జాగ్రత్త ! అమ్మవారి[లక్శ్మీదేవి] ని తలమీదకెక్కనివ్వకండి . పాదాలు తగలనివ్వకండి
>> Saturday, October 30, 2010
శ్రీరామ్
మొన్న నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఒక సిద్దాంతిగారు ఫోన్ చేశాడు . అయ్యా నేనొక మనిషిని పీఠానికి పంపుతున్నాను .చాలా కష్టాలలో ఉన్నాడు . చాలా మంచి స్థాయిలో కొచ్చి ,ఆర్ధికంగా బాగా ఎదిగి .రాజకీయంగా కూడా బాగా గుర్తింపు పొంది నవాడు . కానీ దురదృష్టం వలన సంపదనంతా కోల్పోయాడు .చాలా విషాధం లో ఉన్నాడు . అతనిని వెళ్ళి అమ్మనాశ్రయించటమే తప్ప వేరు మార్గం లేదని చెప్పాను . దయచేసి అమ్మవారి పూజ కు అతనిని అనుమతించగలరా ? అని అడిగాడు . అతనెవరో నాకు తెలియదు . ఇక్కడ పీఠం విషయం కూడా అతనికి ఇంతకు ముందు తెలియదు . అయినా అతను ఇక్కడకు రావాలని సంకల్పం కల్పించబడింది అంటే అది అమ్మ ఆదేశం అని భావించాలి . రమ్మని చెప్పండి .ఆ తల్లి ఎప్పుడు ఎవరిని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుందో మనకు తెలియదు కదా ! అని చెప్పాను. అతని పరిస్థితిని గూర్చి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు చెప్పాడు ఆసిద్దాంతి గారు
.
ఇతనిపేరు ...... రావు .[అతని అనుమతి అడగనందున అతని పేరు చెప్పటం భావ్యంకాదు] . అతను నరసరావు పేట దగ్గర ఒకఊరి కి చాలాకాలంగా సర్పంచ్ గాచేస్తున్న ఒకనాయకుని కుమారుడు . ఇతను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో చేరి బాగా శ్రమించి మంచి స్థాయికి ఎదిగాడు . అత్యధికంగా పాలసీలు కట్టించి బాగా గుర్తింపు తెచ్చుకోవటం ,దానితోపాటు బాగా ఆదాయాన్ని కూడా పొందాడు. దానితో పాటు సహజంగానే రాజకీయ కుటుంబం కనుక ఆరంగంలోనూ పలుకుబడి సంపాదించాడు . ఇక ఇతని శక్తి సామర్ధ్యాలు గుర్తించినన సదరు కంపెనీ వాల్లు విజయవాడలో ఇతనికి కనకాభిషేకం చేశారట . కనకం అంటే ఈరోజుల్లో సాధ్యం కాదుకనుక డబ్బుతో చేసుంటారు . ఇది జరిగి ఐదు సంవత్సరాలయిందిట. ఆ సన్మానం జరిగినప్పటినుంచి నల్లేరు మీదబండిలా సాగుతున్న అతని జీవనయాత్ర లో కుదుపులు మొదలయ్యాయి . బండి రివర్స్ గేరులో పడింది . మనవాడు చెయ్యిపెట్టిన చోటల్లా నష్టం రావటం మొదలైంది . ఆర్ధికంగా దెబ్బమీద దెబ్బ లు తగిలాయి . ఇతనుకాక నలుగురన్నదమ్ములు,అక్కచెల్లెల్లకు మంచీ చెడ్డా అన్నీ తనే చూశాడు . ఆర్ధికంగా ఇబ్బందులు మొదలవ్వగానే ఎవరిదరిన వాల్లు జారుకున్నారు . ఇక డబ్బున్నోడే పెద్దమనిషి ఈరోజుల్లో కనుక ఇతని నాయకత్వం పట్లకూడా అనుచరులకు ఆసక్తి తగ్గింది .
అయితే ఇతను వ్యక్తిగతంగా మంచివాడు . దానాధర్మాలపట్ల అనురక్తి కలవాడు . ఈపుణ్యమే అతనిని కాపాడుతున్నది .ఈమధ్యకాలంలో విజయవాడ వెళ్లినప్పుడు ఒక స్నేహితుడు ఈసందేహం వెలిబుచ్చాడట . ఒరే ! నీకు ఆసన్మానం జరిగినప్పటినుంచి ఎదురుదెబ్బలు మొదలయినట్లున్నాయి అని . అతనికికూడా మనసులో ఉన్న ఈసందేహాన్ని తన కుటుంబానికి ఆప్తులైన సిద్దాంతి గారి వద్ద వెలిబుచ్చాడు . ఆయన కూడా అన్ని విధాలా పరిశీలించి ,ఇది దైవంపట్ల జరిగిన అపచారమేనని నిర్ణయించి దీని పరిష్కారంగా అమ్మనాశ్రయించటం వినా వేరు మార్గం లేదని తెలిపారు. కళ్లకద్దుకోవలసిన ధనాన్ని కాళ్లతో తొక్కటం ఎంత దోషమో ఇతని జీవితంలో ప్రత్యక్షంగా కనపడుతున్నది . అమ్మవారిని సేవించుకోవాలంటే అమ్మవారు ఆనందలాస్యం తో నెలకొన్నసిధ్ధక్షేత్రం శ్రీవేంకటేశ్వరజగన్మాత పీఠానికి వెళ్ళి అమ్మను ప్రార్ధిస్తే శీఘ్రమే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పాడట . ఆవిషయాన్నే నాకు చెప్పి ఆభార్యాభర్తలకు వేరొకరిని తోడునిచ్చి పంపాడు .
మహర్ణవమి ఉత్సవం రోజు వాల్లు పన్నెండుగంటలకు వచ్చారు. వాళ్ళు వచ్చేసమయానికి పీఠంలో కుంకుమార్చనలు ఒకవైపు అమ్మవారికి ప్రీతిపాత్రంగా సాగే సంకీర్తన సాగుతున్నది . చిన్నపిల్లలు ఆనందంతో సంకీర్తనకనుగుణంగా నృత్యం చేస్తున్నారు . భక్తులు పూజలు జరుపుకుంటూ కోలాహలంగా ఉంది . అమ్మవారు ఆనందతో తాండవచేస్తుందా అన్నవిధంగా చిన్నారుల పాదాలు కదులుతున్నాయి . వర్ణింపలేని కాంతులతో అమ్మ వెలిగిపోతున్నది .
వచ్చిన ఆదంపతులను పూజకు కూర్చోబెట్టి ఎందుకో శివాభిషేకం చేపించాలని అనిపించగా అభిషేకలింగ తెప్పించి వాళ్ళు పూజమొదలెట్టబోయేసరికి సంకీర్తన చేస్తున్నవాల్ల నోటివెంట నమ:పార్వతీ పతయేహరహర ........హరహరశంకర మహాదేవా ...... అనే కీర్తన మొదలైంది . అరే మంచి శుభపరిణామం అనుకుంటూ సకలదోషాలూ నివారించాలని ప్రార్ధిస్తూ రుద్రనమకచమకాలతో అభిషేకం జరిపాము .చేతులారా శివుని పూజించి ఆభార్యాభర్తా తన్మయులయ్యారు. ఇలాకనకాభిషేకాలపేరుతో ధనాన్ని మీమీదపోసినప్పుడు ఆడబ్బు పాదాలపైబడి నందువలన దోషం కలిగిఉండవచ్చు . ఆతల్లి అనుగ్రహం కోసం తపించేమనం కాళ్లతో తాకటం అపచారం . అయితే తప్పులెన్నిచేసినా తల్లీ ! నీవుతప్ప మమ్మల్నెవరు మన్నిస్తారని వేడుకుంటే కన్నతల్లి కనుక కరిగి పోతుంది అమ్మను కన్నీళ్లతో క్షమించమని ప్రార్ధించండి అని చెప్పి లక్ష్మీదేవిగా అమ్మను అర్చింపబూనుకోగానే చిత్రంగా సంకీర్తన చేస్తున్న వాళ్లనోటినుంచి శ్రీ...లక్ష్మి దేవీ ... మాపూజలు గైకొనుమా ...అనే కీర్తన మొదలైంది .నిజంగా నాకైతే అమ్మ అనుగ్రహానికి కనులవెంట నీల్లొచ్చాయి . పూజచేస్తూ ఆభార్యాభర్తా అదేస్థితికి లోనయ్యారు. మైకు లో వస్తున్న సంకీర్తనా ధ్వనివ్ల్లాయిద్యాలఘోషలో మేము మాట్లాడేవికాని .మేము జరుపుతున్న పూజకాని మిగతావారికి వినపడే అవకాశం లేదు . కీర్తనలను పోటాపోటీగాపాడుతున్న భక్తులు నాట్యం చేస్తున్న చిన్నారులమీదే భక్తుల దృష్టంతా ఉంటుంది . మరి అనుకోకుండా అమ్మవారికి ఏరూపమ్తో పూజ జరుగుతుందో ఆరూపం మీదనే వాల్లెట్లా పాట మొదలెట్టారు ? ఇది బిడ్డలపట్లఅమ్మకున్న అనురాగానికి ప్రత్యక్షప్రమాణమే. అమ్మవారికి పసుపుకుంకుమగంధాధిద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేకంగా వాల్లుతెచ్చుకున్న ఐదువందల పదహారు రూపాయల నాణేలతో అమ్మవారిని ఆర్తితో అభిషేకించుకున్నారు .
అమ్మను ఆశ్రయించినవారికి ఆపదలు ఉండవు అని ధైర్యం చెప్పి . నలభైరోజులపాటు నిత్యం కనకధారా స్తవంతో అమ్మవారికి ఇంటిలో పూజజరపమని .అలాగే రోజూ గోమాతకు ఒకపండు సమర్పించి నమస్కరించమని ,ఈకాలంలో ఆయిట ఆవునేతితో దీపారాధన జరుపుతుండమని చెప్పి పంపాను .
మూడునాలుగేళ్లుగా మామనస్సులో సంతోషం తో ఉన్నరోజులు లేవు . పీఠానికెళ్ళి పూజమనసారా చేసుకున్నాము . వెళ్ళెప్పుడుకూడా ఏడ్పుదిగమింగుకుంటూనే వెళ్లాము . అమ్మ కరుణించింది అని నమ్మకం ఏర్పడింది .అమ్మ అండ మాకుంది అని నమ్ముతున్నాము మనస్సంతా ప్రశాంతంగా ఉందని వాళ్లసిద్దాంతి గారికి చెప్పి వెళ్లారట .
అమ్మదయ్ట ఉంటే అన్నీ ఉన్నట్లే ..అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి . నిను నమ్మినవారికెన్నడు నాశము లేదుకదమ్మ ఈశ్వరీ ....అని భక్తులు నిత్యం స్తుతిస్తూ ఉండే ఆతల్లిని ఆ దంపతులదైన్యాన్ని తొలగించి వారింట సకలశుభాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాను .
ఈసందర్భంగా ఒకవిషయం స్పురణకొచ్చింది నాకు. లోకాలను సంపదలరూపంలో అనుగ్రహించే తల్లి లక్ష్మీదేవి మానవుని లో వివిధస్థానాలలో ఉన్నప్పుడు ఒక్కో రీతిగా వారిననుగ్రహిస్తుంది . ఆస్థానాలన్నీ దాటి తలపైకి ఎక్కిందో ఇకనిలువదు . వారిని వదలి వెళ్లిపోతుంది అని దత్తాత్రేయులవారు దేవేంద్రాదులకు చేసినబోధ గుర్తుకు వచ్చింది . చరిత్రలో కూడా కనకాభిషేకాలు చేపించుకున్న శ్రీనాథకవిసార్వభౌముల వద్దనుండి ప్రభువులవరకు ఎందరో జీవితాలలో అశుభాలు ప్రాప్తించినట్లు తెలుస్తుంది .
ఏదేమైనా అమ్మను ప్రేమించి గౌరవిద్దాం . ఆతల్లి నెత్తికెక్కి మతిచెడే పనులు మనచే జరపకుందా చూసుకుందాం . పాదాలతో ధనం తాకరాదనే పెద్దలహెచ్చరిక గుర్తుంచుకుందాం .
2 వ్యాఖ్యలు:
చిన్నప్పుడు భోగిపళ్లు పోసేటప్పుడు కానీ లు (పైసలు), భోగిపళ్లు,చామంతుల రేఖలతో వేసేవాళ్ళు, ఆ ఆచారం మంచిదే నంటారా?
manchide lk.raju garu,kaaneelu[lakshmi]talakekkite,paadaalaki jaaripothundani cheppadame e sampradayamlo daagina rahasyam.
Post a Comment