శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందువుల మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రతి నికృష్టుడు వాడే అస్త్రం " కుల విబేధం"

>> Thursday, June 10, 2010

హిందువుల మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రతి నికృష్టుడు వాడే అస్త్రం " కుల విబేధం"

హిందువుల ఐక్యతను దెబ్బతీయటానికి, ఆదినుంచి ఈదేశాన్ని బలహీనపరచటనికి ప్రతి నికృష్టుడు వాడిన ,ఇప్పటికీ వాడుతున్న అస్త్రం కులాలమధ్య కుంపు పెట్టడం . సాధ్యమైనన్ని మార్గాలలో వివిధకులాల మధ్య ఉన్న చిన్న అపోహలను పెద్దవిగా చూపటం , లేని విబేధాలను ఉన్నట్లుగా చూపటం ఒక వ్యూహం . ఈవ్యూహం తో మనసులలో విష బీజాలను నాటటం అవి పెరిగి పెద్దవయితే మరిన్ని చితుకులువేసి మంటను పెద్దది చేయటం . ఈ వ్యూహాన్ని ఏ మార్పులు లేకుండా వరుసగా ప్రయోగిస్తూనే ఉన్నారు .ఫలితం బాగానే ఉంటున్నది కనుక మరలా మరలా ప్రయోగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సమాచారాన్ని పదిమందికి చేర్చగల అన్ని రంగాలలో ఏమాత్రం వెరవకుండా దీనిని వాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్


మంచి అన్నది మాల అయితే మాల నేనవుతా ............ అని ప్రతి వారూ ఈ పుణ్యభూమిలో భావిస్తుంటారు. సంకరబుద్ధులు,వంకరబుద్ధులు తప్ప . ఆదిశంకరులెంత పూజ్యులో అవధూత మాల పిచ్చమ్మ కూడా జాతికంత ఆరాధనీయులే. గొలగమూడి వెంకయ్యస్వామి,కాశిరెడ్డినాయన ల కులాలు చూసికాదు గుణాలుచూసి గురువులుగా గౌరవించేజాతి మనది. జాతికి బలం ,బలహీనత రెండు ఈ కులమనే పదమే . శ్రమ విభజనతో ఏర్పడ్దకులాలతో జాతిని బలపరచేపని చేయాలేగాని దురభిమానాలతో బలహీనపరచే కుట్రలలో భాగస్వాములవ్వవద్దని మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాము .

5 వ్యాఖ్యలు:

Malakpet Rowdy June 10, 2010 at 10:52 AM  

విబేధాలు సృష్టించగలిగేంత బుఱ్ఱ అతనికి లేదు లేండి. ఏదో పిచ్చి వాగుడు వాగి అడ్డంగా దొరికేసరికీ తప్పించుకోడానికి దారిలేక చేసిన పని ఇది. ఏమీ తెలియకుండ ఏదేదో వాగే కాపీ పేస్టు మెధావులంతా ఇంతే.

Malakpet Rowdy June 10, 2010 at 11:07 AM  

Just to give you some background:

ఏదో బ్లాగులో చర్చలో ఈయాన గారు శొధించిన సాధించిన ( అంటే ఎవరి వ్రాతలో కాపీ కొట్టిన ) జ్ఞానంతో చెప్పిందేమిటంటే "భారతీయ విలువ అంటే హిపోక్రసీ" అని.

దన్నికి నా సమాధానం - "ఇలాంటి హిపోక్రసీని వళ్ళంతా నింపుకున్న మనుషులకి అది తప్పా ఇంకేమీ కనబడదు - భారతీయత అంటే:

1. కుటుంబ వ్యవస్థ
2. వివాహ వ్యవస్థ
3. భిన్నత్వంలో ఏకత్వం
4. ఆప్యాయత
5. పెద్దల పట్ల గౌరవం

దానికి ఈయన అరికాటిని గోక్కునీ గోక్కునీ అలోచించేసి అడిగిన ప్రశ్న "ఇవన్నీ వేరే దేశాల్లో లేవా?" అని

దానికి నేను తిరి అడిగిన ప్రశ్న "మరి హిపోక్రసీ వేరే దేశాల్లో లేదా?" అని

మనవాడికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. చెప్పడానికి సమాధానం లేదు. ఏం చేస్తాడూ పాపం - కులాల పోస్టు పెట్టి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నాడు. అదీ చూద్దాం :))

Malakpet Rowdy June 10, 2010 at 11:12 AM  

This was my post:

http://malakpetrowdy.blogspot.com/2010/05/blog-post_23.html


ఈ మధ్య కొందరు మేధావులు భారతీయ విలువల్ని గురించి పెట్టిన మణిమాణిక్యాల్లాంటి కామెంట్లు చూశాను. పాపం పూటకతో వచ్చిన బుధ్దులు కదా, పక్కవాడిమీద ఏడవందే పూటా గడవదు వారికి. ప్రతీ సమూహంలో మంచీ, చెడు రెండూ ఉంటాయని వీళ్ళకి తెలియకనా? దేశాన్ని వెక్కిరించడం ఫేషన్ అంతే. ఇలాంటి తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టే విశ్వాసఘాతక మేధోవర్గానికి భారతీయతకి సంబంధించినదేమీ మంచి కనబడకపోవడంలో ఆశ్చర్యం లేదు. అన్నట్టు నేనేమీ గోగోగోగోప్ప దేశభక్తుడిని కాను. కానీ తల్లిలాంటి దేశాన్ని దూషించి ద్వేషించే ఈ మేధోవర్గానికి చెందినవాడినైతే కాను. కానీ అసలు భారత దేశానికి ఉన్నవీ, చాలా దేశాలకు లేనివి అసలేమన్నా ఉన్నాయా? నాకు తెలిసిన కొన్ని:

1. కుటుంబ వ్యవస్థ: ప్రపంచానికి కుటుంబ విలువలని ఎత్తిచూపింది మనదేశం, కొంత వరకూ జపాన్. పెద్దల అనుభవం, పిల్లల సృజనాత్మకత కలిసి పనిచేసే అరుదైన నమూనా

2. వివాహ వ్యవస్థ: ఆడైనా మగైనా తన జీవిత భాగస్వామికోసం బ్రతకడం, తన భాగస్వామి పట్ల అపరిమితమైన, అచంచలమైన, నిరుపాధికమైన అనురాగాన్ని జీవితాంతం కలిగి ఉండడమనే భావన ఈ మేధావులకెప్పుడు అర్ధమవ్వాలి? తమకోసమే తాము బ్రతికేవారికీ, ద్వేషం తప్ప ప్రేమ అనే పదం తమ నిఘంటువులలో లేనివారికి ఇది అతిశయోక్తిగానే అనిపిస్తుంది.

3. భిన్నత్వంలో ఏకత్వం: భారత దేశంలో ఉన్న జాతులు వేరే ఏ దేశంలోనూ లేవు. అయినా కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే, నానాజాతి సమాగమైన భారతీయ సంతతికి ఒకేజాతిగా గుర్తింపు తీసుకొచ్చేది - భారతీయతే. "భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు" అన్న భావనొక్కటి చాలు దీని విలువని చాటడానికి

4. ఆప్యాయత: సంతానం పట్ల తల్లిదండ్రులు చూపించే బాధ్యతను ఒక్క జాపాన్ మినహా వేరే ఏ దేశంలోను ఇంతగా చూపించరు. ఒక వయస్సు వచ్చాక మనుషులు తమ కోసం బ్రతకడం మానేసి తమ సంతానం కోసమే బ్రతకుతారు మన దేశంలో. పదిహేనేళ్ళు రాగానే తన్ని తగిలేసే దృశ్యాలు అంతగా కనబడవు. (ఒకటి రెండు సంఘటనల్ని భూతద్దంలో చూపించే మేధావుల సంగతి వేరులేండి)- ఒక రూపాయి దాచినా అది తమ సంతానానికి ఉపయోగపడుతుందనుకునే వారే ఎక్కువ. అలాగే తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలు తీసుకునేలా చేసింది భారతీయ విలువలే. కొన్ని వందల/వేల మంది ఉన్న వయోవృధ్ధుల వంటరి తనాన్ని సాకుగా చూపించి కొన్ని కొన్ని కోట్లమంది మీద ఈ విషంలో నిందారోపణ చెయ్యడం జనాలకి మామూలేగా?

5. పెద్దల పట్ల గౌరవం: తమ పెద్దవారి పట్ల భారతీయులు చూపించే గౌరవం మరేదేశంలోను ఇంతగా కనబడదు. భారతదేశాన్ని సందు దొరికితే తూలనాడే ఒకాయన్ని చూద్దాం. "ఎవడేమనుకుంటే నాకేంటి, నా బ్లాగులు నేను రాసుకుంటా" అనే తత్వం ఆయనది. జనాలు బండ బూతులు తిట్టినా ఎప్పుడూ పట్టీంచుకున్న దాఖలాల్లేవు. అలాంటిది నేను పొరపాటున తెలియకుండా వాళ్ళా నాన్నగారి పేరుని ఒకచోట వాడేసరికి, ఈ మధ్యకాలంలో ఏనాడూ నాతో మాట్లాడని ఆయన నాకు మెయిల్ పంపించాడు. కారణం చెప్పక్కరలేదనుకుంటా - ఆయనకి తన తండ్రిమీదున్న గౌరవం. తనని ఎవడైనా ఎమన్నా అన్నా సరే పట్టించుకోనివారు తల్లిదండ్రులని ఏమన్నా అంటేమాత్రం తట్టుకోలేరు. అదీ భారతీయులకి తమ పెద్దవారిపై ఉండే గౌరవం.

ఇంటికి వచ్చిన అతిధులని భారతీయులు ఆదరించినట్టుగా వేరెవరూ ఆదరించరు. తనకి చిన్నప్పుడెప్పుడో చదువు చెప్పిన గురువు ఎక్కడైనా కనిపిస్తే కులమతాలకతీతంగా గుండెల్లోంచి వచ్చిన గౌరవ భావంతో చేతులు జోడించినమస్కరించే గుణం భారతీయ విలువల్లో ఒకటికాదంటారా?

**** నేను చిన్నప్పుడు విన్న విషయం ఇది: ఎమతవరకూ నిజమో తెలియదు - ఎవరో వివేకానందుడిని అడిగారట "ఏమిటయ్య? నీ బోడి భారతీయతలోని గొప్పదనం ఒక్కటి చెప్పు చూద్దాం" అని వెటకారంగా. దానికి ఆయన సమాధానం: "మేము భార్యని తప్ప మిగాతావారిని తల్లుల్లా చూస్తాం, మీరు తల్లిని తప్ప మిగతావారిని భార్యల్లా చూస్తారు" :))

Anonymous June 10, 2010 at 9:00 PM  

##ఒకసారి ఎవరో ప్రప౦చ౦ ఎలా వు౦దో చూసి రమ్మని దుర్యోధనుణ్ణి, భీముణ్ణి ప౦పి౦చార౦ట. వాళ్ళిద్దరూ ఒక యాత్ర చేసి వచ్చారు. మొదటగా దుర్యోధనుడు వచ్చి ఈ ప్రప౦చ౦లో అ౦దరూ చెడ్డవరేనని మ౦చి అనేది క్షీని౦చి పోయి౦దనీ చెప్పాడుట. భీముడు సరిగ్గా వ్యతిరేక౦గా ఈ ప్రప౦చ౦లో ఏదో కొద్ది మ౦ది తప్ప అ౦దరూ మ౦చి వాళ్ళేనని చెప్పాడుట.

## పచ్చ కామెర్ల వాడికి లోకమ౦తా పచ్చగా కనిపిస్తు౦దట.

## తా పట్టుకున్న కు౦దేటికి మూడే కళ్ళని ఎనకటికి, ఇప్పటికీ కొ౦తమ౦ది వాదిస్తు౦టారు.

## భర్తృహరి గారు ఇలా అన్నారు.

"తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు - తవిలి మృగతృష్ణలో నీరుద్రావవచ్చు - తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు - చేరి మూర్ఖుల మనసు రంజింపలేము!"

## ఇ౦తకీ వాడికి బాగా కాలి౦దనుకు౦టా, మళ్లీ మొరుగుతున్నాడు.

## భారతీయ విలువల వల్ల వాడికి తన స్నేహితురాలు(?) దక్కకు౦డా పోయి౦ది. అది వాడి అక్కసు.

## వాడి కుల౦ వల్ల వాడికి అసహన౦, అవమాన౦. గౌరవ౦ లేదు. గౌరవ౦ పె౦చేలా ప్రవర్తన వు౦డదు. దాన్ని కప్పడానికి ఇలా ఎగిరి పడుతు౦టాడు.

ramnarsimha June 20, 2010 at 6:55 AM  

Your opinion is very

uncomprehensive to me..

I could not understand

anything..

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP