శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మాటలు రాని బిడ్డగా ఉంటేనే మేలు .

>> Monday, October 11, 2010

అమ్మను ఏమి కోరాలి ? ఎలా అడగాలి ? ఏసాధనారీతులతో ఎలా మెప్పించాలి ? ఇవి ఉపాసకులను కలవరపెట్టే ప్రశ్నలు . సాధకులైనవారంతా ఏదో ఒకరూపం లో వారి ఉపాసనలను కొనసాగిస్తుంటారు ఈ శరన్నవరాత్రులలో . అమ్మవారి ఉపాసన లో ఉన్నన్ని మార్గాలు మరెక్కడా కనరావు మనకు. పండితుడైనా పామరుడైనా తల్లికి బిడ్డలందరి మీదా ఒకే విధమైన అనురాగం ఉంటుంది కనుక అన్ని ఉపాసనలను స్వీకరిస్తుంది .అమ్మా అని పిలచినవారందరినీ అనుగ్రహిస్తుంది .

ఐతే మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే ఓ గొప్పసత్యం మనకు కనపడుతుంది . వారెవరూ నాకు ఇది కావాలి అని అడిగినట్లుగా కనపడదు .అయినా సర్వసిద్ధులు ,సకల సంపదలు వారి ఆజ్ఞనుపాటించేలా అనుగ్రహించినట్లుంది అమ్మ. పిచ్చివాల్లలా సాధారనంగా కనపడే ఆమహాత్ముల ద్వారా లోకానికి జరిగిన మేలంతా అమ్మ అనుగ్రహవర్షమే .

మాటలు రాని పసిబిడ్డకు చూడండి ఎన్నెన్ని డ్రస్ లు ఉంటాయో ! అమ్మ ఒకటి తెస్తే నాన్నొకటి కొంటాడు. తాత ఒకటితెస్తే అమ్మమ్మ ,మామయ్య,బాబాయి ఇలా తలా ఒకటి తెస్తారు . వాడికిన్ని ఎందుకు అని ఆలోచించరు . వాడికోసం కొనటమంటే అదొక ప్రీతి వారందరికీ .ఎన్నున్నా ఇంకా తెస్తూనే ఉంటారు వాణ్ని చూడ్దానికొచ్చిన బంధువులంతా .
అయితే వీడికి మాట్లాడటం వచ్చేశాక నాకది కావాలి .ఈడ్రస్ కావాలి ,ఆడ్రస్ కావాలి అని మారాం చేసినాగాని అంత ప్రయోజనం ఉండదు . ఏది కొనాలో ఎన్ని కొనాలో అంతా పెద్దవాల్ల ఇష్టం అవుతుంది .
పైగా ఎప్పుడు పడితే అప్పుడు కొనరు. అడిగాడనుకోండి . ఎందుకురా ? మొన్ననేగా కొన్నది ? చాల్లే .అని కసురు కుంటారు కూడా .
మొన్న సంధ్యాహారతి సమయం లో వచ్చిన గాయత్రీఉపాసకులైన ఒక మితృని నోటినుంచి అమ్మ పలికించింది. "మీరడగకుండానే అన్నీ సమకూరుస్తున్న అమ్మ ఉండగా మీకు చింతలేముంటాయి?మీకెందుకు శ్రమ అని ఆయన పలికిన పలుకులలో నాకు తన అభయప్రదానాన్ని వినిపించింది . ఆసమయం లో మా పరమ గురువులు రాధికా ప్రసాద్ మహరాజ్ గారు చేసిన బోధ గుర్తు వచ్చింది " అమ్మముందు బెగ్గర్ లుగా బ్రతకకండి ,బిడ్దలుగా బ్రతకండి " అని ఆయన చెప్పినమాట మరొకసారి. మనసులో స్మరించుకుంటూ ................


నవరాత్రులలో అమ్మవారిని దర్శించండి



  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP