శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసముంటే ఏఫలితం లభిస్తుంది ?

>> Sunday, October 31, 2010


మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి . ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారుండ్రరు. అయితే ఆతల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు . కనుకనే పెద్దలు మానవశరీరం లో ఆతల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితాలొస్తాయో సంకేతరూపంలో తెలియజేశారు . ఈవిషయాన్నే జ్యోతిషశాస్త్ర రీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి .ఇప్పుడు పెద్దలు చెప్పిన సూచనలను చూద్దాం .

అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆమానవునకు పెద్దపెద్దభంతులు.విలాసవంతమైన గృహాలు లభిస్తాయట.
తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది.
గుహ్యభాగంలో ఉంటే భార్యాసుఖం సాంసారిక ఆనందం లభిస్తుంది
రొమ్ముభాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి.
కంఠభాగంలో ఆతల్లి తేజస్సుఉన్నప్పుడు ఆభరణప్రాప్తి కలుగుతుంది
ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి యేకాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి ,మధురమైన కవితాశక్తి పాండిత్యము లభిస్తాయి

ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...! వాని దగ్గర నిలబడదు . వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలినతనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు . ఈ విషయాన్ని దత్తాత్రేయస్వాములవారు దేవతలకు బోధిమ్చి వున్నారు.
జ్యోతిషరీత్యాపరిశీలిస్తే లక్ష్మీ దేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారం తో పై సంకేతాలు కచ్చితంగా సరిపోలుతున్నవి అని జ్యోతిషకారులు చెబుతున్నారు .
జగన్మాత అగు ఆతల్లి కృపహఠాత్తుగానో,పుట్టుకతోనో మనపై కలుగవచ్చు. పూర్వజన్మలో మనం చేసిన సత్కర్మలో,ఇప్పటి సద్వర్తనమో , మనతల్లిదండ్రులు చేసిన పుణ్యమో దానికి కారణం కావచ్చు. సంపదలను అనుగ్రహించే ఆతల్లి ఆసంపదలను సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తుంది . ఆడబ్బుచేరటం తో మదమెక్కి ప్రవర్తిస్తే రాక్షసులలాగానే ఎప్పుడొ ఏమరుపాటున ఆతల్లిని తలపైకెక్కించుకుని [కళ్ళుకూడా అక్కడేఉంటాయనే పెద్దలు కల్లునెత్తికెక్కాయిరా అని తిట్టేది ] కానిపనులు చేసి కష్టాలపాలు కాకూడదు . అమ్మదయతో చేరిన ఆధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి .ధర్మ,కామ,మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా వినియోగించుకోవాలి .

// ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీప్రచోదయాత్ //

1 వ్యాఖ్యలు:

Anonymous October 31, 2010 at 10:39 AM  

ippudu sukrudekkadunnaado elaa telustumdi

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP