శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మనసెందుకు కోరుకోదు? ! మహాదేవుని లోకము

>> Friday, February 5, 2010



ఉద్ధవుడు శ్రీకృష్ణభక్తుడు. శిష్యుడుకూడా . ఒకనాడయన శ్రీకృష్ణపరమాత్మనిలా అడిగాడు. దేవా ! మీరు సర్వశక్తి సంపన్నులు .తృటిలో ఏకార్యమునైనా చేయగలుగుదురు. నాచుట్టూ గల ఈ ప్రపంచం లో జనులందరును,ప్రాణులందరును అనేకమైన దు:ఖములకు,బాధలకు గురిఅగుచున్నారు. ఈ సమస్త ప్రాణులను మీ నిజధామమునకు ఎందుకు తీసుకుని పోరు ? మీరు కనికరించిన వీరందరు అచట శాస్వతానందమును పొందుదురుగదా ! దయాళువైన మీరు ఏల ఉపేక్షచేయుచున్నారు ? అని ప్రశ్నించెను. అదివిని శ్రీకృష్ణులు మందహాసము చేస్తూ "ఉద్ధవా! నేనలాగే కోరుకుందును కానీ వారు వచ్చుటకు ఒప్పుకోరు.

అదేమిటి ! దేవా ! మీరన్నది నమ్మలేనిది. అందరూ ఒప్పుకుంటారని నానమ్మకము. అని ఉద్ధవుడనెను. సరే ! అయితే అన్నింటికంటే నికృష్టమైనది పంది జన్మ . నాతో వచ్చుటకది ఒప్పుకునునేమో అడిగిచూడు అన్నాడు ఆలీలానాటక సూత్రధారి. ఉద్దవునికి నిజమే అడిగిచూడాలనిపించినది.

" ఈభూమికంటే ఏంతో ప్రశాంతము ఆనందముగానుండెడి పరంధామమునకు నిన్నుగొని పోయెదను వచ్చెదవా? అని అడిగాడు ఉద్దవుడు పందిని.

అది ఉధ్ధవుని శంకిస్తూచూసింది. "నేనిచ్చట తినునట్టి మలము మొదలగు ఆహారములచ్చట దొరుకునా ? అడిగింది.

ఛీ ! లేదు. నీకు తినుటకు అచట దివ్యమైన అమృతము దొరుకుతుంది . అత్యంత రుచికరంగా ఉంటుంది అని ఉద్దవుడన్నాడు.

" నాకిది అనుమానం గా ఉన్నది . ఇచట లభించెడి మలము కన్న రుచిగల పదార్ధమింకేదైనా ఉండునా? ఎన్నటికీ ఉండదు. ఫో ! ఫో ! నాకు నీ పరమాత్మ వద్దు ఆధామము వద్దు. నీ అమృతము నాకక్కరలేదు. నాకు ఇక్కడ ఉండటం రుచికరమైన ఈ ఆహారమే ఇష్టము . " అని పంది తన నిర్ణయమును తెలిపెను. ఉద్ధవుడు మారు మాటాడక వెడలి పోయెను.

అనగా ప్రాపంచిక కోర్కెలను వదలి భక్తిమార్గములో ప్రవేశించాలంటే భౌతికసుఖాలకు అలవాటుపడ్డ మనసుకు చాలాకష్టము గా ఉంటుంది .అందువల్ల వాటిని వదలాలంటె ఒప్పుకోదు.


2 వ్యాఖ్యలు:

KumarN February 5, 2010 at 12:23 PM  

:-)

t February 7, 2010 at 10:57 AM  

I don't agree with you, when you say that nobody would agree to leave the materialistic things / pleasures present in his life.
It's about the trust that you build when anybody comes to you and says, "You will be taken to one beautiful place where you get moksha, which you are trying to achieve thru out your life". When you observe, even pig said the same thing "నాకిది అనుమానం గా ఉన్నది ."

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP