సోదరీమణులూ ! ఈ ఆదివారం మీ అన్నదమ్ములకు భోజనం పెట్టండి
>> Saturday, November 6, 2010
కార్తీక మాసములో రెఁడవరోజయిన విదియ తిథి నాడు యమున తనసోదరుడయిన యముని సత్కరించినది. ఆరోజును భగినీ హస్త భోజనము, వ్యవహరిస్తారు. ఆరొజు సోదరులను తమయింటికి పిలచి ,భోజనము పెట్టి వారి ఆశీర్వాదము తీసుకొనుట భారతదేశములో మహిళలు పాటించే ఆచారము. ఆ సోదరులు కూడా తమ సోదరి లను కానుకలతో సత్కరిస్తారు. దీనివలన వారి మాంగల్యబలము మరింత శక్తివంతమవుతుందని. శాస్త్రవచనము. అలాగే తమచెల్లెళ్లను సత్కరించిన వారికి అపమృత్యువు లేకుఁడా వరమిచ్చాడు. యమధర్మరాజు.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి. మరెందుకాలస్యం మరచిపోయిన వారుంటే వెంటనే పిలవండి. . బ్లాగ్ లోకములో వున్న నాసోదరీమణులకందరికీ సకలశుభాలు కలగాలని కోరుకుంటున్నాను.
కార్తీక పాఢ్యమి మిగులు తదనంతరం విదియ ఈసంవత్సరం ది 7-11-2010 ఆదివారం నాడే రావటం వలన ఈరోజే మీరు మీ అన్నదమ్ములను పిలచి భోజనం పెట్టి వారిచేపసుపుకుంకుమ,వస్త్రాదులను కానుకగా పొందండి .
6 వ్యాఖ్యలు:
దుర్గేశ్వర గారూ,
నాకు బాగా గుర్తుంది. మీరు గత దీపావళి తర్వాత రోజుకూడా "భగిని హస్త భోజనం" గురించి రాశారు. చాలా సంతోషం! రాఖీ ని అత్యంత ఆదరణ తో సొంతం చేసుకుని ఆచరించే ప్రతి తెలుగింటా ఈ శుభ దినం గురించి కనీసం చాలా మందికి తెలీను కూడా తెలీదంటే ఆశ్చర్యమే!
మా మేనమామలు మా ఇంటికి వచ్చి అమ్మ చేతి భోజనం చేసి వెళ్ళడం బాగా గుర్తుంది నాకు!
అధ్యాత్మిక లాభం సంగతి ఎలా ఉన్నా ఆత్మీయానుబంధాలను ఇలాంటి చిన్న చిన్న సందర్భాలే బలోపేతం చేస్తాయి.
ధన్యవాదములు
కానీ మీరు ఆథ్యాత్మికలాభం ఎలాఉన్నా అని అన్నారు . కానీ ఆథ్యాత్మిక లాభం కూడా తప్పనిసరిగా చేకూరుతుంది , మీరు మీ అన్నదమ్ములను చూడగలరేగాని వారిలో ప్రేమను కంటితో చూడలేరు కదా ! దాని ఫలితాన్ని మాత్రం పొందుతారు . అలాగే ఆథ్యాత్మిక లాభం కూడా తప్పకుండా మీకు అనుభవం లోకొస్తుంది
పనిలో పని గా బ్లాగులోకంలో ఉన్న తల్లులకొక మనవి
మీరు మీ అన్నదమ్ములకు భోజనం వడ్డిస్తున్న ఫోటోలను మీఓ బ్లాగులద్వారా ప్రచురించండి . దానివల్ల ఈసంస్కృతీ సాంప్రదాయాలపట్ల మరికొందరికి ఆసక్తి కలుగుతుంది . లోకానికి ఉపకారం చేసినవారవుతారు . శుభమస్తు
ఇప్పుడు దూరాభారం వల్ల కుదరడంలేదు, ఇంతకు ముందు ప్రతి దీపావళి తరువాత రెండవ రోజు మా చెల్లెలి ఇంటికి వెళ్ళేవాడిని, రేపు చెల్లి/అక్క వరుస అయిన వాళ్ళింటికి భోజనానికి వెళుతున్నాను.
మంచి విషయం చెప్పారు. నాకు అక్క గానీ చెల్లెలు కానీ లేరు. నా కజిన్స్ నే నెను స్వంత చెల్లెళ్ళులాగా ట్రీట్ చేస్తుంటాను. ఈ ఆదివారాం వాళ్ళింట్లో భోజనం చేసి సత్కరిస్తాను.
చక్కని విషయాలను తెలుపుతున్నారు దుర్గేశ్వర గారు. చాలా సంతోషం.
Post a Comment