తిరుమల విషయంలో ఒళ్ళు దగ్గరపెట్టుకొని మెలగండి ..... లేకుంటే ఇక అథోగతే .
>> Sunday, August 29, 2010
తిరుమల పైనున్న స్వామితో ఆటలు చాలాప్రమాదకరం . భక్తితో కొలచినవారికి కొంగుబంగారమై నిలచే ఆపదమొక్కులవాడు అతిచేష్టాలు చేసే వారిని వడ్డితో సహా కక్కించి మరీ శిక్షిస్తాడు .అది వాని ఒక్కనితో పోదు వాని వంశాన్నంతటినీ వేధిస్తుంది . తిరుమల క్షేత్రంలో శ్రీవారి సేవలో ఉండే పరివార దేవతలు క్షేత్రపాలకులు అన్నీ గమనిస్తుంటారు . ఇక్కడచేసే అపచారం వారి వారి పుణ్యరాశులను కొట్టేసి ,స్వామి వారి పట్లచెసే అపచారాలకు కోపగించేది తీవ్రంగా శిక్షించేది వీరే.
ఈపవిత్ర క్షేత్రంలో మన సమకాలీనులలో అపచారం జరిపినందుకు ఎవరెవరు ఎన్ని బాధలు పడ్దారో ఇప్పటికీ పడుతున్నారో నేను గతంలో ఉదహరించానో పొస్ట్ లో . ఆయన కొండకే ఎసరు తలపెట్టిన వారికి దైవీశక్తులు ఎటువంటి గతి కల్పించారో అందరికీ తెలిసినదే . ఆ ప్రభావమేమిటో మనమికా చూస్తూనే ఉన్నాము .
ఆ ... అలాజరిగితే కొండపై ఇన్ని అక్రమాలు జరుగుతాయా అని ప్రశ్నించవచ్చు. మనం రసాయన శాస్త్ర ప్రయోగశాలలోనైతే వెంటనే చూడగలుగుతాము . కానీ ఇవి జీవితాలలో జరిగే ప్రయోగాలు పరిశీలిస్తేగాని కనపడవు .
కొండమీద తలనీలాలు తీసే వారు ఒక్కోమనిషిదగ్గర ఎంతలేదన్నా ఇరవైకి తక్కువలేకుండా వసూలుచేస్తారు . ఆప్రకారం రోజూ వాళ్ళు సంపాదిమ్చేది వేలలో ఉంటుంది . ఆలెక్కన లక్షాధికారులై పోతుండాలి వాల్లు . కానీ వాళ్ల ఇళ్లలో నిత్యం రోగాలు ,గొడవలు కనపడుతుంటాయి . ఏమయ్యా ! ఇంత సంపాదిస్తున్నారు ఏంచేస్తుంటారిదంతా అని సరదాకి అడిగినవారితో ఎక్కడ బాబూ ! కక్కుర్తిపడి సంపాదిమ్చటమే కానీ ఇంటికెళ్ళెసరికి ఏదో ఒక పెద్ద బాధపెడతాడా వెంకన్నబాబు అని వ్యాఖ్యానిస్తుంటారు.
సరే భక్తులకెందుకు ఈ బాధలు మరి అని అన్నప్పుడు కూడా మనం ఆలోచించాల్సినవిషయాలున్నాయి.
బయట ప్రపంచంలో మనం చేస్తున్న తప్పులు మన్ద్వారా ఇతరులు పడేబాధ ఎలా ఉంటుందో అనుభవం లో చూపిస్తారు స్వామి ఇలా వీళ్ళచేత పీడింపజేసి. అదీగాక తప్పుచేయటం ఎంత పాపమో దాన్నిచూసి మౌనంగా ఉండటం అంతేపాపం అని ఆనాడు మహాభారత యుధ్ధంలో చెప్పనే చెప్పాడుకదా ! ఇలా మనమౌనంవలన కూడా అంటుకున్న పాపం ఇలా పీడిస్తుంది .
ఇతరులను నెట్టుకుంటూ బాధపెడుతూ ,వక్రమార్గాలు,పలుకుబడులద్వారా చేసుకునే దర్శనం ఎన్ని కష్టాలు తెస్తుందో అలాంటిమార్గాలు అనుసరించినవారు ఎవరి జీవితంలో వారు పరిశీలించుకుంటే అర్ధమవుతాయి.
తిరుమల మహాశక్తి క్షేత్రం .విష్ణురూపంలో అర్చావతారంగా వెలసిన పరాశక్తి అక్కడ కొలువైనది . ఎట్టిపరిస్తితులలోనూ వక్రమార్గాలు , అహంకారాలు అక్కడ చూపవద్దు . వీలుకాంటే గుడిముందు సాష్టాంగపడి ప్రభూ ! నీదర్శనభాగ్యం ఇవ్వవా అని ఆర్తితో ప్రార్ధించిరండి .అంతేగాని వేలాదిభక్తులు ముందు వేచిఉండగా మనం దర్పంతో ముందు దర్శనానికి వెళ్లాలని ప్రయత్నించకూడదు. ఈడబ్బులు మనదగ్గర లేకుంటే మనం ఆయన దర్శనం కోసం ఎంత సహనం వహిస్తామో అంత పాటించండి .తద్వారా మన పాపాలు పటాపంచలవుతాయి . ఈ టిక్కెట్లు స్పెషల్ దర్శనాలు స్వామిచెంతచేరిన వ్యాపారులు సృష్టించినవి . తన భక్తులకోసం దిగివచ్చి తనకోసం చెప్పులుతయారు చేసిన భక్తునికోరికమేరకు ధరిస్తున్నస్వామి . తన భక్తుని కోసం ఈనాటికి మట్టిమూకుడులో ప్రసాదం ఆరగించేస్వామి ఆయన. సృష్టిలో సకలానికి మాతృస్వరూపుడు ,పితృస్వరూపుడాయన . బిడ్దలంతా ప్రేమ ఆప్యాయతలతో ఒకరికోసం ఒకరు త్యాగంచేసే దైవీభావనలతో మెలగటం ఆయనకిష్టం . అలాకాక ఒకడు ఇంకొకడి అవకాశాలను లాక్కుంటుంటే తల్లిలాగానే నాలుగుపీకి బుధ్ధి చెబుతాడు . అసలు ఇన్ని అక్రమాలు అక్కడ ఎలా జరగగలుగుతున్నాయి ? మనలో ఉన్న స్వార్ధచింతన ,అహంకారాలవలనే కదా ? అటువంటి పనులకు మనలను ప్రేరేపించేవాల్ల చెంప చెల్లు మనిపిస్తే మరలా అలాంటి సాహసం వాళ్ళుచేస్తారా ?
మనకేకాడికి ,వచ్చినదగ్గరనుంచి మన మార్కెట్ లిస్ట్ చదవటంపైనే గాని .ఇది నాతండ్రి దివ్యధామం ఇలాంటిచోట ఎవడుతప్పుచేసినా నిలదీయాలనే బాధ్యతమనది అని అనుకున్నామా ఎప్పుడైనా ?
నావల్లేమి అవుతుంది ? అని అనుకోవటం .చీ ...ఇక్కడకు రాకూడదు . అంతా మోసం అని వాపోవటం ఖచ్చితంగా బాధ్యతారాహిత్యమే . మననుంచి ఒక్కకేక . ఒక్క ఉత్తరం ముక్క ,ఒకమెయిల్ మనం గమనించిన అంశాలమీద పంపుదాము . ఆమాత్రం స్పందించినా ఈదొంగలగుంపులు పలాయనం చిత్తగిస్తాయి. ఈసారి ఎవరు తిరుపతెల్లినా ఒక గంట సమయం ఇక్కడ అక్రమాలు కనిపెట్టడానికి కేటాయించండి ఫిర్యాదుచేయండి మనజేబులో డబ్బు ఎవడన్నా కొట్టెస్తే ఎంత ఆవేదనచెందుతామో అలా ఫీలవ్వండి ..అది శ్రీవారిసేవలో భాగమని నమ్మండి .
[భక్తజనులందరికీ పాదాభివందనం చేస్తూ ....దుర్గేశ్వర]
ఈ విషయంలో మనకు సహాయపడేందుకు
www.omnamovenakatesaya.com వాళ్ళు ఉన్నారు .చూడండి .అక్కడ మెయిల్ అడ్రస్ లు ఫోన్ నెంబర్లన్నీ దొరుకుతాయి .
17 వ్యాఖ్యలు:
మద్యం వ్యాపారులు, రాజకీయ దళారీలను చైర్మన్ లుగా ఎలా అంగీకరిస్తున్నారో... వారికి పడ్డ శిక్షలేమీ కానరావడంలేదు.. భయంతో కొలిచేది సామాన్య జనమే.. దానిని సొమ్ముచేసుకుంటున్నది వ్యాపార దళారీలు. కోట్లకు పడగలెత్తి మన నెత్తిపై కూచుంటున్నారు.. కాదంటారా?
బాగా చెప్పారు దుర్గేశ్వర్ గారు ! నిజమె కానీ ఎంత మంది పాటిస్తారు చెప్పండి ?
@kcube-u r watching their earnings only but u dnt no howmuch they r suffering mentally sir.It haunts their generations also..
మంచి లింక్ ఇచ్చారు సర్
కేక్యుబ్, మీకు అసలికి జీవితం లో మనిషి ఎమీ కావాలంకుంటాడొ తెలుసా? ఒక సారి మీకు మీరు ప్రశ్నించుకోండి. తెలియక పోతే మీనాన్నని అడిగి తెలుసు కోండి. ఊరకనే కారల్ మార్క్స్ ప్రశ్నలు వేయకండి. ఆయన అతి పెద్ద మేధావిలా అనిపించె కనీస ఇంగిత జ్ఞానం లేని మనిషి. పోతూ పోతూ మీబోటి వాళ్ళని తయారు చేసి వేళ్ళాడు. ఊరకనే ఇతరులను ప్రశ్నించే వారిని.
-----------------------------------ఒకసారి నేను రైల్ లో ప్రాయాణిస్తున్నప్పుడు మధ్యం వ్యాపారం చేసే వారు మాట్లాడుకుంట్టుంటె విన్నాను. విజయ మాల్య, మాగుంట సుబ్బ రామి రెడ్డి, ఆది కేసవుల నాయుడు మొ|| వారికి కుటుంబాలలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు వింటె నోరేళ్ల బెడతారు. ఇదంతా వారెందుకు మాట్లాడు కొంట్టున్నారంటె ఈ మధ్యం వ్యాపారం చేసే వారి పిల్లకి ఆరోగ్యం బాగా లేక, మన వ్యాపారం చేసే వాళ్ళకి ఇదొక శాపం అనే ధొరణిలో వారి సంభాషణ కొన సాగింది. వాళ్లెదో ప్రపంచం లోని సుఖాలను జవురుకుంట్టునట్లు మీడీయా నిరంతరం ఊదర గొట్టటం వలన మీరు నిద్దర లేచిన మొదలు కొని వారిని ద్వేషిస్తూ ఉంట్టారు.
కరుణసుధాంభుధీ!కరుణ చాలును.దుష్టుల దౌష్ట్యజాలమున్
కరుణను గాంచుటొప్పదిక. గాఢ దురంత మహోగ్ర శిక్షలన్
వడివడిఁ గొల్పిచూపుమయ భవ్యుల చిత్తములుత్సహింపగా.
తిరుమల వేంకటేశ్వరుఁడ!దిక్కులుచూచెదవేల?మేలుకో.
Hello
meeru cheppedi ok.ilantivanni ala urike kurchuni discuss cheyyadaniki bavuntai.
kani mandutendallalo, chanti piallato, musali vallato, anaarogyalato velli nappaudu,US nuchi akkadiki vellesariki okkosari akkadi hotel food tini sick ayyinappudu..mari special darsanalu VIP darsanalu unte enquiry cheddam.. ani meeke anipistundi. Dharma darsnam lo vellalante balamunnavadide rajyam.
@ పై అజ్ఞాత
అప్పుడే కదయ్యా ఖర్మ నశించేది :))
వర్మగారూ
నేను ముందేమనవిచేసాను .దగ్గరనుంచి చూస్తేగాని అసలు విషయాలు తెలియవు. ఇలాంటి అవినీతికి పాల్పడే వాల్ల జీవితాలలో ఎంత సుఖమభవిస్తున్నారో మనకు దూరంగా ఉంటే తెలియదు.
రాజేశ్వరిగారు మనకు మనం పాటిద్దాం .
జయదేవ్ గారు ధన్యవాదములు .
సునీల్ శుభాశీస్సులు
మొదటి అజ్ఞాతగారూ మీ వివరణ వాస్తవమండీ
రామకృష్ణారావుగారికి నమస్సులు
రెండవ అజ్ఞాతగారూ నేను పాటించి మాత్రమే చెబుతున్నానండి . మీలో ఆలోచనను రేకెత్తించాను చాలు నాప్రయత్నం ఫలించినట్లే.
సహదేవుని వంటి శ్రీనివాస్ కు అభినందనలు
@కెక్యూబ్ గారు,
దుర్గేశ్వర్ గారు హెచ్చరిస్తున్నది మీరు చెప్పిన దళారీలనే...
మనిషికి మానవత్వం తో పాటు పాపభీతి కూడా పోయినప్పుడు స్వార్థం నెత్తిమీద కూర్చొని సవారీ చేస్తుంది. ఎన్ని కోట్లు సంపాదించినా ధనదాహం తీరదు.
కానీ ఆ పాపం ఊరికే వదలదని, వంశాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించడంలో ఉత్తుత్తి బెదిరింపు లేదు. అది చరిత్ర నిరూపించే సత్యం.
తన వారసులను సుఖపెట్టడానికి అడ్డమైన గడ్డీ కరచి సంపాదించినా ఆ డబ్బు వారి అభివృద్ధికి ఉపయోగపడుతోందా..జ్ఞానం పెంచుకొనే అవకాశాలు వినియోగించుకోకుండా పబ్బులవెంట, బార్లవెంట పడి మత్తులో తూగడంలేదా...అనారోగ్యాలతోను, అకాల మృత్యువు పాల బడడం లేదా...
మనం చేసే మంచే మన వెంట వస్తుందనే పెద్దలమాట ని మన తర్వాత తరానికి చద్దిమూటగా అందించే బాధ్యత మనదే.
అనానిమస్ గారూ,
మీరు మరీను...ఊరికే ఆవేశ పడకండీ. రాజకీయ అండదండలతో కోట్లకు పడగెత్తుతున్న ఆసామీలకు ఈ జన్మలోనే శిక్ష పడితే బాగుండునని ఆయన ఆలోచన అనుకుంటా.
హిందూ మతం ప్రకారం పాపం పండడానికి గాని, కారల్ మార్క్స్ ప్రకారం విప్లవం వచ్చి పరిస్థితులు మారడానికి గానీ వేచి ఉండవలసిందే అని నా మిడిమిడి జ్ఞానం.
Pujya Durgeswara garu
Whatever you said is 100% correct. But suppose if any of our friends offers us to come to tirumala for vvip darshan what we are supposed to do? Actually this happened to us. My husband's collegue and friend offered all of us to accompany them to tirumala for direct darshan for more than 20min before Lord. Unfortunately, we could not go and felt extreme pain in heart that Lord is not allowing us. But after reading your message i felt whatever you are telling is 100% correct. But what's my doubt is whether to take that type of opportunity or not if anyone calls us with them to have vvip darshans. Please clear my doubt.
అక్సరాలా ఉన్నమాట చెప్పారు.శ్రీనివాసుడన్టే కేవలమ్ ఏడుకొండలస్వామే కాదు ,ఏడు పడగల ఆదిశేశువు.ధర్మాన్ని తప్పితే కాటు వేసి తీరుతాడు.అయితే కొంత వ్యవధి కూడా ఇస్తాడు, ఆలొచించేందుకు,పచా త్తాపానికి,శిశుపాలవధ గుర్తు లేదూ!
అక్సరాలా ఉన్నమాట చెప్పారు.శ్రీనివాసుడన్టే కేవలమ్ ఏడుకొండలస్వామే కాదు ఏడు పడగల ఆదిశేశువు.ధర్మాన్ని తప్పితే కాటు వేసి తీరుతాడు.అయితే కొంత వ్యవధి కూడా ఇస్తాడు, ఆలొచించేందుకు,పచా త్తాపానికి,శిశుపాలవధ గుర్తు లేదూ!
అక్సరాలా ఉన్నమాట చెప్పారు.శ్రీనివాసుడన్టే కేవలమ్ ఏడుకొండలస్వామే కాదు ఏడు పడగల ఆదిశేశువు.ధర్మాన్ని తప్పితే కాటు వేసి తీరుతాడు.అయితే కొంత వ్యవధి కూడా ఇస్తాడు, ఆలొచించేందుకు,పచా త్తాపానికి,శిశుపాలవధ గుర్తు లేదూ!
NAMASKARAM NENU TIRUPATHI EVERY YEAR VELTANU 4DAYS BACK VELLANU MEERU CHEPPINDI CHALA CHALA SATYAM KANI MANA PRAMEYAM LEKUNDA KUDA MISTAKES JARUGUTAI FOR EX. MONNA TIRUPATHI LO ANTE KONDA KINDA TEMPLE LO RUSH GA UNDANI QUICK DARSHAN CESUKUNDAMANI TICKET COUNTER KOSAM CHOOSTUNTE PANTULUGARU KANIPINCHARU. TICKET COUNTER EKKADA ANI ADIGAMU. NATHO RANDI ANI CHALA FAST GA THISUKUVELLARU ON THE WAY LO ANDARU PANTULUGARIKI WISH CHESTUNTE HELP CHESTUNNARU ANI ANUKUNNAMU DIRECT GA TEMPLE LOKI THEESUKU VELLARU MAKU KANEESAM MATLADE CHANCE IVVALEDU. LAST LO BIG AMOUNT ABOVE700 ADIGARU MEMU SHOCK. BAYAPADI ICHHAMU. TEMPLE NAME CHEPPADAM ISHTAM LEDU. CHALA PEDDA TEMPLE.
Namaskaram. Meeru cheppindi bagundi kani, swamy darsanam chala duramga nundi (jaya-vijayulua nundi) avadam valana, eppudaina manchi darsanam dorukute bagunnu ane asa valana, koncham manava sahajamaina chanchalyam (swamy darsananiki Kakkurthi) valana, dalarulanu aasrayinchakapoyina, edaina VIP darsanam (Break Darsanam) ki prayatnichadam jarugu tundi. Aa avakasame lekunda pote, kevalam first come first ani vunte, ee badhalu, siggu padadalu vundavu.
NAGESH
Namaskaram. Meeru cheppindi bagundi kani, swamy darsanam chala duramga nundi (jaya-vijayulua nundi) avadam valana, eppudaina manchi darsanam dorukute bagunnu ane asa valana, koncham manava sahajamaina chanchalyam (swamy darsananiki Kakkurthi) valana, dalarulanu aasrayinchakapoyina, edaina VIP darsanam (Break Darsanam) ki prayatnichadam jarugu tundi. Aa avakasame lekunda pote, kevalam first come first ani vunte, ee badhalu, siggu padadalu vundavu.
NAGESH
Post a Comment