పరమపూజనీయ రాధికాప్రసాద్ మహరాజ్ వారి సంపూర్ణజీవితచరిత్ర
>> Tuesday, November 2, 2010
పరమపూజ్య శ్రీ రాధికాప్రసాద్ మహరాజ్ వారు సంపూర్ణజీవితాన్ని అమ్మసేవలో గడిపి లోకానికి తనజీవితాన్నే మార్గదర్శనం గాచూపి రెండువేలమూడు ఆగస్ట్ పదహారవతేదీ న అమ్మ నిత్యలీలలో ప్రవేశించారు . సఖీరూపందాల్చి గోలోకానికి తరలి వెళ్లారు .
,అమూల్యమైన వారి బోధలు గురుబమ్ధువు ఒకరు నిర్వహిస్తున్న ఈక్రింది సైట్ లో చూడండి
www.sriradha.org
అలాగే నాన్నగారి సంపూర్ణజీవిత చరిత్రను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://docs.google.com/leaf?id=0B7AupJaw5x-pOTVlMjBkMzYtNmFhNS00MmQyLWE0NWEtNWQ5YmY0NDMzY2Fm&sort=name&layout=list&num=50
పమపూజనీయులైన మహాత్ముల పాదధూళికైతపించే ...మీ...
దుర్గేశ్వర
6 వ్యాఖ్యలు:
ఈ రాధికా ప్రసాద్ ఎవరండీ? సఖీ రూపం దాల్చటమేమిటి? ఏ అమ్మ సేవలో గడిపారు ? "రాధా" అమ్మవారా? వింతలు! వింతలు!
గోలోకమేమిటి? అర్థం కాలా !
@ఈ రాధికా ప్రసాద్ ఎవరండీ
మీకు తెలీక అడిగారని నాకు తెలిసిన సమాధానం ఇస్తున్నా, ఈకలు పీకొద్దు.
ఈయన ఒక పేరొందిన స్వామీజి. ఒంగొలు, నెల్లూరు మరియు గుంటూరు, కృష్నా పక్క బాగా చాలమందికి తెలుసు.
వీరిని అందరు "నాన్న గారు" అని పిలుస్తారు. వీరి సంప్రదాయం లొ రాధాదేవిని అనుష్టాన దేవతగా, క్రిష్ణుడికి ప్రతిరూపముగా కొలుస్తారు. ఇంకా సమాచారం కోసం ఆ లింకుల్ పీక నొక్కండి.
@గొలోకం
గొపాల బాలా కిట్టయా.. ఉండే లొకం అని వువాచా.
@ రాజేష్... :)
మళ్లీ :)
@రాజేష్ - ఇప్పుడో చిన్న ప్రశ్న - మీరు బ్లాగులోకంలో ఎప్పటినుండి ఉన్నారు ?
@ఎప్పటినుండి ఉన్నారు ?
ఈ మద్యే నండి. ఎం అలాగా అడిగారు?
నాకయితే ఈ బ్లాగ్సేరిత్ర తెలీదండి.. ఏదో సుత్తి బ్లాగ్సేరిత్ర మీద రాసిన కింద రెండు పుస్తకాలు(?) సదువుతున్నా.
౧.నే బ్లాగ'రెట్ట'యితిని
౨.నే జేప్పాల.. నువ్ ఇనాల
అందువల్ల ఏదో పిల్లోడ్ని కాబట్టి తప్పులేమయిన రాసిఉంటే క్షమించండి..
ఎమాటికామాటే, మీరు రాసిన సెటైర్ అద్భుతం..ఛలోక్తి..అతిశయోక్తి అనుకోకూడదు గాని
నేను మొదట చదవితే అర్థం అవలా.. మళ్ళీ సదివా.. సటైర్ అర్థం అవ్వి౦ది... అదీ witty-full satire లేక్క ..
మా అప్పయకిచ్చా.. సదవమని.. హబ్బే..
మీ తర్వాతి టపా కోసం ఎదురు చూస్తుంటా.
అన్నట్లు మీ Maaganti.org కి చాలా పాతవాడినే..
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనమన్నట్లు.. ఆ బలాగులో నే మీ గురించి మాట్లాడితే ఈ బ్లాగాయన కోప్పడోచ్చు.. సో ఇక సాలు.
చివరగా.. మీ ఒక్క సిన్న ప్రశ్నకి సానా పేద్ద సమాధానం చెప్పా.. ఇప్పడు నాదొక సిట్టి ప్రశ్న.
ఈ రెండు ":)" ఎందుకు? ఆంతర్యమేమి?
Post a Comment