు, పదవులు సంపాదించి, సమాజంలొ వున్నత స్తానములొ కూర్చొని, తిరిగి సమాజానికి ప్రత్యుప కారము చెయడం లేదు.
will continue later ....
@snkr గారు
hmm.. same..chill out..:)
@అప్పి-బొప్పి గారు,
హ్మ్.. కృతజ్ఞతలు.
>>అసలు కులమే ఉండకూడదు.
కోరుకుందాము అలానే. కానీ నే మొదట చెప్పినట్లు ఆ సుత్తుల మాట మూటగా చలామణి అవుతున్నంతకాలం ఈ "జాడ్యం" లేని వారు కూడా దాన్ని గోక్క తప్పడం లేదు తమ బాధ తగ్గడం కోసం. దీనికి ప్రతిఫలమే సంఘాలు. దీనికి ప్రత్యసాక్షిని నేను. కనుక కుల జాడ్యాన్ని రూపు మాపాలంటే ముందుగా అలాంటి వారి బాధ పోగొట్టాలి నిజమైతే లేదా స్వార్ధపరులైతే ఆ సుత్తులు మాటలని గడ్డి పోచ సమానంగా తృణీకరించి ముందుకు పోవాలి. ఇది అందరూ చేయవలసిన పని, ఎవరో ఒకరు కాదు.
@రాజేష్ జి: కాస్త కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. కులం ప్రతి రాజకీయ-ఆర్థిక-సామాజిక చర్యలోనూ కనిపిస్తోంది. దాన్ని కాపాడేందుకు మీరు కూల్చేందుకు మేమూ పోరాడుతున్నాం. ఆ ఝాఢ్యం నీకుందో నాకుందో అది జగద్వితితం. So, just chill.
@మహేష్ గారు,
రాజేష్ కులాన్ని ఎక్కడ కాపాడాడు. మీరు అంత పెద్ద బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగారు? మిమ్మల్ని విమర్శిస్తే కులాల్ని సమర్ధించినట్లేన? అసలు మీరు కులాన్ని ఎక్కడ కూల్చడానికి పోరాడారు?
"హిట్ అన్డ్ రన్" అనేది అబ్రహామ్ అనుచరుల ఎత్తుగడలలొ ఒకటి. గజని మరియు తుగ్లక్ ఇలాంటి ఎత్తుగడలే వాడారు.
ఎవరొ ఇంతకుముందు కత్తిని ఒక ప్రష్న అడగడం జరిగింది. కిరస్తాని బ్రిటిష్ అంతా మంచే చెస్తె, 1750 లొ 25% గా వున్న GDP 1947 కి <1% ఎలా అయింది? దానికి సమాదానము లేదు.
అసందర్బమైన accusations చెయడం అనేది ఇంకొక ఎత్తుగడ.
ఇలాంటి వాటిని academic (legal frame work) గా తిప్పికొట్టాలి. ఇలా చెయాలి అంటే మన youth కి rigorous training కావాలి. పిచ్చి వాడితొ మనకు పని ఎమిటి అని వదిలేయ కూడదు.
తెల్ల కిరస్తానీల నుండి మన మతము లొ వున్న కొన్ని sections కి massive funds అందుతున్నాయి, మనలను ఎలా అయినా లొపలనుండి destroy చెయాలని. వాళ్ళు వాడే techniques కొన్ని ...
- మనకు History లేదు
- మనది అసలు మతమే కాదు
- మనము రేసిష్ట్ ల ము (కొన్ని sections ను అణగ తొక్కుతున్నాము)
- మనలను మనము పరిపాలిచుకొ లేము
- తెల్ల కిరస్తానీ కాని తురక అరబ్బు కాని లేక కమ్యునిష్ట్ కాని మనలను పరిపాలించాలి
- మనకు స్త్రీ లను గౌరవించడము రాదు
-
ఇప్పుడు ఒక విదంగా చూస్తె మన సమాజం/దేశం మీద తెల్ల కిరస్తానీలు complete control కలిగి వున్నారు.
http://en.wikipedia.org/wiki/Why_I_Am_Not_a_Christian
by Bertrand Russell, wrote in 1927
పై దానిని copy కొట్టి హిందువుల మీద వ్రాసిన "చెత్తయ్య" రచన చదివే వుంటారు.
ఇక్కడ నేను వ్రాసే పాయింట్స్ ఎవరు అంగీకరించవలసిన పనిలేదు.
ప్రపంచము లొ ఇప్పుడు వున్న ప్రధాన మైన 5 మతాలు(*) హిందు, జుదాయి, బుద్ద, కిరస్తాని, అరబ్బు. వాటిలొ తెల్ల కిరస్తానీలు, అరబ్బు తురకలు అనుసరిస్తున్న 2 మతాలు వివిద కారణాల (structure & ఎకత్వము) వల్ల dominant గా వున్నాయి. వారి వేనుకనే జుదాయి తమ intellectual capacity & ఎకత్వము తొ dominant గా వున్నారు.
(*) హిందు కాక మిగతా మతాలను ఎవరొ ఒకరు స్తాపించారు. హిందు స్తాపకులు ఎవరొ తెలీయదు. అందుకే ఇది మతము కాదు, ఒక జీవన విదానము చి చెప్పవచ్చు. కాకపొతే ఈ discussion కు హిందు ను ఒక మతము గా పరిగణిద్దాము.
ఇక మిగిలింది హిందు, బుద్ద మతాలు. వీటి followers, dominant గా కాక, defensive mode లొ వుండి పొయారు. ఎవడొ ఒకడు రాయి వెస్తుంటాడు, వీళ్ళు ఆ రాయి తగలకుండా, లేక తగిలినా తగలలేదు అని సర్దుకుపొతుంటారు. అది ఎందుకు ఇలా?
Dominant మరియు non-dominant మతాలను, వాటి పని చేచె విదానమును గమనిస్తే, మీకే సమాదానము తెలుస్తుంది. ఎమిటది?
Dominant మతాలు organize గా వున్నాయి. అంటే ఒక structure వుంది (top-to-bottom), ఒక గమ్యం వుంది. ఎమిటా గమ్యం? వీలు అయినంత మందిని మత మార్పిడి చెయాలి. దానికి అనుసరించే పద్దతులు ఎవైనా సరే, దాని కొసం ఎమి చేయడానికైనా సరే.
దాని వల్ల లాభం ఎమిటి? numbers. Strength in numbers. Control over resources (land) all over the globe. To over come natural attrition (secularization, loss of members to rivals etc) and decline in natural birth rates.
వీరికి వున్నవి రెండు ప్రధానమైన పద్దతులు. 1) వున్న వారిని ప్రతి వారము brain wash చెయడము 2) కొత్త వారి ఆత్మలను కొల్ల గొట్టటము. మత మార్పిడి మానేస్తె, ఈ మతాలు కొద్ది కాలంలొ అంతము అయిపొతాయి. అందుకని పైన చెప్పిన రెండు పనులను నిరంతరాయము గా చెస్తూనే వుంటాయి.
గమ్మత్తు ఎమంటే, అలా brain wash చెయించుకునే వాళ్ళ నుండి 10% కలెక్ట్ చేసి, కన్వర్ట్ కాబడుతున్న వారికి 5% ఇస్తారు. They pay remaining 5% as salaries & perks to మిషనరీలు మరియు native agents who were on their pay roll. ఈ పద్దతి చాలా success అయింది.
మన ఇండియాలొ అయితే మరీను. ఎంత మంది రాజకీయ నాయకులు మరియు కుల pyramid లొ దిగువన వుండి పొయిన వారు ఆ pay roll చేరిపొయారు. ఫ్రీగా డబ్బు వస్తుంటే వాడు ఆగుతాడా? దానితొ పాటు రాజకీయ అధికారము ఒక తెల్ల కిరస్తాని మనిషి చేతులొ వున్నప్పుడు.
మన కుల వ్యవస్తను reform చేసుకొవాలా (కష్టమైన పని)? లేక డబ్బులు ఇచ్చే తెల్ల కిరస్తానీ తొ చేతులు కలపాలా (సులభమైన పని) అని choice వుంటే, కుల వ్యవస్త వల్ల నష్ట పొయిన వాడు (ముఖ్యము గా pyramid లొ కిందవున్న వాడు), సులభమైన మార్గం లొ పొవడానికి చూస్తున్నాడు. అది సహజమేనేమొ? నిజమా? ఎందుకు? ఎలా?
నువ్వు ఆపాలి అని చూస్తే ఆగుతాడా? నువ్వు ఆపలేకపొతే నీకు నష్టము ఎమిటి? లాభం ఎమిటి?
will continue later ...
తాడేపల్లి గారు చెప్పినట్లు, హిందువులు కలిసి కట్టుగా ఒక చిన్న గుడి కట్టాలి అని అనుకుంటే, అది 5 లేక 10 సంవసరాలు పట్ట వచ్చు. ఈ లొపల తెల్ల కిరస్తానీలు మరియు అరబ్బు తురకలు పది కిరస్తానీ మందిరాలు, ఐదు మసీదులు కట్టేస్తారు. కాని హిందువులు అతి కష్టం మీద ఆ project పూర్తి చేయవచ్చు, చేయలేక పొనువచ్చు.
ఎందువల్ల? ఏమిటి లొపం?
డబ్బు లేకనా? మరి డబ్బు లేక పొతే, స్విస్ భాంకులొ 1.5 Trillion Dollars ఏలా దాచ గలిగారు? దానికి పది రేట్లు సంపద ఇండియాలొ వున్న corrupt people (రాజకీయ రాబందులు, bureaucratic రాబందులు) దగ్గర ఎలా వుంది?
దీన్ని బట్టి అర్దం అయింది ఏమంటే - డబ్బు అనేది సమస్య కానే కాదు. మరి ఏమిటి సమస్య? ఈ ప్రష్నకు సమాదానమే, హిందువుల భవిష్యత్తును నిర్దేసిస్తుంది.
గుడి సంగతి వదిలేయండి, ఒక మరుగు దొడ్డిని కూడా సరిగా అమర్చుకూలేని హీన స్తితిలొ హిందువులు వున్నారు ఈనాటికి. పల్లెలు అని లేదు, పట్టణాలు అని లేదు, ఉదయమే బారులు తీరి రొడ్లు వెంబడి, డొంకల వెంబడి చెంబులతొ దర్శన మిస్తుంటారు.
ఇక బడి (Schools) సంగతి సరే సరే. గుడులను (Temples) కరప్ట్ రాజకీయ నాయకులకు మరియు పంది కొక్కులు అయిన Bureaucrats కు అర్పణము చెచారు.
హిందువులు ఇంత confused గా/తికమక గా/"దిశా నిర్దేశం లేకుండా" ఎందుకు వుంటున్నారు? solutions ఏమిటి?
సామాజక భాద్యతలను ఏన్నొ ఏన్నెన్నొ గాలికి వదిలి వెయడం జరిగింది. ఒక 30 సంవసరాల ముందు వున్నంత భాద్యతాయుతంగా కూడా ఇప్పుడు లేరు.
కారణాలు అనేకం. కాని solution మాత్రము ఒక్కటే.
In any given population group (సమాజం కావచ్చు లేక మతం కావచ్చు) 2-5% assume leadership role and guide the remaining population. The role of this tiny group is paramount in survival of the entire population.
మన హిందువులు ఎప్పుడు అయితే, ఈ group existence and/or support లేకుండా వున్నారొ, అప్పటి నుండే హిందువుల అవరొహణం మొదలయింది. అరబ్బు తురకల నుండి, తెల్ల కిరస్తానీల వరకు హిందువులను బానిసలుగా చెయగలిగారు. ఆ బానిసత్వము ఇంకా కొనసాగుతు వుంది ఒక తెల్ల కిరస్తాని చేతిలొ.
కిరస్తానీలు కాని తురకలు గాని survive అవుతున్నారు అంటే దానికి కారణము, వారికి వున్న core group support వల్లనే. తురకలు ఒక దేశం నుండి 50 దేశాలుగా విస్తరించినా, కిరస్తానీలు ఒక ప్రాంతము నుండి ప్రపంచము అంతా విస్తరించినా వారికి వున్న core group వల్లనే అనేది కాదనలేని నిదర్శనము.
అదే సమయములొ హిందువులు వున్న ఒక్క హిందు దేశమైన Nepal ను పొగొట్టుకున్నారు. భారత దేశములొ దాదాపుగా సగము భూభాగాన్ని పొగొట్టుకున్నారు (1947 దేశ విభజన).
will continue later ....
ఋగ్ వేదం (Rig Veda) లొ చెప్పినట్లు ... దేవతలు అందరు కలిసి ఇంద్రుడిని తమ leader గా ఎన్నుకున్నారు. ఏందుకు?
తమను lead చెయాలి అని, తమను తమ శత్రువుల బారి నుండి రక్షించాలని, తమ ధర్మం రక్షింప బడాలని, తమ culture ఒక తరము నుంది ఇంకొక తరానికి ఒక జీవ నదిలా ప్రవహించాలని.
కాని హిందువులు ఇప్పుడువున్న దయనీయ స్తితి చూస్తుంటే, ఆ జీవ నది ఇంకా ఎక్కువ దూరం ప్రవహించదు అని అనిపిస్తుంది. మహాభారత కాలంలొ సరస్వతి నది ఏండి పొయి నట్లు.
ఏమిటా దయనీయ స్తితి?
-- loss of రాజకీయ అధికారము for the last 1200 years
-- loss of control over History writing. మన చరిత్రను వేరే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చి నట్ట్లు వ్రాసి, మన పిల్లలకు అది నేర్పుతున్నారు. మన తరం తరువాత తరం మన core values నుంది కొంచెం కొంచెం దూరం అయిపొతున్నారు.
-- loss of control over Education
-- loss of control over దేవాలయాలు
-- loss of control over social institutions
-- loss of unity among హిందువులు
-- loss of control over Media
-- loss of sense of purpose
-- lack of unified leadership
-- lack of institutional support
హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరచి ...
Elect or choose leadership (about 2-5% of the total population) to lead them and represent them, and to propagate హిందు మతము. రేండు విషయాలు ముఖ్యము ...
-- core leadership for protection
-- మత ప్రచారము (పాత నీరు పొతున్నప్పుడు, కొత్త నీరు వచ్చి చేరాలి, లేకపొతే ఆ నది (సరస్సు లేక సాగరము) ఎండిపొతుంది.
ఇంతకు ముందు ఎవరొ అన్నారు, ఎంత ప్రయత్నించినా, ఎవరు ముందు రావడము లేదు అని (ఏదయినా మంచి పనిచెయడానికి). ఎలా వస్తారు, ఎందుకు రావాలి? సామాన్య ప్రజలు (నూటికి 95-98 శాతం ప్రజలు) ఎప్పుడు ఒక స్తితి (inertia) లొ వుంటారు. అది సామాన్య ప్రజల సహజ స్తితి. ఉదాహరణకు Electrons తమ నిర్దేశించిన కక్ష్యలొ తిరుగుతున్నట్లు. ఏదయినా external stimulus కాని, లేక రసాయనిక చర్య కాని జరిగినప్పుడు మాత్రమే Electrons చైతన్య పూరితము అవుతాయి.
వుదాహరణకు - రామ జన్మభూమి విషయము మీద (1984 - 2000) దేశము లొ ఎక్కడ ఎక్కడొ (ప్రతి గ్రాంమం లొ) వున్న సామాన్య హిందువులు చైతన్య వంతులై తమ సంఘీ భావానీ తెలియ పరిచారు. దాని పరిణామమే బజప అధికార ఫీటం ఎక్క గలిగింది.
మామూలు సమయాలలొ సామాన్య ప్రజలు (హిందువులు) కొంత జడత్వము కలిగి వుంటారు. అందుకే కిరస్తానీలు మరియు తురకలు ప్రతివారము తమ ప్రజానీకానికి Brain Wash చెస్తుంటారు.
Solutions:
-- Core leadership for protection. Full time, paid, well trained, conservative people.
-- మత ప్రచారము (పాత నీరు పొతున్నప్పుడు, కొత్త నీరు వచ్చి చేరాలి, లేకపొతే ఆ నది (సరస్సు లేక సాగరము) ఎండిపొతుంది.
ఇలాంటి వాటిని academic (legal frame work) గా తిప్పికొట్టాలి. ఇలా చెయాలి అంటే మన youth కి rigorous training కావాలి.
రమేష్ గారు. మీరు మీ అనుభవముతో చాలా మంచి విషయాలు చెప్పారు. అందులో నాకు ఉత్కృష్టమైనది పైన అనానిమౌస్ గారు చెప్పిన వాక్యం. నిజముగా చెప్పలంటె ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో చాలా వరకు నాకు తెలియదు. ఖచ్చితముగా తులనాత్కమైన శిక్షణ కావాలి. అందులో కూడా ఎక్కువగా విసుగులేకుండా, తర్కానికి ప్రాధాన్యమిస్తూ మక్కువతో తర్పీదు ఇచ్చేవాళ్ళు ఉండాలి. "విసుగులేకుండా" అని అనడములొ ఆంతర్యం ఒక్కటే - ఇప్పటి యువత/తరానికి(నన్ను కలుపుకొని) కి ప్రతిదానికీ ప్రశ్నించే((పునాది లేకపోయినా)స్వభావము మెండు. దానికి తోడు అర్ధంపర్ధం లేని ప్రచారమాధ్యమాల హొరులో ప్రతి దాన్నీ సైన్సు తో భేరీజు వెయ్యడం. కనుక, విషయన్ని సమగ్రముగా ఆకిళింపు చేసుకున్న పెద్దలు ఒక తాటి(!) మీదకి వచ్చి తమ అనుభవాన్ని జోడించి అర్థాన్ని వివరించే పనిచేయాలి. నా ఉద్దేశ్యము అప్పటితరం ఆలోచనాసూన్యులు అని కాదు, కానీ ఆ తరం, తర్కానికి వితండవాదానికి మధ్య ఉన్న సన్నటి గీతని గుర్తెరిగి మసిలారు. అలాగే సందేహం వచ్చినపుడు తనకు తానుగా/లేద తెలిసిన పెద్దల సాయముతో వాటిని పరిశోధించేవారు. ఇప్పుడు అంతా తారుమారైంది. తనకు తానుగా ఇప్పుడూ చదువుతారు, దాని వల్ల ప్రాపంచిక సుఖం లేదా లాభం ఉన్నప్పుడు. అందువల్ల, ఈ తర్పీదు(వాస్తవిక దృష్టితొ) అనేది చిన్నపటినుంచీ జరగాలి అని నా భావన.
ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ టపా ద్వారా మిగిలిన పెద్దలు ఇంకా ఏవైనా విషయాలు తెలియజేస్తారని భావిస్తూ ఈ టపాని తాజా గా ఉండేట్టు(కామెంటు తొ :)) ప్రయత్నిస్తా.
Ekkadithe logical ga chukkeduravuthundo akkada undadu "Katti" :)
ప్రస్తుతం హిందువులైన మనలో ధర్మాచరణ ఉన్నది . కానీ ధర్మనిష్ట లేదు . వివరిస్తాను
ధార్మికమైన క్రియలలో పాల్గొనటం లేదా వాటిని జీవితంలో ఆచరించటంలో కాస్త శ్రద్ద పెరుగుతున్నట్లనిపిస్తున్నది కాని
ఆధార్మికమైన విషయాలతో మమేకం కావటం తగ్గుతున్నది.
ఉదాహరణకు మనవాళ్ళు ఒక ఆలయంలో పూజలు జరిపితే చక్కటి ఫలితాలొస్తున్నాయంటే గుంపులుగా వెళ్ళి వేలుఖర్చుపెట్టయినా పూజలు చేస్తారు . కానీ అదే ఆలయంపైన ఎవరన్నా దాడికి వస్తున్నరని కాని బాంబులేయనున్నారనికాని పుకారువస్తే అక్కడనుంచి క్షణాలలో మాయమైపోతారు . ఒకవేళ ఎవరన్నా ప్రతిఘటించాలని కోరికౌన్నా నిరుత్సాహ పరుస్తారు.
అదే ఒక మసీదు పై ఎవరన్నా రాల్లేయబోతున్నారుఅన్నిపుకారుపుట్టినా సరే వెంటనే పిల్లాదిమొదలు లుంగీలెగ్గట్టి రాల్లుతీసుకుని ఎదుర్కొనటానికి సిద్దమవుతారు ముస్లింలు . ఈమాత్రం శ్రద్దాశక్తులు ఎందుకు లోపించాయి ?
Post a Comment