శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గుడ్డి వాళ్లను కూడా మోసం చేస్తావా కన్నయ్యా ? !

>> Wednesday, September 1, 2010








నేటికి 80 సంవత్సరాలకుపూర్వం బృందావనంలో మదన్ మోహన్ మందిరానికి దగ్గరగా ఒక కుటీరములో ఒక అంధుడయిన సాధువు ఉండేవారు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. ఆయన మదన టేర్ లో ఎక్కువగా ఉంటాడు కనుక ఆయనను మదనటేర్ బాబా అని పిలుస్తుంటారు.
ఆయన నిద్రలేవటమ్ తోనే స్నానాదులను కానిచ్చి,నీటి కుండ్ను ఒకటి తీసుకుని మదనటేర్ లోని దట్తమైన పొదలలోకి వెళ్ళి కూర్చుని రోజంతా రాధాకృష్ణుల లీలలను మననం చేస్తూ కన్నీరు కారుస్తూవుండేవారు. సంధ్యా సమయం లో గోవింద్ జీ మందిరానికి వెళ్ళి తన ఆవేదనను నివేదించుకుని తిరిగివచ్చేవాడు. వస్తూ రెండు మూడు ఇళ్లలో మధుకరాన్ని యాచించి అది తిని నిదురపోయేవాడు. కానీ వస్తూ పోతూ తింటూ త్రాగుతూ అన్నివేళలా రాధాక్రిష్ణుల చింతన సాగిస్తూ కన్నీరు కారుతూనే ఉండేవి ..

ఈవిధంగా నిరంతరం ఏడుస్తూవుండటంవలన ఆయన చూపు కూడా ఫోయింది. దానికాయన బాధపడలేదు.ఎందుకంటే ఆయనదృష్టిలో దేవుని దర్శించే కళ్ళే కళ్ళు. ఆభగవద్దర్శనానికి నోచుకోని కళ్ళు వున్నా లేకున్నా ఒకటే నని ఆయన భావన. ఈవిధంగా రాత్రిల్లు పగల్లు ఏడుస్తూ 40 సంవత్సరాలు గడచిపోయాయి. జీవనసంధ్యా సమయము ప్రవేశించినది. ధైర్యం సన్నగిల్లినది .భగవంతుని విరహం భరింపరానిదైనది. ఆ ఆవేదనలో ,ఆయన ఆపొదలలో మూర్చ్హపోయారు.ఆయన పట్ల సానుభూతివ్యక్తం చేసేవారెవరూ లేరక్కడ. కానీ అక్కడి పక్షులు,నెమళ్ళు,కోయిలలు మొదలయినవి తమతమ అరుపులతో ఆయన్ను మేల్కొల్పాలని ప్రయత్నించి విఫలమైనవి.అలా ఆవేదనతో స్మృతి కోల్పోతూ గడుపుతున్నాడు కాలాన్ని నామస్మరణలో.
ఒకరోజు ఆయన మదన టేర్ లో కూర్చుని ఏడుస్తూవున్నాడు. లీలావినోదంగా రాధాకృష్ణులు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకున్నారు. బాబా బాగాఏడుస్తూఉండటంచూసి ఆతల్లి భక్తానుగ్రహకాతారయగు రాధ కన్నయ్యతో ఇలా అంటున్నది."బాబా ఏడుస్తున్నాడు,వెళ్ళి నవ్వించు ప్రియా .

బాలకృష్ణుడు బాబా దగ్గరకు వెళ్ళి బాబా ఎందుకేడుస్తున్నావు? నిన్నెవరన్నా కొట్టారా? నీదగ్గరనుంచిఏదైఅనా లాక్కున్నారా? అని ముద్దుగా అడిగాడు.లేదు... లేదు.. ఇక్కడనుడి వెళ్లు అని బాబా అనిపలికాడు బాబా. బాబా నీకు మజ్జిగ తీసుకురానా?రొట్టె తీసుకురానా? ఏ
కావాలంటే అది తీసుకువస్తాను అన్నాడు కన్నయ్య."లేదు లేదు నువ్వెళ్ళు విసుక్కున్నడు బాబా."ఐనా వదలకుండా చిన్ని కృష్ణుడు మరలా మరలా అడుగుతున్నాడు.దాంటో బాబా విసుక్కుంటూ"అరే గొల్లపిల్లవాడా!వెళ్ళు వెళ్ళి గోవులని మేపుకోఫో.. నాతో నీకేం పని ? అని మరలా విలపించసాగాడు.ఇక వల్లగాక కృష్ణుడు రాధను సమీపించి బాబా నామాటవినటంలేదు. ఏడుస్తూనే ఉన్నాడు అనిపలికాడు.
అప్పుడురాధాదేవి ప్రియా బాబానెందుకు నవ్వించలేకపోయావు. నేను వెళ్ళి నవ్విస్తాను చూడు అని పలికి బాబాను సమీపించినది.బుంగమూతి పెట్టి బాబా!ఎందుకేడుస్తున్నావు?నీభార్య చని పోయినదా? అని అడిగినది. ఆచిన్నారి పాప అడిగినతీరు విని నవ్వి తల్లీ !నాకెవ్వరు లేరుఅని పలికాడు. అయితే మరెవ్వరూ లేనప్పుడు నువ్వెందుకేడుస్తున్నవు?అని మరలా అడగగా "నావాల్లంతా నన్ను మర్చిపోయారమ్మా?అంటూ " నీకుతెలియదు తల్లీ! వ్రజ లో ఒక మోసగాడున్నాడు. వానిని స్మరిస్తూ భజిస్తూ ముసలివాడినయిపోయాను. ఒక్కసారికూడా నాకు కనపడలేదు. ఇక వాడితో స్నేహంచేసి నాతల్లి రాధాదేవి కూడా కఠినురాలైనది అనిపలికెను.
రాధాదేవి ఉలిక్కిపడి.... నేనాకఠినురాలిని? అని నోరుజారి మరుక్షణమే బాబాతో ..బాబా!నాపేరు కూడారాధయే నీకు ఏమికావాలో చెప్పు?అనిఅడుగగా నాకేంకావాలిచిట్టితల్లీ ! ఈవయస్సులో .ఒక్కసారి వాళ్ళదర్శనం లభిస్తేచాలు అన్నాడు బాబా. అంతట రాధ ,బాబా నీవు వట్టి అమాయకుడవు. నీకు చూపులేదు కదా? వారిని ఎలా చూడగలవు? అనిప్రశ్నించింది. దానికి బాబా...నీవేవట్టి అమాయకురాలవు నీకు తెలియదా నా చిన్నారి తనచేత్తోనన్ను తాకగనే నాకు చూపువస్తుంది అన్నాడు ధృఢ నిశ్చయంతో.
ఇక రాధాదేవి ఉండలేక అతని కన్నులను తనచేతితోతాకింది కృష్ణుడు కూడావచ్చి తనచేతితో బాబానుతాకాడు. బాబాకన్నులు ఒక్కసారి గా కాంతివంతమయ్యాయి. ఎదుటగా నిల్చిన రాధాకృష్ణులను చూచి ఆనందముతో మూర్ఛిల్లాడు. మూర్ఛలోనే ఆరాత్రంతా పడివున్నాడు. ఉదయం బృందావన పరికమణచేసే ప్రజలు ఇతనిని గుర్తించి ఆస్థితిలోనే మధుసూదన్ మందిర్ కు తీసుకు వెళ్ళిరి. మందిరములో గోస్వామి బాబాను మదనమోహనుడు కటాక్షించెనని గ్రహించాడు. ఆయన అక్కడవారందరితో కలసి కీర్తనప్రారంభించారు. కీర్తనచెవినపడిన వెంటనే బాబాలో చలనం వచ్చినది..తరువాత గోస్వామి ఆయనను ఏకాంతనికి తీసుకవెళ్ళి తగువిధంగా పరిచర్యలు చేశాక కారణం అడుగగా ,ఏడుస్తూ జరిగినదంతా చెప్పాడట.
బాబా ఏదైతే కోరుకున్నాడో అది లభించింది. కానీ అతనిఏడుపుఆగలేదు. ఏడ్వడం మునపటికన్నాఎక్కువైనది. రాధాకృ ష్ణులను ఒకసారి కలసివిడిపోవటం కలవకముందుకంటే ఎక్కువ బాధాకరం. ఈవిధంగా విలపిస్తూ వి;అపిస్తూ,కొన్నిరోజులతరువాత ,ఈభౌతిక దేహాన్ని విడిచి సిధ్ధదేహంతో గోలోకం వెళ్ళిపోయాడు.

[మాపూజ్యగురుదేవులు శ్రీరాధికాప్రసాద్ మహరాజ్ గారుప్రసాదించిన ' బృందావనేశ్వరి రాధ " నుండి ]

11 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్ September 1, 2010 at 1:45 AM  

మీకు మీ కుటుంబానికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Anonymous September 1, 2010 at 1:47 AM  

>>ఈవిధంగా నిరంతరం ఏడుస్తూవుండటంవలన ఆయన చూపు కూడా ఫోయింది.>>

ఇలాంటి రోగం ఇక్కడ ఎవరో బ్లాగరుకి వున్నట్టు చదివాను. గుళ్ళకూ, అమ్మలను, బాబాలను చూట్టానికి వెళ్ళినప్పుడల్లా అలా ధారాపాతంగా కన్నీళ్ళు కార్చడం ఓ కంటి రోగమని చెప్పిచూడండి. :)

durgeswara September 1, 2010 at 1:58 AM  

అజ్ఞాత గారూ
మీరు విమర్శించగలగాలంటే ఆ విషయం గూర్చి లోతుగా అవగాహన కలిగి ఉండాలి . మీకాస్థాయి లేదు అని అర్ధమవుతుంది .ఇటువంటిచోట వ్యాఖ్యలు మీకనసరమేమో ?

మాలా కుమార్ September 1, 2010 at 2:32 AM  

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు .

శ్రీనివాస బాబు తోడేటి September 1, 2010 at 2:48 AM  

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

..nagarjuna.. September 1, 2010 at 3:10 AM  

కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుర్గేశ్వర గారు

హరే కృష్ణ September 1, 2010 at 3:19 AM  

దుర్గేశ్వర గారు,
కృష్ణాష్టమి శుభాకాంక్షలు

durgeswara September 1, 2010 at 9:01 AM  

amdariki janmastami subhaakaamkshalu

Anonymous September 1, 2010 at 9:06 AM  

అనామక, నువ్వు ప్రతి సారి శర్మ గారిని విమర్శించటం బాగా లేదు. నువ్వు అర్థం చేసు కోవలసినది ఒకటి ఉంది. ప్రకృతి ఒక్కోక్క మనిషిని ఒక్కోక్క విధం గా ప్రేరేపిస్తుంది అని నీకు తెలుసు కదా. నువ్వు రామకృష్ణ పరమహంస,వివేకానంద పుస్తకాలు బాగా చదివావు గనుక ఒకరిని ఒకస్థాయి కి మించి విమర్శించటం బాగా లేదు. రామకృష్ణ పరమహంస శిష్యులలో (దైవంతో సహజీవనం పుస్తకం లో చెప్పిన శిష్యులు) ఒక్కోక్కరి స్వభావం ఒక్కోక్క విధం గా ఉంట్టుంది. అందరూ మీరు ఆదర్శం గా భావించే వివేకానందుల వంటి వారు కాదు గదా. ఇతరుల లో ఉన్న విభిన్న స్వభావాన్ని అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికత లో ముఖ్య లక్ష్యం. రామకృష్ణ పరమహంస అందరి శిష్యులను సమానంగా ఆదరించారు కదా.ఊపారు. క్లుప్తంగా చెప్పాలంటె ప్రకృతిలో మనిషి కూడా అంతర్భాగం కనుక, మనిషి ఏ స్థాయి(జ్ఞానం లోకాని, ఎమోషనల్ లేవల్లో గాని) లో ఉన్నా వారిని ఆ విధంగా యాక్సెప్ట్ చేయటం మీ ఆధ్యాత్మిక ప్రగతిని సూచిస్తుంది. కనుక ఇక నుంచి మీరు శర్మ గారిని ఒకస్థాయికి మించి వ్యతిరేకించటం ఆపుతారని అనుకుంట్టున్నాను.

Anonymous September 1, 2010 at 4:16 PM  

నేను చెబుతోంది వర్డ్ ప్రెస్ లో చూసిన ఓ బ్లాగరు గురించి. ఆయన పేరు అది కాదు. మీరు ఇంకెవరినో ఇందులో ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. పుస్తకాలు చదివనన్న మాట భలే చెప్పారు. అది కాకతాళీయమా? లేక మీ దివ్యదృష్టా?

durgeswara September 2, 2010 at 12:38 AM  

నాయనా అనామకుడూ
ఇక్కడ మీ మేధస్సును వృధాచేసి మాలాంటి అజ్ఞానులను గేలిచేయటం వలన నీకొచ్చే ఉపయోగమేముంటుంది ?. మా లాంటివారినిలా వదిలేయ్ . ఎక్కడో ఏదో జరిగిందని నీవుచెబితే వెళ్ళి ఉచిత సలహాలిచ్చే ఓపికా తీరికా మాకులేవు . నువ్వెంతగింజుకున్న వాదన పెరగదు.నీ అహం సంతృప్తి పడదు. జైశ్రీరాం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP