శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఓరి ! మీ కెరీర్ కాశీకెళ్ళా ,! ముందు పెళ్ళిచేసుకోండినాయనా ! పెళ్ళికాని ప్రసాదులూ .

>> Friday, August 27, 2010

ఈకాలం లో చదువులమీద ,కెరీర్లమీద పిల్లకాయలకు శ్రద్ధఎక్కువైపోతుంది. జీవితంలో ఎదగాలనుకుని ఎంతో కష్టపడుతున్నారు . హార్డ్ వేర్లు షాఫ్ట్ వేర్లు .ఎమ్సీఏలు .ఎమ్బియ్యేలూ ఒకదానితరువాత మరొకటి చదువుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొర్సులు రావటం పోటిప్రపంచంలో వెనుకబడగూడదనుకుని బాగా చదువుకుంటున్నారు . కెరీర్లో పైకిపైపైకి ఎదగాలనుకుని అలుపెరుగక శ్రమిస్తున్న కుర్రాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తున్నది. కానీ జీవితంలో అతిముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనిపిస్తున్నది .ఈడబ్బు ,కెరీర్ తరువాత వస్తాయేమోగాని వయస్సురాదుకదా ! అందుకే కుర్రాళ్లకు రెండుముక్కలు చెబుదామని పిస్తున్నది .

ఈమధ్య మా బంధువులమ్మాయికి ఒక సంబంధం వచ్చింది కుర్రాడు చాలామంచోడు . ఢిల్లీలో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు ఎనభైవేలదాకా సంపాదిస్తున్నాడట . అన్నీ బాగనే ఉన్నాయి కుర్రాడుకూడా గడబొంగులా ఎత్తుగాఉన్నాడు అంతవరుకూ బానే ఉంది . వయసు మాత్రం 38 దాకా ఉన్నాయి . ఇప్పటిదాకా చదువు మీద దృష్టిపెట్టటం వల్ల పెళ్ళి గూర్చి ఆలోచించలేదట. వీల్లు మొత్తం అయిదుగురు సంతానం వీళ్లనాన్నగారు అటెండర్ గా పనిచేసేవారు .ఎప్పుడు ఆన్లైన్లో ఉండేవాడుకూడానట . కాబట్టి కష్టాల్లో పెరిగారు కనుక చదువుమీద .ఉద్యోగాలపైన దృష్టి పెట్టటం వలన అందరికీ లేట్ మారేజ్ లే . పాపం ఈ కుర్రోడు ఆఖరివాడు . ఇక ఈ పిల్లోడ్నిచూసినకాడనుండి అమ్మలక్కలంతా బాగాముదిరిపోయాడు .ఇంతకాలం పెల్లెందుకు కాలేదో ? ఏదో ఉండి ఉంటుంది . అయినా వయస్సంతా అయిపోయాక ఈపిల్ల ఏం సుఖపడుతుంది ? అని మెటికలు విరవటం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఇంతవయస్సయినవాడికి పిల్లనివ్వటం బాలేదనిపించి సంబంధం వద్దనుకున్నారు.

ఇలా ఇక్కడ అంతర్జాలం లో పరిచయమైన కుర్రాల్లుకూడా బాగా చదువుకుంటున్నారు . ఇలా సదువుకుని, సదువుకుని అసలు సమస్యను గుర్తించటం లేదు . ఏవయస్సుముచ్చట ఆవయస్సులో జరగాలంటారు పెద్దలు . ధర్మార్ధకామమోక్షాలు వరుసలో సాధించాలి . అందుకు వైవాహిక జీవితం చక్కని బాట. మనిషికి డబ్బుకంటే విలువైనది జీవితం . ఏది సాధించిన ఏస్థితిలో ఉన్నా ,అభినందించి అండగానిలచి సంతోషాన్ని పంచేది జీవిత భాగస్వామే. అదీగాక సరయిన వయస్సులో పిల్లలు పుడితే శరీరం లో ఓపిక ఉన్నప్పుడే బరువులు బాధ్యతలను అలఓకగా నిర్వహించగలుగుతారు. బాగా ముదిరి పోయాక పెళ్ళిచేసుకున్నా సంసారజీవితంలోమాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవించలేరు. పెద్దవయస్సులో పుట్టే పిల్లలు పెద్దయ్యేసరికి వీల్లుపెద్దవాళ్లయి పోయి బాధ్యతలు పెనుబారమవుతాయి .

పెళ్ళిచేసుకుంటే చదువు సాగదు. కెరీర్ లో ఎదగలేమనుకోవటం భ్రమ . మనోసంకల్పం ఉంటే అవేమీ ఆటంకాలు కావు. పైగా సహకారాన్నికూడా అందిస్తుంది కుటుంబం . కేవలం చేతినిండా డబ్బు .ఇంటినిండా వస్తువులుంటేనే సుఖసంతోషాలుంటాయనే అపోహ వదలండి . సంతోషం అనేది మనమనస్సుకు సంబంధించింది . కెరీర్ నిర్మించుకోవడం అవసరమే . కానీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ముఖ్యమే. అది మరువవద్దు.

నాకుతెలిసి ఇలా వయస్సు బాగాపెరిగినదాకా పెళ్ళిగూర్చి ఆలోచించని ఆడ ,మగ పిల్లలు మానసికంగా చాలావత్తిడికి గురవుతున్నారు . పెళ్ళివిషయంలో వారి తల్లిదండ్రులు వేదనకు గురవుతున్నారు. మనవల్లు మనవరాల్లతో గడుపుతున్న మిగతావారినిచూసి తమకా అదృష్టం ఇంకారాలేదని కుమిలిపోతున్నారు .
కాబట్టి మీరు మీకుదక్కాల్సినది ఎక్కడికీ పోదు. అలాగని సోమరులుగా కూర్చోమని కాదు . మీ జీవనయాత్రకు జీవితసహచరి తోడేగాని కీడుకాదు .

కాబట్టి నేను చెప్పేదేమిటంటే ఇరవై మూడునుంచి ఇరవైఅయిదుదాకా వేచిచుసినా పరవాలేదుగాని ఇకపై ఆలస్యం చేయకండి .ఈ మందులతిండితినే ఈరోజులలో ఆరోగ్యం.ఆయుష్శు చాలాతక్కువ .గమనించండి . అలాకాక బాగాచదువుకుని చదువుకుని , బాగాసంపాదించటమే ముఖ్యమనుకుంటే చేతినిండా డబ్బు గాడితప్పితే వంటినిండా జబ్బుమాత్రమే మిగులుతాయి. కాబట్టి పెళ్ళికాని ప్రసాదులూ ....................త్వరగా వైవాహిక జీవితాన అడుగుపెట్టండి .మీజీవితం పుష్పించి ఫలించి సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాను .
మాకుర్రాళ్లంతా ఇది చదువుతున్నారని తెలుసు . కాబట్టి త్వరగా పెళ్ళిపిలుపులు వస్తాయని అనుకుంటున్నాను .

17 వ్యాఖ్యలు:

The Mother Land August 27, 2010 at 5:55 AM  

You made to re-think again. :)

swapna@kalalaprapancham August 27, 2010 at 6:08 AM  

Exact ga ee post gurinche nenu oka post raddamu anukunna time vachhinappudu. inthalo mire rasesaru. nenu emithe cheppadalchukunnano same ave miru chepparu. ee kaalam lo career ani pelli ni careless chestunnaru, pillale kakunda valla parents kuda alage unnaru valla pillalu baga chaduvukovali settle ayyaka matches chustunnaru. parents ikanina melkovali.

Anonymous August 27, 2010 at 6:27 AM  

ప్రస్తుతం పెళ్ళిళ్ళు ఆలస్యంగానైనా అవుతున్నాయి. సంతోషం. కానీ ఇంకో ముప్ఫై-నలభయ్యేళ్ళు పోతే అసలు పెళ్ళిళ్ళే ఉండవు. అంతా బోయ్ ఫ్రెండ్, గాల్ ఫ్రెండ్ కల్చరే ఉంటుంది. ఇష్టమైనంతకాలం శారీరిక సంబంధంలో ఉండి, ఇష్టం తగ్గిపోయినాక విడిపోతూంటారు.

Anonymous August 27, 2010 at 6:58 AM  

బాగుంది మీరు చెప్పింది...కానీ ఇప్పుడు లేట్ మేరేజ్‌లు కావడానికి అమ్మాయిలు/అబ్బాయిలుకు భాగస్వామి విషయంలో ప్రాధాన్యతలు ఎక్కువగా ఉన్నాయి..ఒకరికి అమ్మాయి ఉద్యోగం చేసేయాలి..వేలకు వేలు జీతం తెచ్చేయాలి..ఇంటి చాకిరీ చేసేయాలి..ఇంకొకరికి అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉంటే నచ్చరు..అబ్బాయికి బరువు,భాద్యతలు అనేవే ఉండకూడదు..ఇలా ఉన్నాయి ఈ రోజు ఒక్కొక్కళ్ళ ఆలోచనలు....వాస్తవంలోకి వచ్చేసరికి
ABC (Age Bar Candidate)అయిపోతున్నారు :)

Anonymous August 27, 2010 at 7:04 AM  

The best way to die is to marry the one you are living with - RGV

karthik August 27, 2010 at 7:50 AM  

మీరు కూడా ఇదే సలహానా?? వాఆఆఆఆ (ఏడుపు ఎవరో ఒకరు ఓదార్చండి బాబూ)

పానీపూరి123 August 27, 2010 at 8:33 AM  

> ABC (Age Bar Candidate)
:-))

August 27, 2010 at 8:46 AM  

నేను స్మార్ట్ , 28 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాను

Anonymous August 27, 2010 at 9:54 AM  

NENU INKAAAAA SMART 25YRS KI PELLI CHESUKUNNANU............

Anonymous August 27, 2010 at 10:22 AM  

పెళ్ళి ఆలస్యమయినకొద్దీ జీవితంలో అర్థభాగంతో పంచుకోవలసినవి కూడా తగ్గిపోతాయి. సర్దుకుపోగల తత్వం కూడా తగ్గుముఖం పడుతుంది. మీ సలహా కొంతమందయినా పాటిస్తారని ఆశిద్దాం.

నాగప్రసాద్ August 27, 2010 at 11:45 AM  

బాధపడకు కార్తీక్, బాధపడకు.. నిన్ను ఓదార్చడానికి నేనున్నాను. :-))

మాష్టారు చెప్పినట్లు ఆలస్యం చెయ్యకుండా, త్వరగా మీ కడపలో మాంఛి జెనీలియా లాంటి ఫ్యాక్షన్ పిల్లను చూసి పెళ్ళి చేసుకో. :-)))

నాగప్రసాద్ August 27, 2010 at 11:46 AM  
This comment has been removed by the author.
..nagarjuna.. August 27, 2010 at 12:49 PM  

బాగాచెప్పారు మాష్టారు... :)
నేను గత 24 ఏళ్ల నుండీ ఎదురుచూస్తూనే ఉన్నా....ఎవరన్నా నాకు పెళ్ళి చేస్తారేమోనని, ఏరి ఒక్కరూ కనపడరే!! మా ఇంట్లో వాళ్లకే చెబుదామంటే "చదువొదిలేసి ఇదేంట్రా" అని ఎక్కడ తాట తీస్తారేమోనని భయం :D

durgeswara August 27, 2010 at 4:59 PM  

నాగార్జునా ఇంకోసంవత్సరం చదువుకో .అప్పడు నాకు మీ ఇంటి అడ్రసివ్వు అమ్మానాన్నవాల్లతో నే మాట్లాడతా .
ార్తీక్ ,నాగా ఇద్దరే వచ్చారు. ఇంకా రావాలసినవాల్లు చాలామంది ఉన్నారే ! వాల్ల కామెంట్లు కనడలేదింకా .

Ravi August 27, 2010 at 9:33 PM  

నేను తొందరగానే చేసేసుకుంటున్నా :)

కొత్త పాళీ August 29, 2010 at 7:58 PM  

మంచి సందేశాన్నిచ్చారు మాస్టరు!
ఏవయసులో ముచ్చట ఆవయసులో జరగాలని ఊరికే అనలేదు.

@ నాగప్రసాద్. జెనీలియాలాగుండే కడప ఫేక్షన్ హీరోయిన్ని అశ్విన్ బూదరాజు ఆల్రెడీ బుక్‌చేసినట్టు టాక్!

శరత్ కాలమ్ September 2, 2010 at 2:26 PM  

చక్కగా చెప్పారు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP