బ్లాగులోకపు హిరణ్యకశిపునింట ఓ ప్రహ్లాదుడు పెరుగుతున్నాడు . ఇదీ విష్ణు మాయ.
>> Thursday, February 18, 2010
విష్ణుని మహిమలను ,ఆయన లీలలను వర్ణించనెవరి తరముకాదు . ఏంటో ఒక్కోసారి లోక కళ్యాణకరమైన ఆయన లీల అసలర్ధంకాదు , కానీ తెలుసుకున్నతరువాత ఆశ్చర్యపోతాము . వేడిన వారికి దరశనమీయవు !వలదని నిన్ను వారించువారిని వదలక వెంట తిరిగెదవయ్యా ! అంటూ భక్తులు పాడుకుంటూనే ఉన్నారు యుగయుగాలుగామహాభక్తులు . ఎవరు ద్వేషిస్తారో వాళ్లచేతనే పలుమార్లు తన నామాన్నుచ్ఛరింపజేసే చిత్రమైన లీలలు చేస్తాడాయన.
అప్పుడెప్పుడొ హిరణ్యకశిపుని నృసింహమూర్తిగా సంహరించినప్పుడు ఆదుష్టుని రక్తం విశ్వాంతరాలకు ఎగజిమ్మగా ఆరక్తపు తుంపరలు మెల్లగా భూమిపైవాలుతూ రాక్షసాంశలుగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నాయి ,ప్రతియుగాన,ప్రతి తరాన . మానవ జన్మ తీసుకున్నా తమలో ఇంకి కరుడుగట్టిన విష్ణుద్వేషం మరచిపోకుండా ఆజీవి ,లోకాన విష్ణుద్వేషిగా పాతవాసనలను ప్రదర్శిస్తూనే ఉంటుంది .
ఇలా ఒకానొక రక్తబిందువు ఈయుగంలో ,ఈతరం లోనూ తెలుగుగడ్డమీద ఓ బ్లాగ్లోక మేధావిగా జన్మించినది. విద్యాబుద్దులు నేర్చి అన్నివిషయాలను చదివే పరిజ్ఞానం సంతరించు కున్నాడు. . తన పరిజ్ఞానాన్నంతా జనంలో విష్ణువుపైన ద్వేషం కలిగేలా చేయగలగటానికి , ఆపేరు చెబితేనే మండిపడే తన పూర్వలక్షణాన్ని అనుసరించి ప్రదర్శిస్తున్నాడు. .రాక్షసులు కూడా అద్భుత పాండిత్యాన్ని సంపాదించటం లోను సాధన చేయటం లోనూ ఏమాత్రం తక్కువవారుకాదు. మొండిపట్టుదల తీవ్ర తామసిక లక్షణాలతో అనుకున్నది సాధించగలరు. కాకుంటే ఆ జ్ఞానాన్నంతా భగవంతుని పట్ల ద్వేషంతో ఆత్మ వినాశనానికి ఉపయోగించుకుంటారు . పరమదయాళువైన ఆస్వామి తన పూర్వ భక్తుడు ఈ జన్మలోనూ పతనం కావటం సహించక వారి క్షేమం కోసం మరలా మరలా వారిచేత తన నామాన్ని స్మరింపజేసే రీతిలో తనలీలలు సాగిస్తాడు.
ఇక్కడ ఆ హిరణ్యకశపాంశ తో జన్మించిన ఆజీవి తన రచనలలో. వాదనలలో ప్రస్ఫుటంగా విష్ణుద్వేషం కన్పిస్తూ ఉండటం నాకనుమానం కలిగించింది .ఎందుకు ఈ జీవి ఇంతగా భగవద్వేషాన్ని ప్రదర్శిస్తున్నడా? అని ఎంతాలోచించినా గాని ,ప్రశ్నించి చూసినా గానీ సమాధానం రాలేదు . ఎందుకో హఠాత్తుగా ఈ విషయం స్ఫురణకు వచ్చి ఆలోచించాను . ఓసారి ఈ హిరణ్యకశిపుని ఇంట ఉన్న భక్తప్రహ్లాదుని ఫోటొ చూడటం తటస్థించింది . వాని ముఖం లో తేజస్సు ,భగవద్భక్తుని లక్షణాలను చూడగానే పోల్చుకున్నాను . సందేహం లేదు .ఈయనచే భగవన్నామ స్మరణ పలుమార్లు చేపించడానికే ఈయనకు జన్మించిన ప్రహ్లాదాంశమని అనుకోవచ్చు. ఈయనకు సహచర్యం చేస్తున్న ఆసాధ్వి నాటి లీలావతి అంతటి వందనీయ మాతృమూర్తేనని నాభావం .
ఇక ఇక్కడనుంచి మనం శ్రీహరి లీలా విలాసాన్ని చూడవచ్చు . ఈ హిరణ్యకశిపుడు పైకి కన్పించినట్లుగా నాస్తికుడేమీకాదు . నాస్తికత్వం ఒక ముసుగుమాత్రమే . లోపల చూస్తే ఆయన కూడా ఏదో రూపం మీద నమ్మకమున్నవాడే . కానీ సర్వాంతర్యామియగు హరి నామాన్ని సహించలేని ఈర్ష్యాద్వేషాలు కరుడుగట్టి ఉన్నాయి మనసున . కానీ కరుణాంతరంగుడైన శ్రీహరి లీలలకు ఇదే వేదికవనుంది.
ఇప్పుడు పెరుగుతున్నా బాలప్రహ్లాదుడు " హరి నీవే ...సర్వాత్మకుడవు " అనిపాడకా మానడు .అదివిని ఈయన మనస్సు అగ్నిపర్వతంలా కుతకుతలాడక మానదు .అదొక హింస ......పాపం. విష్ణువొక చిల్లరదేవుడు ... ఎవరా గోవిందుడు అని గర్జించి ప్రశ్నించిన నోటితోనే ., ముకుందా....ముకుందా .కృష్ణా ,,ముకుందా ...ముకుందా అని మురిపెంగా బిడ్డను పిలచి లాలించక తప్పని స్థితి కల్పించాడు స్వామి . ఎంతకాదనుకున్నా అంతరంగం లో ప్రేమతరంగాలు మిళితమై భగవన్నామం ప్రేమ పూరితంగా జపించబడుతుంది . ఇది తెలిస్తే ఇంకా నరకం . ఛీ ..ఛీ దానవ వైరి ఆ హరి నామం నేనునా నోట పలకటమా థిక్.... అని ఇంతెత్తెగిరినా సరే ,తప్పదు. నాన్నా !అని ఆబుడతడు పిలవగనే నాయనా !అని హరినామంతో వాడిని పిలవక తప్పనిస్థితి కల్పించాడు లీలానాటకసూత్రధారి.
పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ భక్తి ప్రవర్ధమానమై మన బాల ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తమునిగా ఎదుగుతున్నప్పుడు అది సహించలేక ,నిరోధించలేక ప్రేమద్వేషాలనేవిరుధ్ధభావలమధ్య నలుగుతూ విష్ణుద్వేషం యొక్క ఫలితం అనుభవిస్తుంటే అప్పుడు తెలుస్తుంది అభినవ హిరణ్యకశిపునకు . ఎలాగోలా వానిని విష్ణువుపట్ల విరక్తునిగా మార్చాలని మార్చలేకపోయినా నాస్తికునిగానైనా మార్చి భగవ్ద్భావానికి దూరం చేయటం కోసం ,,ఒరే ద్వుడులేడు ..గీవుడు లేడు ,అని మన రాక్షస చక్రవర్తి అనగానే ..అయ్యో భగవంతుడు లేకున్న ఇదంతా ఎలాసృష్టించబడినది తండ్రీ అని మన బాలభక్తుడంటాడు . అయితే ఏడిరా ! చూపించు ? అని ప్రశ్నించగానే ..... ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు .... అంటూ ప్రహ్లాదుడు వివరణ ఇస్తుంటే దేహం కంపిస్తూ హృదయం రగిలిపోతూ ... అబ్బా ! ఆదృశ్యాన్ని ఊహించికుంటుంటే చాలు మనసు పులకించి పోతోందికదా ! అది అంతే .నారాయణ నీలీలా నవరసభరితం అంటూ మనం పాడుకుంటూ వేచిచూద్దాము .
ఇంకా హిరణ్యాక్ష ,రక్తబీజ ,మహిష,మహాకాయ, తాటక ,సుబాహు మారీచాది రాక్షసయూధముఖ్యుల అంశలుకూడా ఇక్కడ మనకు తటస్థిస్తున్నాయి . మరక్కడేమి మాయచేశాడో మహామాయకు అధినాయకుడు, తెలియదుకదా మనకు.
యుగయుగాన జరిగే విష్ణుమాయను ఊహించతరమా ! మనబోంట్లకు
9 వ్యాఖ్యలు:
ఆయితే త్వరలో నేను మళ్లీ బ్లాగ్నరసింహావతారం ఎత్తాలా?
అదంతా ఏమోగానీ మాకు మీ హింస తప్పేలా లేదు.
బాబూ,
మీరేదో నాలుగు మంచి మాటలు చెప్తారనుకుంటే ఈ గోల ఏమిటి? ఎవరి పిల్లలు ఎవరైతే మీకెందుకు? ఆ బుల్లోడు కూడా నాస్తికుడే అయితే మిమ్మల్ని ఏం చెయ్యాలి మేము?
ఏమిటీ హింస మాకు? బ్లాగ్లోకపు హిరణ్య కశిపుడేమిటి? హిర్ణ్య కశిపుడు పరమ శివభక్తుడు. అందుకే విష్ణువుని ద్వేషిస్తాడు. ఎవరి భక్తులు వాళ్ళకుంటాయి. అంతా విష్ణువునే పూజించాలంటే ఎలా?
ఇలాంటి ద్వేషపూరిత బ్లాగులు రాయడం ఆపండి. గోల!
మీది నారద పాత్రా స్వామీ? కనపడితే ముకుందుడికి తండ్రి మీద ద్వేషం నూరిపోసేలా ఉన్నారే?
హిర్ణ్య కశిపుడు పరమ శివభక్తుడు. అందుకే విష్ణువుని ద్వేషిస్తాడు. ఎవరి భక్తులు వాళ్ళకుంటాయి. అంతా విష్ణువునే పూజించాలంటే ఎలా?
Anonymous గారు..
నిజమె.. ఎవరి భక్తులు వాళ్ళకుం టాయి,అంత మాత్రన శీవుని భక్తులంత విష్ణువుని, విష్ణువుని భక్తులంత శీవున్ని ద్వేషించమన మీఅర్థం?ఎదైన చుసె ద్రుష్టిని భట్టె...
నారాయణ ! నారాయణ !
ఏమిటండీ నేను భగవద్వేషిలా కనిపిస్తున్నానా !
నిరంతరం శివార్చన చెసే నేను శివద్వేషినని ఎలా అనుకున్నారు? సర్వరూపాల్లో పరమాత్మ ప్రతిష్టితమై ఉన్నారు అని చెప్పిన మహాత్ములు,మహర్షులు నడచిన బాటలో ధూళిని తలపైదాల్చడానికి తహతహలాడేవాళ్లము
మీరు సరిగా అర్ధం చేసుకోలేదు . భగవద్వేషులనైనా మేము ద్వేషించము వారి ద్వేషభావాన్ని మాత్రమే నిరసిస్తాము.
ఇక భగవద్విషయాలు విన్నా చదివినా కర్ణశూల ప్రారంభమై బాధపడేవారికి [కలిగేహింసకు] మేము బాధ్యులమా? అది మనసులో కరుడుగట్టుకున్న ద్వేషం కల్పిస్తున్న మాయమాత్రమే .
స్వామి నాకు అవకాశం అనుగ్రహిస్తే తప్పనిసరిగా వానితో కలసి హరిభజనచేయటం లో పాల్గొంటాను.
:))
కొంపదీసి ఆ హిరణ్య కశిపుడు నేను కాదుకదా? నాకు ఈమధ్య పిల్లలు ఏవరూ పుట్టలేదే!
బాబూ శ్రీనివాస్, నేనే అయితే గనుక నీ అవతారంలో కాస్త నన్ను చూసీ చూడనట్లు వెళ్ళిపో.
Just when I thought telugu blogs are not funny anymore :)
Way to go sir !! You restored my faith in human... umm... whatever that is ! (I leave it to your imagination)
You made my day !!
హిరణ్యకశిపుడు శివభక్తుడు కనుక విష్ణువుని ద్వేషించాడా? బాబూ/అమ్మా తెలియని విషయాల గురించి ఎందుకు మాట్లాడతావు? విష్ణు ఆజ్ఞ ప్రకారమే ఆయన ద్వారపాలకులైన జయవిజయులు విష్ణు ద్వేషులుగా మూడు జన్మలెత్తి ఆయనచేతే చంపబడి తిరిగి విష్ణువును చేరుకుంటారు. శివ భక్తులు విష్ణువుని, విష్ణు భక్తులు శివుణ్ణి ద్వేషిస్తారని ఎక్కడా లేదు. అవన్నీ శైవ, వైష్ణవ మతావలంబుల మధ్య వచ్చిన గొడవలు మాత్రమే.
Post a Comment